Difference between revisions of "Linux/C2/Desktop-Customization-16.04/Telugu"
From Script | Spoken-Tutorial
(Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- || 00:01 ||ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో డెస్క్...") |
(No difference)
|
Revision as of 12:35, 4 July 2019
Time | Narration |
00:01 | ఉబంటు లినక్స్ 16.04 అపరేటింగ్ సిస్టం లో డెస్క్ టాప్ కస్టమైజేశన్ అనే ఈ స్పొకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:11 | ఈ టుటోరియల్ లో మనం లాంచర్ గురించి మరియు లాంచర్ లో అప్ప్లికేశన్ లను చేర్చడం మరియు తొలగించడం, |
00:21 | మల్టిపుల్ డెస్క్ టాప్ ను ఉపయోగించడం
డెస్క్ టాప్ యొక్క థీం ను మార్చడం |
00:27 | ఇంటర్నెట్ కనెక్టివిటి, సౌండ్ సెట్టింగ్స్ |
00:32 | టైం మరియు డేట్ సెట్టింగ్స్ మరియు వేరె యుజర్ అకౌంట్స్ కు మారడం గురించి తెలుసుకుంటాము. |
00:39 | ఈ ట్యుటొరియల్ కొరకు నేను ఉబంటు లినక్స్ అపరేటింగ్ సిస్టం16.04 ను ఉపయోగిస్తున్నాను. |
00:46 | ఇప్పుడు లాంచర్ ని ప్రారంభిద్దాం. |
00:49 | లాంచర్ అనేది ఉబంటు లినక్స్ డెస్క్ టాప్ లో డీఫౌల్ట్ గా ఉండే ఎడమవైపు ప్యానెల్. ఇది కొన్ని డీఫౌల్ట్ ను కలిగిఉంటుంది. |
00:59 | లాంచర్ తరచుగా వాడే అప్లికేషన్ లను అక్కెస్స్ చేయడాన్ని సులభతరం చేస్తుంది. |
01:05 | అందువల్ల మనం ఒక ప్రొగ్రాం ను లాంచర్ పై ఉన్న డెస్క్ టాప్ శార్ట్ కట్ ను క్లిక్ చేయడం ద్వారా లాంచ్ చేయవచ్చు. |
01:12 | డీఫౌల్ట్ గా లాంచర్ కొన్ని అప్లికేషన్ లను కలిగి ఉంటుంది. |
01:17 | లాంచర్ ను మన అవసరాలకు అనుగుణంగా ఎలా కస్టమైజ్ చేయాలో నేర్చుకుందాం. |
01:22 | నా రోజువారీ పనులకు నాకు Terminal, LibreOffice Writer, gedit, మొదలైన అప్లికేషన్ లు కావాలి. |
01:34 | ఈ అప్ప్లికేశన్ లను లాంచర్ లో చేర్చుదాం. |
01:38 | దానికి చేసే ముందు, నాకు అనవసరము లేని కొన్ని అప్ప్లికేషాన్ లను నేను తొలగిస్తాను. |
01:44 | నేను ఒకవేళ అమెజాన్ అప్ప్లికేషాన్ ని లాంచర్ నుండి తొలగించాలి అనుకుంటే, |
01:49 | అమెజాన్ అప్ప్లికేషాన్ అయికన్ కు వెళ్ళి దాని పై రైట్ క్లిక్క్ చేసి, Unlock from Launcher ఎంచుకోండి. |
01:58 | అమెజాన్ అప్ప్లికేషాన్ అయికన్ లాంచర్ నుండి తొలగించబడడం మనం చూడవచ్చు. |
02:04 | అదేవిధంగా మనం తరచుగా వాడని అన్ని శార్ట్ కట్ లను తొలగించవచ్చు. |
02:11 | నేను లాంచర్ నుండి కొన్ని అప్ప్లికేషాన్ లను తొలగించడం మీరు ఇక్కడ చూడవచ్చు. |
02:17 | ఇప్పుడు, Terminal శార్ట్ కట్ ని లాంచర్ లో చేర్చుదాం. |
02:22 | లాంచర్ పై భాగం లో ఉన్న Dash home పై క్లిక్ చేయండి. |
02:26 | సెర్చ్ బార్ లో terminal అని టైప్ చేయండి.టర్మినల్ అయికాన్ పై క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేయండి. |
02:34 | మీరు లాంచర్ పైన టర్మినల్ అయికాన్ ని చూడవచ్చు. |
02:38 | టర్మినల్ అయికాన్ ని లాంచర్ పైన ఫిక్స్ చేయడానికి ముందుగా లాంచర్ పై రైట్ క్లిక్ చేయండి. ఆపై Lock to Launcher ఎంచుకోండి. |
02:47 | లాంచర్ పైన అప్ప్లికేశన్ శార్ట్ కట్ ని ఫిక్స్ చేయడానికి మరో పద్ధతి డ్రాగ్ మరియు డ్రాప్ చేయడం.ఇప్పుడు దాన్ని చేసి చూపిస్తాను. |
02:57 | Dash Home ని తెరచి సెర్చ్ బార్ లో gedit అని టైప్ చేయండి. |
03:03 | gedit అయికన్ ని లాంచర్ వైపు లాగండి. (డ్రాగ్ చేయండి). |
03:07 | ఇప్పుడు gedit అయికన్ ని లాంచర్ పైకి డ్రాప్ చేయండి.
gedit శార్ట్ కట్ ఇప్పుడు లాంచర్ లో చేర్చ బడింది అని మీరు చూడవచ్చు |
03:16 | ఈ విధంగా మనం లాంచర్ లో శార్ట్ కట్ లను చేర్చవచ్చు. |
03:21 | ఉబంటు లినక్స్ OS లో మరో ముఖ్యమైన లక్షణం మలల్టిపుల్ వర్క్ స్పేస్ లేదా డెస్క్ టాప్. |
03:28 | ఒక్కొసారి మనం ఎక్కువ అప్లికేషన్ ల తో పని చేయవచ్చు. |
03:33 | మనకు ఒక అప్లికేషన్ నుండి మరో అప్ప్లికేషన్ కు మారడానికి కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు. |
03:38 | దాన్ని సులభతరం చేయడానికి మనం Workspace Switcher(వర్క్ స్పేస్ స్విచ్చర్) ని ఉపయోగించవచ్చు. |
03:42 | ఇప్పుడు డెస్క్ టాప్ కి తిరిగి వెళ్దాం. |
03:45 | ఉబంటు 16.04 లో మల్టిపుల్ వర్క్ స్పేస్లు డీఫౌల్ట్ గా కనిపించదు. |
03:51 | దాన్ని సక్రియం చేయడాని కి System Settings పై క్లిక్ చేసి ఆ తర్వాత Appearance పై క్లిక్ చేయండి. |
03:58 | Appearance విండో లో Behavior ట్యాబ్ పై క్లిక్ చేయండి. |
04:02 | ఇక్కడ, Enable workspaces ఎంపిక ని ఎంచుకోవాలి.
ఇది బహుళ workspaces icon ని లాంచర్ పైన చూపుతుంది. |
04:11 | విండో ని క్లొజ్ చేయండి(మూసి వేయండి). |
04:13 | లాంచర్ పైన Workspace Switcher icon ని కనుగొని దాని పై క్లిక్ చేయండి. |
04:19 | ఇది 4 భాగాలుగా 4 డెస్క్ టాప్ లను చూపిస్తుంది, |
04:24 | డీఫౌల్ట్ గా, ఎగువ ఎడమవైపు ఉన్న డెస్క్ టాప్ ఎంపిక చేయబడుతుంది. |
04:29 | అది ప్రస్తుతం మనం పనిచేస్తున్న డెస్క్ టాప్. |
04:34 | ఇప్పుడు రెండవ డెస్క్ టాప్ ఎంచుకొనుటకు, దాని పై డబుల్ క్లిక్ చేద్దాం. |
04:39 | ఇక్కడ నేను లాంచర్ పై terminal icon పై క్లిక్ చేసి terminal ను తెరుస్తాను. |
04:45 | ఇప్పుడు మళ్ళీ Workspace Switcher పై క్లిక్ చేయండి. |
04:49 | మీరు టర్మినల్ ని రెండవ వర్క్ స్పేస్ పై మరియు మన డెస్క్ టాప్ ని మొదటి దానిపైన చూడవచ్చు. |
04:55 | ఈ విధంగా మీరు మల్టిపుల్ డెస్క్ టాప్ లలో పని చేయవచ్చు. |
04:59 | ఇప్పుడు మొదటి డెస్క్ టాప్ కి తిరిగి వెళదాం. |
05:03 | Trash అనేది లాంచర్ లో మరో ముఖ్యమైన అయికన్. |
05:07 | Trash అనేది అన్ని తొలగించబడిన ఫైల్s మరియు ఫోల్దర్ల ను కలిగి ఉంటుంది. ఒకవేళ మనం అనుకొకుండా ఏదయినా ఒక ఫైల్ ను తొలగిస్తే, దానిని మనం Trash నుండి రెస్టొర్ చేయవచ్చు. |
05:17 | దీనిని ప్రదర్శించడానికి నేను నా డెస్క్ టాప్ పై ఉన్నHello.txt ని తొలగిస్తాను. |
05:23 | ఫైల్ పై రైట్ క్లిక్ చేసి Move to Trash ఎంపిక ని క్లిక్ చేయండి. |
05:29 | దీనిని రెస్టొర్ చేయడానికి లాంచర్ లోని Trash icon పై క్లిక్ చేస్తే Trash ఫొల్డర్ తెరచుకుంటుంది. |
05:37 | ఫైల్ ను ఎంపికచేసి దానిపై రైట్ క్లిక్ చెసి రెస్టొర్ ఎంపిక పై క్లిక్ చేయండి. |
05:43 | Trash ఫొల్డర్ విండోని మూసివేసి డెస్క్ టాప్ కి తిరిగిరండి. |
05:48 | మనం ఇంతకు ముందు తొలగించిన ఫైల్ ఇప్పుడు రెస్టొర్ మనం అవ్వడం చూడవచ్చు. |
05:53 | మీ సిస్టం నుండి ఒక ఫైల్ ను శాశ్వతంగా తొలగించడానికి ముందుగా దాన్ని ఎంపిక చేసి తర్వాత Shift+Delete కీలను నొక్కండి. |
06:01 | Are you sure you want to permanently delete Hello.txt? అనే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. Delete బటన్ పై క్లిక్ చేయండి. |
06:12 | Trash అయికన్ పై మళ్లీ క్లిక్ చేయండి. |
06:15 | మనకు ఆ ఫైల్ Trash ఫొల్డర్ లో కనిపించదు ఎందుకంటే అది శాశ్వతంగా మన సిస్టం నుండి తొలగించబడింది. |
06:23 | మీకు ఒకే థీం ని డెస్క్ టాప్ పై చూసి విసుగ్గా లేదా? దాన్ని మారుద్దాం. |
06:28 | లాంచర్ లోకి వెళ్ళి System settings ని ఎంపిక చేసుకుని తర్వాత Appearance ని ఎంపిక చేయండి. |
06:35 | Appearance విండో తెరచుకుంటుంది. |
06:38 | ఇక్కడ Themes ట్యాబ్ క్రింద మనకు ముందే వ్యవస్థాపించబడిన చాలాథీమ్ లు ఉన్నాయి. |
06:44 | మీకు ఇష్టమైన విధంగా మీరు ఈ థీం ల లో నుండి ఎంచుకోవచ్చు. |
06:47 | మీరు దేనినైనా క్లిక్ చేసిన వెంటనే, మార్పులు డెస్క్టాప్కి అన్వయించబడతాయి అని మీరు చూడవచ్చు. |
06:54 | విండో ని మూసివేయుటకు చిన్న X icon ని క్లిక్ చేయండి. |
06:58 | ఇప్పుడు,డెస్క్ టాప్ లో పై కుడి వైపు చివరన ఉన్న కొన్ని అయికన్ లను చూద్దాం. |
07:04 | మొదటిది Internet connectivity. |
07:07 | మీరు ఏదైనా Lan లేదా Wifi network కి కనెక్ట్ అయిఉంటే కనెక్సన్ స్థాపించబడిఉంటుంది. |
07:13 | మీరు వాటిని ఇక్కడ చూడవచ్చు. |
07:16 | మీరు మీకు అందుబాటులో ఉన్న నెట్వర్క్ ని ఎంపిక చేసుకోవచ్చు. |
07:20 | దాన్ని Enable లేదా Disable చేయడానికి, Enable Networking అనే ఎంపికను check లేదా uncheck చేయవచ్చు. |
07:27 | మనం Edit Connections ఎంపిక ద్వారా నెట్వర్క్ ని సవరించవచ్చు. |
07:32 | తర్వాతి అయికన్ Sound. |
07:35 | ఇక్కడ మీకు స్లైడర్ కనిపిస్తుంది. |
07:37 | ఇది మీకు తగిన విధంగా ధ్వనిని ఎక్కువ లేదా తక్కువ చేయడానికి వీలుకలిగిస్తుంది. |
07:43 | మనం మన సిస్టం లో Sound Settings పై క్లిక్ చేసి మరింత అనువుగా ధ్వనిని మార్చుకోవచ్చు. ఈ విండోలోని సెట్టింగులను మీ స్వంతంగా అన్వేషించండి. |
07:53 | తర్వాతి అయికన్ Time & Date. మనం ఈ ఐకాన్ పై క్లిక్ చేస్తే క్యాలెండర్ తెరచుకుంటుంది. |
08:00 | మనం ప్రస్తుత తేది, నెల మరియు సంవత్సరం ఇక్కడ చూడవచ్చు. |
08:04 | బాణం గుర్తుగల బటన్లు మనకు వేరె నెలలు మరియు సంవత్సరాలకు మనకు కావలసినట్టుగా మార్చుకోవడానికి అనుమతిస్తాయి. |
08:11 | Time & Date Settings పై క్లిక్ చేయడం ద్వారా మనం వాటిని మార్చుకోవచ్చు. |
08:16 | ఈ ఎంపికను మీరు స్వయంగా అన్వేషించండి. |
08:20 | తర్వాత, wheel లేదా Power icon పై క్లిక్ చేయండి. |
08:24 | ఇక్కడ మనకు కొన్ని శార్ట్ కట్ ఎంపికలు Log Out మరియు Shut Down ఎంపికలతోపాటు కనిపిస్తాయి. |
08:31 | అలాగే మనం మన సిస్టం లో ఉన్న అన్ని యూజర్ అక్కౌంట్ లను చూడవచ్చు. |
08:36 | ఆ ప్రత్యేక యూజర్ అక్కౌంట్ పై క్లిక్ చేయడంద్వారా మనం మనకు కావలసిన యూజర్ అక్కౌంట్ కు మార్చవచ్చు. |
08:43 | ఇంతటితొ ఈ ట్యుటొరియల్ చివరకు వచ్చాం. సారాంశం చూద్దాం. |
08:48 | ఈ ట్యుటొరియల్ లో మనం లాంచర్ గురించి మరియు లాంచర్ లో అప్ప్లికేశన్ లను తొలగించడం మరియు చేర్చడం ఎలాగో తెలుసుకున్నాం. |
08:55 | మల్టిపుల్ డెస్క్ టాప్ లను వాడడం మరియు డెస్క్ టాప్ థీం మార్చడం |
09:01 | ఇంటర్నెట్ కనెక్టివిటి మరియు సౌండ్ సెట్టింగ్ లు. |
09:04 | టైం మరియుడేట్ సెట్టింగ్ ల మరియు యూజర్ అక్కొంట్ లకు మారడం గురించి తెలుసుకున్నాం |
09:10 | ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్ లోడ్ చేసి చూడండి. |
09:18 | స్పొకెన్ ట్యుటొరియల్ ప్రాజెక్ట్ వర్క్ శాప్ లను నిర్వహిస్తుంది.ఆన్లైన్ పరీక్షలో పాసైన వారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
09:27 | మరింత సమాచారం కోసం మాకు రాయండి. |
09:30 | మీకు ఏవైనా సందేహాలుంటే మా సైట్ ని సంప్రదించండి. |
09:35 | మీకు సందేహంగా ఉన్న నిమిశం లేదా సెకండ్ ని ఎంచుకుని సందేహాన్ని క్లుప్తం గా రాయండి. |
09:41 | మా టీం నుండి ఎవరైనా దానికి జవాబు ఇస్తారు. |
09:45 | స్పొకన్ టుటోరియల్ ప్రాజెక్ట్ కి ఎన్ ఎం ఈ ఐ సి టి, ఎం హెచ్ అర్ డి, భారత ప్రభుత్వం నిధులను సమకూర్చుతుంది. ఈ లింక్ లొ ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఉంది. |
09:57 | ఈ ట్యుటొరియల్ ని తెలుగులోకి అనువదించినది కరణం స్రవంతి మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. పాల్గొన్నందుకు ధన్యవాదములు. |