Difference between revisions of "Git/C3/Working-with-Remote-Repositories/Telugu"
From Script | Spoken-Tutorial
Line 254: | Line 254: | ||
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | మనము repositoryను సింక్రనైజ్ చేసేటప్పుడు, మన పూర్తి URLను టైప్ చేయడానికి బదులుగా, మారుపేరును | + | | మనము repositoryను సింక్రనైజ్ చేసేటప్పుడు, మన పూర్తి URLను టైప్ చేయడానికి బదులుగా, మారుపేరును ఉపయోగించవచ్చు |
|- | |- | ||
Line 282: | Line 282: | ||
|- | |- | ||
| 06:32 | | 06:32 | ||
− | |ఇక్కడ Remote పేరు | + | |ఇక్కడ Remote పేరు stories గా ఇస్తున్నాను అదే Remote repository యొక్క పేరు కూడా. |
|- | |- |
Revision as of 19:37, 25 January 2018
|
|
---|---|
00:01 | Working with Remote Repositories పై spoken tutorialకు స్వాగతం. |
00:06 | ఈ ట్యుటోరియల్ లో మనము Remote repository అంటే ఏమిటి ? |
00:12 | Remote repositoryకు డేటా ను ఎలా సమకాలీకరిస్తామో నేర్చుకుంటాం. |
00:16 | ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 14.04ను ఉపయోగిస్తున్నాను. |
00:22 | అలాగే Git 2.3.2, |
00:25 | gedit Text Editor మరియు |
00:28 | Firefox web browserను కూడా ఉపయోగిస్తున్నాను. |
00:30 | మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ మరియు బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు. |
00:36 | మీకు ఈ ట్యుటోరియల్ కొరకు Internet కనెక్షన్ కూడా అవసరం. |
00:41 | Git కమాండ్స్ పై అవగాహన కూడా ఉండాలి. |
00:46 | లేకపోతే, సంబంధిత Git ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా లింక్ ను సందర్శించండి. |
00:52 | ముందుగా Remote repository అంటే ఏమిటో అర్ధం చేసుకుందాం. |
00:56 | ఏ repository అయితే, Internetలో గాని లేదా ఏదైనా networkలో గాని హోస్ట్ చేయబడుతుందో దానిని Remote repository అని అంటారు. |
01:04. | ఈ కేంద్రీకృత repositoryను ఉపయోగించి, ప్రజలు ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ లో కలసి పనిచేయవచ్చు. |
01:13 | ఉదాహరణకు, ఒకే repository లో సంయుక్తంగా పనిచేయాలనుకునే ముగ్గురు వినియోగదారులు ఉన్నారు అని అనుకుందాం. |
01:21 | Git ఉపయోగించి, వారి లోకల్ సిస్టం లోనికి, రిమోట్ రిపోజిటరీ యొక్క ఒక కాపీను తీసుకోవచ్చు. |
01:28 | దీనిని clone కమాండ్ ను ఉపయోగించి చేస్తాము. |
01:31 | తరువాత వారు లోకల్ repository తో ఆఫ్ లైన్ లో కూడా పనిచేయవచ్చు. |
01:36 | పని పూర్తి అయిన తర్వాత, వారు దానిని తిరిగి ప్రధాన repositoryకు సింక్రనైజ్ చేయాలి. |
01:43 | దీనిని Push మరియు pull కమాండ్స్ ను ఉపయోగించి చేస్తాము. |
01:48 | మీరు ఈ ట్యుటోరియల్ పూర్తి అయ్యేసరికి మొత్తం ప్రక్రియను అర్థం చేసుకుంటారు. |
01:53 | ముందుగా, మనము సృష్టించిన GitHub repositoryను ఓపెన్ చేద్దాం. |
01:59 | కుడి వైపున, ఈ repository యొక్క URL ను చూడవచ్చు. |
02:05 | ఈ URL ను కాపీ చేద్దాం. |
02:08 | ఈ URL ఉపయోగించి,repository యొక్క ఒక కాపీని, లోకల్ repository గా సృష్టిస్తాము. |
02:16 | terminalను ఓపెన్ చేద్దాం. |
02:18 | ఇద్దరు వినియోగదారులు ఒకే Remote repository పై ఎలా పనిచేస్తారో ఇప్పుడు అర్థం చేసుకుందాం. |
02:24 | దీని కోసం, నేను, నా Desktop పై User1 మరియు User2 అనే రెండు డైరెక్టరీలను ఇప్పటికే సృష్టించాను. |
02:33 | దయచేసి మీరు కూడా మీ Desktop పై అలానే చేయండి. |
02:36 | ఒకే terminalలో, నేను రెండు విభిన్న టాబ్‌లలో ఆ డైరెక్టరీలను తెరుస్తాను. |
02:43 | మొదటి టాబ్ లో cd space User1 అని టైప్ చేయండి. |
02:49 | రెండవ టాబ్ ను ఓపెన్ చేయడానికి File menu పై క్లిక్ చేసి, Open Tab ను ఎంచుకోండి. |
02:55 | రెండవ టాబ్ లో cd User2 అని టైప్ చేయండి. |
03:00 | User1 ట్యాబ్ కు వెళ్ళండి. |
03:03 | ఇప్పుడు Remote repository యొక్క కాపీ ని తయారుచేద్దాం. |
03:08 | git space clone అని టైప్ చేసి, కాపీ చేసిన URL ను పేస్ట్ చేయండి. ఈ కమాండ్ చివరిలో dot అని టైప్ చేయండి. |
03:17 | ఈ dot, మనం ప్రస్తుత డైరెక్టరీ, User1 directory లోపల repository ను కాపీ చేయబోతున్నామని సూచిస్తుంది. |
03:25 | లేకపోతే, repository పేరు stories గా కొత్త directory ను సృష్టిస్తుంది. |
03:31 | ఇప్పుడు Enter నొక్కండి. |
03:33 | clone కమాండ్ మొత్తం కేంద్ర ఫోల్డర్ ను కాపీ చేసి, దానిని స్థానిక repository గా చేస్తుంది. |
03:40 | ls అని టైప్ చేయండి. Remote repository యొక్క కంటెంట్ ఇక్కడ కాపీ చేయబడిందని మీరు చూడవచ్చు. |
03:48 | అవగాహన కోసం, ఈ repository యొక్క user name మరియు email id లను నేను మారుస్తాను. |
03:55 | నేను ఇప్పటికే మరో రెండు GitHub users priya-spoken1 మరియు kaushik-spokenలను- ప్రదర్శించడం కొరకు క్రియేట్ చేశాను. |
04:04 | నేను వాటిని ఇక్కడ ఉపయోగిస్తాను. |
04:14 | ఇప్పుడు Git log ను తనిఖీ చేద్దాం. |
04:16 | మీరు Remote repository యొక్క commitsను చూడవచ్చు. |
04:21 | అదేవిధంగా, నేను రెండవ టాబ్ లో User2 directory లో repository ను clone చేస్తాను. |
04:28 | ఇక్కడ కూడా నేను User1కు చేసినట్లుగా user name మరియు email id లను మారుస్తాను. |
04:35 | తరువాత, ఈ వినియోగదారులు, Remote repository లో ఎలా పని చేస్తారో తెలుసుకుందాం. |
04:41 | User1, lion-and-mouse.html అనే ఫైల్ పై పని చేస్తున్నాడు అని అనుకుందాం. |
04:48 | ఈ ఫైల్ ను క్రియేట్ చేయడానికి gedit lion-and-mouse.html అని టైప్ చేయండి. |
04:54 | నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లోనికి పేస్ట్ చేస్తాను. |
05:02 | అదేవిధంగా, మీరు కూడా మీ ఫైల్ కు కొంత కంటెంట్ ను జోడించండి. |
05:06 | ఫైల్ ను staging area కు జోడిద్దాం. |
05:11 | git add lion-and-mouse.html అని టైప్ చేయండి. |
05:17 | తరువాత కొత్తగా జోడించిన ఫైల్ ను commit చేద్దాం. |
05:21 | git commit hyphen m కోట్స్ లోపల Added lion-and-mouse.html అని టైప్ చేయండి. |
05:29 | ప్రధాన Remote repository తో లోకల్ repository ను సింక్రనైజ్ చేద్దాం. |
05:35 | repositoryను సింక్రనైజ్ చేసే ముందు మనం remotes గురించి నేర్చుకుందాం. |
05:40 | Remote repository యొక్క URL ను Remote అని అంటారు. |
05:45 | మనము URL కు మారుపేరు ఇవ్వవచ్చు. |
05:49 | అనేక Remote repositories పై, పని చేస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. |
05:54 | మనము repositoryను సింక్రనైజ్ చేసేటప్పుడు, మన పూర్తి URLను టైప్ చేయడానికి బదులుగా, మారుపేరును ఉపయోగించవచ్చు |
06:01 | Remote యొక్క డిఫాల్ట్ మారుపేరు ఎల్లప్పుడూ origin. |
06:06 | ఇప్పుడు Remoteను ఎలా జోడించాలో నేర్చుకుందాము. |
06:10 | తిరిగి మన terminalకు వెళ్ళండి. |
06:13 | git remote అని టైప్ చేస్తే, మీకు డిఫాల్ట్ Remote యొక్క పేరు origin అని కనిపిస్తుంది. |
06:20 | తరువాత రిమోట్ కు మారుపేరును ఎలా జోడించాలో చూద్దాం. |
06:25 | git remote add stories అని టైప్ చేసి, రిమోట్ రిపోజిటరీ యొక్క URL ను టైప్ చెయ్యండి. |
06:32 | ఇక్కడ Remote పేరు stories గా ఇస్తున్నాను అదే Remote repository యొక్క పేరు కూడా. |
06:38 | ఇప్పుడు Enter కీ ని నొక్కండి |
06:41 | మళ్ళీ Remote లిస్ట్ ను చెక్ చేయడానికి git remote అని టైప్ చేయండి. |
06:46 | Remote, లిస్ట్ కు జోడించబడిందని మీరు చూడవచ్చు. |
06:50 | ఇప్పుడు మనం ప్రధాన Remote repository తో లోకల్ repositoryను సింక్రనైజ్ చేద్దాం. |
06:55 | దీని కొరకు git push stories master అని టైప్ చేయండి. |
07:00 | ఇక్కడ stories అనునది Remote యొక్క పేరు మరియు master అనునది మనం మార్పులను update చేయవలసిన బ్రాంచ్ పేరు. |
07:07 | ఇప్పుడు Enter నొక్కండి. |
07:09 | priya-spoken1 ను User1 యొక్క username గా టైప్ చేయండి మరియు Enter నొక్కండి. |
07:17 | User1 యొక్క సంబంధిత పాస్వర్డ్ ను టైప్ చేయండి. |
07:21 | ప్రదర్శించడం కోసం, ఈ యూజర్ పేరును ముందుగానే సృష్టించానని గుర్తుకు తెచ్చుకోండి. |
07:27 | దయచేసి మీ యూజర్ పేరు మరియు పాస్ వర్డ్ లను ఇక్కడ ఉపయోగించండి. |
07:31 | ఇది unable to access అనే error ను ఇస్తుంది. |
07:35 | ఈ ఎర్రర్ ఎందుకు వచ్చినది? ఎందువల్లనంటే మనకు Remote repositoryకు యాక్సెస్ కాలేదు. |
07:42 | కాబట్టి ఇప్పుడు, కంట్రిబ్యూటర్లకు యాక్సెస్ అనుమతి ఇవ్వడం నేర్చుకుందాం. |
07:48 | తిరిగి GitHub repositoryకు వెళ్ళండి. |
07:51 | పై ప్యానల్ యొక్క, చివరి టాబ్ Settings పై క్లిక్ చేయండి. |
07:55 | తరువాత ఎడమ వైపు బాక్స్ లో ఉన్న Collaborators లింకుపై క్లిక్ చేయండి. |
08:00 | కంఫార్మేషన్ కోసం మీ GitHub అకౌంట్ పాస్వర్డ్ ను టైప్ చేయండి. |
08:04 | ఇక్కడ, ఈ టెక్స్ట్ బాక్స్ లో, మనము సహచరుల పేర్లను జోడించవచ్చు. |
08:10 | ఎవరైనా ఈ GitHub repositoryను clone చేయవచ్చు అని అర్ధం చేసుకోండి. |
08:15 | కానీ సహచరులగా మనము జోడించే వ్యక్తులు, repository కు push చెయ్యవచ్చు. |
08:21 | ఇప్పుడు నేను ఇద్దరు యూజర్లు priya-spoken1 మరియు kaushik-spoken లను చేర్చుతాను. |
08:27 | నేను టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేస్తున్నప్పుడు యూజర్ పేరు లిస్ట్ చేయబడుట, మీరు గమనించవచ్చు. |
08:33 | యూసర్ ను సహచరులు గా జోడించడానికి Add Collaborator బటన్ పై క్లిక్ చేయండి. |
08:38 | నేను వేరొక యూసర్ kaushik-spokenను చేర్చుతాను. |
08:43 | ఇక్కడ మీరు జోడించిన పేర్లను చూడవచ్చు. |
08:47 | ఇప్పుడు Remote repository లోనికి పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం. |
08:51 | తిరిగి terminal కు మారండి. |
08:54 | git push stories master అని టైప్ చేయండి. |
08:58 | repository కు యాక్సెస్ ఉన్న యూజర్ యొక్క username మరియు passwordలను ఇవ్వండి. |
09:04 | మనం విజయవంతంగా పుష్ చేయడాన్ని మీరు చూడవచ్చు. |
09:08 | తరువాత GitHub repositoryను చెక్ చేసి, మనం చేసిన మార్పులు అప్ డేట్ అయ్యాయో లేదో చూద్దాం. |
09:14 | తిరిగి GitHub repository కు వెళ్ళండి. |
09:17 | Code టాబ్ పై క్లిక్ చేయండి. |
09:20 | commit list ను చెక్ చేద్దాం. |
09:23 | ఇక్కడ సహచరుని యొక్క commit జాబితా చేయబడుట మీరు చూడవచ్చు. |
09:28 | తరువాత, Remote repository తో User2 ఎలా సహకరించగలదో తెలుసుకుందాం. |
09:34 | తిరిగి terminal కు వెళ్ళండి. |
09:37 | friends.html అనే ఫైల్ పై User2 పనిచేస్తుంది అని అనుకొందాం. |
09:43 | ఫైల్ ను క్రియేట్ చేయాలంటే, gedit friends.html అని టైప్ చేయండి. |
09:49 | నేను నా Writer document నుండి కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లోనికి పేస్ట్ చేస్తాను. |
09:54 | అదేవిధంగా మీరు కూడా మీ ఫైల్ లోనికి కొంత కంటెంట్ ను జోడించండి. |
09:59 | ఈ ఫైల్ ను staging area లోనికి జోడిద్దాం. |
10:03 | కొత్తగా జోడించిన ఫైల్ ను commit చేద్దాం. |
10:07 | git commit hyphen m కోట్స్ లోపల Added friends.html అని టైప్ చేయండి. |
10:15 | ఇప్పుడు మనం ప్రధాన Remote repository తో లోకల్ repository ను సింక్రనైజ్ చేద్దాం. |
10:21 | git push origin master అని టైప్ చేయండి. |
10:25 | ఈ లోకల్ repositoryకు మనం Remoteను జోడించలేదని గుర్తుంచుకోండి. |
10:30 | కాబట్టి ఇక్కడ మనం డిఫాల్ట్ Remote పేరైన origin ను ఉపయోగిస్తున్నాము. |
10:34 | ఇప్పుడు Enter నొక్కండి. |
10:37 | User2 యొక్క GitHub యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి. |
10:42 | failed to push అనే error వస్తుంది. |
10:46 | అంతేకాకుండా, error రావడానికి కారణంగా the remote contains work that you do not have locally అని చూపిస్తుంది. |
10:53 | ముందుగానే User1 commitకు పుష్ అయిందని గుర్తుంచుకోండి. |
10:58 | కానీ User1 యొక్క పని User2 యొక్క, లోకల్ repository లో లేదు. |
11:04 | అది errorను సరిచేయుటకు, git pull కమాండ్ ను అమలు చేయమని, ఒక సూచనను ఇస్తుంది. |
11:10 | ముందుగా, మనము User1 యొక్క పనిని బయటకు తీసి, User2 యొక్క లోకల్ repositoryలో చేర్చాలి. ఇప్పుడు ఇది చేద్దాము. |
11:21 | git pull origin master అని టైప్ చేయండి. |
11:25 | ముందుగా అది Remote repository నుండి డేటాను పొంది, తరువాత దానినిలోకల్ repository లో విలీనం చేస్తుంది. |
11:32 | కనుక అది merging కోసం ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఎడిటర్‌ను ఓపెన్ చేస్తుంది. |
11:36 | ఆ సందేశమును అలాగే ఉంచుతూ Ctrl + X నొక్కి ఎడిటర్‌ను మూసివేయండి. |
11:42 | ఇప్పుడు మళ్ళీ డేటా ను పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం. git push origin master అని టైప్ చేయండి. |
11:50 | User2 యొక్క username మరియు password లను ఇవ్వండి. |
11:54 | ఇప్పుడు మనం డేటాను విజయవంతంగా పుష్ చేయగలగటం మీరుచూడవచ్చు. |
11:59 | తరువాత GitHub repositoryకు మనం చేసిన మార్పులు జరిగాయో లేదో తనిఖీ చేద్దాం. |
12:05 | GitHub repository కు తిరిగి వెళ్ళండి. |
12:08 | repository name Stories పై క్లిక్ చేయండి. |
12:12 | ఇప్పుడు repositoryకు friends.html జత కావడాన్ని చూడగలరు. |
12:18 | ఇప్పుడు commit listను చెక్ చేద్దాం. |
12:21 | User2 యొక్క commit కూడా లిస్ట్ అవడాన్ని ఇక్కడ మీరు చూడగలరు. |
12:26 | దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
12:30 | ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము, |
12:35 | Remote repository అంటే ఏమిటి? |
12:38 | Remote repositoryకి డేటా ను సింక్రనైజ్ చేయడము నేర్చుకున్నాం. |
12:42 | ఒక అసైన్మెంట్ గా, User3 అనే మరో యూజర్ ను క్రియేట్ చేయండి. |
12:47 | User3కు డేటాను Clone చేయండి. |
12:50 | User3 యొక్క లోకల్ repository పై పని చేయడం ప్రారంభించండి. |
12:54 | User3 నుండి డేటా ను పుష్ చేయడానికి ప్రయత్నించండి. |
12:58 | ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ కు సారాంశమును ఇస్తుంది. |
13:03 | దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి. |
13:05 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్‌లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
13:12 | మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి. |
13:16 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది. |
13:22 | ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది. |
13:27 | ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. నేను స్వామి ధన్యవాదములు. |