Difference between revisions of "BASH/C2/Command-Line-arguments-and-Quoting/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 97: Line 97:
 
|-
 
|-
 
|02:18
 
|02:18
| Enter నొక్కండి. Zeroth argument is arg.sh అని ఔట్పుట్  ప్రదర్శింపబడింది.  
+
| Enter నొక్కండి. Zeroth argument is arg.sh అనే ఔట్పుట్  ప్రదర్శింపబడింది.  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26

Revision as of 15:51, 27 December 2017

Time Narration
00:01 BASH లోని Command line arguments and Quoting పై spoken tutorialకు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్ లో మనం,
00:11 Command line Arguments మరియు
00:13 Quoting గురించి నేర్చుకుంటాం.
00:15 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:20 ఒక వేళ లేకపోతే , సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:26 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:29 Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం,
00:33 GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను.
00:37 GNU Bash వెర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:43 Shell script, arguments ను command line నుండి కూడా తీసుకోవచ్చు.
00:46 argument, అనేది పిలువబడే program కు పంపే ఒక విలువ.
00:52 ఒక programకు ఎన్ని arguments ను అయినా పంపవచ్చు.
00:57 Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా terminalను తెరుద్దాం.
01:06 నేను ఇప్పటికే కోడ్ ను arg.sh పేరుగల ఫైల్ లో వ్రాశాను.
01:12 terminal పై,
01:16 gedit space arg.sh space ampersand sign(&) అని టైప్ చేయడం ద్వారా ఈ ఫైల్ ని తెరుస్తాను.
01:23 మనం అంపెర్సన్డ్ ని prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాం.
01:27 ఇప్పుడు,Enter నొక్కండి.
01:30 text editor తెరవబడుతుంది.
01:33 ఇప్పుడు నేను code ను వివరిస్తాను.
01:36 ఇది shebang లైన్.
01:39 ఈ లైన్ జీరోత్ argumentను ముద్రిస్తుంది.
01:43 ఇక్కడ, $0 (Dollar zero) shell script యొక్క పేరును ముద్రిస్తుంది.
01:48 దీని అర్థం zeroth argument అనేది మనం పిలుస్తున్న program పేరు అవుతుంది.
01:55 మనం ప్రోగ్రాం ని execute చేసి, పరిశీలిద్దాము.
01:59 terminal కు మారండి.
02:01 ముందుగా chmod space plus x space arg.sh అని
02:05 టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం.
02:12 Enter నొక్కండి.
02:14 ఇప్పుడు dot slash arg.sh అని టైప్ చేసి,
02:18 Enter నొక్కండి. Zeroth argument is arg.sh అనే ఔట్పుట్ ప్రదర్శింపబడింది.
02:26 ఇప్పుడు, మన editor కు వెళ్ళి, మూడు లైన్ లను ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
02:33 $1 (Dollar one ), command line నుండి program కు పంపబడిన మొదటి argument ను సూచిస్తుంది.
02:40 $2 (Dollar two), program కు పంపబడిన రెండవ argument ను సూచిస్తుంది.
02:44 $3 (Dollar three), మూడవ argument ను సూచిస్తుంది.
02:48 ఇప్పుడు, Save పై క్లిక్ చేయండి. మనం ప్రోగ్రాం ను execute చేసి, గమనిద్దాం.
02:52 up-arrow కీ ని నొక్కి, Enter నొక్కండి.
02:57 మనం జీరోత్ argument ముద్రింపబడటాన్ని చూడవచ్చు.
03:00 కానీ మొదటి,రెండవ మరియు మూడవ arguments ఖాళీలు.
03:05 ఇది ఎందుకంటే command line arguments ఎగ్జిక్యూషన్ సమయంలో ఇవ్వబడ్డాయి.
03:11 అందువల్ల up-arrow కీని నొక్కి,sunday monday and tuesday అని టైప్ చేసి,
03:18 Enter నొక్కండి.
03:21 మీరు మొదటి, రెండవ మరియు మూడవ arguments లు sunday monday మరియు tuesday అని చూడవచ్చు.
03:28 ఇప్పుడు మన editorకు, మారి,Enter నొక్కండి.
03:33 ఇప్పుడు, లైన్ ని ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
03:37 $12 (Dollar twelve) పన్నెండవ argument ను సూచిస్తుంది.
03:41 argument సంఖ్య గా 9 కంటే ఎక్కువ వ్రాయడానికి, మనం కర్లీ బ్రాకెట్లను ఉపయోగించాలి.
03:46 లేదంటే, bash argument యొక్క ten's place లో ఉన్న పూర్ణంకం యొక్క విలువ ని మాత్రమే తీసుకుంటుంది
03:53 కాబట్టి మీరు output ను ఊహించలేరు.
03:57 ఇప్పుడు Save పై క్లిక్ చేయండి.
03:59 మనం ప్రోగ్రాం ను execute చేద్దాం.
04:01 terminal కు మారండి.
04:04 నేను prompt ను క్లియర్ చేస్తాను.
04:07 ఇప్పుడు మనం, మన ప్రోగ్రాం కు 12 లేదా 13 arguments ఇవ్వవలసిన అవసరం ఉంది.
04:12 అందువల్ల, dot slash arg.sh space 1 to 13 అని టైప్ చేయండి. ఇప్పుడు Enter నొక్కండి.
04:23 మీరు 12 వ argument 12 అని చూడవచ్చు.
04:27 తిరిగి editorకు, మారండి.
04:30 ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
04:34 $# (డాలర్ హాష్) ఒక ప్రోగ్రాం కు పంపబడిన మొత్తం arguments యొక్క సంఖ్య ను సూచిస్తుంది
04:40 ఇప్పుడు Save పై క్లిక్ చేయండి.
04:43 ప్రోగ్రాం ని execute చేసి, terminalకు మారండి.
04:46 ఎగ్జిక్యూట్ చేద్దాం. up-arrow కీ ని నొక్కి, Enter నొక్కండి.
04:52 మనం మొత్తం arguments 13 అని చూడవచ్చు.
04:57 ఇప్పుడు editor కు వెళ్ళండి.
05:00 Enter నొక్కి, ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
05:04 $ * (Dollar asterisk) అన్ని arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది.
05:10 దీనిని ఒక సాధారణ for loop సహాయంతో పరిక్షిద్దాం.
05:14 ఈ for loop ను ఎగ్జిక్యూషన్ సమయంలో విశ్లేషిస్తాము.
05:18 ఇప్పుడు Save పై క్లిక్ చేసి, terminal కు వెళ్ళండి.
05:22 నేను promptను క్లియర్ చేస్తాను.
05:26 ఇప్పుడు, dot slash arg.sh space sunday monday and tuesday అని టైప్ చేసి,
05:35 Enter నొక్కండి.
05:38 మన ప్రోగ్రాం కు 3 arguments ను పంపాము కాబట్టి, మొత్తం arguments సంఖ్యను 3 గా మీరు చూడవచ్చు.
05:46 ముందే చెప్పిన విధంగా, $ * అన్ని arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది.
05:54 ఇది for loop యొక్క అవుట్ పుట్.
05:57 మనం అన్ని arguments లను ఒకే లైన్ పై ముద్రిపబడటాన్ని చూస్తాం.
06:02 ఇప్పుడు, మనం ప్రోగ్రాం కు వెళ్ళి, ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి.
06:09 $@ (Dollar at) కూడా అన్ని arguments లను ముద్రిస్తుంది.
06:13 అయితే, ఈసారి ప్రతి argument ఒక ప్రత్యేక లైన్ పై ముద్రించబడుతుంది.
06:20 ఈ for loop ప్రతి argument విలువ ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది.
06:26 ఎలానో చూద్దాం. Save పై క్లిక్ చేయండి.
06:29 terminal కు వెళ్ళండి.
06:32 up-arrow key పై నొక్కండి.
06:34 Enter నొక్కండి. ఇప్పుడు మీరు తేడాను చూడవచ్చు.
06:39 ఇవి $@ చే ముద్రించబడిన arguments.
06:43 $@ అనేది, ప్రతి argument ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది.
06:47 ఇది రెండవ for loopకు ఔట్పుట్
06:52 ఇప్పుడు BASHలో quotingకు వెళ్దాము.
06:55 slidesకు మారండి.
06:57 ఇక్కడ మూడు రకాల quotes ఉన్నాయి.
06:59 Double quote, Single quote
07:02 Backslash. Double quote variables మరియు commands యొక్క విలువను ప్రతిక్షేపిస్తుంది.
07:09 ఉదాహరణకు echo “Username is $USER” .
07:13 ఇది సిస్టమ్ యొక్క username ని ప్రదర్శిస్తుంది.
07:17 Terminalకు మారండి.
07:20 నేను prompt ను క్లియర్ చేస్తాను.
07:23 ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Username స్పేస్ is dollar USER ఇన్ capitals, అని టైప్ చేసి,
07:34 Enter నొక్కండి. సిస్టం యొక్క username ముద్రించబడింది.
07:39 మీ సిస్టమ్ ప్రకారం output మారుతూ ఉంటుంది.
07:42 ఇప్పుడు slides కు తిరిగి వెళ్ళండి.
07:46 Single quotes ఇచ్చిన string యొక్క ప్రతీ అక్షరం స్వభావ అర్ధాన్ని సంరక్షిస్తుంది.
07:53 దీనిని అన్ని అక్షరాల ప్రత్యేక అర్ధాన్ని ఆపి వేయడానికి ఉపయోగిస్తారు
07:58 Terminal కు వెళ్ళండి.
08:01 echo స్పేస్ సింగల్ కోట్స్ లోపల Username is dollar USER ఇన్ capital అని టైప్ చేసి,
08:10 Enter నొక్కండి.
08:12 Username is $USER అనేది అవుట్ పుట్.
08:16 ఈ ఉదాహరణలో, ఇది సింగిల్ కోట్స్ లలో కనిపించే అన్ని అక్షరాలను ముద్రిస్తుంది.
08:23 ఇది $USER వేరియబుల్ యొక్క విలువను ప్రతిక్షేపం చేయలేదు.
08:28 మన slides కు వెళ్ళండి.
08:31 Backslash ఒక సింగల్ క్యారెక్టర్ నుండి ప్రత్యేక అర్థాన్ని తొలగిస్తుంది.
08:37 దీన్ని BASH లో escape character గా ఉపయోగిస్తారు.
08:42 Terminal కు వెళ్ళండి.
08:44 ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Username is backslash dollar USER అని టైప్ చేయండి.
08:55 మనము డబుల్ కోట్స్ ఇచ్చినందున,మనము echo కమాండ్ username ను ప్రదర్శించునని భావిస్తున్నాము.
09:02 ఈ కమాండ్ ను ప్రయత్నిద్దాము, అందుకు Enter నొక్కండి.
09:06 అవుట్ పుట్ Username is $USER.
09:10 ఈ ఉదాహరణలో, బ్యాక్ స్లాష్ (Dollar) $ గుర్తు యొక్క ప్రత్యేక అర్ధాన్ని తొలగిస్తుంది.
09:16 $USER ఎటువంటి ప్రత్యేక కార్యాచరణ లేకుండానే string గా వ్యవహరించబడును.
09:22 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
09:25 తిరిగి మన slidesకు వెళ్ళండి.
09:27 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం,
09:31 Command line arguments,
09:33 డబుల్ కోట్, సింగిల్ కోట్ మరియు బాక్ స్లాష్ లతో పనిచేసే విధానం గురించి నేర్చుకుంటాం.
09:39 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
09:42 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
09:45 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
09:51 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
09:56 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
10:00 మరింత సమాచారం కోసం, దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాయండి.
10:07 Spoken Tutorial ప్రాజెక్ట్, Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
10:10 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro
10:24 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
10:30 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india