Difference between revisions of "BASH/C2/Command-Line-arguments-and-Quoting/Telugu"
From Script | Spoken-Tutorial
Line 34: | Line 34: | ||
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | Shell script, arguments ను command line నుండి కూడా | + | | Shell script, arguments ను command line నుండి కూడా తీసుకోవచ్చు. |
|- | |- | ||
| 00:46 | | 00:46 |
Revision as of 15:48, 27 December 2017
Time | Narration |
00:01 | BASH లోని Command line arguments and Quoting పై spoken tutorialకు స్వాగతం. |
00:08 | ఈ ట్యుటోరియల్ లో మనం, |
00:11 | Command line Arguments మరియు |
00:13 | Quoting గురించి నేర్చుకుంటాం. |
00:15 | ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి. |
00:20 | ఒక వేళ లేకపోతే , సంబంధిత ట్యుటోరియల్స్ కోసం దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి. |
00:26 | ఈ ట్యుటోరియల్ కోసం నేను, |
00:29 | Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం, |
00:33 | GNU BASH వర్షన్ 4.1.10 ను ఉపయోగిస్తున్నాను. |
00:37 | GNU Bash వెర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్ లు ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి. |
00:43 | Shell script, arguments ను command line నుండి కూడా తీసుకోవచ్చు. |
00:46 | argument, అనేది పిలువబడే program కు పంపే ఒక విలువ. |
00:52 | ఒక programకు ఎన్ని arguments ను అయినా పంపవచ్చు. |
00:57 | Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి మీ కీబోర్డు పై నొక్కడం ద్వారా terminalను తెరుద్దాం. |
01:06 | నేను ఇప్పటికే కోడ్ ను arg.sh పేరుగల ఫైల్ లో వ్రాశాను. |
01:12 | terminal పై, |
01:16 | gedit space arg.sh space ampersand sign(&) అని టైప్ చేయడం ద్వారా ఈ ఫైల్ ని తెరుస్తాను. |
01:23 | మనం అంపెర్సన్డ్ ని prompt ను ఫ్రీ చేయడానికి ఉపయోగిస్తాం. |
01:27 | ఇప్పుడు,Enter నొక్కండి. |
01:30 | text editor తెరవబడుతుంది. |
01:33 | ఇప్పుడు నేను code ను వివరిస్తాను. |
01:36 | ఇది shebang లైన్. |
01:39 | ఈ లైన్ జీరోత్ argumentను ముద్రిస్తుంది. |
01:43 | ఇక్కడ, $0 (Dollar zero) shell script యొక్క పేరును ముద్రిస్తుంది. |
01:48 | దీని అర్థం zeroth argument అనేది మనం పిలుస్తున్న program పేరు అవుతుంది. |
01:55 | మనం ప్రోగ్రాం ని execute చేసి, పరిశీలిద్దాము. |
01:59 | terminal కు మారండి. |
02:01 | ముందుగా chmod space plus x space arg.sh అని |
02:05 | టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం. |
02:12 | Enter నొక్కండి. |
02:14 | ఇప్పుడు dot slash arg.sh అని టైప్ చేసి, |
02:18 | Enter నొక్కండి. Zeroth argument is arg.sh అని ఔట్పుట్ ప్రదర్శింపబడింది. |
02:26 | ఇప్పుడు, మన editor కు వెళ్ళి, మూడు లైన్ లను ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
02:33 | $1 (Dollar one ), command line నుండి program కు పంపబడిన మొదటి argument ను సూచిస్తుంది. |
02:40 | $2 (Dollar two), program కు పంపబడిన రెండవ argument ను సూచిస్తుంది. |
02:44 | $3 (Dollar three), మూడవ argument ను సూచిస్తుంది. |
02:48 | ఇప్పుడు, Save పై క్లిక్ చేయండి. మనం ప్రోగ్రాం ను execute చేసి, గమనిద్దాం. |
02:52 | up-arrow కీ ని నొక్కి, Enter నొక్కండి. |
02:57 | మనం జీరోత్ argument ముద్రింపబడటాన్ని చూడవచ్చు. |
03:00 | కానీ మొదటి,రెండవ మరియు మూడవ arguments ఖాళీలు. |
03:05 | ఇది ఎందుకంటే command line arguments ఎగ్జిక్యూషన్ సమయంలో ఇవ్వబడ్డాయి. |
03:11 | అందువల్ల up-arrow కీని నొక్కి,sunday monday and tuesday అని టైప్ చేసి, |
03:18 | Enter నొక్కండి. |
03:21 | మీరు మొదటి, రెండవ మరియు మూడవ arguments లు sunday monday మరియు tuesday అని చూడవచ్చు. |
03:28 | ఇప్పుడు మన editorకు, మారి,Enter నొక్కండి. |
03:33 | ఇప్పుడు, లైన్ ని ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
03:37 | $12 (Dollar twelve) పన్నెండవ argument ను సూచిస్తుంది. |
03:41 | argument సంఖ్య గా 9 కంటే ఎక్కువ వ్రాయడానికి, మనం కర్లీ బ్రాకెట్లను ఉపయోగించాలి. |
03:46 | లేదంటే, bash argument యొక్క ten's place లో ఉన్న పూర్ణంకం యొక్క విలువ ని మాత్రమే తీసుకుంటుంది |
03:53 | కాబట్టి మీరు output ను ఊహించలేరు. |
03:57 | ఇప్పుడు Save పై క్లిక్ చేయండి. |
03:59 | మనం ప్రోగ్రాం ను execute చేద్దాం. |
04:01 | terminal కు మారండి. |
04:04 | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
04:07 | ఇప్పుడు మనం, మన ప్రోగ్రాం కు 12 లేదా 13 arguments ఇవ్వవలసిన అవసరం ఉంది. |
04:12 | అందువల్ల, dot slash arg.sh space 1 to 13 అని టైప్ చేయండి. ఇప్పుడు Enter నొక్కండి. |
04:23 | మీరు 12 వ argument 12 అని చూడవచ్చు. |
04:27 | తిరిగి editorకు, మారండి. |
04:30 | ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
04:34 | $# (డాలర్ హాష్) ఒక ప్రోగ్రాం కు పంపబడిన మొత్తం arguments యొక్క సంఖ్య ను సూచిస్తుంది |
04:40 | ఇప్పుడు Save పై క్లిక్ చేయండి. |
04:43 | ప్రోగ్రాం ని execute చేసి, terminalకు మారండి. |
04:46 | ఎగ్జిక్యూట్ చేద్దాం. up-arrow కీ ని నొక్కి, Enter నొక్కండి. |
04:52 | మనం మొత్తం arguments 13 అని చూడవచ్చు. |
04:57 | ఇప్పుడు editor కు వెళ్ళండి. |
05:00 | Enter నొక్కి, ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
05:04 | $ * (Dollar asterisk) అన్ని arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది. |
05:10 | దీనిని ఒక సాధారణ for loop సహాయంతో పరిక్షిద్దాం. |
05:14 | ఈ for loop ను ఎగ్జిక్యూషన్ సమయంలో విశ్లేషిస్తాము. |
05:18 | ఇప్పుడు Save పై క్లిక్ చేసి, terminal కు వెళ్ళండి. |
05:22 | నేను promptను క్లియర్ చేస్తాను. |
05:26 | ఇప్పుడు, dot slash arg.sh space sunday monday and tuesday అని టైప్ చేసి, |
05:35 | Enter నొక్కండి. |
05:38 | మన ప్రోగ్రాం కు 3 arguments ను పంపాము కాబట్టి, మొత్తం arguments సంఖ్యను 3 గా మీరు చూడవచ్చు. |
05:46 | ముందే చెప్పిన విధంగా, $ * అన్ని arguments ను ఒకే లైన్ పై ముద్రిస్తుంది. |
05:54 | ఇది for loop యొక్క అవుట్ పుట్. |
05:57 | మనం అన్ని arguments లను ఒకే లైన్ పై ముద్రిపబడటాన్ని చూస్తాం. |
06:02 | ఇప్పుడు, మనం ప్రోగ్రాం కు వెళ్ళి, ఇక్కడ చూపించిన విధంగా టైప్ చేయండి. |
06:09 | $@ (Dollar at) కూడా అన్ని arguments లను ముద్రిస్తుంది. |
06:13 | అయితే, ఈసారి ప్రతి argument ఒక ప్రత్యేక లైన్ పై ముద్రించబడుతుంది. |
06:20 | ఈ for loop ప్రతి argument విలువ ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది. |
06:26 | ఎలానో చూద్దాం. Save పై క్లిక్ చేయండి. |
06:29 | terminal కు వెళ్ళండి. |
06:32 | up-arrow key పై నొక్కండి. |
06:34 | Enter నొక్కండి. ఇప్పుడు మీరు తేడాను చూడవచ్చు. |
06:39 | ఇవి $@ చే ముద్రించబడిన arguments. |
06:43 | $@ అనేది, ప్రతి argument ను ప్రత్యేక లైన్ పై ముద్రిస్తుంది. |
06:47 | ఇది రెండవ for loopకు ఔట్పుట్ |
06:52 | ఇప్పుడు BASHలో quotingకు వెళ్దాము. |
06:55 | slidesకు మారండి. |
06:57 | ఇక్కడ మూడు రకాల quotes ఉన్నాయి. |
06:59 | Double quote, Single quote |
07:02 | Backslash. Double quote variables మరియు commands యొక్క విలువను ప్రతిక్షేపిస్తుంది. |
07:09 | ఉదాహరణకు echo “Username is $USER” . |
07:13 | ఇది సిస్టమ్ యొక్క username ని ప్రదర్శిస్తుంది. |
07:17 | Terminalకు మారండి. |
07:20 | నేను prompt ను క్లియర్ చేస్తాను. |
07:23 | ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Username స్పేస్ is dollar USER ఇన్ capitals, అని టైప్ చేసి, |
07:34 | Enter నొక్కండి. సిస్టం యొక్క username ముద్రించబడింది. |
07:39 | మీ సిస్టమ్ ప్రకారం output మారుతూ ఉంటుంది. |
07:42 | ఇప్పుడు slides కు తిరిగి వెళ్ళండి. |
07:46 | Single quotes ఇచ్చిన string యొక్క ప్రతీ అక్షరం స్వభావ అర్ధాన్ని సంరక్షిస్తుంది. |
07:53 | దీనిని అన్ని అక్షరాల ప్రత్యేక అర్ధాన్ని ఆపి వేయడానికి ఉపయోగిస్తారు |
07:58 | Terminal కు వెళ్ళండి. |
08:01 | echo స్పేస్ సింగల్ కోట్స్ లోపల Username is dollar USER ఇన్ capital అని టైప్ చేసి, |
08:10 | Enter నొక్కండి. |
08:12 | Username is $USER అనేది అవుట్ పుట్. |
08:16 | ఈ ఉదాహరణలో, ఇది సింగిల్ కోట్స్ లలో కనిపించే అన్ని అక్షరాలను ముద్రిస్తుంది. |
08:23 | ఇది $USER వేరియబుల్ యొక్క విలువను ప్రతిక్షేపం చేయలేదు. |
08:28 | మన slides కు వెళ్ళండి. |
08:31 | Backslash ఒక సింగల్ క్యారెక్టర్ నుండి ప్రత్యేక అర్థాన్ని తొలగిస్తుంది. |
08:37 | దీన్ని BASH లో escape character గా ఉపయోగిస్తారు. |
08:42 | Terminal కు వెళ్ళండి. |
08:44 | ఇప్పుడు, echo స్పేస్ డబుల్ కోట్స్ లోపల Username is backslash dollar USER అని టైప్ చేయండి. |
08:55 | మనము డబుల్ కోట్స్ ఇచ్చినందున,మనము echo కమాండ్ username ను ప్రదర్శించునని భావిస్తున్నాము. |
09:02 | ఈ కమాండ్ ను ప్రయత్నిద్దాము, అందుకు Enter నొక్కండి. |
09:06 | అవుట్ పుట్ Username is $USER. |
09:10 | ఈ ఉదాహరణలో, బ్యాక్ స్లాష్ (Dollar) $ గుర్తు యొక్క ప్రత్యేక అర్ధాన్ని తొలగిస్తుంది. |
09:16 | $USER ఎటువంటి ప్రత్యేక కార్యాచరణ లేకుండానే string గా వ్యవహరించబడును. |
09:22 | దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము. |
09:25 | తిరిగి మన slidesకు వెళ్ళండి. |
09:27 | సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో మనం, |
09:31 | Command line arguments, |
09:33 | డబుల్ కోట్, సింగిల్ కోట్ మరియు బాక్ స్లాష్ లతో పనిచేసే విధానం గురించి నేర్చుకుంటాం. |
09:39 | క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. |
09:42 | ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది. |
09:45 | ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు. |
09:51 | స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం, స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. |
09:56 | ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది. |
10:00 | మరింత సమాచారం కోసం, దయచేసి contact@spoken-tutorial.orgకు వ్రాయండి. |
10:07 | Spoken Tutorial ప్రాజెక్ట్, Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం. |
10:10 | NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది. http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:24 | FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది. |
10:30 | ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి. మీకు ధన్యవాదాలు. |