Difference between revisions of "Git/C3/Working-with-Remote-Repositories/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 409: Line 409:
 
|-
 
|-
 
| 09:08
 
| 09:08
|తరువాత  GitHub repositoryను  చెక్ చేసి, మనం చేసిన మార్పులు అప్ డేట్ అయ్య్యయో లేదో చూద్దాం.  
+
|తరువాత  GitHub repositoryను  చెక్ చేసి, మనం చేసిన మార్పులు అప్ డేట్ అయ్యాయో లేదో చూద్దాం.  
  
 
|-
 
|-
Line 437: Line 437:
 
|-
 
|-
 
| 09:37
 
| 09:37
|    friends.html    అనే ఫైల్ పై     User2 పనిచేస్తుంది అని అనుకొందాం.  
+
|    friends.html    అనే ఫైల్ పై User2 పనిచేస్తుంది అని అనుకొందాం.  
  
 
|-
 
|-
Line 509: Line 509:
 
|-
 
|-
 
| 11:10
 
| 11:10
|ముందుగా , మనము    User1    యొక్క పనిని బయటకు తీసి,  User2  యొక్క లోకల్    repositoryలో చేర్చాలి దీన్ని ఇప్పుడు చేద్దాము.
+
|ముందుగా , మనము    User1    యొక్క పనిని బయటకు తీసి,  User2  యొక్క లోకల్    repositoryలో చేర్చాలి దీనిని  ఇప్పుడు చేద్దాము.
  
 
|-
 
|-
Line 585: Line 585:
 
|-
 
|-
 
| 12:47
 
| 12:47
|  User3  కు  డేటా ని    Clone    చేయండి.  
+
|  User3  కు  డేటాను    Clone    చేయండి.  
  
 
|-
 
|-
Line 593: Line 593:
 
|-
 
|-
 
| 12:54
 
| 12:54
|    User3  నుండి డేటా ని పుష్ చేయడానికి  ప్రయత్నించండి.  
+
|    User3  నుండి డేటా ను  పుష్ చేయడానికి  ప్రయత్నించండి.  
  
 
|-
 
|-
Line 621: Line 621:
 
|-
 
|-
 
| 13:27
 
| 13:27
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది  నాగూర్ వలి . ధన్యవాదాలు.
+
|ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది  నాగూర్ వలి . ధన్యవాదాలు.

Revision as of 10:52, 27 November 2017

Time
Narration
00:01 Working with Remote Repositories పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము Remote repository అంటే ఏమిటి ?
00:12 Remote repository కు డేటా ను ఎలా సమకాలీకరిస్తామో నేర్చుకుంటాం.
00:16 ఈ ట్యుటోరియల్ కొరకు నేను Ubuntu Linux 14.04 ను ఉపయోగిస్తున్నాను.
00:22 అలాగే Git 2.3.2,
00:25 gedit Text Editor మరియు
00:28 Firefox web browser ను కూడా ఉపయోగిస్తున్నాను.
00:30 మీరు మీకు నచ్చిన ఏ ఎడిటర్ మరియు బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:36 మీకు ఈ ట్యుటోరియల్ కొరకు Internet కనెక్షన్ కూడా అవసరం.
00:41 Git కమాండ్స్ పై అవగాహన కూడా ఉండాలి.
00:46 లేకపోతే, సంబంధిత Git ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా లింక్ ను సందర్శించండి.
00:52 ముందుగా Remote repository అంటే ఏమిటో అర్ధం చేసుకుందాం.
00:56 ఏ repository అయితే, Internet లో గాని లేదా ఏదైనా network లో గాని హోస్ట్ చేయబడుతుందో దానిని Remote repository అని అంటారు.
01:04. ఈ కేంద్రీకృత repository ను ఉపయోగించి, ప్రజలు ప్రపంచంలో ఎక్కడి నుండైనా ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ లో కలసి పనిచేయవచ్చు.
01:13 ఉదాహరణకు, ఒకే repository లో సంయుక్తంగా పనిచేయాలనుకునే ముగ్గురు వినియోగదారులు ఉన్నారు అని అనుకుందాం.
01:21 Git ను ఉపయోగించి, వారి లోకల్ సిస్టం లోనికి, రిమోట్ రిపోజిటరీ యొక్క ఒక కాపీను తీసుకోవచ్చు.
01:28 దీనిని clone కమాండ్ ను ఉపయోగించి చేస్తాము.
01:31 తరువాత వారు లోకల్ repository తో ఆఫ్ లైన్ లో కూడా పనిచేయవచ్చు.
01:36 పని పూర్తి అయిన తర్వాత, వారు దానిని తిరిగి ప్రధాన repositoryకు సింక్రనైజ్ చేయాలి.
01:43 దీనిని Push మరియు pull కమాండ్స్ ను ఉపయోగించి చేస్తాము.
01:48 మీరు ఈ ట్యుటోరియల్ పూర్తి అయ్యేసరికి మొత్తం ప్రక్రియను అర్థం చేసుకుంటారు.
01:53 ముందుగా మనము సృష్టించిన GitHub repositoryను ఓపెన్ చేద్దాం.
01:59 కుడి వైపున, ఈ repository యొక్క URL ను చూడవచ్చు.
02:05 ఈ URL ను కాపీ చేద్దాం.
02:08 ఈ URL ఉపయోగించి, repository యొక్క ఒక కాపీని, లోకల్ repository గా సృష్టిస్తాము.
02:16 terminal ను ఓపెన్ చేద్దాం.
02:18 ఇద్దరు వినియోగదారులు ఒకే Remote repositoryపై ఎలా పనిచేస్తారో ఇప్పుడు అర్థం చేసుకుందాం .
02:24 దీని కోసం, నేను, నా Desktop పై User1 మరియు User2 అనే రెండు డైరెక్టరీలను ఇప్పటికే సృష్టించాను.
02:33 దయచేసి మీరు కూడా మీ Desktop పై అలానే చేయండి.
02:36 ఒకే terminal లో, నేను రెండు విభిన్న టాబ్లలో ఆ డైరెక్టరీలను తెరుస్తాను.
02:43 మొదటి టాబ్ లో cd space User1 అని టైప్ చేయండి.
02:49 రెండవ టాబ్ ను ఓపెన్ చేయడానికి File menu పై క్లిక్ చేసి, Open Tab ను ఎంచుకోండి.
02:55 రెండవ టాబ్ లో cd User2 అని టైప్ చేయండి.
03:00 User1 ట్యాబ్ కు వెళ్ళండి.
03:03 ఇప్పుడు Remote repository యొక్క కాపీ ని తయారుచేద్దాం.
03:08 git space clone అని టైప్ చేసి, కాపీ చేసిన URL ను పేస్ట్ చేయండి. ఈ కమాండ్ చివరిలో dot అని టైప్ చేయండి.
03:17 ఈ Dot, మనం ప్రస్తుత డైరెక్టరీ, User1 directory లోపల repository ను కాపీ చేయబోతున్నామని సూచిస్తుంది.
03:25 లేకపోతే, అది repository పేరు stories గా ఒక కొత్త directory ను సృష్టిస్తుంది.
03:31 ఇప్పుడు Enter నొక్కండి.
03:33 clone కమాండ్ మొత్తం కేంద్ర ఫోల్డర్ ను కాపీ చేసి, దానిని స్థానిక repository గా చేస్తుంది.
03:40 ls అని టైప్ చేయండి. Remote repository యొక్క కంటెంట్ ఇక్కడ కాపీ చేయబడిందని మీరు చూడవచ్చు.
03:48 అవగాహన కోసం ఈ repository యొక్క user name మరియు email id లను నేను మారుస్తాను.
03:55 నేను ఇప్పటికే మరో రెండు GitHub users - priya-spoken1 మరియు kaushik-spoken లను -ప్రదర్శించడం కొరకు క్రియేట్ చేశాను.
04:04 నేను వాటిని ఇక్కడ ఉపయోగిస్తాను.
04:14 ఇప్పుడు Git log ను తనిఖీ చేద్దాం.
04:16 మీరు Remote repository యొక్క commits ను చూడవచ్చు.
04:21 అదేవిధంగా, నేను రెండవ టాబ్ లో User2 directory లో repository ని clone చేస్తాను.
04:28 ఇక్కడ కూడా నేను User1కు చేసినట్లుగా user name మరియు email id లను మారుస్తాను.
04:35 తరువాత, ఈ వినియోగదారులు, Remote repository లో ఎలా పని చేస్తారో తెలుసుకుందాం.
04:41 User1, lion-and-mouse.html అనే ఫైల్ పై పని చేస్తున్నాడు అని అనుకోండి
04:48 ఫైల్ ను క్రియేట్ చేయడానికి gedit lion-and-mouse.html అని టైప్ చేయండి.
04:54 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లోనికి పేస్ట్ చేస్తాను.
05:02 అదేవిధంగా, మీరు కూడా మీ ఫైల్ కు కొంత కంటెంట్ ను జోడించండి.
05:06 ఫైల్ ను staging area కు జోడిద్దాం.
05:11 git add lion-and-mouse.html అని టైప్ చేయండి.
05:17 తరువాత కొత్తగా జోడించిన ఫైల్ ను commit చేద్దాము.
05:21 git commit hyphen m కోట్స్ లోపల Added lion-and-mouse.html అని టైప్ చేయండి.
05:29 ప్రధాన Remote repository తో లోకల్ repository ను సింక్రనైజ్ చేద్దాం.
05:35 repositoryను సింక్రనైజ్ చేసే ముందు మనం remotes గురించి నేర్చుకుందాం.
05:40 Remote repository యొక్క URL ను Remote అని అంటారు.
05:45 మనము URL కు మారుపేరు ఇవ్వవచ్చు.
05:49 అనేక Remote repositories పై , పని చేస్తున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
05:54 మనము repositoryను సింక్రనైజ్ చేసేటప్పుడు, మన పూర్తి URL ను టైప్ చేయడానికి బదులుగా, మారుపేరును ఉపయోగించవచ్చ్చు.
06:01 Remote యొక్క డిఫాల్ట్ మారుపేరు ఎల్లప్పుడూ origin.
06:06 ఇప్పుడు Remote ను ఎలా జోడించాలో నేర్చుకుందాము.
06:10 తిరిగి మన terminalకు వెళ్ళండి.
06:13 git remote అని టైప్ చేస్తే, మీకు డిఫాల్ట్ Remote యొక్క పేరు origin అని కనిపిస్తుంది.
06:20 తరువాత రిమోట్ కు మారుపేరును ఎలా జోడించాలో చూద్దాం.
06:25 git remote add stories అని టైప్ చేసి, రిమోట్ రిపోజిటరీ యొక్క URL ను టైప్ చెయ్యండి.
06:32 ఇక్కడ Remote పేరు stories గా ఇస్తున్నాను అదే Remote repository యొక్క పేరు కూడా.
06:38 ఇప్పుడు Enter కీ ని నొక్కండి
06:41 మళ్ళీ Remote లిస్ట్ ను చెక్ చేయడానికి git remote అని టైప్ చేయండి.
06:46 Remote, లిస్ట్ కు జోడించబడిందని మీరు చూడవచ్చు.
06:50 ఇప్పుడు మనం ప్రధాన Remote repository తో లోకల్ repository ను సింక్రనైజ్ చేద్దాం.
06:55 దీని కొరకు git push stories master అని టైప్ చేయండి.
07:00 ఇక్కడ stories అనునది Remote యొక్క పేరు మరియు master అనునది మనం మార్పులను update చేయవలసిన బ్రాంచ్ పేరు.
07:07 ఇప్పుడు Enter నొక్కండి.
07:09 priya-spoken1 ను User1 యొక్క username గా టైప్ చేయండి మరియు Enter నొక్కండి.
07:17 User1 యొక్క సంబంధిత పాస్వర్డ్ ను టైప్ చేయండి.
07:21 ప్రదర్శించడం కోసం, ఈ యూజర్ పేరును ముందుగానే సృష్టించానని గుర్తుకు తెచ్చుకోండి.
07:27 దయచేసి మీ యూజర్ పేరు మరియు పాస్ వర్డ్ లను ఇక్కడ ఉపయోగించండి.
07:31 ఇది unable to access అనే error ను ఇస్తుంది.
07:35 ఈ ఎర్రర్ ఎందుకు వచ్చినది? ఎందువల్లనంటే మనకు Remote repository కు యాక్సెస్ కాలేదు.
07:42 కాబట్టి ఇప్పుడు, కంట్రిబ్యూటర్లకు యాక్సెస్ అనుమతి ఇవ్వడం నేర్చుకుందాం.
07:48 తిరిగి GitHub repositoryకు వెళ్ళండి.
07:51 పై ప్యానల్ యొక్క, చివరి టాబ్ Settings పై క్లిక్ చేయండి.
07:55 తరువాత ఎడమ వైపు బాక్స్ లో ఉన్న Collaborators లింకుపై క్లిక్ చేయండి.
08:00 కంఫార్మేషన్ కోసం మీ GitHub అకౌంట్ పాస్వర్డ్ ను టైప్ చేయండి.
08:04 ఇక్కడ, ఈ టెక్స్ట్ బాక్స్ లో , మనము సహచరుల పేర్లను జోడించవచ్చు.
08:10 ఎవరైనా ఈ GitHub repositoryను clone చేయవచ్చు అని అర్ధం చేసుకోండి.
08:15 కానీ సహచరులగా మనము జోడించే వ్యక్తులు, repository కు push చెయ్యవచ్చు.
08:21 ఇప్పుడు నేను ఇద్దరు యూజర్లు priya-spoken1 మరియు kaushik-spoken లను చేర్చుతాను.
08:27 నేను టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేస్తున్నప్పుడు యూజర్ పేరు లిస్ట్ చేయబడుట, మీరు గమనించవచ్చు.
08:33 యూసర్ ను సహచరులు గా జోడించడానికి Add Collaborator బటన్ పై క్లిక్ చేయండి.
08:38 నేను వేరొక యూసర్ kaushik-spokenను చేర్చుతాను.
08:43 ఇక్కడ మీరు జోడించిన పేర్లను చూడవచ్చు.
08:47 ఇప్పుడు Remote repository లోనికి పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం.
08:51 తిరిగి terminal కు మారండి.
08:54 git push stories master అని టైప్ చేయండి.
08:58 repository కు యాక్సెస్ ఉన్న యూజర్ యొక్క username మరియు password లను ఇవ్వండి.
09:04 మనం విజయవంతంగా పుష్ చేయడాన్ని మీరు చూడవచ్చు.
09:08 తరువాత GitHub repositoryను చెక్ చేసి, మనం చేసిన మార్పులు అప్ డేట్ అయ్యాయో లేదో చూద్దాం.
09:14 తిరిగి GitHub repository కు వెళ్ళండి.
09:17 Code టాబ్ పై క్లిక్ చేయండి.
09:20 commit list ను చెక్ చేద్దాం.
09:23 ఇక్కడ సహచరుని యొక్క commit జాబితా చేయబడుట మీరు చూడవచ్చు.
09:28 తరువాత, Remote repository తో User2 ఎలా సహకరించగలదో తెలుసుకుందాం.
09:34 తిరిగి terminal కు వెళ్ళండి.
09:37 friends.html అనే ఫైల్ పై User2 పనిచేస్తుంది అని అనుకొందాం.
09:43 ఫైల్ ను క్రియేట్ చేయాలంటే gedit friends.html అని టైప్ చేయండి.
09:49 నేను నా Writer document నుండి కొంత టెక్స్ట్ ను కాపీ చేసి ఈ ఫైల్ లోనికి పేస్ట్ చేస్తాను.
09:54 అదేవిధంగా మీరు కూడా మీ ఫైల్ లోనికి కొంత కంటెంట్ ను జోడించండి.
09:59 ఈ ఫైల్ ను staging area లోనికి జోడిద్దాం.
10:03 కొత్తగా జోడించిన ఫైల్ ను commit చేద్దాం.
10:07 git commit hyphen m కోట్స్ లోపల Added friends.html అని టైప్ చేయండి.
10:15 ఇప్పుడు మనం ప్రధాన Remote repository తో లోకల్ repository ను సింక్రనైజ్ చేద్దాం.
10:21 git push origin master అని టైప్ చేయండి.
10:25 ఈ లోకల్ repositoryకు మనం Remoteను జోడించలేదని గుర్తుంచుకోండి.
10:30 కాబట్టి ఇక్కడ మనం డిఫాల్ట్ Remote పేరైన origin ను ఉపయోగిస్తున్నాము.
10:34 ఇప్పుడు Enter నొక్కండి.
10:37 User2 యొక్క GitHub యూసర్ నేమ్ మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
10:42 failed to push అనే error వస్తుంది.
10:46 అంతేకాకుండా error రావడానికి కారణంగా the remote contains work that you do not have locally అని చూపిస్తుంది.
10:53 ముందుగానే User1 commit కు పుష్ అయిందని గుర్తుంచుకోండి.
10:58 కానీ User1 యొక్క పని User2 యొక్క, లోకల్ repository లో లేదు.
11:04 అది error ను సరిచేయుటకు, git pull కమాండ్ ను అమలు చేయమని, ఒక సూచనను ఇస్తుంది.
11:10 ముందుగా , మనము User1 యొక్క పనిని బయటకు తీసి, User2 యొక్క లోకల్ repositoryలో చేర్చాలి దీనిని ఇప్పుడు చేద్దాము.
11:21 git pull origin master అని టైప్ చేయండి.
11:25 ముందుగా అది Remote repository నుండి డేటాను పొంది, తరువాత దానినిలోకల్ repository లో విలీనం చేస్తుంది.
11:32 కనుక అది merging కోసం ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఎడిటర్ను ఓపెన్ చేస్తుంది.
11:36 ఆ సందేశమును అలాగే ఉంచుతూ Ctrl + X నొక్కి ఎడిటర్ను మూసివేయండి.
11:42 ఇప్పుడు మళ్ళీ డేటా ను పుష్ చేయడానికి ప్రయత్నిద్దాం. git push origin master అని టైప్ చేయండి.
11:50 User2 యొక్క username మరియు password లను ఇవ్వండి.
11:54 ఇప్పుడు మనం డేటాను విజయవంతంగా పుష్ చేయగలగటం మీరుచూడవచ్చు.
11:59 తరువాత GitHub repository కు మనం చేసిన మార్పులు జరిగాయో లేదో తనిఖీ చేద్దాం.
12:05 GitHub repository కు తిరిగి వెళ్ళండి.
12:08 repository name Stories పై క్లిక్ చేయండి.
12:12 ఇప్పుడు repository కు friends.html జత కావడాన్ని చూడగలరు.
12:18 ఇప్పుడు commit list ను చెక్ చేద్దాం.
12:21 User2 యొక్క commit కూడా లిస్ట్ అవడాన్ని ఇక్కడ మీరు చూడగలరు.
12:26 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
12:30 ట్యుటోరియల్ సారాంశం. ఈ ట్యుటోరియల్ లో మనము
12:35 Remote repository అంటే ఏమిటి?
12:38 Remote repository కి డేటా ను సింక్రనైజ్ చేయడము నేర్చుకున్నాం.
12:42 ఒక అసైన్మెంట్ గా , User3 అనే మరో యూజర్ ను క్రియేట్ చేయండి.
12:47 User3 కు డేటాను Clone చేయండి.
12:50 User3 యొక్క లోకల్ repository పై పని చేయడం ప్రారంభించండి.
12:54 User3 నుండి డేటా ను పుష్ చేయడానికి ప్రయత్నించండి.
12:58 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ ను సారాంశమును ఇస్తుంది.
13:03 దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
13:05 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
13:12 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
13:16 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
13:22 ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
13:27 ఈ ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి . ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india