Difference between revisions of "Java/C2/Introduction-to-Array/Telugu"
From Script | Spoken-Tutorial
Line 214: | Line 214: | ||
|- | |- | ||
| 08:42 | | 08:42 | ||
− | | ఈ విధంగా ఆర్రేస్ ని | + | | ఈ విధంగా ఆర్రేస్ ని సృష్టించవచ్చు మరియు వాటిని ఉపయోగించవచ్చు. |
|- | |- |
Revision as of 12:56, 23 November 2017
Time | Narration |
00:02 | ఇంట్రడక్షన్ టు ఆర్రేస్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం. |
00:07 | ఈ టుటోరియల్ లో మీరు ఆర్రేస్ ను ఎలా సృష్టించాలి మరియు అర్రేస్ లోని అంశాలను ఎలా వాడాలి అనేది నేర్చుకుంటారు. |
00:14 | ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు11. 10,JDK1.6 మరియు Eclipse 3.7.0 ఉపయోగిస్తున్నాం. |
00:25 | ఈ టుటోరియల్ ను అనుసరించడానికి మీకు జావాలోని డాటా టైప్స్ మరియు ఫర్ లూప్ యొక్క అవగాహన ఉండాలి. |
00:32 | లేదంటే, తత్సంభంధ టుటోరియల్ కొరకు చూపిన మా వెబ్సైట్ ను సందర్శించండి. |
00:38 | ఆర్రేస్ అనేది ఒక డేటా యొక్క సేకరణ |
00:40 | ఉదాహరణకి, మార్కుల జాబితా,పేర్ల జాబితా,ఉష్ణోగ్రతల జాబితా,వర్షపాతం జాబితా. |
00:47 | ప్రతి అంశం దాని స్థానం ఆధారంగా ఒక సూచీని (ఇండెక్స్) కలిగి ఉంటుంది. |
00:52 | మొదటి అంశం యొక్క సూచిక 0. |
00:55 | రెండవ అంశం యొక్క సూచిక 1 తర్వాతివి ఆపై క్రమంగా వచ్చే సంఖ్యలు. |
00:59 | ఇప్పుడు ఈ డేటాను ఎలా నిల్వ చేయాలో చూద్దాం. |
01:03 | కనుక ఎక్లిప్స్ కు మారండి. |
01:06 | ఆర్రేస్ డెమో అనే పేరుగల ఒక క్లాస్ ఇప్పటికే సృష్టించబడింది. |
01:11 | మెయిన్ మెథడ్ లో మనం రైన్ ఫాల్ డాటా ని చేర్చుదాం. |
01:16 | కనుక,మెయిన్ మెథడ్ లో మెథడ్ లో, |
01:18 | int రైన్ ఫాల్ ఓపెన్ మరియు క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఈక్వల్ టు కర్లీ బ్రాకెట్స్ లోపల 25, 31, 29, 13, 27, 35, 12 ఇంకా చివరలో సెమీకోలోన్ అని టైపు చేయండి. |
01:53 | వేరియబుల్ పేరు రైన్ ఫాల్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ వేయడం గుర్తుంచుకోండి. |
01:58 | ఇది రైన్ ఫాల్ ని పూ ర్ణాంకాలు యొక్క ఒక ఆర్రే అని ప్రకటిస్తుంది. |
02:03 | బ్రేసెస్ అనేవి ఆర్రే లోని అంశాలను వివరించడానికి ఉపయోగిస్తారు. |
02:09 | ఇప్పుడు డేటా ను యాక్సెస్ చేద్దాం. |
02:12 | కనుక, తర్వాతి వరుసలో |
02:14 | System dot out dot println rainfall అని టైప్ చేయండి. స్క్వేర్ బ్రాకెట్ లో2 ని టైప్ చేయండి.'. |
02:28 | మనం సూచిక సంఖ్య 2 లో గల అంశాన్ని ముద్రిస్తున్నాం. |
02:32 | మరోలా చెప్పాలంటే, ఆర్రే లోని మూడవ అంశం 29. |
02:38 | ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేద్దాం. |
02:43 | మనం చూస్తున్నట్లుగా,మూడవ అంశం యొక్క అవుట్ పుట్ అనేది 29. |
02:49 | ఇప్పుడు, 2 స్థానంలో 0 ని టైప్ చేద్దాం. |
02:56 | ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేద్దాం. |
03:00 | మనం చూస్తున్నట్లుగా, మొదటి విలువ అవుట్ పుట్ అనేది 25. |
03:07 | ఇప్పుడు, మనము మొదటి ఐటెమ్ యొక్క విలువను మార్చుదాం. |
03:13 | కనుక, rainfall[0] = 11; అని టైప్ చేయండి. |
03:27 | ఇప్పుడు, దాని విలువను చూద్దాం.కనుక, ప్రోగ్రాంని సేవ్ చేసి రన్ చేద్దాం. |
03:34 | మనం చూస్తున్నట్లుగా, విలువ 11 కు మార్చబడింది. |
03:40 | ఇప్పుడు, ఒకవేళ మనకి ఆర్రే పరిమాణం మాత్రమే తెలుసు కానీ దాని విలువ తెలియదనుకోండి. |
03:45 | అలాంటి ఆర్రే ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. |
03:49 | మెయిన్ ఫంక్షన్ లో ఉన్నవన్నీ తొలగించి |
03:57 | int square[] = new int[10]; టైప్ చేయండి |
04:19 | ఈ స్టేట్మెంట్ 10 అంశాలు కలిగిన పూర్ణంకాల యొక్క ఒక ఆర్రే ని సృష్టిస్తుంది.ఈ ఆర్రే యొక్క పేరు స్క్వేర్స్. |
04:30 | ఇప్పుడు, దీనికి కొన్ని విలువలని చేర్చుదాం. |
04:33 | కనుక, |
04:35 | squares[0] = 1; |
04:43 | తర్వాతి వరుసలో, squares[1] = 4; |
04:53 | తర్వాతి వరుసలో, squares[2] = 9; |
05:04 | squares[3] = 16;అని టైప్ చేయండి. |
05:15 | కనుక, మనం మొదటి 4 సంఖ్యల యొక్క వర్గాలను ప్రవేశపెట్టాం. |
05:20 | ఇప్పుడు అర్రే యొక్క ఇతర అంశాల గురించి ఏమి ఉంది. అవి ఏమి కలిగి ఉన్నాయో చూద్దాం. |
05:26 | కనుక, మనం ఆర్రే లోని 6 వ విలువ ను ముద్రిస్తాము. |
05:30 | System S capital .out.println(squares[5]); అని టైప్ చేయండి. |
05:56 | సేవ్ చేసి ప్రోగ్రాం రన్ చేయండి.మనం ఔట్పుట్ లో సున్నా రావడం చూస్తాం. |
06:05 | ఇది ఎందుకంటే, మనం పూర్ణాంకాల యొక్క ఆర్రే ని సృష్టించినపుడు, అన్ని విలువలు 0 తో ప్రారంభం అవుతాయి. |
06:11 | ఇదేవిధంగా, ఫ్లోట్స్ యొక్క ఆర్రే లో కూడా అన్నీ విలువలు 0.0 తో ప్రారంభం అవుతాయి. |
06:18 | మనము ప్రతి విలువను అర్రే లో టైప్ చేస్తే అది సుదీర్ఘమైన ప్రక్రియ అవుతుంది. అందుకు బదులుగా,మనం ఫర్ లూప్ ను ఉపయోగిద్దాం. |
06:28 | కనుక,int n, x ;for(x = 4; x < 10; x = x + 1){n = x + 1; మరియుsquares[x] = n * n;}} అని టైప్ చేయండి. |
07:25 | కనుక, మనం 4 నుండి 9 వరకు సంఖ్యలను పునరావృతం గావించాలి మరియు అర్రే లో సంబంధిత అంశాన్ని సెట్ చేయాలి. |
07:36 | ఇప్పుడు ,ఔట్పుట్ ని చూద్దాం. |
07:38 | మనం చూస్తున్నట్లుగా, మనం ఆర్రే లోని 6 వ అంశం యొక్క విలువ ముద్రిస్తున్నాం. కనుక,సేవ్ చేసి రన్ చేయండి. |
07:52 | 6వ అంశం అది 6 యొక్క వర్గం 36 అని మనం చూస్తాం. |
07:57 | నిజానికిఇప్పుడు మనం అన్ని విలువలని for loop లో అమర్చవచ్చు. |
08:03 | మానవీయంగా మనం అమర్చిన విలువల యొక్క వరుసలని తొలగించి 4 ను 0 కి మార్చండి. |
08:14 | ఈ విధంగా, 0 నుండి 9 సూచికల వరకు ఉన్న అంశాలని వాటికి సంభందించిన వర్గాలతో అమర్చవచ్చు. |
08:21 | ఇప్పుడు, మనం 3 వ అంశం యొక్క విలువని చూద్దాం. |
08:25 | కనుక,5 ను 2 కు మార్చండి. |
08:30 | సేవ్ చేసి రన్ చేయండి. |
08:35 | మనం చూస్తున్నట్టుగా 3 వ అంశం విలువ loop లో అమర్చబడింది.దాని విలువ 9. |
08:42 | ఈ విధంగా ఆర్రేస్ ని సృష్టించవచ్చు మరియు వాటిని ఉపయోగించవచ్చు. |
08:50 | ఇప్పుడు ఈ టుటోరియల్ చివరకు వచ్చాం. |
08:53 | ఈ టుటోరియల్ లో మనం నేర్చుకున్నవి. |
08:55 | ఆర్రే ని ప్రకటించడం మరియు ప్రారంభించడం |
08:58 | దాని లోని అంశాలని పొందడం. |
09:01 | ఈ టుటోరియల్ కు ఒక అసైన్మెంట్: |
09:04 | ఇచ్చిన పూర్ణంక ఆర్రే లో,దాని లోని అంశాల మొత్తాన్ని కనుగొనడం. |
09:10 | స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం, |
09:13 | ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి. |
09:19 | ఇది స్పోకెన్ టుటోరియల్ యొక్క సారాంశం. మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు. |
09:26 | స్పోకన్ టుటోరియల్ ప్రాజెక్టు టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్ ఇస్తుంది. |
09:34 | మరిన్ని వివరాలకు contact@ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి. |
09:40 | స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం. |
09:44 | దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది |
09:50 | దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.spoken హైఫన్ tutorial డాట్ org స్లాష్ ఎన్ ఎం ఈ ఐసి టి హైఫన్ ఇంట్రో |
09:57 | ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు ఉదయలక్ష్మి ధన్యవాదములు. |