Difference between revisions of "Inkscape/C2/Fill-color-and-stroke/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 |'''Time''' |'''Narration''' |- |00:00 |Inkscape ను ఉపయోగించి Fill color and stroke పై Spoken Tutorial కు స్వాగతం. |-...")
(No difference)

Revision as of 12:46, 10 April 2017

Time Narration
00:00 Inkscape ను ఉపయోగించి Fill color and stroke పై Spoken Tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేవి,
ఆబ్జెక్ట్స్ లో రంగును నింపడం
ఆబ్జెక్ట్స్ కు ఒక  అవుట్ లైన్ ఇవ్వడం
gradients యొక్క వివిధ రకాలు, ఇంకా 

Stroke paint మరియు style.

00:20 ఈ ట్యుటోరియల్ కొరకు, నేను
Ubuntu Linux 12.04 OS

Inkscape వర్షన్ 0.48.4 ఉపయోగిస్తున్నాను.

00:29 Inkscape ని తెరుద్దాం. దానికోసం, Dash home కు వెళ్ళి, Inkscape అని టైప్ చేద్దాం.
00:35 మీరు logo పై క్లిక్ చేసి Inkscape ను తెరువవచ్చు.
00:40 మనం ఇదివరకే రుపొంచించిన Assignment.svg ఫైల్ ను తెరుద్దాం. నేను దానిని నా Documents ఫోల్డర్ లో భద్రపరిచాను.
00:50 మనం మునుపటి అసైన్మెంట్ లో ఈ మూడు ఆకారాలను రూపొందించాము.
00:54 interface యొక్క కింది భాగం వద్ద ఉన్న color palette ను ఉపయోగించి రంగును మార్చటం నేర్చుకున్నాము అని గుర్తుచేసుకోండి.
01:01 ఇప్పుడు మనం Fill and Stroke ఉపయోగించి వివిధ రకాలుగా రంగును ఎలా నింపడం అనేది నేర్చుకుంటాం.
01:08 Object మెనూ కి వెళ్ళి, డ్రాప్ -డౌన్ జాబితా నుండి Fill and Stroke ఎంపిక పై క్లిక్ చేయండి.
01:13 ఇంటర్ఫేస్ యొక్క కుడి వైపు Fill and Stroke డైలాగ్ బాక్స్ తెరుచుకుంది అని గమనించండి.
01:20 ఇక్కడ డైలాగ్ బాక్స్ లో మూడు టాబ్స్, Fill, Stroke paint మరియు Stroke style ఉన్నాయి.
01:27 ఇప్పుడు, మనం canvas ఏరియా లో ఉన్న దీర్ఘ చతురస్రం పై క్లిక్ చేద్దాం. Fill and stroke డైలాగ్ బాక్స్ లోని ఎంపికలు మరియు చిహ్నాలకు అనుమతి ఉందని గమనించండి.
01:38 ముందుగా, మనం Fill ట్యాబ్ గూర్చి నేర్చుకుందాం.
01:41 ఇక్కడ Fill ట్యాబ్ కింద ఆరు icon లు ఉన్నాయి గమనించండి. ఈ చిహ్నాలు ఏమి చేస్తాయో నేర్చుకుందాం.
01:48 మొదటి చిహ్నం No paint గా పిలవబడుతుంది. ఇది ఆబ్జెక్ట్ ఎలాంటి రంగుతో నింపబడదు అని సూచిస్తుంది.
01:56 icon పై క్లిక్ చేసి, దీర్ఘ చతురస్రం లో వచ్చిన మార్పును గమనించండి. దీర్ఘ చతురస్రం యొక్క రంగు తొలగించబడింది.
02:03 తరువాతి చిహ్నం Flat color ఇది ఒక ఆబ్జెక్ట్ కి దట్టమైన రంగు నింపడానికి సహాయం చేస్తుంది.
02:11 Flat color చిహ్నం పై క్లిక్ చేయండి.ఇంకా దీర్ఘ చతురస్రం ఆకారం యొక్క రంగులో వచ్చిన మార్పును గమనించండి.
02:17 Flat color కింద 5 సబ్-టాబ్స్ ఉన్నాయి గమనించండి.
02:21 అప్రమేయంగా, RGB ట్యాబ్ ఎంచుకోబడుతుంది.
02:25 RGB ట్యాబ్ కింద, 4 sliders ఉన్నాయి.
02:29 మొదటి మూడు స్లయిడర్స్ Red, Green మరియు Blue కలర్స్ యొక్క తీవ్రత ను సూచిస్తాయి.
02:36 ఈ స్లయిడర్స్ ను ఎడమ లేదా కుడి దిశలలోకి కదిలించడం చేత రంగును మార్చవచ్చు. నేను అలా చేయడం వల్ల దీర్ఘ చతురస్రం యొక్క రంగులో వచ్చిన మార్పును గమనించండి.
02:46 నాలుగవ స్లయిడర్ Alpha స్లయిడర్. దీనితో, మనం రంగు యొక్క opacity స్థాయిని అపారదర్శకం నుండి పారదర్శకానికి పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
02:57 నేను ఈ నాలుగు స్లయిడర్స్ ను కదిలిస్తుంటే, ఈ బాక్సస్ లో కనిపిస్తున్న రంగు యొక్కRGBA విలువలు స్వయంచాలకంగా మారుతున్నాయి గమనించండి.
03:06 నేను స్లయిడర్స్ ను ఇంకోసారి కదిలిస్తాను అందువల్ల మీరు ఈ మార్పుని గమనించవచ్చు.
03:12 స్లయిడర్స్ కుడివైపు ఉన్న బాక్సస్ లో ప్రతీ రంగు యొక్క విలువలను మార్చడం చేత మనం రంగును మానవీయంగా మార్చవచ్చు.
03:20 నేను ఎరుపు ను 100 కి, పచ్చను 50 కి, మరియు నీలం ను 150 కి మార్చుతున్నాను. ఇప్పుడు దీర్ఘ చతురస్రం ఊదారంగు లోకి మారింది పరిశీలించండి.
03:32 నేను Alpha స్థాయిని 255 గానే ఉంచాను. నేను ఆపారదర్శకత స్థాయిని తగ్గించాలనుకోవటం లేదు.
03:40 తదుపరి ట్యాబ్ HSL, మరియు దాని అర్ధం వరుసగా, Hue, Saturation మరియు Lightness.
03:49 మనం Hue స్లయిడర్ ని మూల వర్ణం పొందటానికి ఉపయోగించవచ్చు. నేను ఆకుపచ్చ రంగు యొక్క మూల వర్ణం పొందడానికి, ఎడమ దిశ వైపుగా స్లయిడర్ ని కదిలిస్తున్నాను.
03:59 మనం Saturation స్లయిడర్ ను ఉపయోగించి మూల వర్ణం యొక్క saturation ని సర్దుబాటు చేయవచ్చు.
04:04 slider ను ఎడమ లేదా కుడి దిశలలో కదిలించి saturation స్థాయిలో వచ్చిన మార్పును గమనించండి.
04:12 Lightness స్లయిడర్ మూల వర్ణం యొక్క lightness ను సర్దుబాటు చేస్తుంది.
04:16 ఈ ఎంపికతో, మూల వర్ణం యొక్క షేడ్నిస్వచ్ఛమైన తెలుపు నుండి పూర్తి నలుపుకు లేదా ఆ రెండింటి మధ్యలో ఏదయినా ఒక షేడ్ లోకి మార్చవచ్చు.
04:26 ముందులగే, Alpha స్లయిడర్ opacity స్థాయిని ఆపారదర్శకత నుండి పూర్తి పారదర్శకతకు పెంచడానికి లేదా తగ్గించటానికి ఉపయోగపడుతుంది.
04:35 తరువాతి ట్యాబ్ CMYKఇది Cyan, Magenta, Yellow మరియు Black లను వరుసగా సూచిస్తుంది.
04:44 ఈ స్లయిడర్స్ ను కదిలించటం వలన, మనం మూల వర్ణం యొక్క తీవ్రత లేదా లోతును పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
04:52 ఈ రంగులను కలిపే ఎంపిక, నమూనా ప్రాజెక్టులను వాణిజ్య పరంగా ముద్రిచబడినపుడు ఉపయోగకరంగా ఉంటాయి.
05:00 తరువాతది Wheel ట్యాబ్. ఇది HSL కలర్ మిక్సర్ కు ఒక ప్రత్యామ్నాయ ప్రాతినిధ్యం.
05:07 ప్రామాణిక రంగు చక్రం పై ఆధారపడే కలర్ రింగ్ పై క్లిక్ చేసి మనం బేస్ హ్యూ ను ఎంచుకోవచ్చు.
05:14 కనుక, నేను పసుపు రంగు యొక్క ఒక బేస్ ను ఎంచుకోవడానికి పసుపు షేడ్ పై క్లిక్ చేస్తున్నాను.
05:19 రంగు వృత్తం పరిధిలో, ఒక త్రిభుజం ఉంది దాని లోపల ఒక చిన్న వృత్తం ఉంది. వృత్తం మీద క్లిక్ చేసి త్రిభుజం లోపల డ్రాగ్ చేయండి. మరియు దీర్ఘ చతురస్రం రంగులో వచ్చే మార్పును గమనించండి.
05:31 ఎవరికైతే రంగులను నిర్వహించే పర్యావరణంలో పనిచేయటానికి నిజమైన ఆసక్తి ఉంటుందో వాళ్ళ కోసమే CMS ట్యాబ్ అవసరంఅవుతుంది.
05:38 ఇప్పటికి, మనం ఈ ట్యాబ్ ను విడిచిపెడదాం.
05:43 తరువాత, ఒక Linear gradient ను ఎలా రూపొందించాలో నేర్చుకుందాం.
05:47 canvas కు వెళ్ళి, వృతం పై క్లిక్ చేయండి.
05:50 ఇప్పుడు, Fill and Stroke డైలాగ్ బాక్స్ కు తిరిగి వచ్చి, Linear gradient చిహ్నం పై క్లిక్ చేద్దాం.
05:57 వృత్తంలో ప్రవణత పూరకాన్ని (gradient fill) గమనించండి.
06:00 ప్రవణతకు (గ్రేడియంట్) యాదృచ్ఛిక సంఖ్యల శ్రేణి తో అంతమయ్యే ఒక పేరు ఇవ్వబడుతుంది.
06:05 నా ఇంటర్ఫేస్ లో, ఆ సంఖ్య linearGradient3794 మీ దానిలో, అది వేరే ఉండవచ్చు.
06:14 linear gradient నంబర్ బటన్ కింద ఉన్న Edit బటన్ పై క్లిక్ చేసి మనం ప్రవణతను (గ్రేడియంట్) మార్చవచ్చు.
06:21 ఇది Gradient editor డైలాగ్ బాక్స్ ను తెరుస్తుంది.
06:26 ఈ బాక్స్ లో stop పేరుతో ఉన్న టాప్ బటన్ కొన్ని యాదృచ్చిక సంఖ్యలను అనుసరిస్తుంది మరియు ఒక డ్రాప్ -డౌన్ జాబితాను కలిగి ఉంటుంది.
06:34 ఒకవేళ మీరు ఈ డ్రాప్ డౌన్ లోని బాణాలను క్లిక్ చేస్తే, రెండు stop ఎంపికలు చూస్తారు.
06:39 మొదటిది స్వచ్ఛమైన మూల వర్ణాన్ని సూచిస్తుంది. రెండవది half checker board ఇది దాని పారదర్శకతను సూచిస్తుంది.
06:48 రెండవ ఎంపికని ఎంచుకోండి, అది, పారదర్శకత stop ఎంపిక.
06:53 Stop Color కిందకు వెళ్ళండి. sliders ను కదిలిస్తూ మీకు నచ్చిన ఏదయినా ఒక రంగుకు RGB విలువలను మార్చండి.
07:00 gradient పూర్తిగా కనిపించేలా చేయటానికి Alpha విలువ 255 వద్ద ఉంచండి. Gradient editor డైలాగ్ బాక్స్ ను మూసివేయండి.
07:09 ఇప్పుడు, మనం gradient angle ను మార్చవచ్చు. ఆలా చేయటానికి, ఇంటర్ఫేస్ యొక్క ఎడమవైపున,టూల్ బాక్స్ నుండి Node టూల్ పై క్లిక్ చేయండి. ఇది Selector tool కు సరిగ్గా క్రింద ఉంటుంది.
07:21 ఇది వృత్తం పై ఒక వరుసను ప్రదర్శిస్తుంది. ఈ వరుస ప్రవణతను(gradient) సూచిస్తుంది.
07:29 ఇవి ప్రస్తుతం వృత్తం యొక్క square handle మరియు arc handles తో (overlap) అతి పాతమై ఉన్నాయి.
07:33 మనం gradient line handles ని కొద్దిగా కదిలిద్దాము, అందువల్ల మనం handles ను స్పష్టంగా చూడవచ్చు.
07:40 ఎక్కడ gradient మొదలవుతుందో మరియు ముగుస్తుందో ఆ స్థానానికి మార్చడానికి circular handle లేదా square handle ను క్లిక్ చేసి లాగండి.
07:50 circular handle ప్రదర్శించినట్టుగా కదిలించడం వల్ల ప్రవణత (గ్రేడియంట్) యొక్క దిశను కూడా మనం రొటేట్ చేయవచ్చు.
07:58 ఇప్పుడు, మనం Radial gradient ను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం. చిహ్నంపై క్లిక్ చేయండి మరియు వృత్తంలో gradient మార్పును గమనించండి.
08:06 Radial gradient ఒక వృత్తాకారంలో ఏర్పడుతుంది.
08:10 ఒక square handle మరియు రెండు circular handles ను గమనించండి.
08:15 gradient యొక్క ప్రారంభ బిందువును తరలించడానికి మధ్య square handle పై క్లిక్ చేయండి. నేను దానిని ఎడమవైపు కిందికి కదిలిస్తున్నాను..
08:22 gradient లో మార్పులు చేయటానికి circular handles లో ఏదయినా ఒకదానిపై క్లిక్ చేసి లాగండి.
08:28 gradient ఆకారం యొక్క పొడవు మరియు వెడల్పులలో మార్పును గమనించండి.
08:37 మనం Gradient tool ను Tool box లో కూడా చూడవచ్చు.
08:42 దానిపై క్లిక్ చేద్దాం ఇంకా మన వృత్తానికి తిరిగి వద్దాం.
08:45 ఇప్పుడు మన కర్సర్ capital I తో ఒక plus చిహ్నంలోకి మారింది గమనించండి.
08:51 ఇప్పుడు, వృత్తం లోపలి భాగంలో ఎక్కడైనా క్లిక్ చేసి లాగండి. Gradient లో మార్పును గమనించండి.
09:00 ఇప్పుడు, వృత్తం వెలుపల ఎక్కడైనా క్లిక్ చేసి లాగండి.
09:04 gradient లో మార్పును గమనించండి.
09:06 తరువాత, ఆకారాలపై వివిధ నమూనాలను ఎలా అతివ్యాప్తి చేయాలో నేర్చుకుందాం.
09:11 Tool box కు వెళ్ళి tool పై క్లిక్ చేయండి తరువాత నక్షత్రం ఆకారంపై క్లిక్ చేయండి.
09:17 Fill and stroke డైలాగ్ బాక్స్ లో, Pattern చిహ్నం పై క్లిక్ చేయండి.నక్షత్రం యొక్కరంగును ఒక స్ట్రయిప్ ప్యాటర్న్ లోకి మారింది అని గమనించండి.
09:26 ఇక్కడ Pattern fill కింద ఒక డ్రాప్ -డౌన్ జాబితా ఉంది. అందుబాటులో ఉన్న నమూనాలను చూడటానికి బాణాలపై క్లిక్ చేయండి.
09:32 Checkerboard పై క్లిక్ చేసి, నక్షత్రం ఆకారంలో వచ్చిన మార్పును గమనించండి. ఇక్కడ అందుబాటులో ఉన్న నమూనాల నుండి ఏదయినా ఎంచుకుని ఉపయోగించవచ్చు.
09:44 మనం Swatch గురించి మరొక ట్యుటోరియల్ లో నేర్చుకుందాం.
09:48 చివరి చిహ్నాన్ని Unset paint అంటారు. ఇది ఎంచుకోబడిన ఆబ్జెక్ట్ యొక్క రంగును నలుపుకు అన్సెట్ చేయటానికి ఉపయోగపడుతుంది.
09.54 icon పై క్లిక్ చేసి, నక్షత్రంలో వచ్చిన రంగు మార్పును గమనించండి. ఇది నలుపుకు మార్చబడింది.
10:01 ఇప్పుడు, మనం ఒక ఆబ్జెక్ట్ కు స్ట్రోక్ లేదా ఒక అవుట్ లైన్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాం. ఇది చేయటానికి, మనం Stroke paint ట్యాబ్ ను ఉపయోగించాలి.
10:09 ఇప్పుడు, Stroke paint ట్యాబ్ పై క్లిక్ చేసి ఆపై దీర్ఘ చతురస్రం పై క్లిక్ చేయండి.
10:14 Stroke paint ట్యాబ్ కింద ఉన్న చిహ్నాలు Fill ట్యాబు మాదిరిగానే ఉంటాయి.
10:19 ఇవీ అదే పద్దతిలోనే పని చేస్తాయి.
10:22 మొదటి చిహ్నం, అనగా No paint తో మనం ఆకారం యొక్క అవుట్ లైన్ ని తొలగిస్తాము.
10:26 తరువాత, Flat color చిహ్నం పై క్లిక్ చేద్దాం. దీర్ఘ చతురస్ర ఆకారం చుట్టూతా ఒక నలుపు రంగు అవుట్ లైన్ ను చూస్తాము.
10:33 మనం Stroke style ట్యాబ్ ను ఉపయోగించి అవుట్ లైన్ యొక్క మందాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు.
10:44 వెడల్పు పారామీటర్ ను 10 గా ఉంచుదాం. మన అవసరాన్ని బట్టి, యూనిట్స్ ను percentage, point మొదలైన వాటికి మార్పు కూడా చేయవచ్చు.
10:54 నేను ఈ యూనిట్ ని Pixels గా ఉంచుతాను.
10:56 Stroke paint ట్యాబ్ కు తిరిగి వెళ్దాం. RGB ట్యాబ్ కింద ఉన్నsliders ను కదిలించడం చేత మనం స్ట్రోక్ యొక్క రంగును మార్చవచ్చు.
11:04 నేను ఆలా చేస్తున్నపుడు, అవుట్ లైన్ లో రంగు మార్పును గమనించండి.
11:09 ఇతర Flat color ఎంపికలు, HSL, CMYK, Wheel మరియు CMS వంటివాటిని మీరు మీ సొంతంగా అన్వేషించండి.
11:17 ఇప్పుడు, Linear gradient పై క్లిక్ చేస్తాను. ఇది దీర్ఘ చతురస్రం ఆకారానికి ఒక గ్రేడియంట్ అవుట్ లైన్ ను ఇస్తుంది.
11:24 మనం ఇదివరకు ఉపయోగించిన గ్రేడియెంట్స్ ఇక్కడ డ్రాప్ -డౌన్ జాబితాలో కనిపిస్తాయి.మనం వాటిల్లో ఏవైనా ఉపయోగించవచ్చు.
11:32 నా దీర్ఘ చతురస్రానికి ఎరుపు మరియు నీలం gradient అవుట్ లైన్ ను ఇస్తాను.
11:38 ఇదే విధంగా, మిగిలిన స్ట్రోక్ చిహ్నాలను ఉపయోగించవచ్చు మరియు మన ఆబ్జెక్ట్స్ కు కొన్ని ఆసక్తికరమైన నమూనాలను మరియు gradient అవుట్ లైన్స్ ను ఇవ్వవచ్చు.
11:46 తరువాత మనం Stroke style గూర్చి నేర్చుకుంటాం. దానిపై క్లిక్ చేయండి.
11:50 మనం ఇప్పటికే stroke యొక్క వెడల్పును ఎలా సవరించాలో నేర్చుకున్నాం.
11:54 ఇప్పుడు, Miter join, Round join మరియు Bevel join అను పేర్లుగల మూడు Join చిహ్నాలను చూద్దాం. అప్రమేయంగా, స్ట్రోక్ Miter join లో ఉంది.
12:08 బాగా కనిపించటానికి నేను దీర్ఘ చతురస్రం యొక్క ఒక మూలను పెద్దది చేస్తాను.
12:12 ఇప్పుడు, stroke కు ఒక గుండ్రని మూలను ఇవ్వటానికి Round join పై క్లిక్ చేద్దాం. Stroke యొక్కఅంచులలో మార్పులను గమనించండి
12:21 తరువాత, మనం ఒక Bevel కార్నర్ ను రూపొందించటానికి Bevel join ఎంపికపై క్లిక్ చేద్దాం.
12:26 వివిధ డాష్ పాట్రన్స్ Dashes డ్రాప్ -డౌన్ మెనూలో అందుబాటులో ఉన్నాయి.వీటిని ఉపయోగించి, stroke కు వివిధ డాష్ పాట్రన్స్ ఇవ్వవచ్చు మరియు వెడల్పు మార్చవచ్చు.
12:38 తదుపరి Cap ఎంపిక.ఇది ప్రాధమికంగా వరస strokes పై పనిచేస్తుంది.
12:44 Tool boxకి వెళ్ళి Freehand tool పై క్లిక్ చేయండి. Freehand tool సహాయంతో ఒక వరస ను గీద్దాం.
12:50 ఇప్పుడు, లైన్ చివరలో జూమ్ చేద్దాం.
12:54 అప్రమేయంగా, Butt cap ఎంచుకోబడుతుంది మరియు అది చివరకు ఒక ఫ్లాట్ అంచును ఇస్తుంది.
12:59 ఇప్పుడు, నేను ఒక గుండ్రని అంచు ఇవ్వటానికి Round cap పై క్లిక్ చేస్తాను.
13:04 తదుపరి Square cap, ఇది లైన్ యొక్క చివర్లకు ఒక చదరమైన మరియు పొడిగించిన అంచును ఇస్తుంది.
13:13 Dashes tab కు సరిగ్గా కిందన మూడు Markers ఉన్నాయి. అవి path యొక్క మధ్యభాగంపై marker లను ఉంచుతాయి.
13:20 అందుబాటులో ఉన్న జాబితాలను చూడటానికి ప్రతీ Marker యొక్క డ్రాప్ -డౌన్ మెనూ పై క్లిక్ చేయండి.
13:25 నేను Start Markers కింద Torso ను ఎంచుకుంటాను.
13:29 మనం Curvein ని Mid markers గా ఎంచుకుందాం.
13:33 End Markers కొరకు మనం Legs ను ఎంచుకుందాం.
13:39 ఒక కార్టూన్ ఆకారం canvas పై ఏర్పడిందని గమనించండి.
13:44 చివరగా, Fill and stroke డైలాగ్ బాక్స్ కు దిగువన Blur మరియు Opacity అనబడే రెండు స్లయిడర్స్, ఉన్నాయని గమనించండి.
13:53 ముందుగా దీర్ఘ చతురస్రాన్ని మళ్ళీ ఎంచుకుందాం
13:56 Blur స్లయిడర్ ఒక ఆబ్జెక్ట్ కు ఒక అస్పష్టమైన ప్రభావాన్ని ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. నేను స్లయిడర్ పై క్లిక్ చేస్తాను ఇంకా దానిని కుడివైపు కదిలిస్తాను.
14:04 నేను స్లయిడర్ ను కుడివైపుకు కదిలించినా కొద్దీ, దీర్ఘ చతురస్రం అస్పష్టంగా మారింది గమనించండి.
14:15 Opacity స్లయిడర్ ఒక ఆకారానికి పారదర్శకత ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. స్లయిడర్ ను కుడివైపుకు కదిలించి, ఆకారంలో వచ్చిన మార్పులను గమనించండి.
14:27 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్ లో,మనం నేర్చుకున్నవి,
14:31 Fill and Stroke ఎంపికలు ఉపయోగించి ఆబ్జెక్ట్స్ లో రంగును నింపడం

ఆకారాలకు స్ట్రోక్స్ లేదా అవుట్ లైన్స్ ను ఇవ్వటం గ్రేడియెంట్స్ యొక్క వివిధ రకాలు స్ట్రోక్ పెయింట్ మరియు స్ట్రోక్ స్టైల్స్.

14:44 మీకోసం ఇక్కడొక అసైన్మెంట్-
14:47 1. ఎరుపు మరియు పసుపు రంగుల యొక్క ఒక Linear gradient, 5 పిక్సల్స్ వెడల్పుతో ఒక నీలం రంగు స్ట్రోక్ తో నిండిన ఒక పంచభుజిని రూపొందించండి.
14:57 2. Wavy పాటర్న్ తో నిండిన ఒక దీర్ఘవృత్తాకారం రూపొందించి దాని opacity ని 70%కు మార్చండి.
15:04 3. 10 విడ్త్ తో ఒక లైన్ గీసి, దానికి Start Markersగా Arrow1Lstart మరియు End Markers, Tail గా ఇవ్వండి.
15:15 మీరు పూర్తిచేసిన అసైన్మెంట్ ఇలా ఉండాలి.
15:18 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో చుడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారంశాన్ని వివరిస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేనిచో, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు.
15:28 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది. ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
15:37 మరిన్ని వివరాలకు, దయచేసి వ్రాయండి: contact@spoken-tutorial.org. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో ఒక భాగం. దీనికి నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ICT, MHRD, భారత ప్రభుత్వము సహకారం అందిస్తోంది.
15:55 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
16:05 మనం ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది, ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya