Difference between revisions of "Firefox/C2/Firefox-interface-and-toolbars/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 234: Line 234:
 
|04:54
 
|04:54
 
||ఎడమ వైపు ఉన్న బార్ లో  మూడు (3) ఎంపిక లు  ఉన్నాయి  అవి  - ''Today''(టుడే), ''Yesterday''(ఎస్టర్డే) మరియు  ''Older than 6 months''(ఒల్దెర్ డెన్  సిక్స్ మంత్స్ ).
 
||ఎడమ వైపు ఉన్న బార్ లో  మూడు (3) ఎంపిక లు  ఉన్నాయి  అవి  - ''Today''(టుడే), ''Yesterday''(ఎస్టర్డే) మరియు  ''Older than 6 months''(ఒల్దెర్ డెన్  సిక్స్ మంత్స్ ).
 +
|-
  
 
|05:02
 
|05:02

Revision as of 12:14, 14 August 2014

Time Narration
00:00 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము
00:05 ఈ ట్యుటోరియల్ లో మనము: ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకుంటాము.
00:11 ఈ ట్యుటోరియల్ లో ఫయర్ ఫాక్స్ వెర్షన్ 7.0 ను ఉబుంటు 10.04 కొరకు వాడతాము.
00:19 ఇప్పుడు ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ వైపు దృష్టి పెడదాం
00:23 ఒక ఆధునిక బ్రౌజర్ కు కావలసిన అన్నీ లక్షణాలు ఫయర్ ఫాక్స్ లో ఉన్నయి .
00:28 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ను సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, దాని లక్షణాల గూర్చి తెలిసి ఉండాలి.
00:34 మొజిల్లా ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ను 6 నిర్దిష్టమైన ప్రాంతాలుగా విభజన చేయవచ్చు, అవి;
00:41 మెనూ బార్, నావిగేషన్ టూల్ బార్, బుక్ మార్క్స్ బార్, సైడ్ బార్, స్టాటస్ బార్ మరియు కంటెంట్ ఏరియా .
00:53 వాటిలో ప్రతి ఒక్కటి ఏమి చేస్తుందో నేర్చుకుందాము.
00:57 ఇప్పుడు "File"(' ఫైల్') మెనూ పై క్లిక్ చేసి మరియు "New Window"(న్యూ విండో) పైన క్లిక్ చేద్దాము.
01:01 ఒక క్రొత్త విండో పాప్ అప్ అవుతుంది.
01:05 కొందరికి వారి బ్రౌజర్లలో చిన్న స్క్రిప్ట్ను చూడటం ఇబ్బందిగా ఉంటుంది
01:08 కాబట్టి View- zoom మరియు zoom in క్లిక్ చేయడం ద్వారా పేజీని జూమ్ చెయ్యవచ్చు
01:14 ప్రత్యామ్నాయంగా, మీరు “Ctrl + +" నొక్కవచ్చు
01:18 ఇది టెక్స్ట్ ను పెద్దగా చేస్తుంది.
01:21 మీరు ఉపయోగిస్తున్న మొజిల్లా ఫయర్ ఫాక్స్ యొక్క వెర్షన్ తెలుసుకోవడానికి , “Help”(హెల్ప్) పైన క్లిక్ చేసి, “About Firefox” (అబౌట్ ఫయర్ ఫాక్స్ ) పైన క్లిక్ చేయండి.
01:27 డీఫాల్ట్ గా, ఫయర్ ఫాక్స్ ఒక హోమ్ పేజీ ను ప్రదర్శిస్తుంది
01:32 కానీ మీరు ఇష్టపడే వెబ్ పేజ్ ను “Homepage”(హోం పేజి ) గా సెట్ చేయుటకు , “Edit”(ఎడిట్ ) మరియు “Preferences”(ప్రిఫరేన్సుస్ ) పైన క్లిక్ చేయండి
01:39 విండోస్ వినియోగదారులు దయచేసి “Tools”(టూల్స్) మరియు “Options” (ఆప్షన్స్) పై క్లిక్ చేయండి.
01:42 ”General tab”(జనరల్ టాబ్) లో, “Home Page”(హోం పేజి) ఫీల్డ్ పై క్లిక్ చేసి , www.yahoo.com లేదా మీరు ఇష్టపడే వెబ్ పేజి టైపు చేయండి
01:52 క్రింద కుడి చేతి మూలలో న “Close”(క్లోజ్ ) బటన్ క్లిక్ చేసి ఫయర్ ఫాక్స్ “Preferences”(ప్రిఫరేన్సుస్) విండోను మూసివేయవచ్చు
02:00 వెబ్పేజీ లోపల ప్రత్యేక పదాలను వెదుకుటకు “Edit”(ఎడిట్) మెనూను ఉపయోగించవచ్చు.
02:05 Address bar(అడ్రస్ బార్) లో www.google.com అని టైప్ చేయండి.
02:12 Edit(ఎడిట్) మరియు Find (ఫైండ్) పై క్లిక్ చేయండి.
02:14 ఒక బ్రౌజరు విండో దిగువన ఒక చిన్న టూల్ బార్ కనిపిస్తుంది.
02:19 టెక్స్ట్ బాక్స్ లో, Gujarati('గుజరాతీ') అనే పదాన్ని టైప్ చేయండి.
02:23 Gujarati('గుజరాతీ') అనే పదము హైలైట్ అవడం గమనించవచ్చు.
02:28 ఒక వెబ్పేజీలో పెద్ద టెక్స్ట్ ను వెదుకుటకు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడుతుంది
02:33 దానిని ముసివెద్దమ్.
02:35 పేరు సూచించినట్లుగా, Navigation(న్యావిగేషన్) టూల్బార్, ఇంటర్నెట్ లో సంచరించుటకు సహాయ పడుతుంది
02:41 Navigation(న్యావిగేషన్) బార్, ఒక పెద్ద టెక్స్ట్ బాక్స్, ఎక్కడైతే మీరు చూచుటకు కావలసిన పేజీ యొక్క చిరునామా టైప్ చేస్తారు.
02:48 దానిని “URL" బార్ లేదా “Address” (అడ్రస్) బార్ అని అంటారు.
02:52 URL పై క్లిక్ చేసి ఇప్పటికే ఉన్న చిరునామాను తొలగించండి.
02:57 www.google.com అని టైప్ చేయండి.
03:02 ఎంటర్ కీ నొక్కండి
03:03 మీరు Google homepage(గూగుల్ హోమ్పేజీ)లో ఉన్నారు.
03:06 Back arrow(బ్యాక్ యారో) ఐకాన్ పై క్లిక్ చేస్తే అది మిమల్ని ఇంతకు ముందు ఉన్న పేజీకి తీసుకెళుతుంది.
03:12 Google homepage(గూగుల్ హోమ్పేజీ)కి వెళ్ళడానికి forward arrow (ఫార్వర్డ్ యారో) ను క్లిక్ చేయండి.
03:17 URL బార్ కుడి వైపున ఇంటి ఆకారంలో ఒక ఐకాన్ ఉంది.
03:22 ఈ బటన్ మిమ్మల్ని ఏ వెబ్ పేజ్ లో ఉన్నప్పటికీ Default home page(డిఫాల్ట్ హోమ్ పేజీకి) కు తిరిగి తెసుకువెళుతుంది.
03:28 ఒక ప్రత్యేకమైన సైట్ లేదా సర్చ్ ఇంజిన్ నుండి బ్రౌజ్ చేస్తున్నపుడు ఈ ఫంక్షన్ మీకు చాలా ఉపయోగపడుతుంది.
03:34 Homepage(హోమ్ పేజీ) బటన్ పై క్లిక్ చేద్దాం .
03:36 ఇంతకు ముందు home page((హోమ్ పేజీ) ను "‘www.yahoo.com’ కు మార్చామని గుర్తు పెట్టుకోండి.
03:42 తత్ఫలితముగా “homepage”(హోం పేజి )బటన్ పై క్లిక్ చేస్తే అది మిమ్మల్ని “yahoo homepage”(యాహూ హోం పేజి ) కు తీసుకువెళుతుంది.
03:49 ఇప్పుడు “Bookmarks” (బుక్ మార్క్స్) బార్ వైపు చూద్దాం
03:51 బుక్మార్క్లు మీరు తరచుగా సందర్శించే లేదా చూసే పేజీలలో సంచరించుటకు సహాయపడుతుంది.
03:57 URL బార్ లో ‘www.gmail.com’ అని టైప్ చేయండి.
04:03 పేజీ లోడ్ కాగానే, URL బార్ కు కుడి వైపున ఉన్న Star(స్టార్ )గుర్తు పై క్లిక్ చేయండి.
04:10 ఆ స్టార్ పసుపుగా మారడం మీరు చూడవచ్చు.
04:13 ఆ స్టార్ పైన మళ్ళి క్లిక్ చేయండి.
04:14 ఒక డయలాగ్ బాక్స్ పాప్ అప్ అవుతుంది.
04:17 ‘Folder’('ఫోల్డర్') డ్రాప్ డౌన్ మెను నుండి, “Bookmarks toolbar”( 'బుక్మార్క్లు టూల్బార్') ను ఎంచుకోండి.
04:23 Gmail bookmark(జిమెయిల్ బుక్మార్క్) ఇక Bookmarks toolbar(బుక్మార్క్లు టూల్బార్) లోకి జోడించబడిందని గమనించండి.
04:28 Yahoo homepage(యాహు హోమ్ పేజీ)కి వెళ్ళుటకు Homepage(హోమ్ పేజీ)ఐకాన్ పై క్లిక్ చేయండ
04:33 Gmail bookmark(జిమెయిల్ బుక్ మార్క్) పైన క్లిక్ చేస్తే అది మిమ్మల్ని నేరుగా Gmail login page(జిమెయిల్ లాగిన్ పేజి) కి తెసుకువెళుతుంది.
04:39 మీరు bookmarks bar ను, తరచుగా చూసే సైట్ లు అయినప్పటికీ హోం పేజ్ గా వద్దు అనుకునే వారి కొరకు వాడవచ్చు.
04:46 ఆ తరువాత Sidebar(సైడ్ బార్ ) వైపు చూద్దాం
04:49 View(వ్యూ) మరియు Sidebar (సైడ్ బార్ )పైన క్లిక్ చేసి ఆ తరువాత, History(హిస్టరీ ) పైన క్లిక్ చేయండి.
04:54 ఎడమ వైపు ఉన్న బార్ లో మూడు (3) ఎంపిక లు ఉన్నాయి అవి - Today(టుడే), Yesterday(ఎస్టర్డే) మరియు Older than 6 months(ఒల్దెర్ డెన్ సిక్స్ మంత్స్ ).
05:02 ప్రదర్శించబదిన ఎంపికలు ఆ కంప్యూటర్లో వున్న ఫయర్ ఫాక్స్ యొక్క వాడుకల మధ్య వ్యవధికి సంబంధించినవి .
05:09 మెనూ ను విస్తరించుటకు Today(టుడే) ఐకాన్ ప్రక్కన ఉన్న ప్లస్ సైన్ (+) పైన క్లిక్ చేయండి
05:15 Google homepage(గూగుల్ హోం పేజి)కి తిరిగి వెళ్ళుటకు google(గూగుల్) లింకు ను ఎంచుకోండి.
05:19 మీరు ఇంతకు ముందు చూసిన సైట్ లను ఇప్పుడు చూడడము ఎంత తేలికో! గమనించండి.
05:25 సైడ్ బార్ కు దాని సొంత శోధన ఫంక్షన్ కూడా ఉంది
05:29 శోధన బాక్స్ లో వేదకాలనుకున్న సైట్ పేరు ను మీరు టైప్ చేయవచ్చు.
05:34 అది మీ హిస్టరీ అంతా దాని కొరకు వెదుకుతుంది
05:37 సర్చ్ బాక్స్ లో ‘'google'’ (గూగుల్ ) అని టైప్ చేయండి.
05:39 మొదటి ఫలితంగా google homepage(గూగుల్ హోం పేజీ ) వస్తుంది.
05:43 సైడ్ బార్కుడి వైపున పై మూల లో ఉన్న చిన్న ‘x’ బటన్ ను క్లిక్క్ చేసి సైడ్ బార్ ను కనపడకుండా చేయగలరు.
05:51 ఆ తరువాత Status bar(స్టేటస్ బార్ ) ఏమి చేస్తుందో చూద్దాం
05:55 Status bar(స్టేటస్ బార్) అనేది మీ బ్రౌజర్ విండో క్రింద ఉన్న ఏరియా, ఇది మీకు లోడ్ చేస్తున్న సైట్ యొక్క స్థితిని చూపుతుంది.
06:02 URL బార్కు వెళ్లి www.wired.com టైప్ చేసి, ఎంటర్ కీ నొక్కండి .
06:10 Status bar(స్టేటస్ బార్) వైపు త్వరగా చూడండి. అది మీకు వెబ్ పేజ్ లోడింగ్ స్టేటస్ ను చూపుతుంది
06:16 ఒక నిర్దిష్టమైన సైట్ ఎందుకు లోడ్ అవ్వడము లేదు, లోడ్ అవ్వడము కొరకు ఎంత సమయం తీసుకుంటుంది వంటి వాటిని అర్థం చేసుకోవడం కొరకు స్టేటస్ బార్ సహాయపడుతుంది.
06:25 చివరగా Content area(కంటెంట్ఏరియా) వైపు చూద్దాం .
06:28 మీరు చూస్తున్న వెబ్ పేజ్ యొక్క కంటెంట్ఏరియా ను ఇక్కడ చూడగలరు
06:33 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేశాం.
06:35 ఈ ట్యుటోరియల్ లో మనము ఫయర్ ఫాక్స్ ఇంటర్ఫేస్ మరియు టూల్ బార్స్ గురించి నేర్చుకున్నాము.
06:43 ఈ కాంప్రిహేన్సివ్ ఎసైన్మెంట్ ను ప్రయత్నించండి.
06:46 మీ హోమ్ పేజ్ ను ‘www.spoken-tutorial.org’ గా మార్చి అందులో సంచరించండి
06:54 ఆపై బ్రౌజర్ యొక్క History(హిస్టరీ) ఫంక్షన్ ఉపయోగించి yahoo వెబ్ సైట్ కు వెళ్ళండి.
07:00 ఈ క్రింది లింకు వద్ద అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
07:05 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ సారాంశాన్ని తెలుపుతుంది.
07:07 మీకు మంచి బాండ్ విడ్త్ లేకపోతె, వీడియోని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
07:12 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాపులను నిర్వహిస్తుంది.
07:17 ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు జారిచేస్తుంది
07:21 మరిన్ని వివరాల కొరకు దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:27 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
07:31 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ అండ్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
07:39 ఈ మిషన్ గురించి మరింత సమాచారము Spoken Hyphen tutorial dot org slash NMEICT hyphen Intro లో అందుబాటులో ఉన్నది.
07:50 ఈ ట్యుటోరియల్ను తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి
07:56 మాతో చేరినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Udaya, Yogananda.india