Difference between revisions of "Linux/C2/The-Linux-Environment/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 |Time ||Narration |- |00:00 ||లైనక్స్ పర్యావరణం మరియు దానిని మార్పు చేసే విధాన…')
 
Line 1: Line 1:
 
 
{| border=1
 
{| border=1
 
|Time
 
|Time

Revision as of 16:47, 20 June 2014

Time Narration
00:00 లైనక్స్ పర్యావరణం మరియు దానిని మార్పు చేసే విధానాల పై ఈ స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో చూపించిన ఉదాహరణలు ప్రయత్నించడానికి ఒక పనిచేస్తున్న లైనక్స్ సిస్టమ్, ప్రధానంగా ఉబంటు అవసరమౌతుంది.
00:13 లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రారంభించడం మీకు తెలుసని మరియు కమాండ్స్, ఫైల్ సిస్టమ్స్ మరియు షెల్ గురించి మీరు ప్రాధమిక అవగాహన కలిగి ఉన్నారని మేము భావిస్తున్నాము.
00:22 మీకు ఆసక్తి ఉంటే, లేదా ఈ విషయాలను మెరుగు పెట్టవలసిన అవసరం ఉంటే, మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్న మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ఉపయోగించటానికి సంశయించకండి.
00:32 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేయడానికి ఉబంటు 10.10 ఉపయోగించబడిందని గమనించండి.
00:36 లైనక్స్ కేస్ సెన్సిటివ్ అని మరియు ప్రత్యేకంగా తెలియచేయబడితే తప్ప ఈ ట్యుటోరియల్లో ఉపయోగించిన అన్ని కమాండ్లు లోయర్ కేసులో ఉన్నాయని కూడా గమనించండి.
00:46 ఆపరేటింగ్ సిస్టమ్ మీతో ఎలా ప్రవర్తిస్తుంది, మీ కమాండ్లకు ఎలా ప్రతిస్పందిస్తుంది, మీ చర్యలను ఎలా వ్యాఖ్యానిస్తుంది మొదలైనవాటిని లైనక్స్ పర్యావరణం నిర్ధారిస్తుంది.
00:55 షెల్ యొక్క సెట్టింగ్స్ మార్చడం ద్వారా లైనక్స్ను అత్యంత అనుగుణంగా మార్చుకోవచ్చు.
00:58 దీన్నంతా ఎలా చేయవచ్చో మనం అర్ధం చేసుకుందాం.
00:59 సాధారణంగా షెల్ యొక్క ప్రవర్తన షెల్ వేరియబుల్స్ ద్వారా నిర్ధారించబడుతుంది..
01:04 షెల్ వేరియబుల్స్ ప్రధానంగా రెండు రకాలు: ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మరియు లోకల్ వేరియబుల్స్
01:12 పూర్తిగా యూజర్ యొక్క ఎన్విరాన్మెంట్లో లభ్యంకావడం వలన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కు ఆ పేరు పెట్టబడింది.
01:19 షెల్ రచనలను పనిచేయించే వాటివలే అవి షెల్చే ఉత్పత్తి చేయబడిన సబ్ షెల్స్లో కూడా ఇవి లభిస్తాయి.
01:24 ఆ పేరు సూచిస్తున్నట్లుగా, లోకల్ వేరియబుల్స్ మరింత నియంత్రిత లేదా పరిమిత లభ్యతను కలిగి ఉన్నాయి.
01:31 అవి షెల్చే ఉత్పత్తి చేయబడిన సబ్ షెల్స్లో లభ్యం కావు.
01:36 అయితే ఈ ట్యుటోరియల్లో, మనం ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటాం, ముందుగా మనం ఈ షెల్ వేరియబుల్స్ యొక్క విలువను ఎలా చూడవచ్చో చూద్దాం.
01:48 ప్రస్తుత షెల్లో అందుబాటులో ఉన్న అన్ని వేరియబుల్స్ను చూడటానికి, మనం set కమాండ్ రన్ చేద్దాం.
01:53 టెర్మినల్ వద్ద "set space 'vertical-bar' more" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:00 మనం ప్రస్తుత షెల్ వేరియబుల్స్ అన్నిటిని చూడవచ్చు,
02:04 ఉదాహరణకు: HOME ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ను చూసి దానికి ఇవ్వబడిన విలువను కూడా గమనించండి.
02:15 జాబితా మొత్తాన్ని చూడటానికి ఎంటర్ నొక్కండి మరియు బయటకు రావడానికి q నొక్కండి
02:21 వేరియబుల్ జాబితా యొక్క మరింత సిస్టమేటిక్ మల్టీపేజ్ అవుట్పుట్ కొరకు ఇక్కడ set నుండి అవుట్పుట్ పైప్లైన్ చేయబడింది.
02:38 కేవలం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ను చూడటానికి కమాండ్ env రన్ చేయండి.
02:45 టెర్మినల్ వద్ద "env space 'vertical-bar' more" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
02:52 ఉదాహరణకు, slash bin slash bash విలువను కలిగిన SHELL వేరియబుల్ను గమనించండి.
03:00 మరలా, జాబితా నుండి బయటకు రావడానికి మీరు q నొక్కవచ్చు.
03:07 ఇప్పుడు మనం లైనక్స్లో మరింత ముఖ్యమైన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో కొన్నిటిని చర్చిద్దాం.
03:11 ఇక్కడ అన్ని ప్రదర్శనల కొరకు మనం బాష్ షెల్ ఉపయోగించబోతున్నాం.
03:15 విభిన్న్ షెల్స్ కొద్దిగా భిన్నమైన మార్గాలలో మార్పుచేయబడ్డాయి.
03:19 వాస్తవంగా ఒక వేరియబుల్ దేనిని భద్రపరుస్తుందో చూడటానికి మనం ఆ వేరియబుల్ యొక్క పేరుకు ముందు డాలర్ చిహ్నాన్ని ఉంచి ఇంకా దానితో పాటుగా echo కమాండ్ను ఉపయోగంచాలి.
03:30 మనం ముందుగా చూడబోయే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ SHELL వేరియబుల్.
03:35 అది ప్రస్తుత షెల్ యొక్క పేరును భద్రపరుస్తుంది.
03:37 SHELL వేరియబుల్ యొక్క విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద "echo space dollar S-H-E-L-L " ను క్యాపిటల్స్ లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి
03:55 ఇక్కడ slash bin slash bash అనేది మనం ప్రస్తుతం పనిచేస్తున్న షెల్.
04:02 తరువాతి వేరియబుల్ HOME.
04:05 మనం లైనక్స్లోకి ప్రవేశించినపుడు, అది సాధారణంగా మనల్ని యూజర్ పేరు మీద ఉన్న డైరక్టరీలో ఉంచుతుంది.
04:11 ఈ డైరక్టరీ హోమ్ డైరక్టరీగా పిలువబడుతుంది మరియు ఇదే ఖచ్చితంగా HOME వేరియబుల్లో కూడా లభ్యమవుతుంది.
04:17 దీని విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద "echo space dollar H-O-M-E" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
04:29 తరువాతి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PATH.
04:32 ఏదైనా అమలు చేయదగిన కమాండ్ ను గుర్తించటానికి షెల్ వెతకాల్సిన డైరెక్టరీల యొక్క అబ్సల్యూట్ పాత్ లను PATH వేరియబుల్ కలిగి ఉంటుంది.
04:40 పాత్ వేరియబుల్ యొక్క విలువను చూద్దాం.
04:43 మరలా, టెర్మినల్ వద్ద "echo space dollar P-A-T-H " అని కాపిటల్స్లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి
04:51 మై కంప్యూటర్లో అది slash user slash local slash sbin slash user slash local slash bin slash user slash sbin slash user slash bin etc డైరక్టరీలను చూపుతుంది .
05:04 ఇది ఒక సిస్టమ్ నుండి మరొకదానికి కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు.
05:07 నిజానికి ఇది ఒక అమలు చేయదగిన కమాండ్ ను కనుగొనడానికి షెల్ వెతికే : (కొలన్) డీలిమిటర్చే వేరుచేయబడిన డైరక్టరీల జాబితా.
05:18 మనం మన స్వంత డైరక్టరీని కూడా జాబితాకు జత చేయటం ద్వారా షెల్ ద్వారా మన డైరెక్టరీ కూడా శోదించబడుతుంది.
05:25 మనం మన స్వంత డైరక్టరీని టెర్మినల్ వద్ద కలపడానికి
05:29 కాపిటల్ లో "P-A-T-H 'ఈక్వల్-టు' డాలర్ మరలా కాపిటల్లో P-A-T-H కోలన్ స్లాష్ హోమ్ స్లాష్ మీ స్వంత డైరక్టరీ పేరు టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:54 ఇప్పుడు మనం PATH విలువను echo చేసినట్లయితే,
06:04 మనం కలిపిన డైరక్టరీ కూడా PATH వేరియబుల్లో భాగంగా ఉంటుంది.
06:10 ఇప్పుడు డైరెక్టరీ ఇక్కడ ఉంది చూడండి.
06:16 మరొక ఆసక్తికరమైన వేరియబుల్ LOGNAME.
06:20 అది ప్రస్తుత క్రియాత్మక యూజర్ యొక్క యూజర్ పేరును భద్రపరుస్తుంది.
06:24 విలువను చూడటానికి "echo space dollar LOGNAME" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
06:35 మనం టెర్మినల్ను తెరచినపుడు డాలర్ గుర్తు కనిపిస్తుంది, ఇదే మనం అన్ని కమాండ్లను ఎంటర్ చేసే ప్రాంప్ట్.
06:42 ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PS1 ప్రాతినిధ్యం వహించే ప్రాధమిక ప్రాంప్ట్ వరుస.
06:47 ఇక్కడ ద్వితీయ ప్రాంప్ట్ వరుస కూడా ఉంది
06:50 మన కమాండ్ పొడవుగా ఉండి ఒక వరుస కంటే ఎక్కువ విస్తరిస్తే, రెండవ వరుస నుండి ప్రాంప్ట్ వద్ద మనం గ్రేటర్ దాన్ “>” గుర్తు చూడవచ్చు.
07:00 ఇది ఎన్విరాన్మెంట్ వేరియబుల్ PS2 ప్రాతినిధ్యం వహించే ద్వితీయ ప్రాంప్ట్ వరుస.
07:05 ద్వితీయ కమాండ్ ప్రాంప్ట్ విలువను చూడటానికి, టెర్మినల్ వద్ద, "echo స్పేస్ డాలర్ PS2 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:20 ప్రాంప్ట్ వద్ద “at the rate” <@> చూపటానికి మన ప్రాధమిక ప్రాంప్ట్ వరుసను మార్చుకోవచ్చు.
07:28 దీని కొరకు "PS1 'equal-to' now within quotes 'at the rate' టైప్ చేసి “ ఎంటర్ నొక్కండి.
07:41 ఇప్పుడు ప్రాంప్ట్ వద్ద మనం డాలర్ గుర్తుకు బదులుగా ఎట్ ద రేట్ గుర్తును చూడవచ్చు.
07:50 మనం మరింత ఆసక్తికరమైన పనిని చేయవచ్చు. ప్రాంప్ట్ వద్ద మన యూజర్ నేమ్ ప్రదర్శించుకోవచ్చు.
07:56 "PS1in capital 'equal-to' within quotes dollar LOGNAME " టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:12 ఇప్పుడు నా యూజర్నేమ్ నా ప్రాంప్ట్ ఒకటే.
08:16 వెనుకకు వెళ్లడానికి "PS1 'equal-to' dollar within quotes అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి."
08:28 చాలా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కు మనం విలువలను కేటాయించాం.
08:32 అయితే, ఈ మార్పులన్నీ ప్రస్తుత సెషన్ వరకే అన్వయించబడతాయని గుర్తుంచుకోండి.
08:37 ఉదాహరణకు మనం ఇప్పుడే మన డైరక్టరీని PATH వేరియబుల్కి కలిపాం.
08:40 మనం టెర్మినల్ను మూసివేసి మరలా తెరిచి లేదా పూర్తిగా కొత్త టెర్మినల్ను తెరిచి మరియు పాత్ వేరియబుల్ను దాని విలువను echo చేయడం ద్వారా పరిశీలిస్తే
09:00 మన మార్పులు ఇప్పుడు ఉనికిలో లేవని చూసి మనం ఆశ్చర్యపోతాం.
09:05 మనం ఈ మార్పలను శాశ్వతం చేసే మార్గం ముందు రాబోయే ట్యుటోరియల్స్లో చెప్పబడుతుంది.
09:13 మనం ఇటీవల కాలంలో అమలుపరచిన కమాండ్లను తిరిగి అమలుపరచాలని తరచుగా అనుకోవచ్చు. మనమేం చేస్తాం? మనం మొత్తం కమాండ్ను తిరిగి టైప్ చేయాలా?
09:22 అవసరం లేదు, దానికి అనేక పరిష్కారాలు ఉన్నాయి.
09:26 ముందు, సాధారణంగా మీరు మీ కీబోర్డ్ లోని అప్ కీని నొక్కితే అది మీరు టైప్ చేసిన చివరి కమాండ్ను చూపుతుంది.
09:33 వత్తిపట్టి ఉంచితే అది ముందరి కమాండ్లను అన్నిటినీ స్క్రోల్ చేస్తుంది.
09:37 వెనుకుకు వెళ్లడానికి డౌన్ కీ నొక్కండి.
09:42 అయితే మీరు చాలా కమాండ్లను చూడాలంటే ఇది కొంచెం అస్తవ్యస్తంగా మరియు విసుగ్గా ఉంటుంది.హిస్టరీ కమాండ్ను ఉపయోగించడం మెరుగైన మార్గం.
09:52 ప్రాంప్ట్ వద్ద "history" అని టైప్ చేయండి.
09:58 ఎంటర్ నొక్కండి, గతంలో అమలుపరచిన కమాండ్ల జాబితాను చూడండి.
10:04 మీరు చూడదలచుకున్న పెద్ద జాబితాకు బదులుగా కేవలం చివరి పది మాత్రమే ఉంటాయి
10:08 "history space 10" అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
10:20 ఈ జాబితాలో, గతంలో అమలుపరచిన ప్రతి కమాండ్కు ఒక సంఖ్య కేటాయించబడిందని గమనించండి.
10:27 ఒక ప్రత్యేక కమాండ్ను తిరిగి ఇవ్వాలంటే.
10:32 ఆశ్చర్యార్ధకాన్ని, ఆ తరువాత కమాండ్ యొక్క సంఖ్యను టైప్ చేయండి, ఉదాహరణకి నా విషయంలో 442, echo space dollar pathను అమలుపరుస్తుంది
10:51 మీరు మరలా చివరి కమాండ్ను అమలుచేయాలంటే, ఆశ్చర్యార్ధకాన్ని రెండుసార్లు టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
11:03 మనం చూడబోయే తరువాతి విషయం tilde substitution గా పిలువబడుతుంది. tilde(~) హోమ్ డైరక్టరీకి షార్ట్హాండ్
11:12 మీకు మీ స్వంత హోమ్ డైరక్టరీలో testtree అనే పేరుతో డైరక్టరీ ఉందనుకోండి. "cd space 'tilde' slash testtree" అని టైప్ చేయడం ద్వారా దానిని మీరు తరలించవచ్చు.
11:25 cd 'tilde' minus or only cd minus కమాండ్ ఇవ్వడం ద్వారా ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీ మరియు చివరగా ఉపయోగించిన డైరక్టరీల మధ్య మారుతూ పనిచేయవచ్చు.
11:35 ప్రస్తుతం మనం testtree డైరక్టరీలో ఉన్నాం, మనం చివరగా చూసిన డైరక్టరీ హోమ్ డైరక్టరీ.
11:41 అంటే ఇప్పుడు మనం"cd space minus" అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే హోమ్ డైరక్టరీకి వెళతాం.
11:47 దానిని మరలా రన్ చేయండి మరియు అది మనల్ని తిరిగి testtree డైరక్టరీకి తీసుకు వెళుతుంది.
11:55 మనం చూడబోయే చివరి మరియు అతి ముఖ్యమైన కమాండ్ alias కమాండ్.
11:59 అనేకసార్లు రన్ చేయాల్సిన అవసరం ఉన్న ఒక పెద్ద కమాండ్ మీ వద్ద ఉండవచ్చు.
12:04 ఇలాంటి సందర్భంలో మనం దానికి ఒక చిన్న మారుపేరు పేరుని ఇవ్వవచ్చు మరియు దానిని invoke చేయటానికి అసలు పేరు బదులుగా మారుపేరు ఉపయోగించవచ్చును.
12:11 మీరు మ్యూజిక్ కోసం తరచు చూసే ఒక పెద్ద డైరక్టరీ మీకు ఉందని అనుకుంటే , మీరు ఈ విధంగా దానికి alias సృష్టించవచ్చు
12:20 " alias space cdMusic 'equal-to' within double quotes cd space slash home slash arc slash files slash entertainment slash music " అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
12:47 మీరు ఈ డైరక్టరీకి వెళ్లాలనుకున్న ప్రతిసారీ cdMusic అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే సరిపోతుంది.
12:55 చూడండి,ఇప్పుడు మనం మ్యూజిక్ డైరక్టరీలో ఉన్నాం.
12:58 ఇప్పుడు మీరు ప్రాంప్ట్ వద్ద "cd space minus" అని టైప్ చేసి ముందు పనిచేస్తున్న డైరక్టరీకి వెళ్లవచ్చు.
13:08 aliasను unset చేయటానికి unalias space cdMusic అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
13:20 ఇప్పుడు మరలా మీరు టెర్మినల్ నుండి cdMusic ను తొలగిస్తే , కమాండ్ కనిపించలేదనే ఎర్రర్ వస్తుంది.
13:30 మనం ప్రస్తుతం పనిచేస్తున్న డైరక్టరీలో టెస్ట్ 1 మరియు టెస్ట్2 అనే రెండు ఫైల్స్ ఉన్నాయని అనుకుందాం
13:38 మరియు ఒకవేళ మనం rm test1ను తొలగిస్తే, టెస్ట్ 1 నిశ్శబ్దంగా తొలగించబడుతుంది
13:45 Rm కమాండ్ యొక్క “hyphen i” ఆప్షన్ తొలగింపు ప్రక్రియను పరస్పర ప్రభావశీలంగా చేస్తుందని మనకు తెలుసు.
13:52 కనుక మనం alias rm equal-to, now within quotes “rm space hyphen i”వంటి aliasను సెట్ చేయవచ్చు.
14:03 ఇప్పుడు మనం “rm”ను రన్ చేస్తే, వాస్తవానికి rm hyphen i” రన్ అవుతుంది.
14:13 టెస్ట్ 1 నిశ్శబ్దంగా తొలగించబడగా, టెస్ట్ 2ను తొలగించే ముందు సిస్టమ్ అడగటాన్ని మనం చూసాం.
14:20 ఈ ట్యుటోరియల్లో, మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, history మరియు aliasing గురించి నేర్చుకున్నారు.
14:25 దీనితో మనం ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
14:28 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
14:36 దీనిపై మరింత సమాచారం మా వెబ్సైట్ నుండి లభిస్తుంది.
14:39 అనిర్బన్ ఈ ట్యుటోరియల్ యొక్క రచన రూపొందించారు.
14:42 ఈ రచనకు సహాయపడినవారు ----------------------(అనువాదం చేసినవారి పేరు) మరియు -----------------------(రికార్డ్ చేసినవారి పేరు) -------------------------- నుండి(ప్రదేశం పేరు).వీడ్కోలు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Udaya, Yogananda.india