Difference between revisions of "Linux/C2/Working-with-Regular-Files/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with ' {| border=1 |Time ||Narration |- |0:00 ||లైనెక్స్ లోని రెగ్యులర్ ఫైల్స్ తో పని చేయడము పై స్…')
 
Line 1: Line 1:
 
 
{| border=1
 
{| border=1
 
|Time
 
|Time

Revision as of 16:39, 20 June 2014

Time Narration
0:00 లైనెక్స్ లోని రెగ్యులర్ ఫైల్స్ తో పని చేయడము పై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.
0:07 ఫైల్స్ మరియు డైరెక్టరీ లు రెండూ కలిసి లైనక్స్ ఫైల్ సిస్టం ను ఏర్పరుస్తాయి.
0:13 గత ట్యుటోరియల్ లో డైరెక్టరీలతో ఎలా పని చేయాలో మనము నేర్చుకున్నాము. మీరు ఈ వెబ్ సైట్ లో ఆ ట్యుటోరియల్ ను చూడవచ్చు.
0:25 ఈ ట్యుటోరియల్ లో రెగ్యులర్ ఫైల్స్ తో ఎలా పని చేయాలో చూద్దాము.
0:31 ఒక cat కమాండ్ ను వాడి ఒక ఫైల్ ను ఎలా క్రియేట్ చేయాలో మనము ఇప్పటికే గత ట్యుటోరియల్ లో చూసాము. వివరముల కొరకు దయచేసి ఈ వెబ్ సైట్ ను చూడండి.
0:46 ఇప్పుడు ఒక ఫైల్ ను ఒక చోటు నుంచి మరొక చోటుకి ఎలా కాపీ చేయాలో చూద్దాము. దీని కొరకు మనకు cp కమాండ్ ఉన్నది.
0:55 ఈ కమాండ్ ఎలా వాడవచ్చో ఇప్పుడు చూద్దాము.
1:00 ఒక ఫైల్ ను కాపీ చేయడము కొరకు మనము

cp స్పేస్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ [OPTION]... స్పేస్ సోర్స్ ఫైల్ యొక్క పేరు స్పేస్ డెస్టినేషన్ పైల్ పేరు టైప్ చేస్తాము.

1:15 ఒకేసారి చాలా ఫైల్స్ ను కాపీ చేయడము కొరకు .

cp స్పేస్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ [OPTION]... స్పేస్ మనము కాపీ చేయాలి అని అనుకుంటున్న సోర్స్ ఫైల్స్ పేర్లు స్పేస్ డెస్టినేషన్ డైరెక్టరీ పేరు టైప్ చేస్తాము.

1:34 ఇప్పుడు ఒక ఉదాహరణను చూద్దాము. ముందుగా మనము ఒక టెర్మినల్ ను ఓపెన్ చేద్దాము.
1:42 మన వద్ద ఇప్పటికే /home/anirban/arc/ లో test1 అనే పేరు ఉన్న ఒక ఫైల్ ఉన్నది.
1:49 test1 లో ఏమి ఉన్నదో చూడడము కొరకు మనము

$ cat test1 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేద్దాము.

2:00 test1 లో ఉన్న కంటెంట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఇప్పుడు మనము దానిని test2 అనే మరొక ఫైల్ లోకి కాపీ చేయాలి అని అనుకుంటే

$ cp test1 test2 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి.

2:22 ఇప్పుడు ఫైల్ కాపీ చేయడము పూర్తి అయింది.
2:25 test2 కనుక లేకపోతే మనము ముందుగా దానిని క్రియేట్ చేసి ఆ తరువాత test1 లోని అంశమును దాని లోకి కాపీ చేస్తాము.
2:35 అది ఇప్పటికే ఉన్నట్లు అయితే అది సైలెంట్ గా ఓవర్ రైట్ చేయబడుతుంది. కాపీ చేయబడిన ఫైల్ టైప్ ను చూడడము కొరకు

$ cat test2 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.

2:52 మీరు వేరు వేరు డైరెక్టరీల నుంచి మరియు డైరెక్టరీలకు ఫైల్స్ ను కాపీ చేయవచ్చు. ఉదాహరణకు

$ cp /home/anirban/arc/demo1 /home/anirban/demo2 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.

3:31 ఇది సోర్స్ డైరెక్టరీ home/anirban/arc/ నుంచి demo1 ఫైల్ ను /home/anirban అనే డెస్టినేషన్ డైరెక్టరీ లో demo2 అనే ఫైల్ కు కాపీ చేస్తుంది.
3:51 demo2 అక్కడ ఉన్నదా లేదా అని చూడడము కొరకు

ls space /home/anirban అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.

4:13 మీరు ఇక్కడ demo2 పైకి స్క్రోల్ అవ్వడమును చూడవచ్చు.
4:19 ఇంకా ముందుకు వెళ్లటానికి ముందుగా స్క్రీన్ ను క్లియర్ చేయండి.
4:25 డెస్టినేషన్ డైరెక్టరీలో ఉన్న పేరుతోనే ఫైల్ ఉండాలి అని మీరు అనుకున్నట్లు అయితే మీరు ఫైల్ నేమ్ ను ప్రత్యేకముగా చెప్పవలసిన పని కూడా లేదు. ఉదాహరణకు
4:35 $ cp /home/anirban/arc/demo1 /home/anirban/ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
5:03 ఇది demo1 అనే పేరు కలిగి ఉన్న ఒక ఫైల్ ను /home/anirban/arc/ directory నుండి /home/anirban అనే directory లో మరలా demo1 అనే పేరు కలిగి ఉన్న ఒక ఫైల్ కు కాపీ చేస్తుంది.
5:20 ఇంతకు మునుపు చూసినట్లుగా demo1 ను చూడడము కొరకు

ls/home/anirban అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.

5:33 ఇక్కడ మనము పైకి స్క్రోల్ చేస్తే demo1 ఫైల్ అక్కడ కనిపిస్తుంది.
5:40 ఇంకా ముందుకు వెళ్ళటానికి ముందుగా స్క్రీన్ ను క్లియర్ చేయండి.
5:48 మరొక సందర్భంలో మనము చాలా ఫైల్స్ ను కాపీ చేసుకోవాలి అని అనుకుంటే డెస్టినేషన్ ఫైల్ నేమ్ ఇవ్వవలసిన అవసరము ఉండదు.
5:56 మన హోమ్ డైరెక్టరీలో test1 test2 test3 అనే పేర్లతో మూడు ఫైల్స్ ఉన్నాయి అని మనము అనుకుందాం.
6:04 ఇప్పుడు మనము $ cp test1 test2 test3 /home/anirban/testdir అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేద్దాము.
6:27 ఇది మొత్తము test1,test2 మరియు test3 ఫైల్స్ ను వాటి పేర్లను మార్చకుండా /home/anirban/testdir అనే డైరెక్టరీకు కాపీ చేస్తుంది.
6:41 నిజానికి ఈ ఫైల్ కాపీ చేయబడింది అని మీరు ఇప్పుడు చూడగలరు. మనము ls /home/anirban/testdir అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేద్దాము.
7:03 ఈ డైరెక్టరీలో test1,test2 మరియు test3 లు ఉన్నాయి అని మీరు చూడవచ్చు.
7:10 cp తో పాటుగా చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనము చాలా ముఖ్యమైన వాటిని మాత్రమే చూస్తాము.
7:18 ఇప్పుడు ముందుగా స్లైడ్స్ ను తిరిగి చూద్దాము.
7:23 అన్ని ఆప్షన్ లలో -R అనేది చాలా ముఖ్యమైనది. ఇది మొత్తము డైరెక్టరీ స్ట్రక్చర్ కూడా రికర్సివ్ కాపీయింగ్ అయ్యేలా చేస్తుంది.
7:33 ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాము.
7:38 ఇప్పుడు test అని పిలవబడే ఒక డైరెక్టరీకు testdir డైరెక్టరీలో ఉన్న మొత్తము కంటెంట్ ను కాపీ చేసే ప్రయత్నము చేద్దాము.
7:48 దాని కొరకు మనము cp testdir/ test అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి.
8:02 మీరు అవుట్ పుట్ మెసేజ్ ను చూడగలరు.
8:06 కొంత కంటెంట్ కలిగి ఉన్న ఒక డైరెక్టరీను cp కమాండ్ ను వాడి మనము సాధారణముగా కాపీ చేయము.
8:14 కానీ -R ఆప్షన్ ను వాడి మనము ఆ పని చేయవచ్చు.
8:19 ఇప్పుడు మనము cp -R testdir/ test అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేద్దాం.
8:36 ఫైల్స్ ఇప్పుడు కాపీ చేయబడ్డాయి, బెస్ట్ డైరెక్టరీ నిజముగా కాపీ చేయబడిందా లేదా అని చూడడము కొరకు ls అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
8:47 test డైరెక్టరీ ను మీరు చూడగలరు. ఇప్పుడు స్క్రీన్ ను క్లియర్ చేయండి.
8:57 test లోపల ఉన్న కంటెంట్ ను చూడడము కొరకు ls test అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
9:08 మీరు test డైరెక్టరీలో ఉన్న కంటెంట్ ను చూడగలరు.
9:13 ఇప్పుడు మనము మరలా తిరిగి స్లైడ్ లకు వెళదాము.
9:16 అప్పటికే ఉన్న ఒక ఫైల్ లోకి మరొక ఫైల్ కాపీ చేయబడితే పాత ఫైల్ ఓవర్ రైట్ చేయబడుతుంది అని మనము చూసాము.
9:25 మనము పొరపాటున ఒక ముఖ్యమైన ఫైల్ ను ఓవర్ రైట్ చేసినట్లు అయితే ఏమి చేయాలి?
9:30 అలాంటిది ఏమీ జరగకుండా నివారించడము కొరకు మనకు -b ఆప్షన్ ఉన్నది.
9:36 ఇది అప్పటికే ఉన్న ప్రతి ఒక్క డెస్టినేషన్ ఫైల్ యొక్క బాక్ అప్ ను తీసుకుని ఉంచుతుంది.
9:41 మనము -i(interactive) ఆప్షన్ ను కూడా వాడవచ్చు, ఇది ఏ డెస్టినేషన్ ఫైల్ ను అయినా సరే ఓవర్ రైట్ చేసే ముందుగా ప్రతిసారి మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది.
9:54 ఇప్పుడు the mv కమాండ్ ఎలా పని చేస్తుందో చూద్దాము.
9:59 దీనిని ఫైల్స్ ను మూవ్ చేయడము కొరకు వాడతారు. ఇప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుంది?
10:04 దీనికి రెండు ముఖ్యమైన ఉపయోగములు ఉన్నాయి.
10:07 ఇది ఒక ఫైల్ లేదా డైరెక్టరీ ను రీనేమ్ చేయటానికి ఉపయోగపడుతుంది.
10:11 ఇది ఒక ఫైల్స్ యొక్క సమూహమును మరొక డైరెక్టరీకు మూవ్ చేయగలదు కూడా.
10:17 మనము ఇప్పటికే చూసిన cp కు mv చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు mv ను ఎలా వాడగలమో చూద్దాము.
10:29 మనము టెర్మినల్ ను ఓపెన్ చేసి $ mv test1 test2 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేద్దాము.
10:43 అప్పటికే హోమ్ డైరెక్టరీలో test1 అనే పేరుతో ఉన్న ఫైల్ ను test2 అనే ఫైల్ గా ఇది రీనేమ్ చేస్తుంది.
10:52 test2 కనుక అప్పటికే ఉన్నట్లు అయితే దానిని సైలెంట్ గా ఓవర్ రైట్ చేస్తుంది.
11:00 ఫైల్ ఓవర్ రైట్ అవ్వడమునకు ముందుగా వార్నింగ్ కావాలి అని మనము కోరుకున్నట్లు అయితే
11:05 mv కమాండ్ తో పాటుగా మనము -i ఆప్షన్ ను కూడా వాడవచ్చు.
11:10 anirban అనే పేరుతో మరొక ఫైల్ ఉన్నది అని అనుకుందాము. ఈ ఫైల్ ను కూడా మనము test2 అని రెన్యూ చేయాలని అనుకోవచ్చు.
11:20 మనము mv -i anirban test2 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాము.
11:32 test2 ను ఓవర్ రైట్ చెయ్యాలా వద్దా అని అడుగుతూ ఒక వార్నింగ్ ఇవ్వబడడమును మీరు చూడవచ్చు.
11:41 మనము y అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఫైల్ నిజముగా ఓవర్ రైట్ చేయబడుతుంది.
11:49 cp లాగానే మనము mv ను చాలా ఫైల్స్ కొరకు వాడవచ్చు, కానీ అలా వాడినప్పుడు డెస్టినేషన్ తప్పనిసరిగా ఒక డైరెక్టరీ అయి ఉండాలి.
11:58 ఇంకా ముందుకు వెళ్ళే ముందుగా స్క్రీన్ ను క్లియర్ చేద్దాము.
12:03 మన home డైరెక్టరీలో abc.txt, pop.txt మరియు push.txt అనే మూడు ఫైల్స్ ఉన్నాయి అని అనుకోండి.
12:14 అవి ఉన్నాయో లేవో చూడడము కొరకు ls టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
12:21 అవి pop.txt,push.txt మరియు abc.txt ఫైల్స్. ఇప్పుడు స్క్రీన్ ను క్లియర్ చేద్దాము.
12:36 ఇప్పుడు ఈ మూడు ఫైల్స్ ను మనము testdir అని పిలవబడే ఒక డైరెక్టరీలోకి మూవ్ చేద్దాము.
12:46 దాని కొరకు మనము mv abc.txt pop.txt push.txt అని టైప్ చేసి testdir అని డెస్టినేషన్ ఫోల్డర్ పేరును ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయాలి.
13:14 వాటిని చూడడము కొరకు ls testdir అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
13:20 మీరు abc, pop మరియు push.txt ఫైల్స్ ను చూడవచ్చు.
13:27 ఇప్పుడు mv తో పాటుగా ఉన్న ఆప్షన్స్ ను చూద్దాము. ఇప్పుడు ముందుగా స్లైడ్స్ ను మరలా చూద్దాము.
13:37 -b లేదా –backup ఆప్షన్ mv కమాండ్ లో ఉన్నది. అది డెస్టినేషన్ లో ఉన్న ప్రతి ఫైల్ బాక్ అప్ తీసుకున్న తరువాత మాత్రమే ఓవర్ రైట్ చేస్తుంది.
13:48 మనము ఇప్పటికే చూసిన -i ఆప్షన్ ఏ డెస్టినేషన్ ఫైల్ ను అయినా సరే ఓవర్ రైట్ చేసే ముందుగా వార్నింగ్ ఇస్తుంది.
13:58 ఇంక ఇప్పుడు మనము rm కమాండ్ ను చూడబోతున్నాము. ఫైల్స్ ను డిలీట్ చేయడము కొరకు ఈ కామాండ్ ను వాడతాము.
14:06 టెర్మినల్ కు తిరిగి వెళ్ళండి మరియు ls testdir అని టైప్ చేయండి.
14:15 faq.txt అనే పేరుతో ఒక ఫైల్ ఉండడాన్ని మీరు చూడగలరు. దానిని మనము డిలీట్ చేయాలి అని అనుకుంటున్నాము అనుకోండి.
14:23 దీని కొరకు మనము

$ rm testdir/faq.txt అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.

14:37 ఈ కమాండ్ faq.txt అనే ఫైల్ ను /testdir డైరెక్టరీ నుంచి తీసివేస్తుంది.
14:46 ఫైల్ నిజముగా తీసివేయబడిందా లేదా అని చూడడము కొరకు ఇప్పుడు ls testdir అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
15:00 ఇప్పుడు మనకు faq.txt అనే ఫైల్ కనిపించదు.
15:05 rm కమాండ్ ను మనము చాలా ఫైల్స్ తో పాటుగా కూడా వాడవచ్చు.
15:10 Testdir డైరెక్టరీలో abc2 మరియు abc1 అనే రెండు ఫైల్స్ ఉన్నాయి.
15:17 మనము ఈ abc2 మరియు abc1 అనే ఫైల్స్ ను తీసివేయాలి అని అనుకుంటున్నాము అనుకోండి.
15:23 దాని కొరకు మనము rm testdir/abc1 testdir/abc2 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి.
15:45 ఇలా చేయడము ద్వారా testdir డైరెక్టరీ నుంచి abc1 మరియు abc2 లు డిలీట్ చేయబడతాయి.
15:53 అవి డిలీట్ చేయబడ్డాయా లేదా అని చూడడము కొరకు ls testdir అని మరలా టైప్ చేయండి. మీకు ఇంక abc1 మరియు abc2 లు కనిపించవు.
16:07 ముందుకి వెళ్ళటానికి స్క్రీన్ ను క్లియర్ చేద్దాము.
16:14 ఇప్పుడు వెనుతిరిగి మరలా స్లైడ్స్ ను చూద్దాము.
16:18 మనము ఇప్పుడే ఏమి చెప్పాము అనే దానిని సంగ్రహముగా చూద్దాము.
16:20 ఒక ఫైల్ ను డిలీట్ చేయడము కొరకు మనము rm మరియు ఫైల్ నేమ్ లను టైప్ చేస్తాము.
16:27 చాలా ఫైల్స్ ను డిలీట్ చేయడము కొరకు మనము rm మరియు మనము డిలీట్ చేయాలి అని అనుకున్న ఫైల్స్ పేర్లను వ్రాస్తాము.
16:34 ఇప్పుడు rm కమాండ్ లో ఉన్న కొన్ని ఆప్షన్ లను చూద్దాము.
16:40 ఏ ఫైల్ అయినా రైట్ ప్రొటెక్టెడ్ అయితే rm ఆ ఫైల్ ను డిలీట్ చేయలేదు. అలాంటి సందర్భములో -f ఆప్షన్ వాడతాము. దీని ద్వారా ఒక ఫైల్ ను ఫోర్స్ డిలీట్ చేయవచ్చు.
16:57 ఇంకా సాధారణముగా వాడబడే మరొక ఆప్షన్ -r. ఈ ఆప్షన్ లు ఎక్కడ ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాము.
17:07 ఇప్పుడు మరలా టెర్మినల్ కు వెళదాము.
17:12 rm కమాండ్ ను సాధారణముగా డైరెక్టరీలను డిలీట్ చేయడము కొరకు వాడరు. దాని కొరకు మనకు rmdir కమాండ్ ఉన్నది.
17:21 కానీ den ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే rmdir కమాండ్ డైరెక్టరీను డిలీట్ చేస్తుంది.
17:27 లోపల పెద్ద సంఖ్యలో ఫైల్స్ మరియు సబ్ డైరెక్టరీలు ఉన్న ఫైల్స్ ను మనము డిలీట్ చేయాలి అనుకుంటే ఎలా చేయగలము?
17:35 దీని కొరకు rm కమాండ్ ను ప్రయత్నించి చూద్దాం.
17:38 ఇప్పుడు rm మరియు మనము డిలీట్ చేయాలి అని అనుకుంటున్న డైరెక్టరీ పేరు testdir ను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
17:47 testdir ను డిలీట్ చేయడమునకు rm ను వాడలేము అని మనకు అవుట్ పుట్ మెసేజ్ లో కనిపిస్తుంది.
17:55 కానీ -r మరియు -f ఆప్షన్ లను కంబైన్ చేయడము ద్వారా మనము ఈ పనిని చేయగలము.
18:03 rm -rf testdir అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
18:16 ఇప్పుడు testdir డైరెక్టరీ విజయవంతముగా డిలీట్ చేయబడింది.
18:22 ఇప్పుడు మరలా స్లైడ్ లకు వెళ్లి తరువాతి కమాండ్ ను చూద్దాము.
18:27 అది cmp కమాండ్.
18:29 కొన్నిసార్లు రెండు ఫైల్స్ ఓకే పేరుతో ఉన్నాయేమో అని మనము చెక్ చేయవలసి ఉంటుంది. అవి ఒకేపేరుతో ఉంటే మనము వాటిలో ఒకటి మాత్రమే డిలీట్ చేయవలసి ఉండవచ్చు.
18:37 అలాగే ఒక ఫైల్ దాని లాస్ట్ వెర్షన్ నుంచి ఏమైనా మారిందా అని కూడా మనము చూడవలసి రావచ్చును..
18:44 వీటి కొరకు మరియు ఇంకా వేరే చాలా లక్షముల కొరకు మనము cmp కమాండ్ ను వాడవచ్చు.
18:49 అది రెండు ఫైల్స్ ను బిట్ బై బిట్ చెక్ చేస్తుంది.
18:54 file1 మరియు file2 లను పోల్చి చూడడము కొరకు మనము cmp file1 file2 అని టైప్ చేయాలి.
19:03 రెండు ఫైల్స్ లో ఒకే కంటెంట్ ఉన్నట్లు అయితే ఎలాంటి మెసేజ్ కూడా కనిపించదు.
19:11 కేవలము ప్రాంప్ట్ మాత్రమే ప్రింట్ చేయబడుతుంది.
19:14 వాటి కంటెంట్ లలో తేడా ఉన్నట్లు అయితే మొదటి మిస్ మాచ్ యొక్క లోకేషన్ టెర్మినల్ వద్ద ప్రింట్ చేయబడుతుంది.
19:25 ఇప్పుడు cmp ఎలా పని చేస్తుందో చూద్దాము. మన home డైరెక్టరీలో మన వద్ద sample1మరియు sample2 అనే పేరు కల రెండు ఫైల్స్ ఉన్నాయి అని అనుకుందాము.
19:35 వాటిలో ఏమి ఉన్నదో ఇప్పుడు చూద్దాము?
19:38 cat sampe1 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. అందులో
“This is a Linux file to test the cmp command”  అనే టెక్స్ట్ ఉన్నది.
19:50 రెండవ sample2 ఫైల్ లో ఏమి ఉందో చూడడము కొరకు మనము sample2 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాము.
20:00 అందులో “This is a Unix file to test the cmp command.” అనే టెక్స్ట్ ఉన్నది.
20:06 ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ పైన మనము cmp కమాండ్ ను అప్లై చేస్తాము.
20:11 మనము cmp sample1 sample2 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాము.
20:23 ఇక్కడ sample1 మరియు sample2 ఫైల్స్ మధ్య మొదటి తేడా ఇక్కడ పాయింట్ అవుట్ చేయబడటాన్ని మనము చూడగలము.
20:32 తరువాతి కమాండ్ కు వెళ్ళే ముందుగా స్క్రీన్ ను క్లియర్ చేద్దాము.
20:38 మనము చూడబోయే తరువాతి కమాండ్ wc కమాండ్.
20:43 ఒక ఫైల్ లో ఉన్న కారెక్టర్లు, వర్డ్స్ మరియు లైన్ ల సంఖ్యను కౌంట్ చేయడము కొరకు ఈ కమాండ్ వాడబడుతుంది.
20:50 మన home డైరెక్టరీలో మన వద్ద sample3 అనే పేరు కలిగిన ఒక ఫైల్ ఉన్నది.
20:56 ఇప్పుడు అందులో ఉన్న కంటెంట్ ను చూడడము కొరకు మనము cat sample3 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేద్దాము.
21:05 ఇది sample3 లో ఉన్న కంటెంట్.
21:10 ఇప్పుడు ఈ ఫైల్ మీద wc కమాండ్ ను ఎలా వాడతామో చూద్దాము.
21:14 దాని కొరకు మనము wc sample3 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేద్దాము.
21:25 ఈ ఫైల్ లో 6 లైన్ లు, 67 పదములు మరియు 385 కారెక్టర్స్ ఉన్నాయి అని ఈ కమాండ్ తెలుపుతుంది.
21:38 ఇవి మనకు ఫైల్స్ తో పని చేయడములో సహాయము చేసే వాటిలో కొన్ని కమాండ్ లు.
21:43 ఇంకా చాలా కమాండ్ లు ఉన్నాయి. పైగా మనము ఇప్పటి వరకు చూసిన కమాండ్ లలో కూడా చాలా ఆప్షన్ లు ఉన్నాయి.
21:51 man కమాండ్ ను వాడి వాటి గురించి చూడమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను.
22:00 దీనితో నేను ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాను.
22:04 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
22:17 దీని గురించి http://spoken-tutorial.org/NMEICT-Intro లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉన్నది.
22:34 నిఖిల సైనింగ్ ఆఫ్. మాతో చేరినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Udaya, Yogananda.india