LibreOffice-Suite-Writer/C3/Typing-in-local-languages/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 టైపింగ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్స్ ఇన్ లిబ్రే ఆఫీస్ రైటర్ (Typing in Local languages in Libre Office Writer)గురించి తెలియ బరిచే స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో నేను, లిబ్రే ఆఫీస్ను వాడి కన్నడలో టెక్స్ట్ ప్రాసెసింగ్ ఎలా చెయ్యలో పరిచయం చేస్తాను.
00:15 మనం ఇక్కడ ఆపరేటింగ్ సిస్టం ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4. ను ఉపయోగిస్తున్నాము.
00:25 నేను మీకు లిబ్రే ఆఫీస్లో కన్నడ టైపింగ్ ఎలా ఆకృతీకరించవచ్చో వివరిస్తాను. ఈ పద్ధతిని ఉపయోగించి మీరు లిబ్రే ఆఫీస్లో ఏ భాషనైన ఆకృతీకరించగలరు.
00:36 ప్యాకేజీలను ఇన్స్టాల్ చేయడానికి సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ను ఉపయోగించండి.
00:40 వివరాలకు, స్పోకెన్ ట్యుటోరియల్ వెబ్ సైట్లో అందుబాటులో వున్న సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ ట్యుటోరియల్ను చూడండి.
00:48 కన్ఫిగరేషన్ నాలుగు దశల్లో జరుగుతుంది-
00:52 మీ కంప్యూటర్లో SCIM ఇన్స్టాల్ చేసి వుందో లేదో తనిఖీ చేయండి.
00:55 లేకపోతే, సినాప్టిక్ ప్యాకేజీ మేనేజర్ని ఉపయోగించి కింది ప్యాకేజీలు గుర్తించి, SCIMని ఇన్స్టాల్ చేయండి.
01:03 మీరు దీన్ని ఇన్స్టాల్ చేసేటపుడు ఈ ట్యుటోరియల్ ను ఆపి పూర్తి అయ్యాక పునః ప్రారంభించండి
01:08 కీబోర్డ్ ఇన్పుట్ పద్ధతిగా SCIM-immoduleను ఎంపిక చేసుకోండి.
01:14 టెక్స్ట్ ఇన్పుట్ కోసం Kannada(కన్నడ) ఒక భాషగా ఎంపిక చేసుకొని SCIMను కాన్ఫిగర్ చేయండి.
01:20 Complex Text layout (కాంప్లెక్స్ టెక్స్ట్ లేఅవుట్) కోసం కన్నడ ఎంపిక చేసుకొని లిబ్రే ఆఫీస్ను కాన్ఫిగర్ చేయండి.
01:26 ఇప్పుడు ఈ దశలను నేను వివరిస్తాను.
01:29 System (సిస్టం), Administration(, అడ్మినిస్ట్రేషన్) మరియు Language support( లాంగ్వేజ్ సపోర్ట్ ) పై క్లిక్ చేయండి.
01:41 ఒక వేళ Remind me later(రెమైన్డ్ మీ లేటర్) లేదా Install now(ఇన్స్టాల్ నౌ) అని తెరపై వస్తే Remind me later(రెమైన్డ్ మీ లేటర్)పై క్లిక్ చేయండి.
01:51 కీబోర్డ్ ఇన్పుట్ మెథడ్ సిస్టంలో, scim-immoduleను ఎంపిక చేసుకోండి.
01:56 ఇక్కడ ఇది ముందే ఎంపిక చేయబడింది, కాబట్టి మనం ఏమీ చేయడం లేదు.
02:01 మూడవసారి, SCIMను కన్ఫిగర్ చేయడానికి System, Preferences మరియు SCIM ఇన్పుట్ మెథడ్ పై క్లిక్ చేయండి.
02:14 మీరు ప్రస్తుతం దీనిని తెరపై చూడలేరు. కానీ మీ కంప్యూటర్ లో ప్రయతిన్స్తున్నప్పుడు ఈ ఎంపికను చూడగలరు.
02:22 IMEngine దిగువన, ఉన్న Global Setup పై క్లిక్ చేయండి.
02:27 SCIM, టెక్స్ట్ ప్రాసెసింగ్ కు మద్దతు ఇచ్చే అన్ని భాషలతో ఒక జాబితా చూపిస్తుంది.
02:38 ఇందులో, అత్యంత విస్తృతంగా మాట్లాడే, హిందీ, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, తమిళం, తెలుగు, మలయాళం, ఉర్దూ మొదలైన భారతీయ భాషలు వున్నవి.
02:48 మన ట్యుటోరియల్ కోసం హిందీ మరియు కన్నడ ఎంపిక చేసుకుందాం.
02:55 మీ కన్ఫిగరేషన్ను సేవ్ చేయడానికి OK పై క్లిక్ చేయండి.
02:59 SCIM మార్పులు ప్రభావం అయ్యాయని నిర్ధారించడానికి మెషిన్ను పునఃప్రారంభించవలసి ఉంటుంది.
03:04 అలా చేసి మళ్ళి ఈ ట్యుటోరియల్ వద్దకు తిరిగి వద్దాం.
03:08 ఇప్పుడు మనం లిబ్రేఆఫీస్ ను కన్నడ ప్రాసెసింగ్లో కాన్ఫిగర్ చేద్దాం.
03:14 Applications, Office(అప్లికేషన్స్, ఆఫీస్ ) మరియు LibreOffice Writer(లిబ్రేఆఫీస్ రైటర్) పై క్లిక్ చేద్దాం.
03:27 మెయిన్ మెనూ లో టూల్స్(Tools)పై క్లిక్ చేసి, Options (ఆప్షన్స్) ఉప ఎంపిక పై క్లిక్ చేయండి.
03:33 Options (ఆప్షన్స్) డైలాగ్ బాక్స్ చూడగలరు.
03:37 ఈ బాక్స్ లో Language Settings(లాంగ్వేజ్ సెట్టింగ్స్) పై క్లిక్ చేసి ఆ తర్వాత Languages option(లాంగ్వేజ్స్ ఆప్షన్) పై క్లిక్ చేయండి.
03:46 complex text layout (కాంప్లెక్స్ టెక్స్ట్ లేఔట్) ను ఏనాబ్ల్ చేస్తూ, ఒక వేళ చెక్ బాక్స్ పై చెక్ పెట్టి లేకపోతే చెక్ పెట్టండి
03:53 CTL డ్రాప్ -డౌన్( drop-down) నుండి Kannada(కన్నడ)ను ఎంపిక చేసుకోండి.
04:00 అప్రమేయంగా, మీ స్థానిక భాష సెట్టింగు Kannada(కన్నడ)ను సెట్ చేస్తుంది.
04:04 OK పై క్లిక్ చేయండి.
04:10 మనం ఇప్పడు Kannada(కన్నడ) మరియు English(ఇంగ్లీష్)లో ఒక వాక్యాన్ని టైప్ చేద్దాం.
04:15 మనం బరాహా(Baraha) పద్ధతిని, నూడి(Nudi) పద్ధతిని మరియు యూనికోడ్(UNICODE) ఫాంట్లు ఉపయోగిద్దాం. చివరగా ఫైల్ సేవ్ చేద్దాం.
04:24 ఇప్పుడు దీనిని ప్రదర్శిద్దాం.
04:27 తెరిచిన టెక్స్ట్ డాక్యుమెంట్ లో, ఉబుంటు GNU/లినక్సు సప్పోర్ట్స్ ముల్టిప్లే లాంగ్వేజ్స్ విత్ లిబ్రేఆఫీస్ (Ubuntu GNU/Linux supports multiple languages with LibreOffice)అని టైపు చేద్దాం.
04:45 CONTROLకీ పట్టుకొని, స్పేస్ బార్ నొక్కుదాం.
04:52 తెర కింది కుడి భాగంలో ఒక చిన్న విండో తెరుచుకుంటుంది.
04:56 బరాహా(Baraha)పద్ధతి లానే సులభమైన ఫోనెటిక్ పద్ధతి లో టెక్స్ట్ ను ఇన్పుట్ చేయడానికి కన్నడ kN-ITRANS('Kannada KN-ITRANS) పద్ధతిని ఎంపిక చేసుకోండి.
05:05 నూడి(Nudi) కీబోర్డ్ లేఔట్ కోసం Kannada – KN KGPపై క్లిక్ చేయండి.
05:10 ఆరంభించేవారి కోసం సులభంగా ఉండడానికి సులభమైన KN-ITRANS ఇన్పుట్ పద్ధతిని ఉపయోగిస్తాను.
05:16 ఆంగ్లంలో సార్వజనిక తంత్రశ(Sarvajanika Tantramsha) అని టైపు చేద్దాం.
05:27 కన్నడ టెక్స్ట్ తెరపై కనిపించడం గమనించండి.
05:31 CONTROL Key పట్టుకొని స్పేస్ బార్ నొక్కండి.
05:33 విండో కనుమరుగవుతుంది.
05:35 ఇప్పుడు మనం ఆంగ్లంలో టైపు చెయ్యవచ్చ.
05:37 ఈ విధంగా, CONTROLకీ మరియు స్పేస్ బార్, ఆంగ్ల మరియు ఎంపిక చేసిన ఇతర భాష మధ్య టోగుల్లా పని చేస్తుంది.
05:48 కన్నడ టెక్స్ట్ ప్రాసెసింగ్ పై www.Public-Software.in/Kannadaలో అందుబాటులో ఉన్న కన్నడ టైపింగ్ ఇందులో కన్నడ తో పాటు అర్కవతు(arkavathu)ను ఉపయోగించి నూడి(Nudi)లో టైప్ చేయడానికి కావాల్సిన ప్రతేకమైన సమాచారం వుంది. ఈ డాక్యుమెంట్ ను మీరు రెఫెర్ చెయ్యగలరు.
06:05 భారతీయ భాషల్లో టైప్ చేసేటపుడు యూనికోడ్(UNICODE) ఫాంట్ను మాత్రమే వాడుతాము. ఎందుకనగా యూనికోడ్ సార్వత్రికంగా ఆమోదించబడిన ఫాంట్.
06:13 లోహిత్ కన్నడ (Lohit Kannada)అనే యూనికోడ్ (UNICODE) ఫాంట్ను నేను వాడుతున్నాను.
06:16 నేను మీకు కన్నడ టెక్స్ట్ ప్రాసెసింగ్ చూపించని గమనించండి.
06:20 అదే విధాన్ని ఉపయోగించి SCIM ఇన్పుట్ పద్దతి ద్వారా ఇతర భాషలో కూడా టెక్స్ట్ ప్రాసెసింగ్ చెయ్యవచ్చు.
06:28 చివరగా, అసైన్మెంట్.
06:31 కన్నడలో మూడు పుస్తకాల పేర్ల జాబితాను టైపు చేయండి.
06:33 ఈ టైటిల్స్ కు ఆంగ్ల ట్రాన్స్లీటరేషన్ కుడా అందించండి.
06:37 నేను ముందుగానే ఇక్కడ అసైన్మెంట్ను తయారు చేసి ఉంచాను.
06:42 సంగ్రాహంగా చెప్పాలంటే,ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది,
06:46 ఉబుంటు మరియు లిబ్రే ఆఫీస్లో కీబోర్డు మరియు లాంగ్వేజ్ సెట్టింగులను ఎలా కన్ఫిగర్ చేయాలో నేర్చుకున్నాం.
06:51 మనం వివిధ పద్ధతుల్లో ఎలా టైప్ చెయ్యాలో కూడా చూశాం.

ఉదాహరణకు, నూడి(Nudi) మరియు బరాహా(Baraha)

06:57 మనం ఒక ద్విభాషా డాక్యుమెంట్ ను ఎలా టైప్ చేయాలో కూడా చూశాం.
07:00 ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
07:03 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
07:06 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:11 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం, స్పోకెన్ ట్యూటోరియల్స్ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికీ సర్టిఫికెట్లు జరిచేస్తుంది.
07:19 మరిన్ని వివరాలకు,దయచేసి contact@spoken-tutorial.orgను సంప్రదించండి.
07:26 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము, దీనికి ICT,MHRD,భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
07:35 ఈ మిషన్ గురించి మరింత సమాచారము,
07:37 స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రోలో అందుబాటులో ఉంది.
07:43 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.
07:47 లిబ్రేఆఫీస్ రైటర్లో అనేక భాషలను అన్వేషించండి. ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india