LibreOffice-Suite-Draw/C4/Set-Draw-preferences/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 లిబరే ఆఫీసు డ్రా లో సెట్టింగ్ ప్రేఫెరేన్సేస్ (Setting Preferences in LibreOffice Draw)పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనం, క్రింది ప్రేఫెరేన్సేస్ ఎలా సెట్ చేయాలో నేర్చుకుంటాం.

ప్రాపర్టీస్(Properties), వర్షన్స్ సృష్టించుట, రంగు/గ్రేస్కేల్/ నలుపు-మరియు-తెలుపులో (కలర్/గ్రే స్కేల్ /బ్లాక్-అండ్- వైట్(color/grayscale/black-and-white))చూచుట.

00:18 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు , లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
00:29 మనం ముందుగా సేవ్ చేసిన 3D ఆబ్జేక్ట్స్ చార్ట్ (3D ObjectsChart) ఫైల్ను తెరుద్దాం. మరియు పేజీ 1 వద్దకు వెళ్దాం.
00:40 ఒకవేళ, తరువాత రిఫరెన్స్ కోసం ఈ ఫైలుకు వివరణలు జోడించాలని అనుకుందాం.
00:45 ఇందు కోసం మెయిన్ మెనూ(Main menu), నుండి పైల్(File)ఎంచుకోండి మరియు ప్రాపర్టీస్(Properties) పై క్లిక్ చేయండి .
00:50 ప్రాపర్టీస్(Properties) డైలాగ్ బాక్స్ చూస్తారు.
00:56 General(జనరల్ ) ట్యాబ్ క్లిక్ చేయండి. ఫైల్కు సంబంధిత సమాచారం అంతా ఇక్కడ జాబితా చేయబడినది.
01:02 గమనించండి ఇక్కడ ఫైల్ వివరాలు మాత్రమే చూడవచ్చు. మీరు ఏ మార్పులు చేయలేరు.
01:09 తర్వాత, డెస్క్రిప్శన్(Descriptions) ట్యాబ్ క్లిక్ చేయండి.
01:13 ఇక్కడ మీకు కావలసిన విధముగా, టైటిల్, సబ్జెక్ట్, కీవర్డ్స్ మరియు కామెంట్స్(Title, Subject, Keywords, Comments ) నమోదు చేయవచ్చు.
01:20 ఈ సమాచారం తర్వాత సూచనగా ఉపయోగించవచ్చు.
01:25 టైటిల్ ఫీల్డ్ లో, 3D ఆబ్జేక్ట్స్ చార్ట్ (3D ObjectsChart) టైపు చేయండి.
01:30 సబ్జెక్ట్ ఫీల్డ్ లో, 3D ఆబ్జేక్ట్స్ కంపారిసన్స్ (3D Objects Comparisons) అని టైప్ చేయండి.
01:37 కీ వర్డ్స్(Keywords)3డి అండ్ 3డి ఎఫెక్ట్స్(3D and 3D Effects) అని టైప్ చేయండి.
01:42 చివరగా కామెంట్స్(Comments) ఫీల్డ్ లో,లెర్నింగ్ అబౌట్ ఫైల్ ప్రాపర్టీస్(Learning about File Properties) అని టైప్ చేయండి.
01:48 డ్రా(Draw) ఫైల్కు సంబంధిత సమాచారం టైప్ చేయడం ఒక మంచి పద్ధతి.
01:54 డెస్క్రిప్శన్స్(Descriptions) ట్యాబ్ లో వున్న ప్రాపర్టీస్(properties)తో పాటు, మీరు మీ స్వంత ప్రాపర్టీస్ సెట్ చేయవచ్చు.
02:00 ఉదాహరణకు, మీ డాక్యుమెంట్ను తయారు చేసిన తేదీ తెలుసు కోవలనుకుంటున్నారనుకోండి,
02:05 డాక్యుమెంట్ ఎడిటర్,
02:07 ఏ క్లయింట్ కోసం డాక్యుమెంట్ తయారు చేసారు మొదలైనవి.
02:11 డ్రా(Draw), మీరు ఈ సమాచారాన్ని అనుకూలీకరించడానికి సహాయపడే లక్షణాలను కలిగి ఉంది.
02:17 ప్రాపర్టీస్(Properties) డైలాగ్-బాక్స్ లో, కస్టమ్ ప్రాపర్టీస్(Custom Properties) క్లిక్ చేయండి.
02:23 ఇక్కడ మీరు మూడు ఫీల్డ్స్ చూస్తారు: నేమ్, టై ప్ (Name, Type) మరియు వాల్యూ(Value).
02:30 దిగువ కుడివైపు ఆడ్(Add) బటన్ క్లిక్ చేయండి.
02:33 మీరు ఇప్పుడు, డ్రాప్-డౌన్ బాక్సులను ప్రతి రంగం కింద చూస్తారు.
02:40 నేమ్(Name) డ్రాప్-డౌన్ క్లిక్ చేసి, మరియు డేట్ కంప్లీటెడ్(Date Completed) ఎంపికను ఎంచుకోండి.
02:46 టైప్(Type) డ్రాప్-డౌన్ లో, డేట్ టైం(Date Time) ఎంచుకోండి.
02:51 వాల్యూ(Value) రంగం తేదీ మరియు సమయం సూచిస్తుంది.
02:55 తేదీలో ఎటువంటి మార్పు చేయకండి.
02:57 టైమ్ ఫీల్డ్ లో, 10:30:33 ఎంటర్ చేయండి.
03:05 ఇప్పుడు మీకు డాక్యుమెంట్ తయారు చేసిన తేదీ తెలుసు.
03:09 ఇప్పుడు మరొక ఫీల్డ్(field) జోడిద్దాం, ఆడ్(Add) క్లిక్ చెయ్యండి.
03:14 మీరు డ్రాప్ డౌన్ బాక్సుల రెండవ జాబితా చూస్తారు.
03:21 నేమ్ డ్రాప్-డౌన్లో, చేక్డ్ బై(Checked by) ఎంచుకోండి.
03:25 టైప్(Type) ఫీల్డ్ లో, టెక్స్ట్(Text) ఎంచుకోండి.
03:29 వాల్యూ(Value)లో, ABC టెక్స్ట్ టైప్ చేయండి.
03:33 ఓకే(OK) క్లిక్ చేయండి. ఒక డ్రా ఫైల్(Draw file)కు మీ సొంత లక్షణాలు ఇలా జోడించవచ్చు.
03:39 ఇప్పుడు, మనం సృష్టించిన ఒక ప్రాపర్టీ(property) ఎలా తొలగించాలో తెలుసుకుందాం.
03:44 మెయిన్ మెనూ(Main menu)లో, ఫైల్(File) క్లిక్ చేసి ప్రాపర్టీస్(Properties) ఎంచుకోండి.
03:51 ప్రాపర్టీస్(Properties) డైలాగ్-బాక్స్ లో, కస్టమ్ ప్రాపర్టీస్(Custom Properties) క్లిక్ చేయండి.
03:55 మొదటి ప్రాపర్టీ చేక్డ్ బై(Checked by)ని తొలగిద్దాం.
04:01 రిమూవ్ ప్రాపర్టీ(Remove Property) బటన్ పై క్లిక్ చేయండి. ప్రాపర్టీ తొలగించబడుతుంది.
04:07 ఓకే(OK) క్లిక్ చేయండి.
04:11 మీరు డ్రా ఫైల్(Draw file) యొక్క బహుళ వెర్షన్లు సేవ్ చేయవచ్చు!ఈ ఫీచర్ను వర్షన్న్స్(Versions) అంటారు.
04:17 ఉదాహరణకు, మీరు మొదటి రోజు ఆబ్జేక్ట్ జోడించవచ్చు మరియు సేవ్(save) చేయవచ్చు.
04:22 తదుపరి రోజు మీరు డ్రాయింగ్ సవరించవచ్చు.
04:24 మీరు అసలు డ్రాయింగ్ మరియు మార్పు చేసిన డ్రాయింగ్ రెండిoటి యొక్క కాపీ కావాలనుకోవచ్చు.
04:31 వర్షన్స్(Versions) ఎంపికను ఉపయోగించి ఫైలు సేవ్ చేద్దాం.
04:33 మెయిన్ మెనూ(Main menu) నుండి, ఫైల్(File) వద్దకు వెళ్ళి వర్షన్స్ (Versions) క్లిక్ చేయండి.
04:39 వర్షన్స్ (Versions) డైలాగ్ బాక్స్ చూస్తారు.
04:42 సేవ్ న్యూ వర్షన్(Save New Version ) బటన్పై క్లిక్ చేయండి.
04:47 మీరు ఇన్సర్ట్ వర్షన్ కామెంట్(Insert Version Comment ) డైలాగ్ బాక్స్ చూస్తారు.
04:51 వర్షన్ వన్(Version One) అనే కామెంట్ టైప్ చేద్దాం.
04:55 ఓకే(OK) బటన్పై క్లిక్ చేసి, క్లోజ్(Close) పై క్లిక్ చేయండి.
05:00 ఇప్పుడు, టైటిల్ లోని టెక్స్ట్- జామెట్రీ ఇన్ టు డి శేప్స్ అండ్ త్రీ డి శేప్స్(Geometry in Two D Shapes and Three D Shapes)కు మారుద్దాం.
05:07 టెక్స్ట్ కలర్ నీలం రంగుకు మారుద్దాం.
05:18 వర్షన్స్ (Versions)ఎంపికను ఉపయోగించి ఫైల్ను సేవ్ చేద్దాం.
05:22 మెయిన్ మెనూ(Main menu) నుండి, ఫైల్ వద్దకు వెళ్ళి వర్షన్స్ (Versions)పై క్లిక్ చేయండి.
05:26 సేవ్ న్యూ వర్షన్(Save New Version) బటన్ పై క్లిక్ చేయండి.
05:30 ఇన్సర్ట్ వర్షన్ కామెంట్(Insert Version Comment) డైలాగ్ వస్తుంది.
05:34 కామెంట్ వర్షన్ టు (Version Two) టైప్ చేయండి.
05:36 ఓకే(OK) క్లిక్ చేయండి.
05:40 ఇక్కడ రెండు వర్షన్ల జాబితా వుంది - వర్షన్ వన్ మరియు వర్షన్ టు.
05:46 వర్షన్ వన్(Version One) నలుపు రంగు ఫాంట్ తో వున్న టైటిల్ ఫైల్ అని మనకు తెలుసు.
05:51 వెర్షన్ టు (Version Two)నీలం రంగు ఫాంట్ తో వున్న టైటిల్ ఫైల్.
05:54 వెర్షన్ వన్(Version One) ఎంచుకోని ఓపెన్(Open) పై క్లిక్ చేద్దాము.
06:00 నలుపు రంగు టైటిల్ ఫాంట్ తో వర్షన్ చూడగలరు.
06:05 మీరు డ్రా ఫైల్(Draw file) మూసి వేసిన ప్రతి సారి, వర్షన్ల యొక్క ఆటోమేటిక్ సేవింగ్ ఎనేబుల్ చేయవచ్చు.
06:11 ఇందు కోసం ఫైల్(File) మీద క్లిక్ చేసి తర్వాత వెర్షన్స్ (Versions)పై క్లిక్ చేయండి.
06:15 ఆల్వేస్ సేవ్ అ వర్షన్ ఆన్ క్లోజింగ్(Always save a version on closing) అనే ఒక చెక్ బాక్స్ ఎంపిక చూడండి.
06:23 ఈ బాక్స్ పై చెక్ పెట్టండి. మీరు డ్రా ఫైల్(Draw file) మూసెసిన ప్రతిసారీ ఒక కొత్త వర్షన్ సేవ్ చేయబడేలా ఇది చేస్తుంది. క్లోజ్(Close) క్లిక్ చేయండి.
06:34 మీరు మీ డ్రా ఫైల్(Draw file) కోసం వ్యూఇంగ్ ప్రేఫెరేన్సుస్ కూడా సెట్ చేయవచ్చు.
06:38 మీరు మీ డ్రాయింగ్ కలర్, గ్రే స్కేల్(Color, Gray scale) లేదా బ్లాక్ అండ్ వైట్(Black and White)లో చూడవచ్చు.
06:44 అప్రమేయంగా, డ్రా ఫైల్(Draw file)ను రంగులో చూడవచ్చు.
06:48 వ్యూను గ్రేస్కేల్(Gray Scale)కు మారుద్దాం.
06:53 వ్యూ(View) పై క్లిక్ చేసి, కలర్/ గ్రేస్కేల్(Color/GrayScale) క్లిక్ చేసి మరియు గ్రేస్కేల్(Gray Scale) ఎంచుకోండి.
06:59 మీరు ఆబ్జేక్ట్ లు బూడిద (గ్రే)రంగులో కనపడడం చూస్తారు.
07:03 వ్యూ బ్లాకు అండ్ వైట్(Black and White)కు మారుద్దాం.
07:08 మెయిన్ మెనూ(Main Menu) నుండి, వ్యూ(View) ఎంచుకోండి కలర్/గ్రేస్కేల్ (Color/Grayscale) క్లిక్ చేయండి. మరియు బ్లాక్ అండ్ వైట్(Black and White) ఎంచుకోండి.
07:17 మీరు ఆబ్జేక్ట్స్ బ్లాక్ అండ్ వైట్(black-and-white)లో కనపడడం చూస్తారు.
07:25 మీరు మళ్ళీ వ్యూను రంగు(కలర్ )కు మారవచ్చు.
07:29 ఇందుకోసం వ్యూ(View) క్లిక్ చేసి, కలర్ / గ్రేస్కేల్(Color/Grayscale) పై క్లిక్ చేసి కలర్(Color) ఎంచుకోండి.
07:36 డ్రాయింగ్ మళ్ళీ రంగు లో కనిపిస్తుంది.
07:43 ఇప్పుడు మనం ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
07:45 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకున్నది డ్రా లో క్రింది ప్రిఫెరేన్సుస్ సెట్ చేయడం. డ్రా ఫైల్(Draw file) యొక్క ప్రాపర్టీస్, డ్రా ఫైల్(Draw file) యొక్క వర్షన్ల తయారి మరియు , డ్రాయింగ్ను కలర్/గ్రే స్కేల్ /బ్లాక్-అండ్- వైట్లో చూచుట.
07:59 ఈ క్రింది లింక్వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
08:02 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
08:06 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
08:11 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.

ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది.

08:21 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. org కువ్రాసిసంప్రదించండి.
08:29 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
08:33 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
08:40 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
08:54 ఈ ట్యూటోరియల్ ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india