LibreOffice-Suite-Draw/C2/Insert-text-in-drawings/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 లిబరే ఆఫీసు డ్రాలో ఇన్సర్టింగ్ టెక్స్ట్ ఇన్ డ్రాయింగ్స్ (Inserting Text in Drawings)పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్లో మనం నేర్చుకునేది,
00:10 రేఖా చిత్రాలలో టెక్స్ట్ తో పని చేయుట
00:12 రేఖా చిత్రాలలో టెక్స్ట్ని ఫార్మాటింగ్ చేయుట
00:15 టెక్స్టు బాక్సులతో పని చేయుట
00:17 మరియు
00:19 టెక్స్ట్ కు ఇండెంట్, స్పేస్ మరియు అలైన్ సెట్ చేయడం కూడా నేర్చుకుంటాం.
00:22 లైన్స్(Lines) మరియు ఆరోస్(Arrows)పై టెక్స్ట్ ని చేర్చుట.
00:26 కాల్అవుట్లు లోపల టెక్స్ట్ ని చేర్చుట.
00:29 టెక్స్ట్ ను రెండు విధాలుగా జోడించవచ్చు,
00:31 ముందే గీసిన ఒక అబ్జేక్ట్ లోపల నేరుగా టెక్స్ట్ ని చేర్చవచ్చు.
00:35 లైన్స్(lines) మరియు ఆరోస్ (arrows)తో పాటుగా.
00:37 దీనిని టెక్స్ట్ బాక్స్ లో ఒక స్వతంత్ర డ్రా(Draw) అబ్జేక్ట్ లా కూడా చేరచవచ్చు.
00:42 ఇక్కడ, మనం ఉపయోగిస్తున్నది,
00:44 ఉబుంటు లినక్సు వర్షన్ 10.04 మరియు , లిబరే ఆఫీసు సూట్ వర్షన్ 3.3.4.
00:52 డ్రా(Draw) ఫైల్ తెరచి వాటర్ సైకిల్ (WaterCycle) రేఖాచిత్రం కు కొంత టెక్స్ట్ ను జోడిద్దాం.
00:57 సూర్యుడి పక్కన వున్న రెండు తెల్ల మేఘాలకు క్లౌడ్ ఫార్మేషన్(Cloud Formation) అనే టెక్స్ట్ జోడిద్దాం.
01:04 వైట్ క్లౌడ్ సమూహాన్ని ఎంచుకోండి.
01:06 సమూహంలోకి ప్రవేశించడానికి దాని పై డబుల్ క్లిక్ చేయండి.
01:10 పైన ఉన్న క్లౌడ్ ఎంచుకోండి.
01:13 ఇప్పుడు డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి టెక్స్ట్(Text) టూల్ ఎంచుకోండి.
01:17 కర్సర్ ఒక చిన్న నిలువు రెప్ప పాటు వరస లోకి మారడం గమనించారా?
01:23 ఇది టెక్స్ట్ కర్సర్(text cursor).
01:25 క్లౌడ్ ఫార్మేషన్(Cloud Formation) టెక్స్ట్ ను టైప్ చేద్దాం.
01:29 ఇప్పుడు, పేజీ(page) పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
01:33 మరో తెల్లని మబ్బులో కూడా ఇదే టెక్స్ట్ ప్రవేశ పెడదాం.
01:37 సమూహంలో నుండి నిష్క్రమించడానికి, పేజీ(page) పై ఎక్కడైనా డబుల్ క్లిక్ చేయండి.
01:42 అదే విధంగా సూర్యుడికి పేరు పెడదాం.
01:45 ఆబ్జెక్ట్ లో టెక్స్ట్ ప్రవేశ పెట్టుట దీని కంటే సులభం కాదు!
01:50 తరువాత, బూడిద మేఘాల సమూహం ఎంచుకోండి.
01:53 ముందులగే, సమూహంలో ప్రవేశించడానికి దానిని డబుల్ క్లిక్ చేయండి.
01:57 ప్రతి క్లౌడ్ పై రేన్ క్లౌడ్(Rain Cloud) అని టైపు చేయండి.
02:02 బూడిద మేఘం లోని టెక్స్ట్ నలుపు రంగులో ఉంది కనుక, అది కనిపించదు.
02:07 టెక్స్ట్ యొక్క రంగును తెలుపుకు మారుద్దాం.
02:11 టెక్స్ట్ ఎంచుకొని కాంటెక్స్ట్(context) మెను(menu) కోసం రైట్-క్లిక్ చేసి, క్యారెక్టర్(Character) ఎంచుకోండి.
02:17 క్యారెక్టర్(Character) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
02:20 ఫాంట్ ఎఫెక్ట్స్(Font Effects) ట్యాబ్ పై క్లిక్ చేయండి.
02:23 ఫాంట్ కలర్(Font color) ఫీల్డ్ ని, స్క్రోల్ చేసి వైట్(White) ఎంచుకోండి.
02:28 ఓకే(OK) క్లిక్ చేయండి.
02:30 ఫాంట్ రంగు తెలుపుకు మారింది.
02:33 అదే పద్ధతిలో, రెండవ మేఘం టెక్స్ట్ రంగు మారుద్దాం.
02:38 టెక్స్ట్ ఎంచుకొని, రైట్ క్లిక్ చేసి క్యారెక్టర్(Character) ఎంచుకోండి.
02:43 ఫాంట్ కలర్(Font color)లో , వైట్(White) ఎంచుకోండి.
02:46 సమూహంలో నుండి నిష్క్రమించడానికి, పేజీ(page) పై ఎక్కడైనా డబుల్ క్లిక్ చేయండి.
02:50 అదే విధంగా, పరవతాన్ని వర్ణిoచే త్రిభుజంలో మౌంటైన్(Mountain) అని టైప్ చేద్దాం.
02:58 క్యారెక్టర్(Character) కోసం టెక్స్ట్ని ఫార్మాట్ చేయవచ్చు, అనగా ఫాంట్ స్టైల్ మార్చవచ్చు మరియు ప్రత్యేక ప్రభావాలను పొందుపరచ వచ్చు.
03:05 పేరాగ్రాఫ్(Paragraph) కోసం కూడా టెక్స్ట్ ఫార్మాట్ చేయవచ్చు, అనగా టెక్స్ట్ అలైన్ చేయడం, ఇండెంట్(indents) లేదా స్పేసింగ్(spacing) సెట్ చేయడం మరియు ట్యాబ్ స్థానాలు సెట్ చేయడం.
03:13 మీరు ఈ డైలాగ్ బాక్సులను,
03:16 కాంటెక్స్ట్(Context) మెనూ నుండి లేదా
03:18 మెయిన్ మెనూ నుండి యాక్సెస్ చేయవచ్చు.
03:21 క్యారెక్టర్(Character) డైలాగ్ బాక్స్ను మెయిన్(Main) మెను నుండి ఆక్సెస్ చేయుటకు ఫార్మాట్(Format) ఎంచుకొని క్యారెక్టర్(Character) ఎంచుకోండి.
03:28 పేరాగ్రాఫ్ (Paragraph) డైలాగ్ బాక్స్ను మెయిన్(Main) మెను నుండి ఆక్సెస్ చేయుటకు ఫార్మాట్(Format) ఎంచుకొని పేరాగ్రాఫ్ (Paragraph) ఎంచుకోండి.
03:36 దీర్ఘచతురస్రంలో, భూగర్భ జలo చేరుతుందని చూపించడానికి ఒక మందమైన నల్లని రేఖా గీయండి.
03:43 డ్రాయింగ్(Drawing) టూల్ బార్ నుండి, లైన్(Line) ఎంచుకోండి.
03:46 కర్సరును పేజీ(page) వైపుకు జరిపి, ఎడమ మౌస్ బటన్ నొక్కి, ఎడమ నుండి కుడికి లాగండి.
03:54 దీర్ఘచతురస్రoను రెండు సమాన భాగాలుగా విడదీస్తూ సమాంతర రేఖాని గీయండి.
04:01 గ్రౌండ్ రెండు భాగాలుగా విభజించబడింది!
04:04 ఇప్పుడు, రేఖను వెడల్పుగా చేద్దాం.
04:07 లైన్ ఎంచుకొని మరియు కాంటెక్స్ట్(context )మెను కోసం రైట్ క్లిక్ చేయండి.
04:11 లైన్(Line) పై క్లిక్ చేస్తే, లైన్(Line) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
04:16 స్టైల్(Style) ఫీల్డ్ లో, డ్రాప్ డౌన్ బాక్స్ ని క్లిక్ చేయండి.
04:20 అల్ట్రా ఫైన్ 2 డాట్స్ 3 డాశేస్(Ultrafine 2 dots 3 dashes) ఎంచుకోండి.
04:24 విడ్త్(Width) ఫీల్డ్ లో, .70(పాయింట్ 70) మూల్యం ప్రవేశ పెట్టండి.
04:29 ఓకే(OK) క్లిక్ చేయండి.
04:31 మనం లైన్ని విస్తృతం చేశాం!
04:34 దీర్ఘచతురస్రం లోపల గ్రౌండ్ వాటర్ టేబుల్(Ground water table) టెక్స్ట్ చేర్చుదాం.
04:39 ముందుగా, టెక్స్ట్(Text) టూల్ ఎంచుకోండి.
04:42 ఇది డ్రాయింగ్(Drawing) టూల్బార్లో కాపిటల్ T ఎంపిక.
04:46 డ్రా(Draw)పేజీకి వెళ్ళండి.
04:49 కర్సర్ ఇప్పుడు, ప్లస్ సైన్ తో పాటు ఒక చిన్న కాపిటల్ ఐ(I)లోకి రూపాంతరం చెయ్యబడింది.
04:55 దీర్ఘ చతురస్రం లోపల క్లిక్ చేయండి.
04:57 ఒక టెక్స్ట్ బాక్స్ కనిపించడం గమనించండి.
05:01 ఇక్కడ, గ్రౌండ్ వాటర్ టేబుల్(Ground water table) అని టైప్ చేద్దాం.
05:05 టెక్స్ట్ బాక్స్ మధ్య లోకి టెక్స్ట్ ని అలైన్ చేయడానికి, టెక్స్ట్ బాక్స్ లోపల కర్సర్ ఉంచండి,
05:12 ఎగువన వున్న స్టాండర్డ్ టూల్బార్ లో సెన్టర్డ్(Centered) ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:19 ఇదే పద్ధతిలో, త్రిభుజంలో,
05:22 రైన్ వాటర్ ఫ్లోస్ ఫ్రం ల్యాండ్ ఇ రివర్స్ అండ్ సీ(Rain water flows from land into rivers and sea) అనే టెక్స్ట్ జోడిద్దాం.
05:30 ఈ ట్యుటోరియల్లో విరామం తీసుకొని ఈ అసైన్మెంట్ చేయండి.
05:33 ఒక చతురస్రం గీయండి.
05:35 This is a square.
05:38 A square has four equal sides and four equal angles. Each angle in a square is ninety degrees.
05:46 The square is a quadrilateral అనే టెక్స్ట్ ప్రవేశ పెట్టండి.
05:50 టెక్స్ట్(Text) డైలాగ్ బాక్స్ లో ఎంపికలను ఉపయోగించి ఈ టెక్స్ట్ ని ఫార్మాట్ చేయండి.
05:54 ఫాంట్, సైజు, స్టైల్(font, size, style) మరియు అలైన్మెంట్(alignment) ఎంపికలు టెక్స్ట్ కు సమకూర్చండి.
06:00 ఇప్పుడు రేఖాచిత్రంలో బాణాలు సరిగ్గా ఏర్పర్చుదాం.
06:03 ఈ బాణాలు భూమి, వృక్ష సంపద మరియు నీటి వనరుల నుండి మేఘాల వైపుకు వెళ్ళే నీటి ఆవిరిని చూపిస్తాయి.
06:12 ఎడమ వైపు బాణం ఎంచుకోని,
06:14 క్లిక్ చేసి పర్వతo వైపుకి లాగండి.
06:18 మధ్య బాణం ఎంచుకొని,
06:21 క్లిక్ చేసి చెట్ల వైపుకి లాగండి.
06:25 మూడవ బాణం నీటి నుండి మేఘాల వరకు నీటి ఆవిరి చూపిస్తుంది.
06:31 పర్వతాల దిగువన పరిగెట్టే నీటిని చూపే ఒక రేఖ గీయడానికి కర్వ్(Curve) ఎంపిక ఉపయోగిద్దాం.
06:37 డ్రాయింగ్(Drawing) టూల్బార్ నుండి కర్వ్(Curve) ఎంచుకొని, ఫ్రీఫాం లైన్(Freeform Line) పై క్లిక్ చేయండి.
06:43 డ్రా(draw) పేజీలో పర్వతo పక్కన కర్సర్ను ఉంచండి.
06:47 ఎడమ మౌస్ బటన్ నొక్కి కిందికి లాగండి.
06:51 మీరు ఒక వక్ర రేఖను గీశారు!
06:53 ఇప్పుడు, ప్రతి బాణoకు వివరణలు జోడింద్దాం.
06:58 కుడివైపు వున్న మొదటి బాణం ఎంచుకొని: ఎవాప్రేషన్ ఫ్రం రివర్స్ అండ్ సీస్(Evaporation from rivers and seas) టైప్ చేయండి.
07:06 పేజీలో ఎక్కడైనా క్లిక్ చేయండి.
07:08 టెక్స్ట్ లైన్ పైన కనిపిస్తుంది.
07:12 టెక్స్ట్ లైన్ మీద సరిగ్గా చేర్చబడింది అందుకే అది ఆస్పష్టంగా ఉందని గమనించండి.
07:18 లైన్ పైన ఉన్న టెక్స్ట్ తరలించడానికి, లైన్ పై క్లిక్ చేయండి.
07:22 టెక్స్ట్ అడ్డంగా చేర్చబడింది.
07:25 టెక్స్ట్ యొక్క ముగింపు వద్ద కర్సర్ను ఉంచండి ఎంటర్(Enter)కీ నొక్కండి.
07:30 పేజీ(page) పై క్లిక్ చేయండి.
07:32 టెక్స్ట్ సమలేఖనమైంది.
07:35 కాంటెక్స్ట్ మెనూ(context menu) నుండి ఎంపికలను ఉపయోగించి, లైన్లు మరియు బాణాల పై టైప్ చేసిన టెక్స్ట్ కూడా ఫార్మాట్ చేయవచ్చు.
07:41 కాంటెక్స్ట్ మెనూ(context menu) ఉపయోగించి, ఫాంట్ సైజ్ ఫార్మాట్ చేద్దాం.
07:45 ఎవాప్రేషన్ ఫ్రం రివర్స్ అండ్ సీస్(Evaporation from rivers and seas),
07:47 టెక్స్ట్ పై క్లిక్ చేయండి.
07:50 టెక్స్ట్ ఇప్పుడు సమాంతరoగా ఉంది.
07:53 టెక్స్ట్ ఎంచుకొని, కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చెయ్యండి.
07:58 సైజు(Size) ఎంచుకొని , 22 క్లిక్ చేయండి.
08:02 ఫాంట్ పరిమాణం మార్చబడింది.
08:05 ఇప్పుడు, అన్ని ఇతర బాణాలు కోసం క్రింది టెక్స్ట్ టైప్ చేయండి.
08:09 ఎవాప్రేషన్ ఫ్రం సాయిల్(Evaporation from soil).
08:12 ఎవాప్రేషన్ ఫ్రం వేజేటేశన్ (Evaporation from vegetation).
08:17 రన్ ఆఫ్ వాటర్ ఫ్రాం ది మౌంటైన్స్(Run off water from the mountains).
08:22 బూడిద మేఘాలు నుండి వర్షం పాడడం చూపిద్దాం.
08:26 వర్షం చూపించడానికి- మేఘం నుండి కిందకి చూపిస్తూ, చుక్కల బాణాలు గీయండి.
08:32 డ్రాయింగ్(Drawing) టూల్ బార్ నుండి, లైన్ ఎండ్స్ విత్ ఆరోస్ (Line Ends with Arrow) ఎంచుకోండి.
08:37 తర్వాత మొదటి బూడిద మేఘం ఎడమ వైపు కర్సర్ ఉంచండి.
08:42 మౌస్ ఎడమ బటన్ పట్టుకొని కిందికి లాగండి.
08:46 కాంటెక్స్ట్ మెనూ(context menu) కోసం రైట్ క్లిక్ చేసి లైన్(Line) పై క్లిక్ చేయండి.
08:50 లైన్(Line) డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
08:53 స్టైల్(Style) డ్రాప్-డౌన్ జాబితా పై క్లిక్ చేసి,
08:56 2 డాట్స్ 1 డాష్(2 dots 1 dash) ఎంచుకోండి.
08:58 ఓకే(OK) క్లిక్ చేయండి.
09:00 మనం ఒక చుక్కల బాణం గీశాం.
09:02 ఈ మేఘం కొరకు ఇంకా రెండు బాణాలు కాపీ చేసి పేస్ట్ చేద్దాం.
09:06 ఇప్పుడు రెండు బాణాలు ఇతర మేఘo కొరకు కాపీ చేసి పేస్ట్ చేద్దాం.
09:12 ఇప్పుడు, చుక్కల బాణాలకు రేన్(Rain) టెక్స్ట్ని జోడిద్దాం.
09:21 వాటర్(Water) ఆబ్జెక్ట్ పైన వున్న టెక్స్ట్ బాక్స్ లోపల Evaporation to form the clouds అనే టెక్స్ట్ టైపు చేయండి.
09:28 డ్రాయింగ్(Drawing) టూల్ బార్ నుండి, టెక్స్ట్(Text) టూల్ ఎంచుకుని చూపిన విధంగా ఒక టెక్స్ట్ బాక్స్ ను గీయండి.
09:35 ఎవాపరేషన్ టు ఫార్మ్ ది క్లౌడ్స్(Evaporation to form the clouds) అని లోపల టైపు చేయండి.
09:41 డ్రాయింగ్(Drawing) టూల్ బార్ నుండి, టెక్స్ట్ టూల్(Text Tool) ఎంచుకొని,
09:44 బూడిద మేఘాల పక్కన ఒక టెక్స్ట్ బాక్స్ని గీయండి.
09:48 దీని లోపల కండెన్సేషన్ టు ఫార్మ్ రెయిన్(Condensation to form rain) అని టైప్ చేయండి.
09:53 టెక్స్ట్ బాక్స్ ని తరలించడానికి, మొదట టెక్స్ట్ బాక్స్ సరిహద్దు పై క్లిక్ చేయండి.
09:57 ఇప్పుడు కావలసిన స్థానానికి దీన్ని లాగి వదిలి వేయ్యండి.
10:02 మునుపటి సోపానాలను అనుసరిస్తూ, వాటర్ సైకిల్ (Water Cycle) డయగ్రమ్ అని టైటిల్ ఇద్దాం.
10:07 ఒక టెక్స్ట్ బాక్స్ ను ఉపయోగించి టెక్స్ట్ ఫార్మాట్ ని బోల్డ్(Bold) చేద్దాం.
10:16 వాటర్ సైకిల్ (Water Cycle) రేఖా చిత్రాన్న గీయడం పూర్తి చేశాం!
10:20 కాల్అవుట్లCallouts) గురించి నేర్చుకుందాం.
10:22 కాల్అవుట్స్(Callouts) అంటే ఏమిటి?
10:24 అవి మీ దృష్టిని కోరే ప్రత్యేక టెక్స్ట్ బాక్సులు లేదా,
10:29 ఒక అబ్జేక్ట్ వైపు లేదా, డ్రా(Draw) పేజీ లో ఒక స్థానo వైపు చూపిస్తాయి.
10:33 ఉదాహరణకు, అనేక కామిక్ పుస్తకాలలో,
10:36 టెక్స్ట్ కాల్ ఔట్స్(Callouts) లోపల చేర్చబడి ఉంటుంది.
10:39 డ్రా(Draw) ఫైల్ కు ఒక కొత్త పేజీ(page)ని జోడిద్దాం.
10:42 మెయిన్(Main ) మెనూ(menu)నుండి, ఇన్సర్ట్(Insert) ఎంచుకొని స్లయిడ్(Slide) పై క్లిక్ చేయండి.
10:47 ఒక కొత్త పేజీ(page) చేర్చబడుతుంది.
10:50 కాల్అవుట్(Callout) గీయడానికి డ్రాయింగ్(Drawing) టూల్బార్ వద్దకు వెళ్ళి,
10:54 కాల్అవుట్(Callout) చిహ్నం పక్కన వున్న చిన్న నల్ల త్రికోణం పై క్లిక్ చేయండి.
10:59 వివిధ కాల్అవుట్స్(Callouts) కనిపిస్తాయి.
11:01 రెక్టాన్గలర్ కాల్అవుట్(rectanglar Callout) పై క్లిక్ చేయండి.
11:04 పేజీ(page) వైపు కర్సరును జరిపి మౌస్ ఎడమ బటన్ పట్టుకొని నొక్కి లాగండి.
11:10 మీరు ఒక కాల్అవుట్(Callout)గీశారు!
11:12 ఇతర అబ్జెక్ట్ లోపల టెక్స్ట్ చేర్చిన విధంగానే కాల్అవుట్(Callout) లోపల కూడా టెక్స్ట్ ని చేర్చవచ్చు.
11:18 Double-click క్లిక్ చేసి, కాల్అవుట్(Callout) లోపల దిస్ ఇస్ ఆన్ ఎక్సంప్ల్(This is an example) టెక్స్ట్ టైప్ చేయండి.
11:25 దీనితో లిబరే ఆఫీసు డ్రా(LibreOffice Draw) ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
11:30 ఈ ట్యుటోరియల్లో, మీరు ఈ కిందివి ఎలా చేయాలో నేర్చుకున్నారు,
11:33 డ్రాయింగ్స్ లో టెక్స్ట్ తో పని చేయుట.
11:35 డ్రాయింగ్స్ లో టెక్స్ట్ ఫార్మాట్ చేయుట.
11:38 టెక్స్టు బాక్సులతో పని చేయుట.
11:40 ఇండెంట్లు, స్పసింగ్ మరియు టెక్స్ట్ అలైన్ చేయుట.
11:44 రేఖలకు మరియు బాణాలకు టెక్స్ట్ చేర్చుట.
11:46 కాల్అవుట్లు లోపల టెక్స్ట్ చేర్చుట.
11:50 మీరే ఈ అసైన్మెంట్ ప్రయత్నించండి.
11:53 ఈ స్లయిడ్ లో చూపిన విధంగా ఒక నోటుబుక్ లేబుల్ మరియు ఒక ఆహ్వానాన్ని సృష్టించoడి.
12:00 ఈ లింక్ లోని వీడియోను చూడండి.
12:03 ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశంను ఇస్తుంది.
12:06 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేక పొతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు.
12:11 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం,
12:13 స్పోకెన్ ట్యూటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
12:17 ఆన్లైన్ పరీక్ష లో ఉతిర్నులైన వారికీ సర్టిఫికెట్లు ఇస్తుంది.
12:20 మరిన్ని వివరాలకు, దయచేసి contact@spoken-tutorial. orgను సంప్రదించండి.
12:27 స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ అనే ప్రాజెక్ట్ లో ఒక భాగము,
12:31 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
12:39 ఈ మిషన్ గురించి స్పోకెన్ హైఫన్ ట్యుటోరియల్ డాట్ ఆర్గ్ స్లాష్ NMEICT హైఫన్ ఇంట్రో లింక్ లో మరింత సమాచారము అందుబాటులో ఉంది.
12:50 ఈ ట్యూటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya