LibreOffice-Suite-Base/C4/Database-Design-Purpose-OrganizeTables/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:00 LibreOffice Base .నందు Spoken tutorial కు స్వాగతం
00:04 ఈ ట్యుటోరియల్ లో మనం డేటాబేస్ డిజైన్ పై ఈ క్రింది అంశాలను నేర్చుకుందాం
00:09 మన డేటాబేస్ ప్రయోజనం నిర్ణయించడం,
00:12 అవసరమైన సమాచారాన్ని గుర్తించడం మరియు నిర్వహించడం,
00:15 సమాచారాన్ని పట్టికలుగా విభజించడం,
00:19 Database Design అంటే ఏమిటి ?
00:21 Database design డేటాబేస్ యొక్క వివరణాత్మక సమాచార నమూనాను ఉత్పత్తి చేసే ప్రక్రియ.
00:28 ఒక మంచి డిజైన్ తో, ఒక డేటాబేస్
00:32 రోజువారీ సమాచారము, ఖచ్చితమైన, మరియు పూర్తి సమాచారమును ఇస్తుంది
00:37 దీని అర్థం- మన సమాచారం యొక్క వివిధ స్థాయిలలో సమగ్రతను నిర్ధారించగలము,
00:43 మన డేటా ప్రోసెస్సింగ్ మరియు రిపోర్టింగ్ లకు కావలసిన అవసరాలను తీర్చగలము.
00:48 మరియు సులభంగా మార్పులను చూపగలము.
00:51 డేటాబేస్ డిజైన్ క్రింది సోపానాలను కలిగి ఉంటుంది
00:57 మన డేటాబేస్ యొక్క ప్రయోజనాన్ని నిర్ధారించడం,
01:00 అవసరమైన సమాచారాన్ని కనుగొని, నిర్వహించడం,
01:04 సమాచారాన్ని tables గా విభజించడం,
01:07 సమాచారాన్ని columns గా మార్చడం
01:11 primary keys ను పేర్కొనడం,
01:14 table relationship s ను నిర్వహించడం,
01:17 డిజైన్ను మెరుగుపరచడం,
01:20 normalization నియమాలను వర్తింపచేయడం,
01:23 చివరిగా, పరీక్షించి డాటాబేస్ను run చేసి, నిర్వహించడం.
01:28 ముందు మనం మొదటి సెటప్ కు వెళదాం
01:32 డేటాబేస్ పద్దతిని పేర్కొనడం
01:35 సులభమైన Library Application ను చూద్దాం.
01:38 గ్రంధాలయంలో పుస్తకాలుంటాయి
01:41 ఈ పుస్తకాలు రిజిస్టర్ అయిన వాళ్లకు మాత్రమే ఇస్తారు
01:45 కాబట్టి దీని కొరకు మనకు Library application కావాలి.
01:51 ఈ పుస్తకాలకు వాటి సభ్యులకు జారీ చేయడాన్ని ట్రాక్ కూడా చేయాలి
01:56 మొదటిగా అవసరమైన సమాచారం కనుగొని, నిర్వహించాలి
02:01 ఇక్కడ మనం,డేటాబేస్ లో రికార్డ్ చేయడానికి కావలసిన సమాచారాన్ని సేకరిస్తాము
02:09 ఇప్పుడు మనం Library application అవసరం తెలుసు కాబట్టి, ఇక్కడ అంశాలను గుర్తించండి.
02:17 అక్కడ పుస్తకాలున్నవి
02:19 ఒక Book , title , author , publisher మరియు price లను కలిగి ఉంటుంది
02:24 మరియు మనం రచయిత గురించిన సమాచారం, అనగా date of birth మరియు country మొదలైనవి కూడా భద్రపరుస్తాం.
02:33 మనం ప్రచురణకర్త పేరు , చిరునామా , ఫోన్ కూడా భద్రపరుస్తాము.
02:38 Library సభ్యుల వద్ద కూడా పేర్లు , ఫోన్ నంబరు , చిరునామా ఉంటుంది
02:45 ఇప్పుడు ఒక పుస్తకం జారీ చేసినప్పుడు,
02:49 పుస్తకం జారీ చేసిన తేదీ, రిటర్న్ తేదీ, అసలు రిటర్న్ చేయవలసిన తేదీ మరియు checked -in స్థితి ఉంటాయి.
02:56 ఈ ఐటమ్ లను attribute s అని అంటారు
03:01 ఒక్కొక్క attribute, table లోని ఒక్కొక్క column ను సూచిస్తుంది
03:08 ఇక్కడ మనం ప్రశ్నలను తయారు చేయవచ్చు
03:12 ప్రచురణకర్త ద్వారా లైబ్రరీకి సరఫరా చేయబడిన తాజా పుస్తకాల సమితి గురించిన సమాచారాన్ని మనం ఎలా జోడించాలి ?
03:20 మనం సభ్యుల వివరాలను ఎలా నిర్వహించాలి ?
03:25 ఒకవేళ సభ్యులు వెళ్ళిపోవాలనుకున్నా లేదా చిరునామా మార్చాలన్నా ఎలా సంభవం?
03:32 ఒక సభ్యుడి ద్వారా ఒక పుస్తకం తిరిగి వచ్చినప్పుడు మనం సమాచారాన్ని ఎలా నవీనకరిస్తాము?
03:38 మనం ఎలాంటి report ను పొందుపరచాలి ?
03:42 సభ్యులు ఎక్కువగా ఎటువంటి పుస్తకాలు చదువుతున్నారు?
03:46 తీసుకున్న పుస్తకాలకు రుసుము చెల్లించవలసిన పుస్తకాల జాబితాను ఎలా రూపొందించగలము.
03:55 ఇప్పుడు మనవద్ద కొన్ని వివరాలున్నవి, ఈ సమాచారాన్ని పట్టికలుగా ఎలా విభజించాలో మనం చూద్దాం
04:02 మనం మన వద్ద ఉన్న సమాచార అంశాలు లేదా లక్షణాలను, ముఖ్య entities లేదా subjectsగా విభజించాము.
04:11 ప్రతి సబ్జెక్ట్ ఒక పట్టికగా మారుతుంది
04:14 కాబట్టి ప్రాధమిక పట్టిక జాబితా, తెరపై చిత్రం రూపంలో కనిపిస్తాయి.
04:21 ఇక్కడ చూపించబడిన ప్రధాన సబ్జక్ట్స్ లేదా entities books మరియు members మాత్రమే.
04:26 కాబట్టి రెండు పట్టికలు ఒకటి books మరొకటి members లతో మొదలు పెట్టాలని తెలుస్తుంది.
04:33 ఇప్పుడు Books పట్టిక గురించి వివరంగా తెలుసుకుందాం.
04:37 ఇది ముందుగా నిర్వచించిన 10 attributes లేదా columns లను కలిగి ఉంది:
04:43 Title, Author, Publisher, PublisherAddress, PublisherCity, PublisherPhone, PublishYear, Price, AuthorBirthDate మరియు AuthorCountry .
04:58 పట్టికలో డేటా ఎలా కనిపిస్తుందో చూద్దాం.
05:03 ప్రతి వరుస లేదా columns లో,పుస్తకం, రచయిత, మరియు ప్రచురణకర్త గురించిన వివరాలు ఉంటాయి
05:13 ఇప్పుడు, ఈ నమూనాలో రెండు లోపాలు ఉన్నాయి.
05:17 ఒకే రచయిత లేదా ప్రచురణకర్త నుండి వివిధ పుస్తకాలుండవచ్చు
05:23 కాబట్టి ప్రతి వరుసలో రచయితా లేదా ప్రచురణకర్త గురించిన సమాచారం పునరావృత్తం అవుతుందని గమనించాలి
05:31 ఇది కంప్యూటర్ డిస్క్ మెమరీ ను వ్యర్థం చేస్తుంది.
05:34 ఈ డిజైన్లోని మరొక సమస్యేమిటంటే,
05:38 ఇది డేటాబేస్లో anomalies లను కలుగచేసే చేసే ప్రమాదానికి దారితీస్తుంది.
05:44 anomaly అంటే ఏమిటి?
05:47 ఇది కేవలం డేటాబేస్లో లోపం లేదా అస్థిరత.
05:53 మూడు రకాలైన anomalies ఉన్నాయి:
05:57 మొదటిది insertion anomaly
06:01 కొత్త రికార్డు చేర్చినప్పుడు కలుగుతుంది
06:06 లేడా కొన్ని లక్షణాలను ఇతర లక్షణాల ఉనికి లేకుండా డేటాబేస్లో చేర్చలేనప్పుడు కలుగుతుంది.
06:14 ఉదాహరణకి Penguin అనే కొత్త Publisher ఉంది అని అనుకుందాం.
06:21 ఇప్పుడు మన డిజైన్, మన లైబ్రరీ, పెంగ్విన్ పబ్లిషర్స్ నుండి కనీసం ఒక్క పుస్తకానైనా పొందే వరకు, దాని గురించిన వివరాలు ఇన్సర్ట్ చేయనివ్వదు,
06:34 రెండోది deletion anomaly
06:39 ఇది రికార్డు తొలగించేటప్పుడు కలుగుతుంది
06:43 ఇక్కడ row లేదా record తొలగించినప్పుడు మనం అనుకున్నదానికంటే ఎక్కువ సమాచారం తొలిగిపోతుంది
06:51 ఉదాహరణకి Orient Publishers కేవలం Paradise Lost’ అనే ఒకే పుస్తకం కలిగి ఉంటారు
07:01 ఒకవేళ మనం ఈ రికార్డు మొత్తం తొలగిస్తే ఓరియంట్ ప్రచురణకర్త యొక్క మొత్తం సమాచారం తొలిగిపోతుంది
07:10 మరియు రచయిత జాన్ మిల్టన్ గురించిన సమాచారం కూడా మనం కోల్పోతాం.
07:16 చివరిగా Update Anomaly అంటే ఏమిటో తెలుసుకుందాం.
07:21 ఇది రికార్డు కు మార్పులు చేస్తున్నప్పుడు కలుగుతుంది
07:26 ఉదాహరణకి కేంబ్రిడ్జ్ ప్రచురణదారుల వద్ద కొత్త చిరునామా ఉందనుకుందాం.
07:32 ఈ Publisher కొరకు Address వరుసను ని అప్డేట్ చెయడానికి మనం చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది
07:40 మన విషయంలో ఐతే రెండు చోట్ల.
07:43 ఒకవేళ కేంబ్రిడ్జ్ వెయ్యి పుస్తక్కలు పంపిస్తే, ఆ వేయి రికార్డుల చిరునామాలు మార్చవలసి ఉంటుంది
07:54 మనం అనుకోకుండా ఒకచోట చిరునామా మార్చి మరొక చోట మర్చిపోతే,
08:02 ఇది డేటా ఖచ్చితత్వం ను, data integrity ను కోల్పోడానికి కారణం అవుతుంది
08:11 మనం ఈ సమస్యలను ఎలా సాధించాలి.
08:14 మనం దీనిని మరల డిజైన్ చేయడం వలన,ప్రతీ రికార్డ్ ను ఒక్కసారి ఇస్తే సరిపోతుంది
08:20 ఒకవేళ ఒకే సమాచారం పునరావృత్తం అయితే దాన్ని ఒక ప్రత్యేక table లో పెడితే సరిపోతుంది
08:29 ఇప్పుడు చూద్దాం
08:31 ఇప్పుడు మనం Books ను Books, Authors మరియు Publisher గా విభజిద్దాం
08:38 ప్రతి పట్టికలో వరుస కేవలం సమాచారం లేదా entity గురించిన వివరాలు మాత్రమే భద్రపరుస్తుంది అని గమనించండి.
08:47 ఈ విధంగా మనం ప్రచురణకర్త గురించిన సమాచారం కేవలం ఒక్కసారి మాత్రమే Publisher పట్టికలో ఉంచవచ్చు.
08:55 అదేవిధంగా Authors పట్టిక ఉండడం వలన రచయితా గురించిన సమాచారం కేవలం ఒక్కసారి మాత్రమే రికార్డు అవుతుంది
09:04 మనం ఈ పట్టికలను Books పట్టికకు తరువాత ట్యూటోరియాల్లో ఎలా లింక్ చేస్తామో చూద్దాం
09:12 ఇది మనల్ని LibreOffice ట్యుటోరియల్, Database Design మొదటి భాగం యొక్క చివరకు తీసుకొస్తుంది
09:19 దీన్ని సంగ్రహించడానికి మనం డేటాబేస్ డిజైన్ లోని అంశాలను అనుసరించాలి
09:25 మన డేటాబేస్ ప్రయోజనం నిర్ణయించడం,
09:28 కావలసిన సమాచారాన్ని వెతికి నిర్వహించడం,
09:32 సమాచారాన్ని పట్టికలుగా విభజించడం.
09:36 Spoken Tutorial అనే ప్రాజెక్టు Talk to a Teacher ప్రాజెక్టు లోని ఒక భాగం, ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
09:48 ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది.
09:54 ఇదే విషయంలో మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
09:58 దీనిని అనువదించినది హరి. చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Yogananda.india