LibreOffice-Suite-Base/C3/Create-simple-queries-in-SQL-View/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:02 LibreOffice Base నందు Spoken tutorial కు స్వాగతం
00:06 ఈ ట్యుటోరియల్ నందు మనం
00:09 SQL View లో సాధారణ ప్రశ్నలను సృష్టించడo, సాధారణ SQL ను వ్రాయడం
00:16 SELECT, FROM and WHERE ఉపయోగించడం
00:20 fields and tables కు పేరు పెట్టడానికి ఎగువ తక్కువ లేదా మిశ్రమ కేసులను ఎన్నుకొనడం నేర్చుకుందాం.
00:27 Base ను ఉపయోగించి SQL View లో సాధారణ ప్రశ్నలు సృష్టించే ముందు, LibreOffice Base గురించే మాట్లాడుకుందాం
00:35 Base అనేది HSQL database engine పై డుస్తుంది
00:41 ఇది జావాలో రాసిన ఓపెన్ సోర్స్ డేటాబేస్ ఇంజిన్ సాఫ్ట్వేర్కు గురించి మరింత సమాచారం కోసం http://hsqldb.org HSQLDB కు వెళ్ళండి:
01:02 సరే, SQL. గురించి నేర్చుకుందాం
01:06 SQL అంటే Structured Query Language. డేటాబేస్లను పొందడానికి మరియు సవరించడానికి ఇది ప్రామాణిక భాష.
01:17 ఇది అంతర్జాతీయంగా ఆమోదించబడిన ANSI ప్రమాణం.
01:23 కాబట్టి ఇది Database Management Systems or DBMS లో ఉపయోగించబడుతుంది
01:31 మన LibreOffice Base, MySQL, Microsoft SQL Server, Microsoft Access, Oracle మరియు DB2 అనేవి కొన్ని ఉదాహరణలు
01:47 SQL యొక్క చాలా సాధారణ ఉపయోగమేమిటంటే మనం డేటాబేస్ నుండి డేటాను పొందవచ్చు, దీన్ని డేటాబేస్ను ప్రశ్నించడం అని కూడా అంటారు
01:58 డేటాబేస్ లో డేటాను ఇన్సర్ట్ చెయ్యడానికి , మార్చుటకు లేదా తొలగించడం కోసం కూడా SQL ను ఉపయోగించవచ్చు.
02:09 మన పూర్వపు టుటోరియాల్లో Base లో విజార్డ్స్ మరియు డిజైనింగ్ విండౌస్ ను ఉపయోగించి,
02:16 ఈ వీటన్నిటిని పూర్తిచేసాం.
02:22 కానీ query languageను గురించి తెలుసుకోవడం అనేది డేటాబేస్ను ప్రశ్నించడానికి మరింత సౌలభ్యాన్ని మరియు శక్తిని ఇస్తుంది. SQL ను డేటాను సవరించడానికి మాత్రమే కాకుండా పట్టిక నిర్మాణాలను సవరించడానికి కూడా ఉపయోగించవచ్చు
02:43 మన ట్యుటోరియల్ SQL గురించి అన్నింటిని కవర్ చేయని కారణంగా, ఇక్కడ కొన్ని ఉపయోగకరమైన ట్యుటోరియల్స్ మరియు వాటి వెబ్సైట్లు ఉన్నాయి. <Pause>.
02:59 HSQLDB దాని స్వంత వినియోగదారు మార్గదర్శిని కలిగి ఉంది. వాటిని ఆన్లైన్లో వీక్షించవచ్చు లేదా వాటిని మీ కంప్యూటర్లోకి ఒక PDF ఫైల్ వలె డౌన్లోడ్ చేసి, సేవ్ చేయవచ్చు.
03:14 సరే, ఇప్పుడు SQL గురించి కొంత నేర్చుకుందాం. ఇప్పుడు మనం Library డేటాబేస్ ఉదాహరణను ఓపెన్ చేయాలి.
03:23 మనం Library డేటాబేస్ ను ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఎడమ ప్యానెల్లో ఉన్న Queries ను క్లిక్ చేద్దాం.
03:34 ఆ తరువాత ‘Create Query in SQL View’ పై క్లిక్ చేద్దాం. Query Design అనే ఖాళి విండోను చూడవచ్చు
03:46 ఇక్కడ మన queries ను SQL లో టైపు చేయవచ్చు
03:51 లైబ్రరీలోని అన్ని పుస్తకాల గురించి సమాచారాన్ని పొందడానికి మన మొట్టమొదటి సరళమైన క్వరీ వ్రాద్దాం. అది చాలా తేలిక.
04:02 ఏదయినా తిరిగి పొందడానికి మనం SELECT కీవర్డ్ను ఉపయోగించాలి. మన క్వరీ ను
04:10 SELECT * FROM Books అని వ్రాయవచ్చు
04:15 ఇక్కడ Books అనేది పట్టిక పేరు. books లో కాపిటల్ B ను గమనించండి
04:23 మనం ముందు ఉపయోగించిన పట్టిక మరియు కాలమ్ ల పేర్లను పాటించాలి
04:29 * ఒక wild card. అంటే దానర్థం Books పట్టికలోని అన్ని ఫీల్డ్స్ లేదా కాలమ్స్ లను పొందడం
04:39 ఇప్పుడు దీన్ని అమలు లేదా run చేద్దాం. ముందు Edit మెనూ ఆపై Run Query పై క్లిక్ చేద్దాం.
04:48 మనం పైన books యొక్క record లు కలిగిన ప్యానెల్ ను చూడవచ్చు
04:53 ఈక్వరీ లేదా మనము వ్రాసిన ఏదైనా క్వరీ ను సేవ్ చేసి వాటికి వివరణాత్మక పేర్లు ఇవ్వాలి.
05:00 అక్కడ మన మొదటి క్వరీ ఉంది. ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నవి.
05:06 HSQLDB అనేది దాని డేటాబేస్ object పేర్ల తో, అనగా పట్టికలు, కాలమ్ ల పేర్ల లతో కేస్ సెన్సిటివ్.
05:17 అనగా - టేబుల్ పేరు “Books” లోని కాపిటల్ B “books” లోని చిన్న b తో సమానం కాదు.
05:27 మనకనుగుణంగా, మొత్తం upper cases లేదా మొత్తం lower cases ను ఉపయోగించవచ్చు.
05:34 ఉదాహరణకి పెద్ద అక్షరాలలోని BOOKS లేదా చిన్న అక్షరాలలోని members మొదలైనవి
05:44 కానీ రెండు కలిపి ఉపయోగించడం వల్ల అవలీలగా చదివి అర్ధం చేసుకోవచ్చు. ఉదాహరణకి BooksIssued కాపిటల్ B and I ఉంది
05:57 లేదా ReturnDate with a capital R and D.
06:03 కాబట్టి పట్టికల మరియు కాలమ్ ల పేర్లను, అవి సృష్టించిన విధంగా ఉపయోగించాలి.
06:11 SELECT వంటి SQL పదాలకు మనం ఎటువంటి కేసునైనా ఉపయోగించవచ్చు, కానీ చదువుటకు వీలుగా ఒకే పద్దతిని ఉపయోగించుదాం.
06:25 మన ఉదాహారణలలో కీవర్డ్స్ల లో మనం upper casesను ఉపయోగిద్దాం
06:31 ఇప్పుడు తరువాత క్వరీ. దీనిని మనం కొత్త విండో లో లేదా పూర్వం వ్రాసిన క్వరీ పై వ్రాయవచ్చు
06:42 ఇప్పటికి దానిని పూర్వం వ్రాసిన క్వరీ పై వ్రాద్దాం.
06:47 Books పట్టిక నుండి కావలసిన కాలమ్ లను తీసుకువద్దాం. SELECT Title, Author FROM Books.
06:58 క్వరీ ను run చేద్దాం. ఫైల్ మెనూ కింద ఉన్న Run Query ను లేదా కీబోర్డులోని F5 ను ఉపయోగించవచ్చు.
07:13 అక్కడ మనకు కావలసిన కాలమ్స్ కలిగిన రెకార్డులున్నవి.
07:19 సరే, వేరొకదానికి వెళదాం.
07:22 మన క్వరీ కోసం కండిషన్స్ లేదా క్రైటీరియాలను వ్రాద్దాం.
07:27 మనం, కేంబ్రిడ్జ్ ప్రచురించిన పుస్తకాలను మాత్రమే పొందాలి.
07:31 అందువల్ల, మన క్వరీ : SELECT * FROM Books WHERE Publisher = Cambridge.
07:46 ఇక్కడ WHERE అనే ఒక కొత్త కీవర్డ్ను పొందుపరచామని గమనించండి
07:52 Publisher equals Cambridge అనే కండిషన్ ను ఉపయోగించాలి.
07:59 ఇప్పుడు మనం మన క్వరీను అమలు చేద్దాం. ప్రచురణకర్త Cambridge అని ఉన్న పుస్తకాలు మాత్రమే మనం చూడగలం.
08:08 మన క్వరీ లో ఎన్ని కండిషన్ లైనా ఉండవచ్చు
08:14 ఇప్పుడు రెండు కండిషన్స్ కలిగిన ప్రశ్నను రాద్దాము
08:18 1975 తరువాత కేంబ్రిడ్జ్ ద్వారా ప్రచురించబడిన పుస్తకాలను మాత్రమే తిరిగి రాద్దాము
08:29 మన క్వరీ ఏమిటంటే SELECT * FROM Books WHERE Publisher = Cambridge AND PublishedYear > 1975.
08:49 WHERE కీవర్డ్ తరువాత మనం రెండు నిబంధనలను చూడవచ్చు
08:55 ఆ రెంటినీ ‘AND’ను ఉపయోగించి కలపగలిగామని గమనించండి. ఇక్కడ ‘AND’ అంటే logical operator.
09:04 అది ఇక్కడ conditions ను కలపడానికి ఉపయోగపడుతుంది. ‘OR’ అనేది మరొక లాజికల్ ఆపరేటర్.
09:13 పైన ఉన్నక్వరీ ను ఉపయోగించి వీటిని గురించి తరువాత అన్వేషించండి
09:18 క్వరీ ను run చేసి, ఫలితాలను గమనించండి
09:23 అక్కడ మన కండిషన్స్ ను తృప్తి పరచే కొన్ని పుస్తకాలున్నవి.
09:29 ఎక్కువ నిబంధనలను పొందుపరచడానికి మరొక పద్దతిని నేర్చుకుందాం.
09:36 మనం కేంబ్రిడ్జ్ లేదా ఆక్సఫోర్డ్ లు మాత్రమే ప్రచురించిన పుస్తకాల జాబితాను ఎలా పొందగలం.
09:46 ఇక్కడ మరొక క్వరీ Books WHERE Publisher IN ( Cambridge, Oxford).
10:09 ‘IN’ అనే కొత్త కీవర్డ్ను గమనించాలి
10:13 ఇది ఒకే కాలమ్ పై ఉన్న నిబంధనలను జోడించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ అది Publisher.
10:21 ఇప్పుడు ఫలితాన్ని గమనించండి
10:25 ఇక్కడొక అసైన్మెంట్ ఉంది
10:27 క్రింది వాటికి మీ SQL ప్రశ్నలను రాసి పరీక్షించండి
10:33 1. గ్రంధాలయంలో మొత్తం సభ్యుల గురించిన సమాచారాన్ని తెలుసుకోండి.

2. 150 కంటే ఎక్కువ ఖరీదు కలిగిన పుస్తకాల పేర్ల సమాచారాన్ని ఇవ్వండి. 3. విలియం షేక్స్పియర్ లేదా జాన్ మిల్టన్ రాసిన పుస్తకాల జాబితాను కనుక్కోండి

10:56 SQL గురించిన మరింత సమాచారాన్ని తరువాత ట్యూటోరియాల్లో తెలుసుకుందాం
11:01 ఇది LibreOffice Base లోని Queries in SQL View చివరి కు తీసుకొస్తుంది
11:09 దీనిని సంక్షిప్తం చేయడానికి మనం
11:12 SQL లో సులభమైన ప్రశ్నలను తయారుచేయాలి.
11:17 సులభమైన SQL ను వ్రాయండి
11:20 SELECT, FROM , and WHERE clauses ను ఉపయోగించండి
11:25 fields మరియు tables లకు పేరు పెట్టడం కోసం upper, lower, లేదా mixed cases ను ఉపయోగించండి.
11:35 Spoken Tutorial Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం, ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది.
11:47 ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది. దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది.
11:55 దీనిని అనువదించినది హరికృష్ణ. చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Yogananda.india