LibreOffice-Suite-Base/C3/Create-simple-queries-in-SQL-View-II/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:02 LibreOffice Base నందు Spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ టురోరియాల్ నందు మనం
00:10 SQL View లో ప్రశ్నలు వ్రాయడం,
00:13 ORDER BY clause ను ఉపయోగించండం,
00:15 JOINS ను ఉపయోగించండం,
00:17 Aggregate functions ను ఉపయోగించండం,
00:19 GROUP BY clause ను ఉపయోగించండం,
00:21 Functions ను తయారు చేయడానికి ఉపయోగించండం నేర్చుకుందాం.
00:26 SQL క్యూరీస్ గురించి మరింత నేర్చుకుందాం.
00:31 దీని కొరకు మనం Library డాటాబేస్ను తెరుద్దాం.
00:36 ఎడమ ప్యానెల్లో ఉన్న Queries జాబితా పై క్లిక్ చేద్దాం.
00:42 ఆపై ‘Create Query in SQL View’ పై క్లిక్ చేద్దాం.
00:49 క్వరీ ఫలితాలను మనం ఎలా సార్ట్ చేయాలో చూద్దాం.
00:55 క్రింది ఉదాహరణను తీసుకుందాం.
00:59 కేంబ్రిడ్జ్ లేదా ఆక్స్ఫర్డ్ లచే ప్రచురించబడిన అన్ని పుస్తకాల బుక్ టైటిల్ మరియు రచయిత సమాచారాన్ని పొందండి.
01:09 వాటిని book titles ఆధారంగా ఆరోహణ క్రమంలో, ఆపై publisher ఆధారంగా ఆరోహణ క్రమంలో క్రమబద్ధీకరించాలి.
01:19 ఇది మన క్వరీ
01:22 SELECT Publisher, Title, Author
01:28 FROM Books
01:31 WHERE Publisher IN ( Cambridge, Oxford)
01:42 ORDER BY Publisher ASC, Title ASC.
01:50 ORDER BY clause ను మనం కాలమ్ ల పేర్ల ఆధారంగా సార్ట్ చేయుటకు ఉపయోగించామని గమనించండి.
01:58 మరియు కామాను ఉపయోగించి, సార్టింగ్ కొరకు మరికొన్ని కాలమ్ లు జోడించవచ్చు.
02:05 ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో తెలుపుటకు ప్రతీ కాలమ్ తరువాత వరుసగా A S C లేదా D E S C లను టైపు చేయాలి.
02:19 ఫైల్ మెనూ బార్ కింద ఉన్న Run Query ఐకాన్ పై క్లిక్ చేయాలి.
02:26 ఇక్కడ ముందుగా Publisher చే, తరువాత book title చే కుదించబడిన కొన్ని పుస్తకాలున్నవి.
02:34 ఇప్పుడు తరువాత క్వరీ.
02:38 ఇప్పుడు సభ్యులచే, తీసుకున్న పుస్తకాలు సరైన సమయానికి అందించని పుస్తకాల టైటిల్స్, ,issueడేట్ సహా పొందుదాం.
02:48 titles, Books పట్టికలో మరియు పుస్తకాలు జారీ చేసిన తేదీ BooksIssued పట్టికలో ఉన్నాయి కనుక
02:55 మనం ఈ రెండు పట్టికలను ఎలాగయినా జోడించాలి.
03:00 కాబట్టి దీని కొరకు మనం JOIN కీవర్డ్ ను ఉపయోగించాలి.
03:07 మనం BookId అనే ఉమ్మడి కాలమ్ ను ఈ రెండింటిని జోడించడానికి ఉపయోగించాలి.
03:14 కాబట్టి క్వరీ ఏమిటంటే
03:17 SELECT B.title, I.IssueDate, I.Memberid FROM Books B JOIN BooksIssued I
03:35 ON B.bookid = I.BookId WHERE CheckedIn = FALSE.
03:48 FROM clause లోని B లను I లను గమనించండి.
03:55 వీటిని Aliases అని అంటారు. ఇది బాగా చదవటానికి వివరణాత్మక లేదా సింగిల్ వర్ణమాలగా ఉంటుంది.
04:06 BookId కాలమ్ రెండు పట్టికలలో ఉందని గమనించాలి.
04:11 కాబట్టి కాలమ్ ల గురించిన గజిబిజిని తొలిగించడానికి aliases లను ఉపయోగించాము.
04:21 FROM క్లాస్ లోని JOIN కీవర్డ్ ను ఉపయోగించి రెండు పట్టికలను జోడించామని గమనించాలి.
04:31 అంతేకాకుండా, BookId కాలమ్ ను ON B.bookid = I.BookId అని వ్రాసి జోడించుటకు ఉపయోగించాము.
04:46 మన ప్రశ్నను run చేద్దాము.
04:49 పుస్తకాలు, మరియు వాటిని జారీచేసిన జాబితాను చూసి మరియు CheckedIn స్టేటస్ not checked in అవునా కాదా అని గమనించాలి.
04:59 మనం కేవలం ఫలితాలలో MemberId ను మాత్రమే గమనించాలి. ఇది అంత ఉపయోగకరమేమి కాదు, కదా?
05:08 కాబట్టి సభ్యుల జాబితాలో ఉన్న సభ్యుల పేర్లు మనం ఎలా ప్రచురిస్తాము?
05:15 మనం, మన members పట్టికను మన క్వరీ ను ఈ విధంగా JOIN చేస్తాము.
05:21 SELECT B.Title, I.IssueDate, I.MemberId, M.Name FROM Books B
05:37 JOIN BooksIssued I ON B.BookId = I.BookId JOIN Members M ON I.MemberId = M.MemberId
05:58 WHERE CheckedIn = FALSE.
06:02 కాబట్టి Members పట్టిక తో గల రెండవ join ను గమనించినట్లయితే, MemberId కాలమ్ కలపడానికి ఉపయోగపడింది.
06:12 మన క్వరీ ను run చేద్దాం.
06:14 ఇక్కడ సభ్యుల జాబితా వాళ్ళకి ఇవ్వబడిన పుస్తకాలతోపాటున్నది.
06:20 ఆ తరువాత, మనం aggregates మరియు grouping ల గురించి తెలుసుకుందాం.
06:26 గ్రంధాలయంలో ఉన్న సభ్యుల సంఖ్య మనం ఎలా పొందగలం?
06:31 ఇక్కడొక క్వరీ
06:34 SELECT COUNT(*) AS "Total Members" FROM Members
06:47 ఇక్కడ COUNT ను గమనించాలి.
06:51 దీన్ని aggregate function అంటాము ఎందుకంటే ఇది record ల సమితిని మూల్యాంకనం చేసి, ఒక రికార్డు ను ఇస్తుంది.
07:02 మనం Alias- ‘Total Members’ ను జోడిద్దాం.
07:07 మన క్వరీ ను run చేద్దాం
07:10 ఇక్కడ, Base మొత్తం 4 సభ్యుల రికార్డులను మూల్యాంకనం చేసి, సభ్యుల సంఖ్య గా 4 ను తిరిగి ఇచ్చింది.
07:22 aggregate functions కు మరిన్ని ఉదాహరణలు SUM, MAX మరియు MIN .
07:30 జోడించడం గురించిన మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం.
07:36 ప్రచురణకర్త కు కావలసిన పుస్తకాల గణనం ఎలా పొందగలం?
07:40 ఇక్కడొక క్వరీ.
07:43 SELECT Publisher, COUNT(*) AS "Number of Books" FROM Books

GROUP BY Publisher ORDER BY Publisher

08:03 GROUP BY క్లాస్ ను గమనించండి
08:06 కాబట్టి, Publisher, పుస్తకాల సంఖ్య మరియు ప్రతి ప్రచురణకర్తకు రికార్డులను సమూహం చేయడానికి GROUP BY నిబంధనలను మనం ఎంచుకుంటున్నాం.
08:18 మన క్వరీ ను run చేద్దాం.
08:21 ప్రచురణకర్త పేర్లను మరియు ప్రతి పబ్లిషర్ ద్వారా ప్రచురించిన పుస్తకాల సంఖ్య ప్రక్క ప్రక్క న గమనించండి.
08:33 Functions in SQL ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
08:38 ఫంక్షన్స్ ఒకే ఒక విలువను తిరిగి ఇచ్చే స్టేట్మెంట్స్.
08:43 ఉదాహరణకి CURRENT_DATE ఈరోజు తేదీనిస్తుంది.
08:49 కాబట్టి సభ్యులు తిరిగి ఇవ్వవలసిన పుస్తకాల జాబితాను తయారుచేయాలి.
08:56 క్వరీ ఏమిటంటే,
08:58 SELECT B.Title, I.IssueDate, I.ReturnDate
09:08 FROM Books B JOIN BooksIssued I ON B.bookid = I.BookId
09:21 WHERE CheckedIn = FALSE and ReturnDate < CURRENT_DATE
09:31 కాబట్టి, CURRENT_DATE ఫంక్షన్ ను గమనించండి.
09:36 నేటితో Return Date ముగిసిన పుస్తకాల వివరాలను పొందుతున్నాము.
09:43 మన క్వరీ ను run చేద్దాం.
09:45 తిరిగి ఇవ్వని పుస్తకాల జాబితా ఇక్కడుంది.
09:51 ఫంక్షన్స్ పై మరికొంత సమాచారం కొరకు HSQLdb http://hsqldb.org/doc/2.0/guide/builtinfunctions-chapt.html ను అందిస్తుంది.
10:23 మొత్తం యూజర్ గైడ్ ను, ఈ క్రింది వెబ్సైట్ను సందర్శించడం ద్వారా పొందవచ్చు.
10:29 http://www.hsqldb.org/doc/2.0/guide/
10:48 ఇక్కడొక అసైన్మెంట్ ఉంది.
10:50 క్రింది వాటికి మీ SQL క్వరీ లను వ్రాసి పరీక్షించండి.
10:55 1. గ్రంధాలయంలో ఉన్న అన్ని పుస్తకాల జాబితాను పొందండి.
10:58 2. ప్రతీ రచయిత ద్వారా వ్రాయబడిన పుస్తకాల సంఖ్య ను పొందండి.
11:03 3. నేటికీ పుస్తకాలు తిరిగి ఇవ్వని సభ్యుల పేర్లు మరియు ఫోన్ నంబర్ల జాబితాను పొందండి.
11:11 4. ఈ క్వరీ ఏమి చేస్తుందో వివరించండి?

SELECT (price) AS "Total Cost of Cambridge Books"

11:24 FROM Books WHERE publisher = Cambridge
11:32 ఇది లిబ్రెఆఫీస్ నందు more queries in SQL View ట్యుటోరియల్ చివరకు తీసుకొస్తుంది.
11:40 దీన్ని సంక్షిప్తం చేయడానికి మనం
11:43 SQL లో క్వరీస్ ను తయారు చేయడం,
11:47 ORDER BY క్లాస్ ను ఉపయోగించడం,
11:49 JOINS ను ఉపయోగించడం,
11:51 Aggregate functions ను ఉపయోగించడం,
11:54 GROUP BY క్లాస్ను ఉపయోగించడం,
11:57 మరియు built in Functions ఉపయోగించడం నేర్చుకున్నాము.
12:00 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం, ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారంతో ఉంది. ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది. దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది.
12:21 దీనిని తెలుగు లోనికి అనువదించినది హరికృష్ణ. చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Yogananda.india