Java/C2/Numerical-Datatypes/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 జావా లోని న్యూమరికల్ డేటా టైప్స్ అనే స్పోకెన్ టుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ టుటోరియల్ లో మనం,
00:10 జావా లోని వివిధ రకాల న్యూమరికల్ డాటా టైప్ లను మరియు
00:13 వాటి ద్వారా న్యూమరికల్ డాటాను ఎలా నిల్వ చేయాలో తెలుసుకుంటాము.
00:18 ఈ టుటోరియల్ కొరకు, మనం ఉబంటు 11.0

JDK1.6 మరియు Eclipse 3.7 ఉపయోగిస్తున్నాం.

00:27 ఈ టుటోరియల్ ను అనుసరించదానికి, మీకు జావా ప్రోగ్రాం రాసి దాన్ని రన్ చేయడం తెలిసి ఉండాలి.
00:34 లేకపోతె, తత్సంబంధిత టుటోరియల్స్ కోసం మావెబ్సైట్ లో చూడండి.
00:42 పూర్ణాంకాలను నిల్వ చేసే డాటా టైప్ ని int అంటారు.
00:47 దశాంశ సంఖ్యలను నిల్వ చేసే డాటా టైప్ ని float అంటారు.
00:52 ముందుగా, పుర్ణాంకాలని నిర్వచించి ఉపయోగించడం చూద్దాం.
01:02 ఇక్కడ మనము ‘ఎక్లిప్స్IDE’ మరియు మిగిలినకోడ్ కి అవసరమైన స్కేలిటన్ కలిగి ఉన్నాం.
01:10 ఇక్కడ మనం న్యూమరికల్ డాటా అనే క్లాస్ ని సృష్టించి, దానికి మెయిన్ మెథడ్ ను జతచేశాం.
01:15 ఇప్పుడు, సంఖ్యలని ఎలా నిల్వ చేయాలో చూద్దాం.
01:20 int distance ఈక్వల్ టూ 28;.
01:27 ఈ స్టేట్మెంట్ పూర్ణాంక విలువని distance అనే పేరుగల వేరియబుల్ లో నిల్వ చేస్తుంది.
01:33 distance అనేది ఒక పూర్ణాంక వేరియబుల్.
01:37 ఇప్పుడు మనం వేరియబుల్ అయిన distance ని దానిలో నిల్వ చేయబడిన విలువను ముద్రించడానికి వాడుదాం.
01:47 సిస్టమ్ డాట్ ఔట్ డాట్ println, పారెంథేసిస్ లో distance;
02:01 ఈ స్టేట్మెంట్, distance అనే వేరియబుల్ విలువని ప్రచురిస్తుంది.
02:06 ఫైల్ ను సేవ్ చేసి, రన్ చేయండి.
02:14 28 అనే విలువ distanceలో నిల్వ చేయబడడం మనం చూడొచ్చు.
02:21 వేరియబుల్ లో నిలువ ఉన్న విలువను మారుద్దాం.
02:25 28 ను 24 కు మారుద్దాం.
02:29 సేవ్ చేసి, రన్ చేయండి.
02:34 ఔట్పుట్ తదనుగుణంగా మారడం మనం చూడొచ్చు.
02:39 int ఋణసంఖ్యలు కూడా నిల్వ చేయగలదు.
02:42 24 ను -25 కు మారుద్దాం.
02:48 సేవ్ చేసి, రన్ చేయండి.
02:56 int ఋణసంఖ్యలు కూడా నిల్వ చేయగలదని మనం చూడవచ్చు.
03:02 int డాటా టైప్ మన చాలా ప్రోగ్రామింగ్ అవసరాలకు సరిపోతుంది.
03:06 కానీ ఇది కొంత అవధి వరకు మాత్రమే విలువలని నిల్వ చేయగలదు.
03:10 ఒక గరిష్ట విలువను నిల్వ చేసి, ఏం జరుగుతుందో చూద్దాం.
03:25 మనకు సంఖ్య కింద ఎరుపుగీత error(తప్పు) అని సూచిస్తుంది.
03:34 ఎర్రర్ సందేశంలో, సంఖ్య వేరియబుల్ డాటా టైప్ పరిధి బయట ఉంది అని సూచిస్తుంది.
03:42 int అనేది 32 బిట్ల మెమోరీ వరకు తీసుకోగలడు. అది -2 power 31 నుండి 2 power 31 వరకు నిల్వచేయగలదు.
03:49 గరిష్ట సంఖ్యలను నిల్వ చేయడానికి, జావా long అనే డాటాటైప్ అందిస్తుంది.
03:54 ఒక పెద్ద సంఖ్యను నిల్వ చేయడానికి దీనిని ఉపయోగిద్దాం.
03:59 int ను long కు మార్చండి.
04:04 సంఖ్య చివరలో కాపిటల్ L జతచేయండి.
04:11 Ctrl+ S తో సేవ్ చేయండి.
04:16 ఇప్పుడు ఏ ఎర్రర్ కనిపించుటలేదు.
04:19 Ctrl+ F11 తో రన్ చేస్తే, విలువ ముద్రించబడింది.
04:27 long variable లో, పెద్ద సంఖ్యలు నిల్వ చేయవచ్చని మనం చూశాము.
04:32 ఇప్పుడు, దశాంశ సంఖ్యలని int వేరియబుల్ లో నిల్వ చేసి చూద్దాం.
04:37 long ను int కి మార్చి, సంఖ్యను 23.5 కి మారుద్దాం.
04:50 ఎర్రర్ కనిపిస్తుంది. ఎందుకంటే int పూర్ణంకాలను మాత్రమే నిల్వ చేస్తుంది.
05:00 దశాంశ సంఖ్యలని నిల్వ చేయడానికి మనం float వాడాలి.
05:05 దాటాటైప్ ని float కి మార్చాలి.
05:10 తర్వాత, f ను విలువ చివరన చేర్చాలి.
05:17 దాన్ని సేవ్ చేయండి.
05:19 ఇప్పుడు ఏ ఎర్రర్ లేదు.
05:22 Control F11 తో రన్ చేయండి.
05:29 దశాంశ సంఖ్య నిల్వ అయి, ముద్రించబడడం మనం చూడవచ్చు.
05:37 distance అనే వేరియబుల్ విలువను మారుద్దాం.
05:46 ఇక్కడ చూపించినట్టుగా దశాంశ స్థానం తర్వాత చాలా అంకెలను చేర్చండి.
05:53 సేవ్ చేసి రన్ చేయండి.
06:01 ఔట్పుట్ మనం నిల్వ చేసినదానికి కొంచెం భిన్నంగా ఉండడం చూస్తాం.
06:06 ఎందుకంటే అక్కడ ఫ్లోటింగ్ పాయింట్ ఆవర్తనమునకు పరిమితి ఉంది.
06:11 ఆ సంఖ్యని సరిగ్గా అలాగే నిల్వ చేయలేక పొతే, దానికి దగ్గర గల సంఖ్య తో సరిచేయబడుతుంది.
06:18 వేరియబుల్ ల నామకరణ నియమాలను చూద్దాం.
06:23 పేరుకు ముందు 2 చేర్చండి.
06:30 మనకు సింటాక్స్ ఎర్రర్ కనిపిస్తుంది.
06:34 ఎందుకంటే వేరియబుల్ పేరు ఆల్ఫాబెట్ కానీ లేదా ఒక అండర్ స్కోర్ తో కానీ మొదలవ్వాలి.
06:40 కానీ అండర్ స్కోర్ని సాధారణంగా పేరుకి ముందు ఉపయోగించము.
06:45 ఇప్పుడు, వేరియబుల్ పేరు చివరలో ఒక సంఖ్య జోడిద్దాం.
06:55 ఎర్రర్ లేదని గమనించ వచ్చు.
06:59 వేరియబుల్ పేరులో సంఖ్యలు ఉండవచ్చు కానీ, ప్రారంభం లో కాదు.
07:04 ఇప్పుడు, అండర్ స్కోర్ ను పేరు మధ్య లో జోడించండి.
07:15 ఎర్రర్ లేదని గమనించ వచ్చు.
07:17 తద్వారా, అండర్ స్కోర్ వేరియబుల్ పేరులో ఉండడానికి అనుమతి ఉందని తెలుస్తుంది.
07:22 కానీ, వేరే విరామచిహ్నాలు వేరియబుల్ పేరులో ఉండడం వలన సింటాక్స్ లేదా వేరే ఎర్రర్లు రావచ్చు.
07:28 ఈ విధంగా మీరు జావా లో న్యూమరికల్ డాటాని నిల్వ చేయవచ్చు.
07:35 దీనితో, ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాము.
07:38 ఈ టుటోరియల్ లో మనం, న్యూమరికల్ డాటా టైప్ ల గురించి,
07:44 అదేవిధంగా వాటిని నిల్వ చేయటం,
07:46 అలాగే, వేరియబుల్ పేర్ల నామకరణ నియమాలని కూడా నేర్చుకున్నాం.
07:51 ఈ టుటోరియల్కు సంబంధించి, ఒక అసైన్మెంట్
07:53 ఇతర, న్యూమరికల్ డాటా టైప్ ల గురించి చదవండి.
07:56 ఇంకా అవి int మరియు float కంటే ఎలా భిన్నంగా ఉన్నాయో చూడండి.
08:00 క్రింది లింక్ లో, జావా టుటోరియల్ లు లభ్యమవుతాయి.
08:05 స్పోకెన్ టుటోరియల్ ప్రాజెక్టు గురించి మరిన్ని వివరాలకోసం ఈ క్రింది లింక్ లో గల వీడియో చూడండి.
08:11 ఇది ఈ ప్రాజెక్టు సారాంశం.
08:14 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
08:20 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్: స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్కుషాప్స్ నిర్వహిస్తుంది.
08:24 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికట్లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org ను సంప్రదించండి

08:35 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
08:39 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
08:45 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది.
08:51 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష మరియు నేను ఉదయ లక్ష్మి. పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig