Java/C2/Hello-World-Program-in-Eclipse/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 స్పోకన్ ట్యుటోరియల్ నందు ఎక్లిప్స్ ఉపయోగించుకొని హెలొ వర్ల్ద్ ఇన్ జావా అనే ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ నందు ఎక్లిప్స్ లో జావాలో హాల్లో వర్ల్ద్ ప్రోగ్రాం ఏవిధంగా వ్రాయాలో నేర్చుకుంటాము.
00:13 ఈ టుటోరియల్ కొరకు మనము ఎక్లిప్స్ 3.7.0 మరియు ఉబంటు 11.10 ఉపయోగిస్తున్నాము.
00:20 ఈ టుటోరియల్ అనుసరించేందుకు మీ సిస్టమ్ పై ఎక్లిప్స్ స్థాపించబడి ఉండాలి.
00:25 మీకు ఎక్లిప్స్ లో ఫైల్ లను సృష్టించుట, నిల్వ చేయుట మరియు అమలుపరుచుట కూడా తెలిసిఉండాలి.
00:30 లేకపోతే తత్సంబంధ టుటోరియల్ కొరకు, మా వెబ్ సైట్ ను సంప్రదించగలరు.
00:36 ఇక్కడ ఉన్న ఈ జావా కోడ్ హలో వర్డ్ సందేశాన్ని ముద్రిస్తుంది.
00:44 ఇప్పుడు ఎక్లిప్స్ లో దీన్ని ప్రయత్నిద్దాం.
00:46 Alt, F2 నొక్కండి, డైలాగ్ బాక్స్ లో eclipse టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
00:56 వర్క్ స్పేస్ వద్ద ఒకే క్లిక్ చేయండి,ఎక్లిప్స్ ఐడిఈ కనిపిస్తుంది.
01:09 ఇప్పుడు, కొత్త ప్రాజెక్ట్ ను జతచేద్దాం.
01:12 ఫైల్ మెను లో న్యూ క్లిక్ చేసి ప్రాజెక్ట్ ను ఎంచుకోండి.
01:19 ప్రాజెక్ట్ ల జాబిలో జావా ప్రాజెక్ట్ ఎంచుకొని , నెక్స్ట్ పై క్లిక్ చేయండి.
01:26 ప్రాజెక్ట్ నేమ్ వద్ద DemoProject టైప్ చేయండి.(ఇక్కడ రెండు పదాల మద్య స్పేస్ లేదని మరియు Demo మరియు Project పదాలలో D మరియు P క్యాపిటల్ అక్షరాలని గమనించండి.)
01:40 క్రింద కుడి మూలలో ఉన్న ఫినిష్ బటన్ పై క్లిక్ చేయండి.
01:46 DemoProject ప్రాజెక్ట్ సృష్టించబడినది.
01:49 ఇప్పుడు ఒక కొత్త క్లాస్ ను మన ప్రాజెక్ట్ కు జోడిద్దాం.
01:52 ప్రాజెక్ట్ పై రైట్ క్లిక్ చేసి, న్యూ లో క్లాస్ ను ఎంచుకోండి.
01:59 క్లాస్ పేరు గా DemoProgram అని టైప్ చేసి, మెథడ్ స్టబ్స్ లో public static void main ఎంచుకోండి.
02:13 క్రింద కుడి మూలలో ఉన్న ఫినిష్ బటన్ పై క్లిక్ చేయండి.
02:20 DemoProject లో ఒక సోర్స్ డైరెక్టరీ మరియు DemoProgram.Java అనే ఫైల్ చూడవచ్చు.
02:27 ఎందుకంటే జావా లో ప్రతీ క్లాస్, ఒక ప్రత్యేక ఫైల్ గా ఉండాలి. అందుకే డెమోప్రోగ్రాం క్లాస్ DemoProgram.java ఫైల్ గానే ఉంటుంది.
02:40 ఇక్కడ ఎడిటర్ విండో మిగిలిన విండో లమధ్య మూసుకుపోయినట్టు కన్పిస్తుంది అందుకే మిగిలిన పోర్టల్ లను మినిమైస్ చేస్తాను. ఇప్పుడు ఎడిటర్ బాగా కనిపిస్తుంది.
02:55 ఈ వరస రెండు స్లాష్ తో ప్రారంభిస్తున్నదని గమనించండి. ఇది ఒక కామెంట్, మన కోడ్ కు కామెంట్ కు ఎటువంటి సంబందం లేదు.
03:05 ఈ వరసను తొలగిద్దాం. అలాగే, స్లాష్ అస్తరిస్క్ మరియు అస్తరిస్క్ స్లాష్ (/* */) మద్యలో ఉన్నదాన్ని కూడా కామెంట్ అని అందురు.
03:17 కాబట్టి ఈ వరసను కూడా తొలగిద్దాం.
03:22 ఇప్పుడు కోడ్ మాత్రమే మిగిలి ఉన్నది.
03:27 ఇప్పుడు ఒక ప్రింట్ స్టేట్మెంట్ ను జోడిద్దాం. System (సిస్టమ్) టైప్ చేయండి.
03:35 ఎక్లిప్స్ ఈ వాక్యాన్ని పూర్తి చెయ్యగల వివిధ ఎంపికల జాబితాను చూపిస్తుంది.
03:38 మనం ఇప్పుడు ఆ ఆదేశాన్ని స్వయంగా పూర్తిచేద్దాం.
03:43 out.println. బ్రాకెట్ లోపాల డబల్ కోట్స్ లో (“హలో వర్ల్ద్”)/(“Hello World”)అని టైప్ చేయండి.
03:56 జావా నందు ప్రతి వాక్యం సెమీ కోలన్ తో ముగించాలి.
03:59 అందువలన సెమీకోలన్ జోడిద్దాం.
04:03 ఇది java లో మన HelloWorld program
04:06 Ctrl + S నొక్కి సేవ్ చేయండి.
04:11 ఫైల్ పై రైట్ క్లిక్ చేసి రన్-యాస్ జావా అప్ప్లికేషన్ ఎంచుకొని కోడ్ రన్ చేయగలరు.
04:19 కంసోల్ పై “Hello World” కనిపిస్తుంది.
04:24 ఇప్పుడు, “World” ను “Java” గా మార్చుదాం .
04:30 Ctrl + S నొక్కి సేవ్ చేసి రన్ చేయండి.
04:40 ఇప్పుడు “Hello Java ” ముద్రించబడటం మనం చూడగలం.
04:45 ఇప్పుడు కోడ్ లో ప్రతీ భాగం ఏమి చేస్తున్నదో చూద్దాం.
04:48 మొదటి వరస, క్లాస్ పేరు DemoProgram అని మరియు ఇది ఒక Public class అని సూచిస్తుంది.
04:55 రెండవ వరస, ఇది మెయిన్ మెథడ్ ఇది program ను అమలుపరిచే ప్రారంబిక చోటుని సూచిస్తుంది.
05:04 ఇంతకు ముందు చూసినట్టు ఇది మన ప్రింట్ స్టేట్మెంట్.
05:07 ఇది మనం java లో Hello World program వ్రాసే విధానము.
05:14 ఇంతటితో ఈ టుటోరియల్ ముగింపుకు వచ్చాం.
05:17 ఈ టుటోరియల్ లో మనం java లో Hello World ప్రోగ్రాం వ్రాయడం మరియు program లో వివిధ భాగాల వివరణల గురించి చూశాం .
05:27 ఒక అసైన్మెంట్ గా ,
05:29 Greet పేరుతో ఒక జావా క్లాస్ ని సృష్టించి , దానిని ఏక్సిక్యూట్ చేసినప్పుడు "Program Successful" అని ముద్రించండి.
05:37 స్పోకన్ టుటోరియల్ గురించి మరిన్ని వివరాల కొరకు
05:39 ఈ లింక్ లోని వీడియో చూడగలరు. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
05:42 ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం ను ఇస్తుంది.
05:45 మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
05:51 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.
05:53 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్ నిర్వహిస్తుంది.
05:55 ఆన్ లైన్ పరీక్ష లో పాస్ ఐతే సర్టిఫికేట్ ఇస్తుంది.
05:59 మరిన్ని వివారాలకు contact @ spoken హైఫన్ tutorial డాట్ org కు మెయిల్ చేయండి.
06:05 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం
06:09 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
06:14 దీనిపై మరింత సమాచారం ఈ క్రింద లింక్ లో ఉంది. spoken హైఫాన్ tutorial డాట్ org స్లాష్ NMEICT హైఫాన్ Intro
06:19 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష ఎ.ఎన్. మరియు స్వామి. పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Yogananda.india