C-and-Cpp/C3/Loops/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 లూప్స్ ఇన్ సి అండ్ సి++ విషయం పై స్పోకన్ టుటోరియల్కు స్వాగతం.
00:06 ఈ టుటోరియల్ లో మనం
00:09 ఫర్ లూప్, వైల్ లూప్ మరియు
00:12 డూ వైల్ లూప్లను నేర్చుకుంటాం. వీటిని కొన్ని ఉదాహరణల ద్వారా నేర్చుకుందాం.
00:17 కొన్ని సామాన్యమైన లోపాలు మరియు వాటి సవరణలు చూద్దాం.
00:21 ఈ టుటోరియల్ రెకార్డ్ చేసేందుకు, నేను
00:24 ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 11.04 మరియు
00:28 జీసీసీ మరియు జీ++ కంపైలర్ వర్షన్ 4.6.1 ఉపయోగిస్తాను.
00:34 లూప్స్ పరిచయంతో ప్రారంభిద్దాం.
00:38 కొన్ని సూచనలను పదేపదే అమలుపరుచేందుకు లూప్స్ని ఉపయోగిస్తాం.
00:44 ఉద్దేశాన్ని బట్టి వీటిని 3 రకాలుగా విభజించడినది.
00:48 వైల్(while) లూప్, డూ వైల్(do...while) లూప్ మరియు
00:51 ఫర్(for) లూప్, ముందుగా వైల్ లూప్ తో ప్రారంబిద్దాం.
00:56 వైల్ లూప్ కండిషన్ని ప్రారంభంలో పరీక్షిస్తుంది.
01:00 దీని నిర్మాణం వైల్ (కండిషన్)
01:03 బ్రాకెట్ లో స్టేట్మెంట్ బ్లాక్ ఉంటుంది.
01:07 ఇప్పుడు డూ వైల్ లూప్ చూద్దాం.
01:09 డూ వైల్ లూప్ కండిషన్ పరీక్షించే ముందు, కనీసం ఒక్క సారైనా ఎక్సెక్యూట్ చేయబడును.
01:15 డూ వైల్ నిర్మాణం
01:17 డూ(బ్రాకెట్ల లోపల) స్స్టేట్మెంట్ బ్లాక్,
01:20 బ్రాకెట్ తరువాత వైల్ (కండిషన్)
01:23 కండిషన్ చివరికి పరీక్షించబడుతుందని చూడగలరు.
01:27 ఇప్పుడు, ఒక వైల్ మరియు డూ -వైల్ ఉదాహరణ చూద్దాం.
01:32 నేను ఎడిటర్ లో కోడ్ ని టైప్ చేసి ఉంచాను.
01:35 దాన్ని ఇప్పుడు తెరుస్తాను.
01:37 మన ఫైల్ పేరు వైల్.సి(while.c) అని గమనించండి.
01:41 వైల్ లూప్ని ఉపయోగించి మొదటి 10 అంకెల కూడిక నేర్చుకుందాం.
01:47 కోడ్ ని వివరిస్తాను.
01:49 ఇది మన హెడ్డర్ ఫైల్.
01:51 మెయిన్() క్రియలో x మరియు y పూర్ణాంక వేరియబల్లను ప్రకటించి, సున్నను తొలి విలువగా ఇచ్చాము.
01:59 ఇది మన వైల్ లూప్.
02:02 వైల్ లూప్ కండిషన్ x 10 కన్నా తక్కువ లేదా సమానం.( x is less than or equal to 10 ).
02:06 ఇక్కడ x విలువ, y విలువకు జోడించబడినది.
02:10 కూడిన తరువాత వచ్చే మొత్తాని yలో ప్రతిక్షేపించబడును.
02:15 తరువాత y విలువను ముద్రిస్తాం.
02:18 ఇక్కడ xని ఇంక్రిమెంట్ చేస్తాం.
02:20 అనగా వరియబుల్ x ఒకటితో పెంచబడుతుంది.
02:25 మరియు ఇది మన రిటర్న్ స్టేమెంట్.
02:27 ఇప్పుడు, ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం.
02:30 Ctrl, Alt మరియు T ఏకకాలంలో నొక్కి టర్మినల్ విండో తెరవగలరు.
02:39 జిసిసి స్పేస్ వై డాట్ సి స్పేస్ హైఫాన్ o స్పేస్ వైల్ టైప్ చేసి,
02:45 ఎంటర్ నొక్కండి.
02:47 ./while(./ వైల్) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
02:52 ఫలితం కనిపిస్తుంది.
02:54 ఇప్పుడు వైల్ లూప్ ఎలా పని చేస్తుందో చూద్దాం.
02:57 విండోను రీసైస్ చేద్దాం.
03:00 ఇక్కడ, x మరియు y మొదటి విలువలు సున్న(0).
03:04 ఇది మన వైల్ లూప్ కండిషన్.
03:06 ఇక్కడ మనం x విలువ 10 కన్నా తక్కువ లేదా సమానమేనా అని పరీక్షిస్తాం, అంటే x విలువ 0 నుండి 10 వరకు ఉండాలి.
03:15 తరువాత yని xతో కూడుతాము, అనగా సున్నను సున్నతో కూడితే ఫలితం సున్న.
03:22 Y విలువను ముద్రిస్తాం, ఇక్కడ సున్న వస్తుంది.
03:27 తదుపరి, x విలువను ఒకటికి పెంచుతాం అంటే ఇప్పుడు x విలువ 1.
03:33 మరల కండిషన్ పరిక్షిస్తాం, ఒకటి 10 కన్నా తక్కువ లేదా సమానమేనా అని, ఈ కండిషన్ సత్యం ఐతే, విలువలను కుడిక చేస్తాము.
03:44 Y విలువ సున్న మరియు x విలువ ఒకటి, వాటి కూడిక ఫలితం 1.
03:50 మనం ఒకటిని ముద్రిస్తాం.
03:53 మరలా xని పెంచుతాం.
03:55 ఇప్పుడు x విలువ 2.
03:59 కండిషన్ ఇంకొకసారి పరిక్షిద్దాం.
04:01 2, 10 కన్నా తక్కువ లేదా సమానమేనా అని, కండిషన్ సత్యం ఐతే విలువలను కుడిక చేస్తాము, అంటే 1 ప్లస్ 2 ఫలితం 3.
04:11 విలువ మూడుని(3) ముద్రిద్దాం.
04:13 ఇలా, x విలువ 10 కన్నా తక్కువ లేదా సమానమియే వరకు కొనసాగుతుంది.
04:20 ఇప్పుడు ఇదే ప్రోగ్రాంను డూ వైల్ లూప్ ఉపయోగించి చూద్దాం.
04:24 ఇది మన ప్రోగ్రాం.
04:26 ఫైల్ పేరు డూ హైఫాన్ వై డాట్ సి(do hyphen while.c) అని గమనించండి.
04:31 ఈ భాగం మునపటి ప్రోగ్రాం వివరణలో చూశాం.
04:35 అందుకే, నేరుగా డూ వైల్ లూప్కి వెళ్దాం.
04:38 ఇక్కడ, ముందుగా లూప్ యొక్క ప్రధాన భాగం ఎక్సెక్యూట్ ఔతుంది తరువాత కండిషన్ తనిఖీ చెయ్యబడుతుంది.
04:44 X విలువ y విలువ తో కుడిక చేసి, మొత్తం yలో ప్రతిక్షేపించబడును లేదా నిలువ చయ్యబడును.
04:52 లాజిక్ వైల్ ప్రోగ్రాంకి సమానమే.
04:55 ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం.
04:58 టర్మినల్కు వద్దాం.
05:00 జీ సీసీ స్పేస్ డూ హైఫాన్ వైల్ డాట్ సి స్పేస్ హైఫాన్ o స్పేస్ డూ (gcc space do hyphen while dot c space hyphen o space do) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:08 డాట్ స్లాష్ డూ (dot slash do) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
05:12 ఫలితం వైల్ ప్రోగ్రాం ఫలితం లాగే కనిపిస్తుంది.
05:16 ఇప్పుడు, డూ వైల్ ఎలా పని చేస్తుందో చూద్దాం.
05:20 విండో ను రీసైజ్ చేస్తాను.
05:22 ఇక్కడ x మరియు y విలువలు సున్న.
05:25 వీటిని కూడితే, వచ్చే మొత్తం సున్న.
05:29 Y విలువ సున్న(0).
05:31 ఫలితం సున్న(0) ముద్రిస్తాం.
05:33 X విలువ ఒక్కటితో పెంచుతాం, అంటే x విలువ ఇప్పుడు 1, తరువాత కండిషన్ ను మరలా పరిక్షిస్తాం.
05:42 లూప్ ప్రధాన భాగం ఇంకొకసారి ఎక్సెక్యూట్ అయిందాని చూడగలరు.
05:45 ఏమైనప్పటికి, కండిషన్ అసత్యం ఐతే, ఫలితం సున్న వస్తుంది.
05:52 ఇక్కడ 1, 10 కన్నా తక్కువా లేదా సమానమేన అని పరిక్షిస్తాం.
05:56 కండిషన్ సత్యం అయితే మరలా విలువలను కుడిక చేద్దాం.
06:00 సున్న(0) ప్లస్ 1.
06:02 తరువాత ఫలితం 1ని ముద్రిస్తాం.
06:05 మరలా x విలువ పెంచుతాం.
06:08 ఇప్పుడు ఎక్స్ విలువ 2.
06:11 రెండు 10 కన్నా తక్కువ లేదా సమానమేనా అని పరిక్షిస్తాం.
06:15 వెనక్కి వెళ్దాం.
06:17 ఈ విలువల కూడిక చేద్దాం. 1 ప్లస్ 2 ఫలితం 3.
06:20 Y విలువ 3, ఈ ఫలితం ముద్రిద్దాం.
06:23 ఇలా, కండిషన్ల తనిఖీ, x విలువ 10 కన్నా తక్కువ లేదా సమానం అయేంత వరుకు సాగుతుంది.
06:30 ఇది మన రిటర్న్ స్టేట్మెంట్.
06:33 ఇక్కడ వైల్ కండిషన్ సెమీ కోలన్ తో అంతం ఔతుంది అని గమనించండి.
06:38 వైల్ లూప్ లో కండిషన్ సెమీ కోలన్ తో అంతం కాదు.
06:43 ఇప్పుడు సి++ ప్రోగ్రాంను ఎలా ఎక్సెక్యూట్ చేయాలో చూద్దాం.
06:48 ఇది మన సి++ ప్రోగ్రాం.
06:52 లాజిక్ మరియు అమలుపరుచుట సి ప్రోగ్రాంలాగే ఉంటుంది.
06:56 ఇక్కడ, కొన్ని మార్పులు ఉన్నవి హెడ్డర్ ఫైల్ ఎస్ టి డి ఐఓ(stdio.h)కి బదలుగా ఐ ఓ స్ట్రీమ్ (iostream).
07:04 యుసింగ్ (using) స్టేట్మెంట్ చేర్చాము, యుసింగ్ నేమ్ స్పేస్ ఎస్ టి డి (using namespace std) మరియు ఇక్కడ ప్రింట్ ఎఫ్ బదలుగా సి ఔట్ క్రియ ఉపయోగించాం.
07:16 వైల్ లూప్ నిర్మాణం సిలో ఉన్నట్టే ఉంది.
07:21 ప్రోగ్రాంను ఎక్సెక్యూట్ చేద్దాం.
07:23 టర్మినల్ కు వద్దాం.
07:25 ప్రాంప్ట్ ని క్లియర్ చేస్తాను.
07:28 ఎక్సెక్యూట్ చేసేందుకు జి++ స్పేస్ వైల్ డాట్ సిపిపి స్పేస్ హైఫాన్ ఓ స్పెకే వైల్ 1( g++ space while dot cpp space hyphen o space while1 ) అని టైప్ చేసి, ఎంటర్ నొక్కండి.
07:38 డాట్ స్లాష్ వైల్1(dot slash while1) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
07:43 ఫలితం సి ప్రోగ్రాం ఫలితం లాగే ఉందని గమనిoచండి.
07:48 ఇప్పుడు డూ వైల్ ప్రోగ్రాంని సి++ లో చూద్దాం.
07:52 టెక్స్ట్ ఎడిటర్ కు వద్దాం.
07:54 ఇక్కడ కూడా, ఆదేరకమైన కొన్ని మార్పులు ఉన్నాయి, అనగా హెడ్డర్ ఫైల్, యూసింగ్ స్టేమెంట్ మరియు సిఔట్ క్రియ.
08:03 మిగితావన్నీ సమానమే.
08:06 ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.
08:08 టర్మినల్ కు వద్దామ్.
08:10 g++ స్పేస్ డూ హైఫాన్ వైల్ డాట్ సిపిపి స్పేస్ హైఫాన్ ఓ స్పేస్ డూ1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:19 డాట్ స్లాష్ డూ1 (./do1 ) టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
08:23 ఫలితం డూ వైల్ సి ప్రోగ్రాంకి సమానమే అని చూడగలరు.
08:28 ఇప్పుడు కొన్ని సామాన్యంగా చేసే లోపాలను చూద్దాం.
08:32 టెక్స్ట్ ఎడిటర్ కి వద్దాం.
08:35 ఇక్కడ, x విలువను పెంచకుండా అలాగే వదిలేస్తాను.
08:41 సేవ్ పై క్లిక్ చేయండి. ఎమౌతుందో చూద్దాం.
08:44 టర్మినల్ కు వద్దాం. ప్రాంప్ట్ క్లియర్ చేస్తాను.
08:47 ప్రోగ్రాంను ఎక్సిక్యూట్ చేద్దాం.
08:50 రెండు సార్లు అప్ యారో కీని నొక్కండి.
08:54 మరలా అప్ యారో నొక్కండి.
08:57 ఫలితం కనిపిస్తుంది.
08:59 ఇక్కడ కొన్ని సున్నలు కనిపిస్తాయి, ఎందుకంటే లూప్ ని ముగింపు చేసే కండిషన్ లేదుగనుక.
09:07 దీన్ని అనంతమ్మైన లూప్ లేదా (ఇన్ఫైనైట్ లూప్) అంటారు.
09:10 ఇన్ఫైనైట్ లూప్ సిస్టమ్ నుస్పందించకుండా చేస్తుంది.
09:14 ఇది ప్రాసెసర్ మొత్తం సమయాన్ని వినియోగించుకుంటుంది. ఐతే దీన్ని ఆపవచ్చు.
09:21 మన ప్రోగ్రాంకు వద్దాం. సవరణలు చేద్దాం.
09:25 X++ టైప్ చేసి సెమీ కోలన్ టైప్ చెయండి.
09:28 సేవ్ చేసి మరల ఎక్సిక్యూట్ చేద్దాం.
09:31 టర్మినల్ కు వద్దాం.
09:33 అప్ యారో కీ నొక్కండి.
09:38 సరైన ఫలితం వచ్చింది.
09:40 ఇంతటితో టుటోరియల్ ముగింపుకి వచ్చాం.
09:43 మన స్లయిడ్స్ కు తిరిగి వెళదామ్.
09:45 సారాంశం చూద్దాం
09:47 ఈ టుటోరియల్ లో మనం
09:50 వైల్ లూప్, ఉదాహరణకు వైల్ (x, 10 కన్నా తక్కువ లేదా సమానమా)(while x is less than or equal to 10).
09:54 డూ వైల్ లూప్
09:56 ఉదాహరణ డూ స్టేట్మెంట్ బ్లాక్ మరియు,
09:59 చివరికి వైల్ కండిషన్ నేర్చుకున్నాం.
10:01 ఒక అసైన్మెంట్,
10:03 ఈ క్రిందవి ముద్రించేలా, ఫర్ లూప్ ఉపయోగించి ఒక ప్రోగ్రాం రాయండి.
10:07 0 నుండి 9
10:10 ఫర్ లూప్ వాక్యనిర్మాణం
10:12 ఫార్(వేరియబల్ ప్రారంభిక విలువ; వేరియబల్ కండిషన్; వేరియబల్ పెంచుట లేదా తగ్గించుట ) for (variable initialization; variable condition; and variable increment or decrement)
10:20 మరియు ఇది లూప్ యొక్క ప్రధాన భాగం.
10:24 ఈ లింక్ లోని వీడియో చూడగలరు.
10:27 ఇది స్పోకన్ టుటోరియల్ సారాంశం.
10:30 మీ వద్ద మంచి బాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
10:33 స్పోకన్ టూటోరియల్ ప్రాజెక్టు టీమ్.
10:35 స్పోకన్ టుటోరియల్స్ ద్వారా వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
10:38 ఆన్ లైన్ పరీక్షలో పాస్ ఐతే సర్టిఫికట్ ఇవ్వబడును.
10:42 మరిన్ని వివరాలకు spoken హైఫాన్ tutorial డాట్ orgను సంప్రదించగలరు.
10:47 స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఎ టీచర్ ప్రాజక్టులోఒక భాగం.
10:51 దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
10:58 దీ నిపై మరింత సమాచారం spoken హైఫన్ tutorialడాట్ org స్లాష్ NMEICT హైపన్ Introలో ఉంది.
11:02 ఈ రచనకు సహాయపడినవారుశ్రీహర్ష ఎ.ఎన్. మరియు మాధురి గణపతి.
11:08 పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, PoojaMoolya, Yogananda.india