BASH/C2/Globbing-and-Export-statement/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Globbing and Export command పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము,
00:08 Globbing, export command లను గురించి నేర్చుకుంటాము.
00:11 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి మీకు Linux Operating System గురించి అవగాహన ఉండాలి.
00:18 ఒక వేళ లేకపోతే, సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా వెబ్ సైట్ ను సందర్శించండి.
00:24 ఈ ట్యుటోరియల్ కొరకు నేను,
00:27 Ubuntu Linux 12.04 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు
00:31 GNU Bash version 4.1.10 లను ఉపయోగిస్తున్నాను.
00:35 GNU Bash వర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్ లు ఈ ట్యుటోరియల్ ప్రాక్టీస్ కొరకు సిఫారసు చేయబడినవి.
00:43 మనం globbing యొక్క పరిచయం తో ప్రారంభిద్దాము.
00:46 BASH చే జరిగే Filename లేదా pathname లకు జరిగే విస్తరణనే Globbing అని అంటాము.
00:52 Globbing అనేది wildcardsను గుర్తిస్తుంది మరియు విస్తరిస్తుంది.
00:57 ఇది ప్రామాణిక wildcard, క్యారెక్టర్ లు అయిన *(asterisk) మరియు ?(Question mark),
01:02 వంటి అక్షరాలను కూడా అనువదిస్తుంది.
01:05 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధంచేసుకుందాం.
01:09 Terminal windowను, Ctrl+Alt మరియు T కీ లను మీ కీ బోర్డు పై ఒకేసారి నొక్కడం ద్వారా తెరవండి.
01:18 Terminal పై ls space asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:27 ఇది ప్రస్తుత డైరెక్టరీలో ఉన్న అన్ని .sh extension ఫైళ్ళను మ్యాచ్ చేస్తుంది.
01:34 ఇక్కడ, మనము అన్ని sh ఫైళ్ళు లిస్ట్ అగుటను చూడవచ్చు.
01:40 నేను prompt ను క్లియర్ చేస్తాను. ఇప్పుడు ls space s asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
01:51 s asterisk dot sh అనే కమాండ్ s అక్షరంతో ప్రారంభమవుతూ, sh పొడిగింపుగా ఉన్న అన్ని ఫైళ్ళ కోసం పోల్చడాన్ని మనం చూడవచ్చు.
02:02 ముందుకు వెళ్దాం.
02:04 ఇప్పుడు, ls space opening square bracket a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:19 ఇది a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే ఫైళ్ళ కోసం వెతికి, ప్రదర్శిస్తుంది.
02:26 output ను గమనించండి.
02:28 మనము a లేదా b లేదా c అక్షరంతో ప్రారంభమయ్యే అన్ని ఫైళ్ళ యొక్క జాబితాను చూస్తాము.
02:35 ఈ ఫైళ్ళ sh extension ను కలిగి ఉంటాయి.
02:39 ఇప్పుడు ముందుకు వెళ్ళి, ls space opening square bracket caret-sign a hyphen c closing square bracket asterisk dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి
02:55 ఇది sh extension గా కలిగిన అన్ని ఫైళ్ళ పేర్ల కోసం వెతుకుతుంది.
03:00 కానీ a లేదా b లేదా c గా అక్షరాలతో మొదలయ్యే వాటిని వదిలేస్తుంది.
03:07 అవుట్ పుట్ ను గమనించండి. a, b లేదా c అక్షరాలతో ప్రారంభమయ్యే ఫైళ్ళు లేవని మీరు గమనిస్తారు.
03:16 నేను prompt ను క్లియర్ చేస్తాను.
03:19 ఇప్పుడు ls space opening square bracket capital A small a closing square bracket asterisk-sign dot sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
03:34 ఇది ఎగువ A లేదా దిగువ a తో ప్రారంభమయ్యే ఫైళ్ల పేర్ల కోసం వెతికి, ఇస్తుంది.
03:40 అవుట్ పుట్ ను చూడండి.

ఎగువ A లేదా దిగువ a తో ప్రారంభమయ్యే మరియు పొడిగింపు sh తో ఉన్న అన్ని ఫైళ్ళ పేర్లు లిస్ట్ అవుతాయి.

03:49 ఇప్పుడు BASH లోని Export command ను చూద్దాము.
03:53 మన slides కు మారండి.
03:55 Bash లో, వేరియబుల్స్, వాటి స్వంత shell కు local గా ఉంటాయి.
04:00 Local variables ను, అదే Shell చే లేదా ప్రస్తుత shell చే ఉపయోగించవచ్చు.
04:06 Export command- variable లేదా function ను child processes యొక్క environment కు ఎగుమతి చేస్తుంది.
04:15 local వేరియబుల్ ను global వేరియబుల్ గా కూడా మార్చవచ్చు.
04:20 మనం దీనిని ఒక ఉదాహరణ సహాయంతో అర్ధం చేసుకోడానికి ప్రయత్నిద్దాం.
04:24 Terminalకు, మారి, myvar equal to sign lion అని టైప్ చేసి, Enterను నొక్కండి.
04:34 ఇప్పుడు, echo space dollar-sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
04:41 lion అనేది ముద్రించబడింది.
04:44 ఇది variable myvarకు కేటాయించిన విలువ.
04:48 ఇప్పుడు, ఒక కొత్త Shell కు నావిగేట్ చేద్దాం.
04:51 ఒక కొత్త Shellకు వెళ్ళడానికి, మనం ఒక క్రొత్త Terminalను తెరవవచ్చు లేదా slash bin slash bash అని టైప్ చేసి Enter నొక్కండి.
05:03 ఇప్పుడు, వేరియబుల్ myvar లో విలువను తనిఖీ చేద్దాం.
05:07 echo space dollar-sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:15 ఒక ఖాళీ లైన్ ముద్రించబడింది.
05:17 దీని అర్ధం variable myvarకు కేటాయించిన విలువ ఈ Shell కు బదిలీకాలేదు.
05:24 అలాగే, వేరియబుల్ myvar అనేది, క్రితం Shell కు మాత్రమే local, ప్రస్తుత shell కు కాదు.
05:32 మనం మునుపటి Shell తెరిగి వెళ్ళుటకు exit అని టైప్ చేస్తాము.
05:36 కాబట్టి, వేరియబుల్స్ ను global గా డిక్లేర్ చేయుటకు, export command ను ఉపయోగించాలి.
05:43 ఎలాగో తెలుసుకుందాము.
05:46 export space myvar equal to sign lion అని టైప్ చేసి Enter నొక్కండి.
05:55 ఇప్పుడు echo space dollar sign myvar అని టైప్ చేసి, Enter నొక్కండి.
06:02 lion అని ప్రదర్శింపబడింది.
06:05 మరొక Shell కు నావిగేట్ అవుదాం. slash bin slash bash అని టైప్ చేసి Enter నొక్కండి.
06:13 నేను prompt ను క్లియర్ చేస్తాను.
06:15 ఇప్పుడు echo space dollar-sign myvar అని టైప్ చేయండి.
06:22 lion అనేది ప్రదర్శింపబడింది.
06:25 ఇది ఎందుకంటే, మనము export command ఉపయోగించి, myvar వేరియబుల్ ను గ్లోబల్ గా డిక్లేర్ చేసాము.
06:33 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
06:36 సారాంశం చూద్దాం. మన slides కు వెళ్ళండి.
06:39 ఈ ట్యుటోరియల్ లో మనము,
06:41 Globbing, Export command గురించి నేర్చుకున్నాము.
06:44 ఒక అసైన్మెంట్ గా, globbing లో చర్చించిన అన్ని కార్యకలాపాలను చేయడానికి, ఒక Bash script ను వ్రాయండి.
06:51 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:54 ఇది స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశం ను ఇస్తుంది.
06:57 ఒకవేళ మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
07:02 Spoken Tutorial ప్రాజెక్ట్ బృందం
07:05 స్పోకన్ ట్యుటోరియల్స్ ను ఉపయోగించి వర్క్ షాప్లను నిర్వహిస్తుంది.
07:08 online పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
07:12 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
07:20 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a teacher ప్రాజెక్ట్ లో భాగం.
07:24 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులను సమకూరుస్తుంది.
07:31 ఈ మిషన్ ఫై మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.

http://spoken-tutorial.org/NMEICT-Intro

07:37 FOSSEE మరియు Spoken-Tutorial బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడ్డాయి.
07:42 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది రమ్య. మరి నేను ఉదయ లక్ష్మి.
07:47 మీ వద్ద సెలవు తీసుకున్నాను ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india