BASH/C2/Array-Operations-in-BASH/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Array operations in BASH పై spoken tutorial కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్ లో, మనం array ను డిక్లేర్ చేయడం మరియు వాటికి విలువలను కేటాయించడం.
00:12 డిక్లరేషన్ సమయంలో array కు ప్రారంభ విలువ ఇవ్వడం.
00:15 array పొడవు మరియు దాని nth elementను కనుగొనడం.
00:20 array ను ముద్రించడం నేర్చుకుంటాము.
00:22 ఈ ట్యుటోరియల్ ని అనుసరించడానికి, మీకు Linux Operating System గురించి కొంత అవగాహన ఉండాలి.
00:27 సంబంధిత ట్యుటోరియల్స్ కోసం, దయచేసి spoken hyphen tutorial dot org ను సందర్శించండి.
00:33 ఈ ట్యుటోరియల్ కోసం నేను,
00:37 Ubuntu Linux 12.04 OS ఆపరేటింగ్ సిస్టం మరియు
00:41 GNU BASH వర్షన్ 4.1.10 లను ఉపయోగిస్తున్నాను.
00:45 GNU Bash వర్షన్ 4 లేదా అంతకన్నా పై వర్షన్లు ప్రాక్టీస్ కొరకు సిఫార్సు చేయబడినవి.
00:50 మనము array యొక్క నిర్వచనంతో మరియు దాని లక్షణాలతో ప్రారంభిద్దాం.
00:55 array అనేది బహుళ values తో కూడిన ఒక variable.
01:01 విలువలు అన్ని ఒకే రకానికి లేదా విభిన్న రకాలకు చెంది ఉండవచ్చు.
01:04 array size పై ఎటువంటి గరిష్ట పరిమితి లేదు.
01:08 Array సభ్యులు వరుసగా ఉండవలసిన అవసరం లేదు.
01:12 Array index ఎల్లప్పుడూ zero తో మొదలవుతుంది.
01:16 ఇప్పుడు మనం arrayను డిక్లేర్ చేయడం మరియు దానికి value ను కేటాయించడం ఎలానో చూద్దాం.
01:21 array ను డిక్లేర్ చేయడానికి సింటాక్స్-
01:24 declare hyphen a arrayname.
01:28 declare కీవర్డ్ ను arrayను డిక్లేర్ చేయడానికి ఉపయోగిస్తాం.
01:31 ఇది Bash లో అంతర్నిర్మిత command.
01:35 array కు విలువను కేటాయించుటకు సింటాక్స్ -
01:38 Name స్క్వేర్ బ్రాకెట్స్ లో index equals to సింగల్ కోట్స్ లోపల value.
01:46 ఇప్పుడు, డిక్లరేషన్ సమయంలో array కు ప్రారంభ విలువ ఇవ్వడం ఎలానో చూద్దాం.
01:51 Array ను ఒకేసారి డిక్లేర్ చేయవచ్చు మరియు ప్రారంభించవచ్చు.
01:56 Elements ను space ద్వారా వేరుచేయాలి.
02:00 ప్రతి element parentheses లోపల ఉండాలి.
02:03 declare hyphen a arrayname equal to విత్ ఇన్ రౌండ్ బ్రాకెట్స్, విత్ ఇన్ సింగల్ కోట్స్ element1, element2, element3 అనేది సింటాక్స్.
02:19 మనం ఒక ఉదాహరణను ప్రయత్నిద్దాం.
02:21 Ctrl + Alt మరియు T కీ లను కలిపి ఒకేసారి నొక్కి, terminal ను తెరవండి.
02:28 ఇప్పుడు gedit space array.sh స్పేస్ ampersand (&) అని టైప్ చేయండి.
02:36 మనం prompt ను ఫ్రీ చేయడానికి ampersand ను ఉపయోగిస్తాం. Enter నొక్కండి.
02:41 ఇక్కడ చూపించిన విధంగా codeను, మీ ఫైల్ "array.sh" లో టైప్ చేయండి.
02:47 ఈ లైన్ Linux అను పేరుగల array ను- Debian, Redhat, Ubuntu మరియు Fedora వంటి అంశాలతో డిక్లేర్ చేస్తుంది.
02:57 ఇక్కడ హైఫన్ a అనేది flag.
03:00 ఇది array కు values ని చదవడానికి మరియు కేటాయించడానికి మనల్ని అనుమతిస్తుంది.
03:05 తిరిగి మన slides కు మారండి.
03:07 array యొక్క పొడవు ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు.
03:12 డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ హాష్ arrayname విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ At (@) గుర్తు మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
03:22 nth element యొక్క పొడవు ను ఈ సింటాక్స్ ద్వారా పొందవచ్చు.
03:28 డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ హాష్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లోపల n మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
03:37 ఇక్కడ n అనేది పొడవు కనుగొనవలసిన element యొక్క సంఖ్య.
03:42 array యొక్క అన్ని ఎలిమెంట్లను ఈ సింటాక్స్ ఉపయోగించి ముద్రించవచ్చు.
03:48 డాలర్ ($) ఓపెనింగ్ కర్లీ బ్రాకెట్ arrayname స్క్వేర్ బ్రాకెట్స్ లోపల "At" గుర్తు (@) మరియు క్లోసింగ్ కర్లీ బ్రాకెట్.
03:57 ఇప్పుడు తిరిగి మన text editor కు రండి.
04:00 ఈ లైన్ array Linux లోని ఎలిమెంట్స్ యొక్క మొత్తం సంఖ్యని ప్రదర్శిస్తుంది.
04:06 హైఫన్ e, బాక్ స్లాష్ escape యొక్క ఇంటర్ ప్రెటేషన్ ను అనుమతిస్తుంది.
04:11 మనం లైన్ చివరిలో బాక్ స్లాష్ n కలిగి ఉన్నందున దీనిని చేర్చాము.
04:18 తరువాత లైన్ array Linux యొక్క అన్ని అంశాలని ప్రదర్శిస్తుంది.
04:23 ఈ లైన్ array Linux యొక్క 3 rd ఎలిమెంట్ ని ప్రదర్శిస్తుంది.
04:28 array యొక్క index ఎల్లప్పుడూ సున్నాతో మొదలవుతుందని గమనించండి.
04:34 చివరగా, ఈ లైన్ 3 rd ఎలిమెంట్ లో ఉన్న అక్షరాల యొక్క సంఖ్యను ప్రదర్శిస్తుంది.
04:40 ఇప్పుడు Terminal కు మారండి.
04:42 మొదట chmod స్పేస్ plus x space array.sh అని టైప్ చేయడం ద్వారా ఫైల్ ను ఎగ్జిక్యూటబుల్ చేద్దాం. Enter నొక్కండి.
04:56 dot slash array.sh అని టైప్ చేసి, Enter నొక్కండి.
05:01 output ప్రదర్శింపబడుతుంది.
05:04 array Linux లోని ఎలిమెంట్స్ సంఖ్య లేదా దాని పొడవు నాలుగు.
05:10 array Linux యొక్క ఎలిమెంట్స్ Debian, Redhat, Ubuntu మరియు Fedora.
05:18 array Linux యొక్క మూడవ ఎలిమెంట్ Ubuntu.
05:22 మనం ఉహించునట్లుగా మూడవ ఎలిమెంట్ లోని అక్షరాల సంఖ్య ఆరు.
05:29 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
05:32 సారాంశం చూద్దాం. తిరిగి మన slides కు రండి.
05:35 ఈ ట్యుటోరియల్ లో, మనం
05:40 array ను డిక్లేర్ చేయడం మరియు విలువలను కేటాయించడం.
05:43 డిక్లరేషన్ సమయంలో array ను ప్రారంభించడం.
05:46 array పొడవు మరియు దాని nth ఎలిమెంట్ ను కనుగొనటం.
05:51 మొత్తం array ను ముద్రించడం గురించి నేర్చుకున్నాం.
05:53 ఒక అసైన్మెంటుగా-
05:55 names అనే array ను పొడవు 7 తో డిక్లేర్ చేయండి.
06:00 మొత్తం ఎలెమెంట్స్ యొక్క సంఖ్య కనుక్కోండి.
06:02 అన్ని ఎలెమెంట్స్ ని ముద్రించండి.
06:04 5th ఎలిమెంట్ ని ముద్రించండి.
06:06 క్రింద చూపిన లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
06:10 ఇది స్పోకన్-ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంక్షిప్తీకరిస్తుంది.
06:13 ఒకవేళ మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేకపోతే, మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చూడవచ్చు.
06:18 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం,
06:20 స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.
06:24 ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
06:27 మరిన్ని వివరాల కోసం, దయచేసి contact@spoken-tutorial.org కు వ్రాయండి.
06:35 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ లో భాగం.
06:40 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
06:47 మరింత సమాచారం క్రింద చూపిన లింక్ లో అందుబాటులో ఉంది.
06:52 FOSSEE మరియు స్పోకన్-ట్యుటోరియల్ బృందం ఈ స్క్రిప్ట్ కు దోహదపడింది.
06:58 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది నాగూర్ వలి.
07:02 మరియు నేను ఉదయ లక్ష్మి మీ వద్ద సెలువు తీసుకుంటున్నాను ధన్యవాదాలు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Yogananda.india