Synfig/C3/Basic-bone-animation/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:05, 19 November 2020 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 Synfig ను ఉపయోగించి Basic bone animation పై ఈ Spoken Tutorial కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్‌లో, మనం Synfig ‌లో Skeleton ఎంపికను ఉపయోగించి ఒక కేరక్టర్ ను యానిమేట్ చేయడం నేర్చుకుంటాము.
00:13 మనం వీటిని కూడా నేర్చుకుంటాము: బోన్స్ ను జోడించడం,
00:17 శరీరానికి బోన్స్ ను అటాచ్ చేయడం మరియు బోన్స్ నుయానిమేట్ చేయడం.
00:22 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను: ఉబుంటు లైనక్స్ 14.04 OS
00:31 Synfig వర్షన్
00:36 మనం ఇప్పుడు ప్రారంభిద్దాం. మనం Synfig లో ఉన్నాము.
00:40 నా మెషీన్ పైన సేవ్ చేయబడిన Synfig-character ఫైల్ ను నేను తెరుస్తాను.
00:47 ఈ ఫైల్ మీకు Code Files లింక్‌లో అందించబడింది. దయచేసి దానిని డౌన్‌లోడ్ చేసి ఉపయోగించండి.
00:57 శరీరం యొక్క అన్ని భాగాలు వేర్వేరు లేయర్స్ లో ఉన్నాయని నిర్ధారించుకోండి.
01:02 ఇప్పుడు, మనం Skeleton ను ఉపయోగించి, స్థిరమైన (జాయింట్స్) కీళ్ళతో శరీరం యొక్క ఎగువ భాగాన్ని రిగ్ చేయడం నేర్చుకుంటాము.
01:11 దానికంటే ముందు, మనం గ్రూప్స్ ను సృష్టించాలి. ఉదాహరణకు - ఎడమ చేయిని ఎగువ ఎడమ మోచేయి, దిగువ ఎడమ మోచేయి మరియు ఎడమ అరచేతితో తయారు

చేయాలి.

01:25 కనుక, మనం ఈ మూడు లేయర్స్ ను గ్రూప్ చేయాలి మరియు దానికి L-hand అని పేరును పెట్టాలి.
01:32 అదేవిధంగా, ఇతర లేయర్స్ ను గ్రూప్ చెయ్యండి.
01:36 ఇక్కడ చూపిన విధంగా గ్రూప్ లేయర్స్ కు L-hand, R-hand, Head, Neck మరియు Trunk గా పేర్లను పెట్టండి.
01:46 మనం ఈ ఫైల్ ను Save As ఎంపికను ఉపయోగించి సేవ్ చేద్దాం.
01:50 File కు వెళ్లి, Save As పై క్లిక్ చేయండి.
01:54 మీకు ఇష్టమైన స్థానాన్ని ఎంచుకుని, ఆపై ఫైల్ పేరును Basic hyphen bone hyphen animation అని టైప్ చేయండి
02:03 తరువాత Save బటన్ పై క్లిక్ చేయండి.
02:06 ఇప్పుడు, Layers pane ‌కు వెళ్లండి
02:10 గ్రూప్ చేసిన ఈ అన్నిlayers తో మరొక గ్రూప్ ని తయారు చేసి, దానికి Character అని పేరును పెట్టండి.
02:17 ఇప్పుడు, త్రిభుజాకార షేప్ పై క్లిక్ చేయడం ద్వారా Character గ్రూప్ ని తెరవండి.
02:23 Character layer యొక్క ఎగువ లేయర్ పైన రైట్ క్లిక్ చేయండి.
02:27 New layer కు వెళ్లి, తర్వాత Other కు వెళ్లి, Skeleton పై క్లిక్ చేయండి.
02:33 మనం కాన్వాస్‌పై ఒక bone ను పొందుతాము.
02:37 Transform tool పై క్లిక్ చేసి, bone యొక్క ఆకుపచ్చరంగు బిందువును ఎంచుకోండి.
02:42 mouse ని పట్టుకుని లాగండి మరియు బోన్ ను కేరక్టర్ యొక్కTrunk పార్ట్ వైపుకు తరలించండి.
02:49 ఇప్పుడు ప్రదర్శించిన విధంగా bone ను ఉంచండి.
02:53 తరువాత, bone యొక్క లెన్త్ ను సర్దుబాటు చేయడానికి bone యొక్క orange డాట్ ను ఉపయోగించండి.
03:00 దీని తరువాత, bone యొక్క నారింజరంగు బిందువుపై రైట్ క్లిక్ చేయండి.
03:04 ఆపై Create child bone ఎంపిక పై క్లిక్ చేయండి.
03:10 ఇంతకు ముందు వివరించిన విధంగా Trunk యొక్క పై భాగంలోని child bone యొక్క లెన్త్ ను సర్దుబాటు చేయండి.
03:17 ఇదే పద్ధతిలో, (మెడ, తల మరియు చేతుల) నెక్, హెడ్ మరియు హాండ్స్ కొరకు bones ను జోడించండి మరియు సర్దుబాటు చేయండి.
03:41 ఇప్పుడు Skeleton layer అనేది శరీరం లోపల ఉంచబడింది.
03:45 తరువాత, మనం శరీరంలోని ప్రతి భాగానికి బోన్స్ ను అటాచ్ చేస్తాము.
03:50 దాని కొరకు, Layers panel కి వెళ్లండి. R-upper-arm layer పై రైట్ క్లిక్ చేసి, ఆపై Select all child layers పైన చేయండి.
04:00 కాన్వాస్‌కు వెళ్లండి. కుడి ఎగువ మోచేయి యొక్క అన్ని nodes ను ఎంచుకోవడానికి, Shift కీని ఉపయోగించి మౌస్ ని పట్టుకొని లాగండి.
04:11 Ctrl కీని నొక్కండి, ఆపై Skeleton layer ను ఎంచుకోండి.
04:18 R-upper-arm యొక్క bone యొక్క ఏదైనా node పైన రైట్ క్లిక్ చేయండి
04:23 Link to bone ఎంపికపై క్లిక్ చేయండి.
04:28 అదేవిధంగా, Link to bone ‌ను ఉపయోగించడం ద్వారా శరీరం యొక్క ప్రతీ ఒక్క భాగాన్ని దాని సంబంధిత bone ను అటాచ్ చేయాలి.
04:50 శరీరం యొక్క ప్రతీ ఒక్క భాగాన్ని Skeleton కు తప్పనిసరిగా అటాచ్ చేయాలి.
04:56 అప్పుడే మనం శరీరం యొక్క అన్ని భాగాలను bones ను ఉపయోగించి యానిమేట్ చేయగలము.
05:02 ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl మరియు S కీలను నొక్కండి.
05:06 ఇప్పుడు మనం యానిమేట్ చేయడం ప్రారంభిద్దాం.
05:09 Layers panel కు వెళ్లి, Skeleton layer ను ఎంచుకోండి.
05:13 animate editing mode ఐకాన్ ను టర్న్ ఆన్ చేయండి.
05:16 Time track panel కు వెళ్లి, cursor ను 20th ఫ్రేమ్‌లో ఉంచండి.
05:22 వివిధ రంగులలో ఉన్న డాట్స్ ను గమనించండి.
05:25 బ్లూ డాట్ అనేది రొటేషన్ కోసం.
05:27 ఆరెంజ్ డాట్ అనేది స్కేలింగ్ కోసం.
05:30 ఇంకా, గ్రీన్ డాట్ అనేది Skeleton లో స్థానభ్రంశం (డిస్ప్లేస్మెంట్) కోసం.
05:35 మనం canvas కు వెళ్దాం.
05:38 కుడి చేతి యొక్క దిగువ మోచేయి భాగంలో ఉన్నbone యొక్క నీలంరంగు బిందువును ఎంచుకోండి.
05:44 ప్రదర్శించిన విధంగా బ్లూ డాట్ ను కదిలించడం ద్వారా దిగువ మోచేయి ఎముకను కదపండి.
05:49 Time track panel కు వెళ్లి, cursor ను 32nd</sup ఫ్రేమ్‌లో ఉంచండి.
05:56 Canvas కు తిరిగి వెళ్లి, ప్రదర్శించిన విధంగా దిగువ మోచేయి ఎముకను కదపండి.
06:02 మళ్ళీ, Time track panel కు వెళ్లి, cursor ను 48nd</sup ఫ్రేమ్‌లో ఉంచండి.
06:09 Canvas కు వెళ్లి, ప్రదర్శించిన విధంగా దిగువ మోచేయి ఎముకను కదపండి.
06:15 తరువాత, అదే ఫ్రేమ్ లోని అరచేతి ఎముక యొక్క నీలంరంగు బిందువును ఎంచుకోండి.
06:21 తరువాత ప్రదర్శించిన విధంగా అరచేతి ఎముకని కదపండి.
06:25 మళ్ళీ ఇంకోసారి, Time track panel కు వెళ్లి, cursor ను 63nd</sup ఫ్రేమ్‌లో ఉంచండి.
06:34 Canvas కు తిరిగి వెళ్లి, చూపించిన విధంగా దిగువ మోచేయి ఎముకను కదపండి.
06:40 మనం L-hand ను కూడా అదే పద్దతిలో యానిమేట్ చేస్తాము.
06:43 canvas కు వెళ్లి, ఎడమ చేతి యొక్క మోచేయి క్రింది ఎముకపైన నీలిరంగు బిందువును ఎంచుకోండి.
06:50 Time track panel కు వెళ్లి, cursor ను 20th ఫ్రేమ్‌లో ఉంచండి.
06:56 Canvas కి వెళ్ళండి.
06:59 నీలిరంగు బిందువును లాగి, ఎడమ చేతి యొక్క మోచేయి క్రింది bone ని ప్రదర్శించినట్లుగా తరలించండి.
07:06 చివరగా,Turn off animate editing mode ఐకాన్ పై క్లిక్ చేయండి.
07:11 canvas యొక్క దిగువభాగం వద్ద ఉన్న Seek to begin పై క్లిక్ చేయండి.
07:15 Play బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా యానిమేషన్‌ను ప్లే చేయండి.
07:28 మళ్ళీ ఇంకోసారి ఫైల్ ను save చెయ్యండి.
07:31 ఇప్పుడు మనం preview ను తనిఖీ చేద్దాం.
07:36 File కు వెళ్లి, ఆపై Preview పై క్లిక్ చేయండి.
07:40 Quality ను 0.5 గా మరియు Frame per second ను 24 గా సెట్ చేయండి.
07:45 Preview బటన్ పై క్లిక్ చేసి, ఆపై Play బటన్ పై క్లిక్ చేయండి.
07:51 యానిమేషన్ యొక్క ప్రివ్యూను మనం screen పైన చూడవచ్చు.
07:56 Preview window ని మూసివేద్దాం.
07:58 ఇప్పుడు, మనం యానిమేషన్‌ను రెండర్ చేద్దాం.
08:02 అలా చేయడానికి, File పై క్లిక్ చేసి, ఆపై Render పై క్లిక్ చేయండి.
08:08 Render setting విండోకు వెళ్ళండి.
08:10 Choose పై క్లిక్ చేసి, Save render as విండోను తెరవండి.
08:15 ఫైల్‌ను సేవ్ చేయడానికి లొకేషన్ ను ఎంచుకోండి. నేను Desktop ‌ను ఎంచుకుంటున్నాను.
08:21 ఫైల్ పేరును Basic hyphen bone hyphen animation dot avi కు మార్చండి.
08:27 Target డ్రాప్ డౌన్ మెనుపై క్లిక్ చేసి, ఎక్సటెన్షన్ ను ffmpeg గా ఎంచుకోండి.
08:35 Time టాబ్‌పై క్లిక్ చేసి, End time ను 70 కి మార్చండి.
08:40 చివరగా, Render పై క్లిక్ చెయ్యండి.
08:45 ఇప్పుడు మనం మన యానిమేషన్‌ను తనిఖీ చేద్దాం.
08:48 Desktop కు వెళ్లి, Basic-bone-animation. avi ‌ను ఎంచుకోండి.
08:56 Firefox web browser ని ఉపయోగించి, రైట్ క్లిక్ చేసి యానిమేషన్‌ను ప్లే చేయండి.
09:03 దీనితో మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. సారాంశం చూద్దాం.
09:10 ఈ ట్యుటోరియల్‌లో, మనం Synfig ‌లోని basic bone యానిమేషన్ గురించి నేర్చుకున్నాము.
09:16 మనం బోన్స్ ను జోడించడం, బోడి కి బోన్స్ ను అటాచ్ చేయడం మరియు బోన్స్ ను యానిమేట్ చేయడం కూడా నేర్చుకున్నాము.
09:24 మీ కొరకు ఇక్కడ ఒక అసైన్మెంట్.
09:26 Code files లింక్‌లో మీకు ఇవ్వబడిన సిన్‌ఫిగ్ ఫైల్‌ను తెరవండి.
09:31 బోన్స్ ను జోడించి హ్యాండ్ ని యానిమేట్ చేయండి.
09:35 మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
09:40 ఈ వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని చూడండి.
09:47 మేము Spoken Tutorials ఉపయోగించి వర్కుషాప్స్ నిర్వహించి సర్టిఫికెట్ లు ఇస్తాము. దయచేసి మమ్మల్ని సంప్రదించండి.
09:55 దయచేసి మీ సమయం తో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
09:59 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT ,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
10:06 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya