Synfig/C2/Overview-of-Synfig/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 13:52, 23 November 2020 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 Overview and Installation of Synfig అను Spoken Tutorial కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము: Synfig యొక్క ఇంటర్ఫేస్
00:13 Synfig లో డ్రాయింగ్ మరియు యానిమేటింగ్ ఇంకా వివిధ ట్యుటోరియల్‌లలో లభించే కంటెంట్
00:22 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను: Ubuntu Linux OS వర్షన్ 16 .04
00:30 Synfig వర్షన్ 1.0.2
00:35 ఈ ట్యుటోరియల్‌ను అనుసరించడానికి, మీకు Inkscape యొక్క పరిజ్ఞానం
00:40 మరియు యానిమేషన్ యొక్క ప్రిన్సిపుల్స్ పై అవగాహన ఉండాలి
00:43 మొదట, Synfig గురించి తెలుసుకుందాం.
00:46 Synfig అనేది 2D యానిమేషన్ సాఫ్ట్‌వేర్. ఇది ఒక ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్.
00:53 తరువాత, మనం సిన్ఫిగ్ యొక్క కొన్ని ఫ్రీచర్స్ ను నేర్చుకుందాం.
00:57 ఇది Linux, Windows మరియుMac ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పనిచేస్తుంది
01:02 ఇది వివిధ రకాల ఆకారాలను గీయగలదు మరియు టెక్స్ట్ యానిమేషన్‌ను సృష్టించగలదు
01:07 ఇది png ఇమేజెస్ ను ఇంపోర్ట్ చేసుకొని ఆ ఇమేజెస్ ను యానిమేట్ చేయగలదు
01:12 ఇది Cutout యానిమేషన్‌ను సృష్టిస్తుంది
01:16 ఇది Character walk cycle ను కూడా సృష్టిస్తుంది

అవుట్‌పుట్‌ను gif, avi మరియు అనేక ఇతర ఫార్మాట్లలో ఇవ్వగలదు.

01:26 Synfig ను 2D యానిమేటర్లు
01:30 యానిమేషన్ పట్ల ఆసక్తి ఉన్న పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు.
01:34 తరువాత మనం Ubuntu OS పై Synfigను ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం.
01:39 ఇన్స్టాలేషన్ విధానాన్ని అనుసరించడానికి, మీరు Internet కు కనెక్ట్ అయి ఉండాలి.
01:44 Ctrl + Alt + T కీలను కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
01:50 ఇప్పుడు terminal లో sudo space apt hyphen get install synfigstudio అని టైప్ చేసి Enter ను నొక్కండి.

ఒకవేళ అవసరమైతే system password ను Enter చేయండి.

02:07 ఎంత డిస్క్ స్పేస్ ని ఆక్రమిస్తుంది అనే సందేశాన్నిఇది ప్రదర్శిస్తుంది.
02:13 దీన్ని ధృవీకరించడానికి Y అని టైప్ చేసి, Enter నొక్కండి.

ఇది Synfig ‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది.

02:18 మనం Synfig విజయవంతంగా ఇన్‌స్టాల్ చేయబడిందో లేదో అని తనిఖీచేద్దాం.
02:22 terminal లో, synfigstudio అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:28 Synfig console తెరుచుకోవడాన్ని మనం చూడవచ్చు.
02:31 ఇప్పుడు మనం Windows ఆపరేటింగ్ సిస్టమ్‌ పై Synfig యొక్క ఇన్‌స్టాలేషన్ నేర్చుకుందాం.
02:37 ఇన్స్టాలేషన్ విధానాన్ని అనుసరించడానికి, మీరు Internet కు కనెక్ట్ అయి ఉండాలి.

మీ డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్‌ను తెరవండి.

02:45 address bar లో, ఈ url : https://www.synfig.org/download-stable

ను టైప్ చేసి Enter నొక్కండి.

03:02 Choose your OS డ్రాప్ డౌన్ బాక్స్‌ లో, మీ OS వివరాలను ఎంచుకోండి -Windows 64bit / Windows 32bit.

నేను Windows 64bit ‌ను ఎంచుకుంటాను.

03:15 Name a fair price ఫీల్డ్‌లో, 0 (సున్నా) అని టైప్ చేసి, GET SYNFIG ని నొక్కండి.

ఒక పాపప్ విండో కనిపిస్తుంది.

03:23 చూపిన విధంగా మీ ఇమెయిల్-ఐడిని టైప్ చేయండి. Continue పై క్లిక్ చేయండి
03:29 తరువాత, డ్రాప్‌డౌన్ బాక్స్‌లో మీ స్థానాన్ని ఎంచుకుని, Continue ని నొక్కండి.

Complete Checkout పై క్లిక్ చేయండి.

03:37 మీకు Paddle help@paddle.com నుండి ఒక ఇమెయిల్ వస్తుంది.

మీ ఇమెయిల్‌ను తనిఖీ చేసి, మెయిల్‌లోని Download బటన్ పై క్లిక్ చేయండి.

03:47 ఒక పాపప్ విండో కనిపిస్తుంది. Saveపై క్లిక్ చెయ్యండి.
03:51 Downloads folder కు వెళ్లి, Synfig యొక్క .exe ఫైల్ పై డబుల్ క్లిక్ చెయ్యండి.
03:57 ఒక పాప్ అప్ విండో కనిపిస్తుంది. Run బటన్ పై క్లిక్ చేయండి.

Synfig Studio Setup విండో కనిపిస్తుంది.

04:04 License Agreement సెక్షన్ లో, I Agree ను ఎంచుకోండి.

Next పై క్లిక్ చేసి, ఆపై Install పై క్లిక్ చేయండి.

04:14 Close పై క్లిక్ చేయండి. Synfig ఇప్పుడు విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడింది.
04:20 తనిఖీ చేయడానికి, Windows బటన్ పై క్లిక్ చేసి, Synfig అని టైప్ చేయండి.

Synfig తెరుచుకుంటుంది మీరు చూడవచ్చు.

04:28 ఇప్పుడు, మనం ఈ సిరీస్‌లోని ప్రత్యేకమైన ట్యుటోరియల్‌ల ద్వారా క్లుప్తంగా వెళ్తాము.
04:33 ఈ సిరీస్ లోని మొదటి ట్యుటోరియల్ Bouncing ball animation.
04:38 ఇక్కడ మనం Synfig interface ను ఉపయోగించడం

Synfig లో ఒక బాల్ ని గీయడం నేర్చుకుంటాము.

04:45 keyframes మరియు waypoints జోడించడం
04:48 squash ఎఫెక్ట్ తో ఒక బాల్ ని యానిమేషన్ చేయడం. gif ఫార్మాట్ లో ఆ యానిమేషన్ ను Render చేయడం నేర్చుకుంటాము.
04:54 ఇక్కడ ఈ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది.
04:56 canvas పై ఉన్న బాల్ ని ఎంచుకోండి. బాల్ మధ్యలో ఉన్న ఒక ఆకుపచ్చ బిందువును గమనించండి. బాల్ ని canvas యొక్క దిగువ భాగానికి తరలించడానికి ఈ ఆకుపచ్చ బిందువును లాగండి.
05:03 తరువాతి ట్యుటోరియల్ E-card animation.
05:08 Png ఇమేజెస్ ను ఇంపోర్ట్ చేసుకోవడానికి,

ఇమేజెస్ ను యానిమేట్ చేయడానికి, టెక్స్ట్ యానిమేషన్ చేయడానికి ఇది మనకు సహాయపడుతుంది.

05:17 అలాగే మనం యానిమేషన్‌ను ప్రివ్యూ చేయడం మరియు యానిమేషన్‌ను avi ఫార్మాట్‌లో రెండర్ చేయడం నేర్చుకుంటాము.
05:24 నన్ను ఈ ట్యుటోరియల్ ని ప్లే చేయనివ్వండి.
05:26 ఇప్పుడు, ఫోల్డర్‌లోని Cake ఇమేజ్ ను ఎంచుకుని, Import పై క్లిక్ చెయ్యండి. మనం మన canvas పైన Cake ఇమేజ్ ను పొందుతాము.
05:34 తరువాతి ట్యుటోరియల్ Create a Star animation
05:38 ఈ ట్యుటోరియల్‌లో, మనం గ్రేడియంట్ కలర్ యానిమేషన్, గ్రూప్ లేయర్స్ మరియు స్టార్ యానిమేషన్‌ను సృష్టించడం నేర్చుకుంటాము
05:48 ఇక్కడ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది.
05:51 కనుక, Layers panel ‌కు వెళ్లండి. Lower layer బటన్‌ పై రెండుసార్లు క్లిక్ చేయండి. తరువాత మనం నక్షత్రాల యొక్క ఆల్ఫా విలువను యానిమేట్ చేద్దాం. కనుక, Stars group layer ను ఎంచుకోండి.
06:00 తదుపరి ట్యుటోరియల్ Draw a toy train
06:04 ఈ ట్యుటోరియల్‌లో, మనం ప్రాథమిక ఆకృతులను గీయడం,

షేప్స్ కు రంగు వేయడం

06:11 ఆబ్జెక్ట్స్ ను గ్రూప్ & డూప్లికేట్ చేయడం మరియు Guideline ను ఉపయోగించి ఆకారాలను అలైన్ చేయడం నేర్చుకుంటాము.
06:17 మనం ఈ ట్యుటోరియల్ చూద్దాం.
06:19 Shift key ని ఉపయోగించి handle యొక్క మధ్య ఆకుపచ్చరంగు బిందువును లాగండి. Compartment-1 గ్రూప్ లేయర్ కొరకు కూడా ఇదేవిధంగా చెయ్యండి.
06:28 తరువాతి ట్యుటోరియల్ Animate a toy train.
06:33 ఈ ట్యుటోరియల్‌లో మనం మునుపటి ట్యుటోరియల్‌లో సృష్టించిన టాయ్ ట్రైన్ ను యానిమేట్ చేయడం నేర్చుకుంటాము.
06:40 ఇక్కడ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది.
06:44 Time cursor సున్నా ఫ్రేమ్‌లో ఉందని నిర్ధారించుకోండి. Shift కీని ఉపయోగించి, ట్రైన్ ను canvas కు బయట కుడి వైపుకు లాగండి.
06:55 తరువాతి ట్యుటోరియల్ Plant animation
07:00 ఇక్కడ మనం వీటిని నేర్చుకుంటాము- Insert item ను ఉపయోగించి ఒక వెర్టెక్స్ ను జోడించడం
07:05 Split tangent ఎంపికను ఉపయోగించడం

Mark active point as off option ను ఉపయోగించడం

07:12 షేప్స్ ను యానిమేట్ చేయడం
07:14 ఇక్కడ ఈ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది.
07:17 canvas యొక్క దిగువభాగం వద్ద ఉన్న Seek to begin పై క్లిక్ చేయండి. Play ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా యానిమేషన్‌ను ప్లే చేయండి.
07:24 తరువాతి ట్యుటోరియల్ Logo animation
07:28 ఈ ట్యుటోరియల్‌లో మనం వీటిని నేర్చుకుంటాము- Mirror tool ను ఉపయోగించడం
07:32 లోగోను యానిమేట్ చేయడం, Spherize ఎఫెక్ట్ ను సృష్టించడం
07:38 మనం ఈ ట్యుటోరియల్ ను చూద్దాం
07:41 మళ్ళీ, logo.png layeను ఎంచుకోండి. ఇప్పుడు 60th ఫ్రేమ్ కు వెళ్ళండి. ప్రదర్శించినట్లుగా logo ను కొద్దిగా పైకి తరలించండి.
07:51 తరువాతి ట్యుటోరియల్ Basic bone animation
07:55 ఇక్కడ, మనం వీటిని నేర్చుకుంటాము కేరక్టర్ కు బోన్స్ నుజోడించడం మరియు అతికించడం
07:59 Skeleton ఎంపికను ఉపయోగించి కేరక్టర్ ను యానిమేట్ చేయడం
08:03 ఇక్కడ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది.
08:07 కుడి చేతి యొక్క దిగువ మోచేయి భాగంలో ఉన్నbone యొక్క నీలంరంగు బిందువును ఎంచుకోండి.

ప్రదర్శించిన విధంగా బ్లూ డాట్ ను కదిలించడం ద్వారా దిగువ మోచేయి ఎముకను కదపండి.

08:18 తరువాతి ట్యుటోరియల్ Cutout animation.
08:22 ఈ ట్యుటోరియల్‌లో మనం ఒక ఇమేజ్ పై Cutout tool ని ఉపయోగించడం

కటౌట్ షేప్స్ ను యానిమేట్ చేయడం నేర్చుకుంటాము

08:30 ఇక్కడ ఈ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది.
08:34 Cursor ను 70 వ ఫ్రేమ్‌కు తరలించి, Amount విలువను 0 నుండి -6.14 కు మార్చండి.
08:43 తరువాతి ట్యుటోరియల్ Rocket animation.

ఈ ట్యుటోరియల్‌లో మనం ఫైర్ ఎఫెక్ట్, నాయిస్ గ్రేడియంట్ మరియు ఫెదర్ ఎఫెక్ట్‌ను సృష్టించడం నేర్చుకుంటాము

08:56 ఇక్కడ ఈ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది.
09:00 Parameters panel లో, Origin పై క్లిక్ చేయండి. Convert పై క్లిక్ చేసి, ఆపై Linear పై చెయ్యండి. Origin యొక్క డ్రాప్ డౌన్ లిస్ట్ పై క్లిక్ చేయండి.
09:12 తరువాతి ట్యుటోరియల్ అనేది Underwater animation ను సృష్టించడం.
09:17 ఈ ట్యుటోరియల్ లో మనం వీటిని నేర్చుకుంటాము PNGs మరియు SVGs లను ఇంపోర్ట్ చేయడం
09:23 Distortion effect ను ఉపయోగించి ఇమేజ్ ను యానిమేట్ చేయడం
09:27 Noise gradient ను జోడించడం ర్యాండమ్ యానిమేషన్ కొరకు Random option ను ఉపయోగించడం
09:32 అలాగే పై వాటన్నిటిని ఉపయోగించి, మనం ఒక underwater animation ను సృష్టించడం నేర్చుకుంటాము.
09:36 ఇక్కడ ఈ ట్యుటోరియల్ యొక్క సంగ్రహావలోకనం ఉంది.
09:39 Canvas ‌కు తిరిగి రండి.

అన్ని ఇమేజెస్ ను స్కేల్ చేయండి మరియు ఇక్కడ చూపిన విధంగా అండర్ వాటర్ సీన్ ని ఏర్పాటు చేయండి.

09:47 దీనితో, మనం ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము. సారాంశం చూద్దాం.
09:52 ఈ ట్యుటోరియల్‌లో, మనం Synfig గురించి తెలుసుకున్నాము మరియు ఈ సిరీస్ లోని ట్యుటోరియల్‌ల యొక్క గ్లింప్సెస్ (సంగ్రహావలోకనాలను) చూశాము.
10:00 కింది లింక్‌లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి.

10:06 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి.

10:14 ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా?

దయచేసి ఈ సైట్‌ను సందర్శించండి.

10:19 మీకు ఎక్కడ సందేహం ఉందో ఆ నిమిషం మరియు క్షణాన్ని ఎంచుకోండి.

మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం లోని వారు ఎవరైనా వాటికి సమాధానాలు ఇస్తారు.

10:28 ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్.
10:33 దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు.
10:37 ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది. తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు.
10:45 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

10:56 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya