STEMI-2017/C2/Introduction-to-Maestros-Device/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 15:24, 31 July 2020 by PoojaMoolya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
NARRATION
00:01 నమస్కారము Maestros స్టెమీ కిట్ పై ఈ ట్యూటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో మనం నేర్చుకునేది-

Maestros స్టెమీ కిట్ యొక్క భాగాలు మరియు దాని ప్రయోజనం.

00:16 ఈ ట్యుటోరియల్ ను సాధన చేయడానికి, మీకు అవసరమైన -

Maestros స్టెమీ కిట్.

00:22 ఈ కిట్ యొక్క ఆస్పత్రి నమూనా వీటిని కలిగి ఉంటుంది -

ఒక మెటల్ కేసింగ్ లో ఒక ఆన్డ్రోయిడ్ ట్యాబ్, Maestros పరికరం తో పాటు NIBP, ECG మరియు SPO2 మానిటర్ , అన్ని ఒకే పరికరం లో ఉన్నాయి.

కిట్ లో, వై-ఫై ప్రింటర్, ట్రాలీ, పవర్ స్ట్రిప్ కూడా ఉన్నవి.

00:46 ఈ కిట్ యొక్క అంబులెన్స్ నమూనా, వీటిని కలిగి ఉంటుంది-

ఒక మెటల్ కేసింగ్ లో ఒక ఆన్డ్రోయిడ్ ట్యాబ్ తో పాటు NIBP, ECG మరియు SPO2 మానిటర్, అన్ని ఒకే పరికరం లో ఉన్నాయి . మరియు ఒక పవర్ స్ట్రిప్ కూడా ఉంది.

01:05 అంబులెన్స్ నమూనా లో ఒక వైఫై ప్రింటర్ లేదు మరియు అది ఒక ట్రాలీ పై మౌంట్ చేయబడదు.
01:13 అంబులెన్స్ నమూనా లో ట్యాబ్ యొక్క మెటల్ కేసింగ్ ఒక క్లమ్ప్ ద్వారా మౌంట్ చేయబడింది.
01:20 ఇక్కడ ఒక HP టాబ్లెట్ డేటా ఎంట్రీ యొక్క పరికరం.

ట్యాబ్ యొక్క పై భాగం లో పవర్ బటన్ ఉంది. రెండు మైక్రో USB పోర్టులు మరియు ఒక HDMI పోర్ట్ ట్యాబ్ దిగువన ఉన్నాయి.

01:36 రెండు USB పోర్టుల లో నుండి కుడి వైపు ఉన్నదానిని ట్యాబ్ని ఛార్జ్ చేయుటకు ఉపయోగిస్తారు .
01:44 ఆన్డ్రోయిడ్ ట్యాబ్ ని ఒక ప్రామాణిక మైక్రో USB ఛార్జర్ తో లేదా Maestros పరికరం నుండి వేలాడుతున్న USB కేబుల్ తో కూడా ఛార్జ్ చేయవచ్చు.
01:58 ఈ కేబుల్ని వాడినప్పుడు, ట్యాబ్ తన ఛార్జింగ్ కొరకు Maestros పరికరం నుండి విద్యుత్ని పొందుతుంది.
02:06 ట్యాబ్ ని చార్జ్ చేయుటకు ఒక పవర్ పాయింట్ లో ప్లగ్ చేసే అవసరం లేదు, అందుకే ఈ సౌకర్యం అందించబడుతుంది.
02:15 ట్యాబ్ ఛార్జ్ అవుతున్నప్పుడు కూడా పరికారిన్ని వాడవచ్చు.
02:21 ట్యాబ్ ఒక మెటల్ కేసింగ్ తో Maestros పరికారానికి జోడించబడింది.
02:27 ట్యాబ్ మరియు Maestros పరికరం వేరు వేరు పరికరాలు.
02:32 కానీ అవి ఒకే యూనిట్ గా పనిచేస్తాయి ఎందుకంటే, వాటి చుట్టూ ఉన్న మెటల్ కేసింగ్ ఒకటే కాబట్టి .
02:39 Maestros పరికరానికి 5 పోర్ట్స్ ఉన్నాయి

1 - చార్జింగ్ పోర్ట్ 2 - ఇసిజి పోర్ట్ 3 - బిపి పోర్ట్ 4 - SpO2 పోర్ట్ మరియు 5- టెంప్

02:51 దానికి ఎడమ వైపున ఛార్జింగ్ పోర్ట్ తో పాటు ఒక పవర్ బటన్ ఉంది..
02:57 ECG, బిపి మరియు SpO2 పోర్ట్ లు దానికి కుడి వైపున ఉన్నాయి..
03:04 Maestros పరికరం యొక్క ఎడుమ వైపు పసుపుపచ్చ సూచిక LEDలు ఉన్నాయి.

ఒకటి Maestros పరికరం ని స్విచ్ ఆన్ చేసి నప్పుడు వెలుగుతుంది మరియు ఇంకొకటి పరికరం ఛార్జింగ్ మోడ్ లో ఉన్నపుడు వెలుగుతుంది.

03:23 ఇప్పుడు మనం Non Invasive Blood Pressure unit అనగా NIBP యూనిట్ గూర్చి తెలుసుకుందాం.
03:32 బి పి కఫ్ లో రెండు భాగాలూ ఉన్నాయి, బి పి కఫ్ కేబుల్ మరియు ఎక్స్టెన్షన్ కేబుల్.
03:39 మొదట బి పి కఫ్ కేబుల్ ఎక్స్టెన్షన్ కేబుల్ కి జోడించండ.
03:46 తదుపరి ఎక్స్టెన్షన్ కేబుల్ యొక్క అవతలి చివరిని B.P పోర్ట్ కి జోడించండి.
03:52 ముందు పేర్కొన్న విధంగా అది, Maestros పరికరం యొక్క ఎడమ దిగువ వైపున ఉంది.
04:00 ఇప్పుడు మనము B.Pని నమోదు చేయుటకు సిద్ధంగా ఉన్నాము.
04:05 తదుపరి SpO2 యూనిట్ గూర్చి తెలుసుకుందాం.

SpO2 కేబుల్ కి రెండు భాగాలూ ఉన్నాయి ఎక్స్టెన్షన్ కేబుల్ మరియు SpO2 ప్రోబ్

04:18 ఇక్కడ చూపిన విధంగా SpO2 ప్రోబ్ని ఎక్స్టెన్షన్ కేబుల్ కి జోడించండి.
04:24 కనెక్టింగ్ కేబుల్లను సురక్షితమ్ చేయుటకు పారదర్శక కవర్ని స్నాప్ చేయండి.
04:31 ఎక్స్టెన్షన్ కేబుల్ యొక్క అవతలి చివరిని Maestros పరికరం కు జోడించండి.
04:38 దానిని Maestros పరికరం యొక్క పై ఎడుమ వైపు ఉన్న పోర్ట్ కి జోడించండి .
04:45 ఇప్పుడు మనం SpO2 ని కొలిచేందుకు సిద్ధంగా ఉన్నాము.
04:50 తదుపరి ECG యూనిట్ గూర్చి నేర్చుకుందాం.

ఇక్కడ చూపిన విధంగా Maestros పరికరం యొక్క పై ఎడుమ వైపు ఉన్న ECG పోర్ట్ ని ECGకేబుల్ కి జోడించండి.

05:04 కనెక్టర్ హెడ్ కు ఇరువైపుల ఉన్న స్క్రూ ల సహాయం తో కనెక్షన్ ని సురక్షితం చేయండి .
05:11 ఇప్పుడు మనం ECGతీసుకొనుటకు సిద్ధంగా ఉన్నాము.
05:15 ట్యుటోరియల్ సారాంశం.
05:16 ఈ ట్యుటోరియల్ లో మనము నేర్చుకున్నది-

Maestros స్టెమీ కిట్ తో పాటు వచ్చే వివిధ యూనిట్ ల గూర్చి మరియు వాటిని Maestros పరికరం తో ఎలా జోడించడం.

05:29 స్టేమీ ఇండియా,

లాభం పొందని సంస్థగా ఏర్పాటు చెయ్యబడింది ప్రధానంగా గుండె నొప్పి రోగులకు తగిన జాగ్రత్తలు పొందడానికి జరిగే జాప్యాలను తగ్గించుటకు మరియు గుండె నొప్పుల వలన మరణాలను తగ్గించుటకు

05:44 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బాంబే NMEICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నిధులను సమకూర్చుకుంటుంది.

మరిన్ని వివరాలకు spoken-tutorial.orgను సంప్రదించండి.

06:00 ఈ ట్యుటోరియల్ స్టెమీ ఇండియా మరియు స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, ఐఐటి బొంబాయి ద్వారా అందించబడింది.

ఈ ట్యుటోరియల్ని తెలుగు లోకి అనువదించింది మాధురి గణపతి. ధన్యవాదములు.

Contributors and Content Editors

PoojaMoolya