QGIS/C2/Installation-of-QGIS/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 22:48, 10 June 2021 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
TIme Narration
00:01 QGIS యొక్క ఇన్స్టాలేషన్ పై స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్‌లో మనం QGIS ను వీటిపై ఇన్‌స్టాల్ చేయడం నేర్చుకుంటాము,

ఉబుంటు లైనక్స్

00:15 విండోస్ మరియు మాక్ ఆపరేటింగ్ సిస్టమ్.
00:20 ఇన్స్టాలేషన్ కొరకు, నేను ఉపయోగిస్తున్నాను,

Ubuntu Linux వర్షన్ 16.04

00:28 Windows 10
00:30 Mac OS X 10.10 మరియు
00:33 పని చేస్తున్న ఒక ఇంటర్నెట్ కనెక్షన్.
00:36 Ctrl, Alt మరియు T కీలను ఒకేసారి కలిపి నొక్కడం ద్వారా terminal ను తెరవండి.
00:43 ప్రాంప్ట్ వద్ద, sudo స్పేస్ su అని టైప్ చేసి, Enter నొక్కండి.
00:52 మీ system password ని ఎంటర్ చేయమని మిమ్మల్ని ప్రాంప్ట్ చేసే ఒక సందేశం కనిపిస్తుంది.
00:58 password టైప్ చేసి, Enter ను నొక్కండి.
01:02 ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ కొరకు కొన్నిcommands ను అమలు చేయవల్సిఉంటుంది.
01:08 ఇక్కడ నేను అవసరమైన commands యొక్క లిస్ట్ తో ఒక ఫైల్ ను కలిగి ఉన్నాను.
01:13 ఈ ఫైల్ QGIS Installation Repositories అనే పేరుతో Code files link లో అందించబడింది.
01:21 ఇప్పుడు మనం QGIS repositories ను sources.list ఫైల్‌కు జోడిద్దాం.
01:28 కింది command ను కాపీ చేయండి. కాపీ చేయడానికి Ctrl C ను ఉపయోగించండి.
01:34 terminal prompt వద్ద, రైట్ క్లిక్ చేసి పేస్ట్ ను ఎంచుకోండి.

మరియు Enter ను నొక్కండి.

01:43 source.list ఫైల్‌తో Gedit editor తెరవబడుతుంది.
01:48 QGIS Installation Repositories ఫైల్‌కు తిరిగి వెళ్ళండి.
01:53 ఇప్పుడు, ఇక్కడ హైలైట్ చేయబడిన రెండు లైన్స్ ను sources.list ఫైల్ యొక్క చివరిన జోడించండి.
02:00 ఇక్కడ చూపబడిన రెండు లైన్ లను కాపీ చేయండి.
02:04 వాటిని Sources.list ఫైల్ చివరిన అతికించండి.
02:09 ఫైల్‌ను సేవ్ చేయడానికి Ctrl S ను నొక్కండి.
02:13 ఇప్పుడు మీ విండో యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న క్రాస్ పై క్లిక్ చేసి ఈ ఫైల్ ని మూసివేయండి.
02:20 terminal prompt వద్ద, sudo స్పేస్ apt-get స్పేస్ update అని టైప్ చేసి, Enter నొక్కండి.
02:32 ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఈ అప్ డేట్ అనేది ఇప్పుడు పూర్తయింది.
02:39 ఈ సమయంలో మనం మరికొన్నిcommands ను అమలు చేయాల్సి ఉంటుంది.
02:44 మనం QGIS Installation Repositories ఫైల్‌కు తిరిగి వెళ్దాం.
02:49 ఈ కింది మూడు commands అనేవి ఇక్కడ చూపించబడ్డాయి.
02:53 మనం వాటిని ఒకదాని తర్వాత ఒకటి అమలు చేయాలి.
02:57 ఒకసారికి ఒక command ను కాపీ చేసి, దానిని terminal లో పేస్ట్ చెయ్యండి.
03:03 ప్రతి command ను prompt వద్ద పేస్ట్ చేసిన తర్వాత Enter ను నొక్కండి.
03:27 మూడవ command ను అమలు చేసిన తరువాత, మీరు OK అనే సందేశాన్ని చూస్తారు.
03:32 ఇప్పుడు QGIS Installation Repositories file నుండి చివరి command ను అమలు చేయండి.

కింది command ను కాపీ చేయండి.

03:41 దాన్ని terminal prompt వద్ద పేస్ట్ చేసి Enter నొక్కండి.
03:47 కొనసాగడానికి Y ను ప్రెస్ చేయండి మరియు Enter ను నొక్కండి.
03:53 ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది.
03:57 ఇన్స్టాలేషన్ ఇప్పుడు పూర్తయింది.
04:01 మీ కీబోర్డ్‌ పైన Windows కీని నొక్కండి మరియు Search bar లో QGIS అని టైప్ చేయండి.
04:09 మీరు QGIS Desktop Application ను చూడగలుగుతారు.

QGIS ను తెరవడానికి దానిపై క్లిక్ చేయండి.

04:18 ఇది QGIS interface.
04:22 ఇప్పుడు మనం Windows పై QGIS ఇన్‌స్టాలేషన్‌కు వెళ్దాం.
04:27 QGIS Installation Repositories ఫైల్ కు తిరిగి వెళ్ళండి. కింది లింక్‌ను కాపీ చేయండి.
04:35 మీ సిస్టమ్‌లో ఏదైనా వెబ్ బ్రౌజర్‌ని తెరవండి. నేను Chrome ను తెరుస్తున్నాను.
04:42 కాపీ చేసిన లింక్‌ను ఒక వెబ్ బ్రౌజర్‌లోపల పేస్ట్ చేసి, Enter ను నొక్కండి.
04:49 ఈ ఎర్రర్ మెసేజ్ ను విస్మరించి, OK పై క్లిక్ చేయండి.
04:55 Long term release repository most stable సెక్షన్ కు స్క్రోల్ చేయండి.
05:01 మీ సిస్టమ్ ప్రకారం 64 బిట్ లేదా 32 బిట్ ల మధ్య తగిన సెటప్‌ను ఎంచుకోండి.
05:09 సంబంధిత setup ఫైల్ యొక్క ఎడమ భాగంపైన ఇవ్వబడిన Download icon పై క్లిక్ చేయండి.
05:16 మీ Internet వేగాన్ని బట్టి installer ఫైల్ ను డౌన్‌లోడ్ చేయడానికి కొంత సమయం పడుతుంది.
05:23 నేను ఇప్పటికే ఈ setup ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్నిDownloads folder లో సేవ్ చేసాను.
05:30 ఇప్పుడు మనం Downloads folder కు నావిగేట్ చేద్దాం.
05:34 task bar పైన అందుబాటులో ఉన్న search బాక్స్‌లో, downloads అని టైప్ చేయండి.
05:40 Downloads ఎంపికపై క్లిక్ చేయండి.
05:43 Downloads ఫోల్డర్ తెరుచుకుంటుంది.
05:46 QGIS installer file ను కనుగొనండి.
05:50 ఇన్స్టాలేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి దానిపై డబుల్ క్లిక్ చేయండి.
05:55 మీ సిస్టమ్‌లో ఒక డైలాగ్ బాక్స్ తెరవబడుతుంది.

కొనసాగడానికి Yes ను క్లిక్ చేయండి.

06:02 Installation Wizard తెరుచుకుంటుంది.
06:05 సూచనలను చదివి Next బటన్ పై క్లిక్ చేయండి.
06:10 software license agreement పేజీలో, I Agree బటన్ పై క్లిక్ చేయండి.
06:16 software ను ఎక్కడ ఇన్‌స్టాల్ చేయాలో ఎంచుకోండి, ఒకవేళ ఖచ్చితంగా తెలియకపోతే డిఫాల్ట్ స్థానాన్నేవదిలివేయండి.
06:24 మీరు ఇన్స్టాలేషన్ కొరకు అదనపు భాగాలను ఎంచుకోవాల్సిన అవసరం లేదు, QGIS తో కొనసాగండి.
06:32 Install బటన్ పై క్లిక్ చేయండి.
06:35 ఇన్స్టాలేషన్ కు కొంత సమయం పడుతుంది.
06:40 ఒకసారి పూర్తయిన తర్వాత, ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేయడానికి Finish బటన్ పై క్లిక్ చేయండి.

QGIS ఇప్పుడు మీ సిస్టమ్స్‌లో ఇన్‌స్టాల్ చేయబడుతుంది.

06:51 taskbar పైన అందుబాటులో ఉన్న search బాక్స్‌లో, QGIS అని టైప్ చేయండి.
06:57 లిస్ట్ లో, మీరు QGIS Desktop Application ను చూడగలుగుతారు.
07:04 QGIS ను తెరవడానికి దానిపై క్లిక్ చేయండి.
07:09 ఇది QGIS interface.
07:13 ఇప్పుడు మనం Mac OS పైన QGIS ఇన్స్టాలేషన్ కు వెళ్దాం.
07:19 మనం ఇంతకు ముందు తెరిచిన QGIS డౌన్‌లోడ్ వెబ్ పేజీకి తిరిగి వెళ్ళండి.
07:25 Mac OS X టాబ్ కొరకు Download ను తెరవండి.
07:29 Long term release most stable సెక్షన్ కు స్క్రోల్ చెయ్యండి.
07:34 సంబంధిత setup ఫైల్ యొక్క ఎడమ భాగంపైన ఇచ్చిన download icon పై క్లిక్ చేయండి.
07:40 ఓక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
07:43 డిఫాల్ట్ ఫైల్ పేరును మనం మార్చవద్దు.
07:47 ఈ ఫైల్‌ను సేవ్ చేయడానికి Downloads ఫోల్డర్‌ను లొకేషన్ గా ఎంచుకోండి.
07:52 Save బటన్ పై క్లిక్ చేయండి.
07:55 మీ Internet వేగాన్ని బట్టి ఇన్‌స్టాలర్ ఫైల్ యొక్క డౌన్‌లోడ్ అనేది కొంత సమయాన్ని తీసుకుంటుంది.
08:02 నేను ఇప్పటికే ఈ సెటప్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, దాన్ని Downloads ఫోల్డర్‌లో సేవ్ చేసాను.
08:08 ఇప్పుడు మనం Downloads ఫోల్డర్‌కు నావిగేట్ చేద్దాం.
08:12 స్క్రీన్ యొక్క ఎగువ కుడి మూలలో ఉన్నsearch ఐకాన్ పై క్లిక్ చేయండి.
08:18 Downloads అని టైప్ చేయండి, Downloads ఫోల్డర్ ఎంపికపై డబల్ క్లిక్ చేయండి.
08:25 QGIS Installer ఫైల్‌ను కనుగొనండి, ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి దానిపై క్లిక్ చేయండి.
08:33 చాలా ఫైళ్లతో ఉన్న ఒక సెటప్ ఫోల్డర్ తెరుచుకుంటుంది.
08:37 అక్కడ నాలుగు packages ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఒక సంఖ్యతో మొదలవుతుంది.
08:42 packages ను ఇన్‌స్టాల్ చేయాల్సిన క్రమాన్ని ఇది మీకు చెబుతుంది.
08:46 నాన్ ఆపిల్ డెవలపర్ చే గుర్తించబడిన సాఫ్ట్‌వేర్ యొక్క ఇన్స్టాలేషన్ ను అనుమతించడానికి,

మొదట మీ Mac Security Preferences ను Allow apps downloaded from: Anywhere కు మార్చండి.

08:58 స్క్రీన్‌పైన ఎగువ కుడి మూలలో ఉన్న search icon పై క్లిక్ చేయండి. System Preferences అని టైప్ చేసి, Enter ను నొక్కండి.
09:09 system preferences తో కూడిన ఒక విండో తెరవబడుతుంది.
09:13 Security & Privacy పై క్లిక్ చేయండి.
09:17 మార్పులను అనుమతించడానికి Security & Privacy విండో నుండి, General టాబ్‌లో దిగువ-ఎడమ మూలలో ఉన్న లాక్ ఐకాన్ ను క్లిక్ చేయండి.
09:28 డైలాగ్ బాక్స్‌లో మీ system password ను ఎంటర్ చేయండి.
09:32 తర్వాత Unlock బటన్ పై క్లిక్ చేయండి.
09:35 Allow apps downloaded from సెక్షన్ లో, Anywhere రేడియో బటన్ పై క్లిక్ చేయండి.
09:42 ఒక డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది, Allow from anywhere బటన్ పై క్లిక్ చేయండి.
09:49 సెట్ట్టింగ్స్ ను లాక్ చేయడానికి దిగువ-ఎడమ మూలలో తెరిచిఉన్నలాక్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
09:55 ఆ విండో ను మూసివేయండి.
09:57 ఇప్పుడు సెటప్ ఫోల్డర్‌కు వెళ్లి ప్యాకేజ్ నంబర్ 1 పై డబల్ క్లిక్ చేయండి.
10:03 ఈ Installation wizard లోని సూచనలను అనుసరించి package ను ఇన్స్టాల్ చేయండి.
10:09 Continueపై క్లిక్ చేయండి.
10:12 ఇవ్వబడిన ముఖ్యమైన సూచనలను చదివి, Continue పై క్లిక్ చేయండి.
10:17 license agreement ను చదివి, Continue పై క్లిక్ చేయండి.
10:22 తెరుచుకున్న డైలాగ్ బాక్స్‌లో Agree బటన్‌ పై క్లిక్ చేయడం ద్వారా software license agreement ను అంగీకరించండి.
10:30 install పై క్లిక్ చేయండి.
10:33 తెరుచుకున్న డైలాగ్ బాక్స్‌లో system password ని టైప్ చేయండి.
10:38 ఇంకా Install Software బటన్ పై క్లిక్ చేయండి.
10:45 ఒకసారి ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత, Close బటన్ పై క్లిక్ చేయండి.
10:50 ప్యాకేజ్ సంఖ్యలు 2, 3 మరియు 4 కొరకు కూడా ఈ విధానాన్ని పునరావృతం చేయండి.
11:19 ఒకసారి మొత్తం నాలుగు package ల కొరకు ఇన్స్టాలేషన్ లు పూర్తయిన తర్వాత, QGIS మీ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్ చేయబడుతుంది.
11:27 సర్చ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. QGIS అని టైప్ చేయండి.
11:33 QGIS ను ప్రారంభించడానికి QGIS అప్లికేషన్‌పై డబల్ క్లిక్ చేయండి.
11:39 ఇక్కడ QGIS ఇంటర్ఫేస్ ఉంది.
11:43 రాబోయే ట్యుటోరియల్స్ లో interface మరియు ఫీచర్స్ ను గురించి మరింత సమాచారం కవర్ చేయబడుతుంది.
11:51 సారాంశం చూద్దాం. ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకున్నాము:
11:57 Ubuntu Linux వర్షన్ 16.04, Windows 10 మరియు Mac OS X 10.10 లపై QGIS వర్షన్ 2.18 యొక్క ఇన్స్టాలేషన్.
12:11 ఒక అసైన్మెంట్ గా,

మీ మెషీన్‌ పై QGIS ని ఇన్‌స్టాల్ చేయండి.

12:17 QGIS ఇంటర్ఫేస్ ను తెరిచి అన్వేషించండి.
12:21 మెనూలు మరియు టూల్‌బార్ల ద్వారా వెళ్ళండి.
12:25 కింది లింక్‌లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి.

12:34 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: వర్కుషాప్స్ ను నిర్వహించి ఆన్ లైన్ పరీక్షల్లో పాసైన వారికి సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి.

12:48 ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా?

దయచేసి ఈ వెబ్ సైట్‌ను సందర్శించండి.

12:55 మీకు ఎక్కడ సందేహం ఉందో ఆ నిమిషం మరియు క్షణాన్ని ఎంచుకోండి.

మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం లోని వారు ఎవరైనా వాటికి సమాధానాలు ఇస్తారు.

13:07 ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్ ఉంది.
13:13 దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు.

ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది.

13:21 తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు.
13:27 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ గురించిన వివరాల కోసం, చూపిన లింక్‌ను సందర్శించండి.

13:40 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya