QGIS/C2/Digitizing-Map-Data/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 19:19, 14 March 2021 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 QGIS లో Digitizing Map Data పై ఈ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని నేర్చుకుంటాము- Point మరియు Polygon షేప్ ఫైల్స్ ను సృష్టించడం మరియు డిజిటైజ్ చేయడం.
00:15 పాయింట్ మరియు పోలిగాన్ (బహుభుజి) ఫీచర్స్ కొరకు స్టైల్ మరియు కలర్ ను మార్చడం.
00:20 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను -

Ubuntu Linux OS వర్షన్ 16.04 QGIS వర్షన్ 2.18

00:32 ఈ ట్యుటోరియల్‌ని అనుసరించడానికి, మీకు బేసిక్ GIS మరియు QGIS interface తో పరిచయం ఉండాలి.
00:41 Digitizing అనేది ఒక ప్రక్రియ ఇది, ఒక మ్యాప్ నుండి, ఇమేజ్ లేదా డేటా యొక్క ఇతర సోర్సెస్ ను సమన్వయం చేస్తుంది

అవి డిజిటల్ ఫార్మట్ లోకి మార్చబడతాయి.

00:52 మార్చబడిన డేటా ను ఒక పాయింట్, లైన్ లేదా ఒక పోలిగాన్ (బహుభుజి) ఫీచర్ గా GIS లో నిల్వ చేయవచ్చు.
01:00 ఈ ట్యుటోరియల్‌ని ప్రాక్టీస్ చేయడానికి, మీరు Code files లింక్‌లో ఇచ్చిన Bangalore నగరం యొక్క నేపథ్య (థెమటిక్) మ్యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
01:09 ఇది Bangalore నగరం యొక్క అభివృద్ధిని వివరించే ఒక మ్యాప్.
01:15 కోడ్ ఫైల్స్ ను డౌన్‌లోడ్ చేయడానికి దశలు.
01:18 ప్లేయర్ క్రింద ఉన్న Code files లింక్‌పై క్లిక్ చేసి, దాన్ని మీ ఫోల్డర్‌లో సేవ్ చేయండి.
01:25 డౌన్‌లోడ్ చేసిన జిప్ ఫైల్‌ను ఎక్స్ట్రాక్ట్ చెయ్యండి.
01:28 ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫోల్డర్‌లో Bangalore.jpg ఫైల్‌ను గుర్తించండి.
01:34 నేను ఇప్పటికే Code file ను డౌన్‌లోడ్ చేసాను, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి Desktop పైన ఒక ఫోల్డర్‌లో సేవ్ చేసాను.
01:41 ఫోల్డర్‌ను తెరవడానికి దానిపై డబల్ క్లిక్ చేయండి.
01:45 Bangalore.jpg ఫైల్‌పై రైట్ క్లిక్ చేయండి.
01:49 కాంటెక్స్ట్ మెనూ నుండి, Open with QGIS Desktop ను ఎంచుకోండి.
01:56 QGIS ఇంటర్ఫేస్ తెరుచుకుంటుంది.
01:59 QGIS Tips డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది. OK బటన్ పై క్లిక్ చేయండి.
02:06 Coordinate Reference System Selector డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
02:11 Coordinate reference systems of the world అనే శీర్షిక కింద, WGS 84 ను ఎంచుకోండి.
02:19 WGS 84 అనేది ఎక్కువగా ఉపయోగించబడుతున్న భౌగోళిక సమన్వయ వ్యవస్థ అని గమనించండి.
02:27 డైలాగ్-బాక్స్ యొక్క దిగువ బాగం వద్ద ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి.
02:32 కాన్వాస్‌ పైన Bangalore యొక్కThematic map అనేది ప్రదర్శించబడుతుంది.
02:38 ఇప్పుడు మనం క్రొత్త షేప్ ఫైల్ లేయర్స్ ను సృష్టిద్దాం.
02:42 మెనూ బార్‌ పైన Layer మెనుపై క్లిక్ చేసి, Create Layer ఎంపికను ఎంచుకోండి.
02:50 సబ్ మెను నుండి, New Shapefile Layer ఎంపికను ఎంచుకోండి.
02:55 New Shapefile Layer విండో తెరుచుకుంటుంది.
02:59 ఇక్కడ మీరు ఫీచర్స్ యొక్క 3 రకాల ఎంపికలు, Point, Line మరియు Polygon లను చూడవచ్చు.
03:10 డీఫాల్ట్ గా Point ఎంపిక అనేది ఎంచుకోబడింది.

దాన్ని అలాగే వదిలేయండి.

03:16 CRS ను WGS 84 గా ఉండనివ్వండి.
03:21 విండో యొక్క దిగువ-కుడి మూలలో ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి.
03:27 Save Layer as.. డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
03:31 ఫైల్‌కు మనం Point-1 అని పేరు పెడదాం.
03:35 ఫైల్‌ను సేవ్ చేయడానికి తగిన స్థానాన్ని ఎంచుకోండి.

నేను Desktop ‌ను ఎంచుకుంటాను.

03:42 డైలాగ్-బాక్స్ యొక్క దిగువ-కుడి మూలలో ఉన్ Save బటన్ పై క్లిక్ చేయండి.
03:48 ఇక్కడ చూపిన విధంగా ఫైల్స్ డెస్క్‌టాప్‌లో సేవ్ చేయబడతాయి.
03:53 QGIS ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్ళండి.
03:56 ఫైల్ స్వయంచాలకంగా Layers Panel లో లోడ్ అవుతుందని గమనించండి.
04:02 ఈ మ్యాప్‌ పైన, IT విభాగాలు స్థాపించబడిన ప్రదేశాలను మనం మార్క్ చేస్తాము.
04;09 జూమ్-ఇన్ చేయడానికి మౌస్ లో మధ్య బటన్‌ను స్క్రోల్ చేయండి.
04:14 IT సంస్థల కొరకు మ్యాప్ యొక్క దిగువ-కుడి మూలలో ఉన్న legend ను రిఫర్ చెయ్యండి.
04:21 IT సంస్థలు అనేవి జెండా చిహ్నంతో సూచించబడతాయి.
04:26 మ్యాప్‌లో IT సంస్థలను సూచించే పాయింట్లను లొకేట్ చెయ్యండి.
04:32 ఇక్కడ IT సంస్థలను సూచించే రెండు పాయింట్ లు ఉన్నాయి.
04:37 మ్యాప్‌లోని ఫీచర్స్ ను ఎడిట్ చేయడానికి లేదా మార్పు చేయడానికి, మనం Toggle editing tool ను ఎంచుకోవాలి.
04:44 Toggle Editing అనేది tool bar యొక్క ఎగువ-ఎడమ మూలలో అందుబాటులో ఉంది.
04:51 Toggle Editing టూల్ ని ఎంచుకోవడానికి దానిపై క్లిక్ చేయండి.
04:55 టూల్ బార్‌లోని Add Feature టూల్ పై క్లిక్ చేయండి.
04:59 కర్సర్ ఇప్పుడు crosshair ఐకాన్ గా ప్రదర్శించబడుతుంది.
05:04 మ్యాప్‌లోని IT సంస్థ సింబల్ పై క్లిక్ చేయండి.
05:08 ఒక ఇన్పుట్-బాక్స్ Point-1 Feature Attributes తెరుచుకుంటుంది.
05:14 Id టెక్స్ట్ బాక్స్‌లో 1 ని టైప్ చేయండి. OK బటన్ పై క్లిక్ చేయండి.
05:21 అదేవిధంగా రెండవ IT సంస్థపై క్లిక్ చేసి, ఫీచర్ ని 2 గా సేవ్ చేయండి.

OK బటన్ పై క్లిక్ చేయండి.

05:31 ఇప్పుడు ఎడిటింగ్ ను ఆపడానికి, మళ్ళీ టూల్ బార్‌లోని Toggle Editing టూల్ పై క్లిక్ చేయండి.
05:38 Stop editing డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
05:42 Save బటన్ పై క్లిక్ చేయండి.
05:45 గమనించండి, మ్యాప్‌ పైన, రంగుతోఉన్న రెండు పాయింట్ ఫీచర్స్ అనేవి సృష్టించబడతాయి.
05:51 సృష్టించబడిన ఆ రెండు ఫీచర్స్ ను attribute table ను తెరవడం ద్వారా మనం తనిఖీ చేయవచ్చు.
05:56 Layers ప్యానెల్‌ పైన Point-1 లేయర్‌పై రైట్ క్లిక్ చేయండి.
06:01 కాంటెక్స్ట్ మెనూ నుండి, Open Attribute Table ఎంపికను ఎంచుకోండి.
06:06 Point-1: Features డైలాగ్-బాక్స్‌లో, id కాలమ్‌లో, రెండు పాయింట్స్ సృష్టించబడతాయి.
06:13 attribute table డైలాగ్-బాక్స్ ను మూసివేయండి.
06:17 స్పష్టంగా కనిపించడం కొరకు మనం ఈ పాయింట్ ఫీచర్స్ యొక్క స్టైల్ మరియు కలర్ లను మార్చవచ్చు.
06:23 Point-1పొరపై రైట్ క్లిక్ చేయండి.
06:26 context menu నుండి Properties ఎంపికను ఎంచుకోండి.
06:31 Layer Properties డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
06:35 Color డ్రాప్ డౌన్ పై క్లిక్ చేయండి.
06:38 కలర్ ట్రయాంగిల్ ను రొటేట్ చేయడం ద్వారా ఒక రంగును ఎంచుకోండి.
06:42 Size టెక్స్ట్ బాక్స్ యొక్క చివరన ఉన్న అప్ వర్డ్ యారొ ట్రయాంగిల్ పై క్లిక్ చేయడం ద్వారా పరిమాణాన్ని పెంచండి.
06:50 డైలాగ్-బాక్స్ యొక్కదిగువ భాగం వద్ద ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి.
06:54 Point ఫీచర్స్ కొరకు రంగు మరియు పరిమాణంలోని మార్పును గమనించండి.
07:00 ఇప్పుడు మనం Polygon ఫీచర్స్ ను కలిగి ఉన్న ఒక షేప్ ఫైల్‌ను సృష్టిద్దాం.
07:05 menu bar లోని Layer మెనుపై క్లిక్ చేయండి. Create Layer ఎంపికను ఎంచుకోండి.
07:12 సబ్ మెనూ నుండి, New Shapefile Layer ను ఎంచుకోండి.
07:17 New Shape File Layer విండో తెరుచుకుంటుంది.
07:21 Type ను Polygon గా ఎంచుకోండి.
07:25 New field Name టెక్స్ట్ బాక్స్ లో, area అని టైప్ చెయ్యండి.
07:31 Type ని Text data గానే ఉంచండి.
07:35 Add to fields list బటన్ పై క్లిక్ చేయండి.
07:40 Fields List టేబుల్ లో, మీరు area రో అనేది జోడించబడినట్లు చూస్తారు.

OK బటన్ పై క్లిక్ చేయండి.

07:50 Save layer as.. డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
07:54 Fileపేరును Area-1 గా టైప్ చేయండి.
07:58 తగిన స్థానాన్ని ఎంచుకోండి.
08:01 నేను Desktop ను ఎంచుకుంటాను. Save బటన్ పై క్లిక్ చేయండి.
08:07 Area-1 layer అనేది Layers panel ‌కు జోడించబడిందని గమనించండి.
08:13 మనం Corporation Area మరియు Greater Bangalore Area యొక్క సరిహద్దును మార్క్ చేస్తాము.
08:20 Corporation Area మరియు Greater Bangalore Area ను గుర్తించడానికి మ్యాప్ పైన Legend ను చూడండి.
08:28 టూల్ బార్‌లోని toggle editing టూల్ పై క్లిక్ చేయడం ద్వారా toggle editing ను ఆన్ చేయండి.
08:35 టూల్ బార్ నుండి Add Feature టూల్ పై క్లిక్ చేయండి.
08:39 కర్సర్‌ను మ్యాప్ దగ్గరకు తీసుకురండి.
08:42 ఏరియా ని గుర్తించడానికి, Corporation area యొక్క బౌండరీ పైన ఎక్కడైనా క్లిక్ చేయండి.
08:48 బౌండరీ పై క్లిక్ చేస్తూ ఉండండి.
08:51 ఒకవేళ లైన్ సెగ్మెంట్ లు అనేవి కలిస్తే కాన్వాస్ పైభాగంలో హెచ్చరిక సందేశాలు కనిపిస్తాయి.

దయచేసి ఈ సందేశాలను విస్మరించండి.

09:02 ఒకవేళ మీరు ఏదైనా పొరపాటు చేసి, మార్కింగ్ ప్రాసెస్ ను తిరిగి ప్రారంభించాలి అనుకుంటే, కీబోర్డ్‌ పైన Esc Key ని నొక్కండి.
09:10 మీరు మళ్ళీ ప్రాసెస్ ను ప్రారంభించవచ్చు.
09:13 మీరు బౌండరీ మొత్తాన్నివిస్తరించే వరకు బౌండరీపై క్లిక్ చేస్తూ ఉండండి.
09:24 మీరు బౌండరీ మొత్తాన్ని మార్క్ చేసిన తర్వాత, బహుభుజిని (పోలిగాన్) ముగించడానికి రైట్ క్లిక్ చేయండి.
09:30 Area-1- Feature Attributes ఇన్పుట్ బాక్స్ తెరుచుకుంటుంది.
09:36 Id టెక్స్ట్ బాక్స్‌లో 1 అని టైప్ చేయండి.
09:40 area టెక్స్ట్ బాక్స్‌లో Corporation Area అని టైప్ చేయండి.
09:45 OK బటన్ పై క్లిక్ చేయండి.
09:48 గమనించండి, మ్యాప్‌ పైన కొత్త polygon ఫీచర్ అనేది సృష్టించబడుతుంది.
09:54 ఇప్పుడు మనం మ్యాప్‌లోని Greater Bangalore ప్రాంతాన్ని డిజిటలైజ్ చేస్తాము.
09:59 ఇక్కడ చూపిన విధంగా Greater Bangalore ప్రాంతాన్ని డిజిటలైజ్ చేయడానికి బౌండరీపై క్లిక్ చేయండి.
10:12 మీరు డిజిటైజింగ్ పూర్తి చేసిన తర్వాత, బహుభుజిని (పోలిగాన్) ముగించడానికి రైట్ క్లిక్ చేయండి.
10:18 Area-1 Feature Attributes టెక్స్ట్ బాక్స్‌లోని, id టెక్స్ట్ బాక్స్‌లో 2 అని టైప్ చేయండి.

మరియు area టెక్స్ట్ బాక్స్‌లో Greater Bangalore అని.

10:30 OK బటన్ పై క్లిక్ చేయండి.
10:33 ఎడిటింగ్ ను ఆపడానికి టూల్ బార్‌లోని Toggle Editing టూల్ పై మళ్లీ క్లిక్ చేయండి.
10:39 Stop editing డైలాగ్ బాక్స్‌లోSave బటన్ పై క్లిక్ చేయండి.
10:44 attribute table ను తెరవడానికి Area-1 లేయర్‌పై రైట్ క్లిక్ చేయండి.
10:49 context menu నుండి Open Attribute Table ను ఎంచుకోండి.
10:54 కాలమ్స్ id మరియు area టైప్ తో 2 ఫీచర్లు అనేవి సృష్టించబడినట్లు మనం చూడవచ్చు.

attribute table ను మూసివేయండి.

11:04 రెండు బహుభుజి (పోలిగాన్) ఫీచర్లు సృష్టించబడినట్లు మనం చూడవచ్చు.
11:09 బహుభుజి (పోలిగాన్) ఫీచర్ యొక్క రంగు మరియు స్టైల్ ను మార్చడానికి, Area-1లేయర్ పై రైట్ క్లిక్ చేయండి.

Properties ఎంపికను ఎంచుకోండి.

11:19 Layer Properties డైలాగ్-బాక్స్‌లో, ఎడమ వైపు పానెల్ నుండి Style ఎంపికను ఎంచుకోండి.
11:26 drop down menu యొక్క ఎగువ ఎడమ మూలలోని, categorized ను ఎంచుకోండి.
11:32 కాలమ్ డ్రాప్ డౌన్ లో id ని ఎంచుకోండి.

Classify బటన్ పై క్లిక్ చేయండి.

11:39 లేయర్ పారదర్శకత స్లయిడర్‌ను 50% కి తరలించండి.
11:44 డైలాగ్-బాక్స్ యొక్క దిగువ భాగం వద్ద ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి.
11:49 ఇప్పుడు మ్యాప్ పైన, వేర్వేరు రంగులలో ఉన్నరెండు Polygon features అనేవి మనం చూడవచ్చు.
11:55 ఫీచర్స్ లేబులింగ్ గురించిన వివరాలు, ఈ సిరీస్‌లోని రాబోయే ట్యుటోరియల్‌లలో చర్చించబడతాయి.
12:03 సారాంశం చూద్దాం.
12:05 ఈ ట్యుటోరియల్‌లో మనం Point మరియు Polygon షేప్ ఫైల్స్ ను సృష్టించడం మరియు డిజిటలైజ్ చేయడం నేర్చుకున్నాము.
12:13 Point మరియు Polygon ఫీచర్స్ కొరకు స్టైల్ ను మరియు కలర్ ను మార్చడం.
12:18 ఒక అసైన్మెంట్ గా, Banglaore thematic map (Bangalore.jpg) పైన,

Industrial Estates ను Digitize చెయ్యండి ఒక Polyline ఫీచర్ ని సృష్టించడం ద్వారా మ్యాప్‌ పైన (రోడ్స్) రహదారులను డిజిటైజ్ చేయండి.

12:32 మీరు పూర్తి చేసిన అసైన్మెంట్ ఇక్కడ చూపిన విధంగా ఉండాలి.
12:37 కింది లింక్‌లోని వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దీనిని డౌన్‌లోడ్ చేసి చూడండి.
12:45 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ ను నిర్వహించి ఆన్ లైన్ పరీక్షల్లో పాసైతే సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి.

12:57 దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
13:01 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT ,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

13:13 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి, నేను మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya