QGIS/C2/Coordinate-Reference-Systems/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:26, 7 December 2020 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 QGIS లో Coordinate Reference System పై ఈ ట్యుటోరియల్‌కు మీకు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి,
00:10 QGIS లో projections కు లేయర్స్ ను జోడించడం.
00:15 layers కొరకు metadata సమాచారాన్ని చూడడం.
00:19 ఎంచుకున్న ఫీచర్స్ ను ఒక layer నుండి ఒక కొత్త layer కు సేవ్ చేయడం.
00:24 వేర్వేరు ప్రొజెక్షన్స్ (స్క్రీన్ పైన ప్రదర్శనలు) ను కలిపి దానియొక్క డేటా లేయర్స్ ను రీ -ప్రాజెక్ట్ చేయడం మరియు ఓవర్ లే (అతివ్యాప్తి) చేయడం.
00:30 ఈ ట్యుటోరియల్ రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నాను,

Ubuntu Linux OS వర్షన్ 16.04, QGIS వర్షన్ 2.18

00:42 ఈ ట్యుటోరియల్‌ని అనుసరించడానికి, మీకు GIS ను గురించిన జ్ఞానం కావాలి.
00:49 దయచేసి ఈ సిరీస్ లోని మునుపటి ట్యుటోరియల్‌ని చూడండి.
00:54 Coordinate Reference Systems గురించి,
00:57 Coordinate Reference Systems అనేది రెండు రకాలు,

Geographic coordinate system, మరియు Projected Coordinate System

01:06 చాలా విస్తృతంగా ఉపయోగించే geographic coordinate system అనేది WGS 84.
01:12 బాగా ఎక్కువగా ఉపయోగించే projected coordinate system అనేది UTM.
01:18 ఇక్కడ నేను QGIS ఇంటర్ఫేస్ ను తెరిచాను.
01:23 canvas పైన, దేశ పరిపాలన సరిహద్దులతో ప్రపంచ పటం ప్రదర్శించబడుతుంది.
01:30 మ్యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి మరియు QGIS లో దాన్ని ఎలా చూపించాలి అనే ప్రదర్శన ముందస్తు అవసరాల పైన ట్యుటోరియల్ లో వివరించబడింది.
01:39 దయచేసి ముందస్తు అవసరరాల పై ట్యుటోరియల్‌ని చూడండి.
01:43 ఈ ఫైల్‌ను Code files లింక్ నుండి కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
01:48 canvas యొక్క ఎడమ భాగం పైన, ఒక layer గా ప్రపంచ పటం యొక్క ఫైల్ పేరుతో Layers Panel ను మీరు చూస్తారు.
01:57 Layers Panel అనేది డిఫాల్ట్ గా ఇక్కడ ఎనేబుల్ అయింది.
02:02 ఒకవేళ కాకపోతే, మనం Layers Panel యొక్క View మెనుని ఉపయోగించి ఎనేబుల్ లేదా డిజేబుల్ చేయవచ్చు.
02:08 menu బార్‌లోని View మెనుపై క్లిక్ చేయండి.

క్రిందికి స్క్రోల్ చేసి, Panels ఎంపికను ఎంచుకోండి.

02:16 సబ్ మెను అనేది panel పేర్ల యొక్క ఒక లిస్ట్ ను చూపిస్తుంది.
02:21 panel ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చెయ్యడానికి Layer Panel ఎంపికపై క్లిక్ చేయండి.
02:27 (బౌండరీ) సరిహద్దును లాగడం ద్వారా మనం panel యొక్క సైజ్ ను సర్దుబాటు చేయవచ్చు.
02:32 ఒకవేళ మీరు మ్యాప్ యొక్క రంగును మార్చాలనుకుంటే, Layers Panel లోని layer పేరుపైన రైట్ క్లిక్ చేయండి.
02:39 context menu కు స్క్రోల్ చేసి, Styles ఎంపికను ఎంచుకోండి.
02:44 సబ్ మెనూ అనేది ఒక కలర్ ట్రయాంగిల్ (రంగు త్రిభుజం) ను చూపిస్తుంది.
02:48 (రంగు త్రిభుజం) కలర్ ట్రయాంగిల్ యొక్క (వర్టెక్స) శీర్షాన్ని తిప్పడం ద్వారా (కలర్) రంగును ఎంచుకోండి.
02:53 కాంటెక్స్ట్ మెనుని మూసివేయడానికి canvas పై ఎక్కడైనా క్లిక్ చేయండి.
02:58 దిగువ-ఎడమ మూలలో, QGIS విండో యొక్క status బార్‌పైన, మీరు లేబుల్ Coordinate ను మరియు సంఖ్యలతో కూడిన ఒక టెక్స్ట్ బాక్స్‌ను గమనించవచ్చు.
03:09 దిగువ-ఎడమ మూలలో, QGIS విండో యొక్క status బార్ పైన, మీరు లేబుల్ Coordinate మరియు సంఖ్యలతో కూడిన ఒక టెక్స్ట్ బాక్స్‌ను గమనించవచ్చు.
03:17 కర్సర్‌ను మ్యాప్‌ మీదికి తరలించండి.
03:20 గమనించండి, X మరియు Y coordinates యొక్క విలువలు అనేవి కర్సర్ యొక్క స్థానంతో పాటు మారుతాయి.
03:28 డిఫాల్ట్ గా Render ఎంపిక అనేది status bar పై తనిఖీ చేయబడింది.

దానిని అలాగే వదిలేయండి.

03:37 దిగువ-కుడి మూలలో ఉన్నstatus bar పైన, మీరు మరొక లేబుల్ Current CRS ను చూస్తారు.
03:44 ఈ కోడ్ అనేది ప్రస్తుత Projection Coordinate Reference System ‌ను సూచిస్తుంది.
03:50 ఒక layer’s projection ను నిర్ణయించడానికి, మనం metadata లోనికి చూడవచ్చు.
03:56 Layers Panel పైన, layer పేరుపై రైట్ క్లిక్ చేయండి.
04:01 కాంటెక్స్ట్ మెను నుండి, Properties ను ఎంచుకోండి.

Layer Properties డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.

04:09 డైలాగ్-బాక్స్‌లో, ఎడమ వైపు ప్యానెల్‌ పైన, Metadata ఎంపికపై క్లిక్ చేయండి.
04:15 Properties విభాగం కింద, స్లయిడర్‌ను క్రిందికి స్క్రోల్ చేయండి.
04:20 దిగువ భాగం వద్ద, Layer Spatial Reference System హెడింగ్ కిందన, మీరు ఈ ప్రొజెక్షన్ యొక్క నిర్వచనాన్ని చూస్తారు.
04:29 ఇది WGS84 ను geographic coordinate system గా చూపిస్తుంది.
04:35 డైలాగ్ బాక్స్ ను మూసివేయడానికి, దిగువ బాగా, వద్ద ఉన్నOk బటన్ పై క్లిక్ చేయండి.
04:41 ఇప్పుడు మనం మ్యాప్‌కు layers ను జోడించి, projection ను మార్చుదాం.
04:47 data layers గురించి.
04:50 సాధారణంగా geographical data అనేది layers లోని ఒక GIS వర్క్ స్పేస్ లో స్టోర్ చేయబడుతుంది.
04:57 ప్రతి layer దానియొక్క attribute table లో స్టోర్ చేయబడిన డేటాను కలిగిఉంటుంది.
05:02 చాలా layers ఒకే భౌగోళిక స్థానం యొక్క data ను సూచిస్తాయి.
05:08 QGIS ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్ళండి.
05:12 ఇప్పుడు మనం layer’s projection ‌ను మనం ఎలా మార్చవచ్చో చూద్దాం.
05:17 ఈ ఆపరేషన్‌ను Re-Projection అని అంటారు.
05:21 మొత్తం layer ను రీ ప్రొజెక్ట్ చేయడానికి బదులుగా, మనం కొన్ని ఫీచర్స్ ను మాత్రమే రీ ప్రొజెక్ట్ చేస్తాము.
05:27 టూల్ బార్ యొక్క కుడి-ఎగువ మూలలో, Select features by area or single click టూల్ పై క్లిక్ చేయండి.
05:35 ఈ టూల్ పక్కన ఉన్న బ్లాక్ ట్రయాంగిల్ పై క్లిక్ చేయండి.
05:39 డ్రాప్ డౌన్ నుండి Select features ను ఎంచుకోండి.
05:44 canvas పైన ప్రదర్శించబడుతున్న ప్రపంచ పటంలో, United States of America ఫీచర్ ని ఎంచుకోవడానికి దానిపై క్లిక్ చేయండి.
05:52 United States of America అనేది వేరే రంగులో చూపబడింది అని గమనించండి.
05:58 మనం ఇప్పుడు ఈ layer యొక్క projected coordinate system ను మార్చి సేవ్ చేస్తాము.
06:04 Layers Panel లోని layer పేరుపై రైట్ క్లిక్ చేయండి.
06:08 క్రిందికి స్క్రోల్ చెసి, Save As ఎంపికను ఎంచుకోండి.
06:12 Save Vector Layer as... డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
06:17 డిఫాల్ట్ format ఎంపిక అనేది ESRI Shapefile.

దానిని అలాగే వదిలేయండి.

06:26 File name టెక్స్ట్ బాక్స్ కు పక్కన ఉన్న Browse button పై క్లిక్ చేయండి.
06:31 Save layer as... డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.

అవుట్పుట్ layer కు USA-1.shp గా పేరును పెట్టండి.

06:41 సేవ్ చేయడానికి అనువైన స్థానాన్ని కనుగొనండి.

నేను దానిని Desktop పైన సేవ్ చేస్తాను

06:48 దిగువన భాగం వద్ద ఉన్నSave బటన్ పై క్లిక్ చేయండి.
06:52 Save Vector Layer as.... డైలాగ్-బాక్స్‌లో, file path అనేది File name టెక్స్ట్ బాక్స్‌లో కనిపిస్తుంది.
06:59 మనం ఈ layer కొరకు కొత్త projection ను ఎంచుకుంటాము.
07:03 CRS డ్రాప్ డౌన్ బాక్స్ కు పక్కన, Select CRS బటన్ పై క్లిక్ చేయండి.
07:10 Coordinate Reference System Selector లోని, Filter search box లో, North America ని ఎంటర్ చేయండి.
07:17 ప్రపంచం యొక్క Coordinate reference systems కిందన, Projected Coordinate System హెడింగ్ కింద, రిజల్ట్స్ ద్వారా స్క్రోల్ చేయండి.
07:27 North_America_Albers_Equal_Area_Conic (EPSG:102008) projection ను ఎంచుకోండి.
07:37 దిగువన భాగం వద్ద ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి.
07:41 CRS డ్రాప్ డౌన్ బాక్స్‌లో, కొత్తగా ఎంచుకున్న CRS అనేది చూపబడుతుంది.
07:47 Save only selected features ఎంపికను తనిఖీ చేయడానికి చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
07:53 ఇది ఎంచుకున్న feature మాత్రమే re-projected అయ్యి exported అవుతుందని నిర్దారిస్తుంది.
08:00 ఇక్కడ, డీఫాల్ట్ గా, Add saved file to map ఎంపిక అనేది తనిఖీ చేయబడింది.
08:06 ఒకవేళ కాకపోతే, ఈ ఎంపికను తనిఖీ చేయడానికి చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
08:11 OK బటన్ పై క్లిక్ చేయండి.
08:14 re-projected layer అనేది ఒక వేరే రంగులో లోడ్ అవుతుంది.
08:19 ఈ రెండు layers అనేవి ఇప్పుడు వేర్వేరు projections లో ఉన్నాయి.
08:24 గమనించండి, Layers Panel పైన, మీరు ఇప్పుడు 2 ఎంట్రీలను చూడవచ్చు.
08:30 world map layer యొక్క ఎగువభాగం పైన కొత్త United States layer అనేది పూర్తిగా ఓవర్లే ఆవుతుందని గమనించండి.
08:38 ఇది ఎందుకంటే QGIS అనేది On-the-fly CRS transformation అని పిలువబడే ఒకfeature ని కలిగి ఉంది కనుక.
08:45 QGIS విండో యొక్క దిగువ-కుడి మూలవద్ద ఉన్న projection టెక్స్ట్ అనేది EPSG:4326కు పక్కన OTF అనే పదాలను కలిగిఉంది.
08:56 Layers Panel లోని United-States లేయర్ పై క్లిక్ చేయడం ద్వారా దానిని ఎంచుకోండి.
09:02 status బార్ యొక్క దిగువ-కుడి మూలలో ఉన్న Current CRS టెక్స్ట్, EPSG:4326 పై క్లిక్ చేయండి.
09:11 Project Properties CRS డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది.
09:16 Enable on-the-fly CRS transformation ను మనం టర్న్ ఆఫ్ చేసి ఏమి జరుగుతుందో చూద్దాం.
09:23 Enable on the fly CRS transformation ను దానిపై క్లిక్ చేయడం ద్వారా అన్ చెక్ చెయ్యండి.

దిగువ భాగం వద్ద ఉన్నOK బటన్ పై క్లిక్ చేయండి.

09:34 తిరిగి main QGIS విండోలో, ప్రపంచ పటం అదృశ్యమవుతుందని మీరు చూస్తారు.
09:40 కాన్వాస్ పైన మీరు United States మ్యాప్‌ను మాత్రమే చూస్తారు.
09:45 ఇది ఎందుకంటే ఈ layer కొరకు Projected CRS అనేది Albers Projection కు మార్చబడింది కనుక.
09:52 coordinates మరియు స్కేల్ అనేవి ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి.
09:56 Layers Panel లోని United States layer పై రైట్ క్లిక్ చేయండి.
10:01 Zoom to Layer ఎంపికను ఎంచుకోండి.
10:05 ఇప్పుడు మీరు ఎంచుకోబడిన projection లో United States ను చూస్తారు.
10:10 మళ్ళీ, Project Properties డైలాగ్-బాక్స్ ను తెరవడానికి Current CRS టెక్స్ట్ పై క్లిక్ చేయండి.
10:17 Enable ‘on the fly’ CRS transformation ఎంపికను టర్న్ ఆన్ చెయ్యండి.
10:23 Recently used Coordinate Reference Systems, హెడింగ్ కిందన WGS 84 ను ఎంచుకోండి.

దిగువ భాగం వద్ద ఉన్న, OK బటన్ పై క్లిక్ చేయండి.

10:35 canvas లోని ప్రదర్శన అనేది ప్రపంచ పటంతో దానియొక్క మునుపటి స్థితికి చేరుకుంటుంది.
10:41 dataset నుండి vector layer ను తొలగించడానికి, Layers panel లోని పేరుపై రైట్ క్లిక్ చేయండి.
10:48 context menu నుండి, Remove ఎంపికపై క్లిక్ చేయండి.
10:52 ఈ చర్యను నిర్ధారించడానికి ఒక prompt కనిపిస్తుంది.

OK బటన్ పై క్లిక్ చేయండి.

10:59 dataset నుండి layer తొలగించబడింది అని గమనించండి.
11:04 సారాంశం చూద్దాం,
11:07 ఈ ట్యుటోరియల్‌లో మనం వీటిని నేర్చుకున్నాం

QGIS లో projections కు లేయర్స్ ను జోడించడం.

11:15 layers కొరకు metadata సమాచారాన్ని చూడడం.
11:19 ఎంచుకున్న ఫీచర్స్ ను ఒక layer నుండి ఒక కొత్త layer కు సేవ్ చేయడం.
11:24 వేర్వేరు ప్రొజెక్షన్స్ (స్క్రీన్ పైన ప్రదర్శనలు) ను కలిపి దానియొక్క డేటా లేయర్స్ ను రీ -ప్రాజెక్ట్ చేయడం మరియు ఓవర్ లే (అతివ్యాప్తి) చేయడం.
11:30 ఒక అసైన్మెంట్ గా:

United States ను North_America_Lambert_Conformal_Conic projection తో Project చేసి తేడాను గమనించండి.

11:43 మొత్తం వరల్డ్ మ్యాప్ layer ను World Mercator projection సిస్టమ్‌ లోనికి Re-project చేయండి.
11:50 మీరు పూర్తి చేసిన అసైన్‌మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
11:55 కింది లింక్‌లోని వీడియో స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్‌ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్‌లోడ్ చేసి చూడండి.
12:03 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం: వర్కుషాప్స్ ను నిర్వహిస్తుంది మరియు

ఆన్ లైన్ పరీక్షల్లో పాసైన వారికి సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాల కొరకు దయచేసి మాకు రాయండి.

12:15 దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
12:19 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT ,MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.

ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.

12:31 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి, నేను మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya