Moodle-Learning-Management-System/C2/Overview-of-Moodle/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 11:39, 10 March 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:01 Overview of Moodle అను స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో, మనం క్లుప్తంగా LMS అని పిలవబడే Learning Management Systems యొక్క భావాన్ని,
00:16 Moodle ని ఒక LMS గా,
00:19 Moodle ని ఎవరు ఉపయోగించవచ్చు మరియు Moodle వెబ్సైట్ యొక్క ఉదాహరణలు నేర్చుకుంటాము.
00:26 మనం, Moodle ను నడపడం కోసం కావాల్సిన సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ అవసరాలు మరియు
00:33 Moodle సిరీస్ లో ప్రదర్శించబడే కీలకమైన లక్షణం గురించి కూడా నేర్చుకుంటాము.
00:39 ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు ఒక వెబ్సైట్ను ఎలా బ్రౌజ్ చేయాలో తెలుసుకోవాలి.
00:45 ముందుగా Learning Management System లేదా LMS అంటే ఏమిటి అనేది మనం అర్థంచేసుకుందాం.
00:53 ఒక LMS మనకు ఏదయినా eLearning content ను సృష్టించడానికి, నిర్వహించడానికి మరియు బట్వాడా(డెలివరీ) చేయడానికి సహాయపడుతుంది.
01:01 ఉదాహరణకు: విద్యా కోర్సులు మరియు శిక్షణా కార్యక్రమాలు.
01:07 ఇది మన కోర్సులు నిర్వహించడానికి కూడా మనకు సహాయపడుతుంది.
01:11 మనం విషయాన్ని సృష్టించడం మరియు ఎడిట్ చేయడం, విద్యార్థులకు యాక్సెస్ ఇవ్వడం, వారి సమర్పణలను గ్రేడ్ చేయడం మొదలైనవి చేయవచ్చు.
01:21 Moodle అనేది ఒక ప్రతిస్పందించే, ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్.
01:27 ఇది విద్యా సంస్థలచే ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడే అత్యంత ప్రజాదరణ పొందిన LMSలలో ఒకటి.
01:33 దీనియొక్క భద్రతా నియంత్రణలు మన డేటాను భద్రంగా మరియు సురక్షితంగా ఉంచుతాయి.
01:39 ఇది ఉపాధ్యాయులు మరియు అభ్యాసకులు ఇద్దరికీ అధికారాన్ని ఇచ్చే చాలా శక్తివంతమైన లక్షణాలు కొన్నింటిని కలిగి ఉంది.
01:47 Moodle వివరణాత్మక డాక్యుమెంటేషన్ను కూడా అందిస్తుంది, ఇది మనం దీన్ని ఉపయోగించడాన్ని సులభతరం చేస్తుంది.
01:54 Moodle యూజర్ కమ్యూనిటీ మరియు ఫోరమ్ సహాయం చాలా చురుకుగా ఉంటాయి.
02:00 Moodle లో ఉచిత ప్లగిన్లు అందుబాటులోఉంటాయి. ఇవి విషయాన్నీ మరింత ఆకర్షణీయంగా చేస్తాయి.
02:06 Moodle అన్ని పరికరాల్లో నావిగేట్ చెయ్యడానికి సులభంగా ఉంటుంది.

కోర్సు మరియు సైట్ స్థాయి వద్ద పాల్గొనడం మరియు పనితీరుపై వివరణాత్మక నివేదికలు కలిగి ఉంది.

02:18 భాగస్వామ్యంలో అలాగే వ్యక్తిగతీకరించిన అభ్యాసంలో సహాయపడుతుంది.
02:23 ఫోరమ్లు, పీర్ అసెస్మెంట్స్, గ్రూప్ మేనేజ్మెంట్, లెర్నింగ్ పాత్ లు మొదలైనవి దానికొరకు ఉపయోగించబడవచు.
02:32 Moodle LMS ను ఎవరు ఉపయోగించవచ్చో చూద్దాం.
02:36 విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు మరియు శిక్షణా సంస్థలు వంటి విద్యా సంస్థలు.
02:44 ఉద్యోగి శిక్షణ మరియు నేపథ్యం కొరకు వ్యాపారాలు.
02:49 హాస్పిటల్ మరియు ఆరోగ్య సంరక్షణ శిక్షణా కార్యక్రమాలు.
02:53 ఏదైనా eLearning ఆధారిత సంస్థ.
02:57 Moodle ను ఉపయోగించి నిర్మించిన కొన్ని వెబ్సైట్లను చూద్దాం.
03:02 ఇలాంటి కళాశాలలు.
03:05 ఇటువంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు
03:09 ఇటువంటి శిక్షణా సంస్థలు.
03:13 ఇటువంటి కోచింగ్ సంస్థలు.
03:17 వ్యక్తిగత ఉపాధ్యాయులు ఎవరైతే వారియొక్క కోర్స్ ను ఆన్లైన్ అందించాలని కోరుకుంటారో మరియు మరిన్ని.
03:24 Moodle క్రింది URL లో వాడుక యొక్క వివరణాత్మక గణాంకాలను కలిగి ఉంది.
03:30 ఇక్కడ, వివిధ దేశాల నుండి రిజిస్టర్ చేయబడిన Moodle వెబ్సైట్లను మీరు తనిఖీ చేయవచ్చు.
03:40 Moodle ను ఇన్స్టాల్ చేయడానికి, మనకు Apache web-server,
03:46 MySQL, MariaDB లేదా PostgreSQL వంటి ఒక డేటాబేస్ మరియు PHP అవసరం.
03:54 Moodle అనేది ఒక వనరును వినియోగించే సాఫ్ట్వేర్.
03:58 Moodle ను నడపడం కొరకు సిఫారసు చేయబడిన హార్డ్వేర్ లు:
04:02 Moodle కోడ్ కొరకు డిస్క్ స్పేస్ 200 MB, కంటెంట్ ను నిల్వ చేయడానికి స్పేస్ కలపాలి, ఏమైనా, వాస్తవంగా కనీసం 5GB అనేది ఉండాలి.
04:15 ప్రొసెసర్: కనీసం 1 gigahertz, అయితే 2 gigahertz dual core లేదా అంతకన్నా ఎక్కువ సిఫార్సు చేయబడింది.
04:23 Memory కనీసం 512MB, కానీ 1GB లేదా అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడింది.
04:31 ఈ అవసరాలు సిస్టమ్ లో ఊహించిన లోడ్ మీద ఆధారపడి మారవచ్చు.
04:37 ఉదాహరణకు : కోర్సుల యొక్క సంఖ్య మరియు ఏకకాలంలో జరిగే లాగిన్స్.
04:44 ఈ సిరీస్ యొక్క తయారీ సమయంలో, Moodle 3.3 అనేది తాజా స్థిరమైన సంస్కరణ.
04:50 అందుబాటులో ఉన్న తాజా స్థిరమైన సంస్కరణతో పనిచేయడం ఎల్లప్పుడూ మంచిది.
04:57 Moodle 3.3 కు ఈ కిందివి అవసరం:
05:01 Apache 2.x (లేదా అంతకంటే ఎక్కువ వర్షన్)

MariaDB 5.5.30 (లేదా ఏదయినా ఎక్కువ వర్షన్ ) మరియు

05:11 PHP 5.4.4(లేదా అంతకంటే ఎక్కువ వర్షన్)
05:17 ఈ సిరీస్ కోసం ఈ క్రింది OS మరియు సాఫ్ట్వేర్ ను ఉపయోగించాము:

Ubuntu Linux OS 16.04

05:26 XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP ఇంక Moodle 3.3.
05:36 ఈ Moodle సిరీస్ 2 భాగాలుగా విభజించబడింది-
05:41 ఒకటి Moodle సైట్ అడ్మినిస్ట్రేటర్స్ కొరకు మరియు మరొకటి ఉపాధ్యాయుల కొరకు.
05:48 Moodle సైట్ అడ్మినిస్ట్రేటర్స్ సర్వర్ పై Moodle ను ఇన్స్టాల్ చేయాలి.
05:54 సంస్థల మార్గదర్శకాల ప్రకారంగా కోర్స్ కేటగిరీలను సృష్టించి, కోర్స్ లను మరియు బహుళకోర్స్ ల కొరకు యూజర్ అకౌంట్ లను నిర్వహించాలి.
06:04 ఈ సిరీస్లో Moodle సైట్ అడ్మినిస్ట్రేటర్స్ కొరకు కవర్ చేసిన కొన్ని కీ ఫీచర్స్ యొక్క గ్లింప్సెస్(తళుకులు) ఇక్కడ ఉన్నాయి.
06:14 Getting ready for Moodle installation ట్యుటోరియల్ localhost పై ప్యాకేజీలుకొరకు ఎలా తనిఖీ చేయాలో మరియు database సెటప్ ను వివరిస్తుంది.
06:29 Installing Moodle on Local Server ట్యుటోరియల్ Moodle ను ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో వివరిస్తుంది.
06:39 Moodle లో Admin’s dashboard ట్యుటోరియల్ Admin Dashboard ను,

వివిధ బ్లాక్ లు మరియు ప్రొఫైల్ పేజీ ఇంకా ప్రిఫరెన్సెస్ ను ఎడిట్ చేయటాన్ని వివరిస్తుంది.

06:53 Blocks in Admin's Dashboard ట్యుటోరియల్- బ్లాక్స్ ని ఎలా జోడించాలి ఎలా తొలగించాలి మరియు
07:05 ఫ్రంట్ పేజీ ని ఎలా సెట్ చేయాలి అనేది వివరిస్తుంది.
07:08 తరువాతి ట్యుటోరియల్ Categories in Moodle లో మనం categories మరియు subcategories ను సృష్టించడం నేర్చుకుంటాము.
07:19 Courses in Moodle ట్యుటోరియల్ లో, మనము ఒక కోర్స్ ను ఎలా సృష్టించాలో మరియు దానిని ఎలా ఆకృతీకరించాలో నేర్చుకుంటాము.
07:28 Users in Moodle ట్యుటోరియల్ మనకు- ఒక యూజర్ ని జోడించడం,
07:36 ఒక యూజర్ యొక్క ప్రొఫైల్ ను ఎడిట్ చేయడం

మరియు బల్క్ లో యూజర్లను ఎలా అప్లోడ్ చేయాలో అర్థంచేసుకోవడానికి సహాయం చేస్తుంది.

07:43 User Roles in Moodle ట్యుటోరియల్ వినియోగదారులకు వివిధ పాత్రలను ఎలా కేటాయించాలో నేర్చుకోవడానికి మనకు సహాయం చేస్తుంది.
07:52 ఉదాహరణకు: సెకండరీ నిర్వాహక పాత్ర, గురువు పాత్ర మరియు విద్యార్థి పాత్ర.
08:00 భవిష్యత్తులో, Moodle సైట్ నిర్వాహకులకు ఈ సిరీస్లో మరిన్ని ట్యుటోరియల్స్ ఉన్నాయి.
08:07 మనము ఇప్పుడు ఉపాధ్యాయుల కొరకు ట్యూటోరియల్స్ కు వెళదాం.
08:11 ఉపాధ్యాయులు వారి కోర్సు కొరకు కంటెంట్ను అప్లోడ్ చేయడానికి మరియు సవరించడానికి బాధ్యత వహిస్తారు.
08:17 విద్యార్థుల పురోగతిని అంచనా వేయడానికి అసైన్మెంట్స్ మరియు క్విజ్ లు సృష్టించడం,
08:22 వారి కోర్సు కు విద్యార్థులను నమోదు చేసి, వారితో కమ్యూనికేట్ చేయడం.
08:27 ఇపుడు, ఉపాధ్యాయుల కొరకు ఈ సిరీస్ లో కవర్ చేయబడిన కొన్ని కీ ఫీచర్స్ యొక్క గ్లింప్సెస్(తళుకులు)ను నన్ను చూపించనివ్వండి
08:34 Teacher’s dashboard in Moodle ట్యుటోరియల్ ఇవి వివరిస్తుంది-

teachers’ dashboard profile ను ఎలా ఎడిట్ చేయాలి preferences ను ఎలా ఎడిట్ చేయాలి.

08:46 Course Administration in Moodle ట్యుటోరియల్ కోర్సు సెట్టింగ్స్ ను ఎలా ఆకృతీకరించాలి
08:53 మరియు Activities ను నిర్వహించడం ఇంకా ఒక కోర్సు లో రిసోర్సెస్ ను వివరిస్తుంది.
08:59 Formatting course material in Moodle ట్యుటోరియల ఇవి వివరిస్తుంది- అప్రమేయ Moodle text editor లో వివిధ ఫార్మాటింగ్ ఎంపికలు
09:10 మరియు అదనంగా course material ను జోడించడం.
09:15 Moodle ట్యుటోరియల్ Uploading and Editing Resources లో A URL resource ను మరియు ఒక book resource ను ఎలా అప్ లోడ్ చేయాలి ఇంకా ఆ రిసోర్సెస్ ను ఎలా ఎడిట్ చేయాలో వివరిస్తుంది.
09:29 ఈ Moodle సిరీస్ లో తరువాతి ట్యుటోరియల్ ఫోరమ్స్ మరియు అసైన్మెంట్స్.
09:34 ఈ ట్యుటోరియల్ లో మనము, Moodle లో ఫోరమ్స్ యొక్క వివిధ రకాలను,
09:39 చర్చ కొరకు ఒక ఫోరమ్ ను ఎలా జోడించాలి మరియు అసైన్మెంట్స్ ను ఎలా సృష్టించాలి అనేది నేర్చుకుంటాము.
09:48 Question bank in Moodle ట్యుటోరియల్: ఈ ట్యుటోరియల్ లో, మనము ప్రశ్నల యొక్క కేటగిరీలు ఎలా సృష్టించాలో మరియు కొశ్చన్ బ్యాంకు కు ప్రశ్నలను ఎలా జోడించాలో నేర్చుకుంటాము.
09:58 Quiz in Moodle ట్యుటోరియల్ లో, మనకు ఒక క్విజ్ ను సృష్టించడం మరియు కొశ్చన్ బ్యాంకు నుండి ప్రశ్నలను క్విజ్ లోనికి జోడించడం నేర్పిస్తుంది.
10:12 Moodle లోని Enroll Students and Communicate అనే పేరుగల ట్యుటోరియల్ లో, మనం నేర్చుకునేవి,

ఒక కోర్సు కు ఒక csv ఫైల్ ద్వారా అప్లోడ్ చేసిన విద్యార్థులను నమోదు చేయడం,

10:25 కోర్సెస్ లో గ్రూప్ లను చేయడం మరియు విద్యార్థులకు సందేశాలను గమనికలును పంపడం.
10:31 తరువాత, ఈ సిరీస్లో ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అనేక ట్యుటోరియల్స్ ఉంటాయి.
10:37 ఇప్పటి కొరకు , సారాంశం చూద్దాం.

ఈ ట్యుటోరియల్ లో, మనం క్లుప్తంగా LMS అని పిలిచే Learning Management Systems యొక్క భావాన్ని,

10:48 Moodle ని ఒక LMS గా

Moodle ని ఎవరు ఉపయోగించవచ్చు మరియు Moodle వెబ్సైట్ యొక్క ఉదాహరణలు గురించి నేర్చుకున్నాము.

10:57 మనం, Moodle ను నడపడం కోసం కావాల్సిన సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ అవసరాలు మరియు

Moodle సిరీస్ లో ప్రదర్శించబడే కీ ఫీచర్ ల యొక్క అవలోకనం గురించి కూడా నేర్చుకున్నాము.

11:10 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
11:18 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

11:28 మీరు ఈ స్పోకన్ ట్యుటోరియల్ పై ఏవైనా సందేహాలను కలిగి ఉన్నారా? దయచేసి ఈ సైట్ ను సందర్శించండి.
11:35 మీకు ఎక్కడైతే సందేహం ఉందో ఆ నిమిషం ఆ క్షణం లో దాన్ని ఎంచుకోండి.

మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి. మా టీం నుండి ఎవరో ఒకరు వాటికీ సమాధానాలు ఇస్తారు.

11:45 ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్.
11:51 దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు. ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది.
11:59 తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు.
12:05 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
12:18 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya