Moodle-Learning-Management-System/C2/Formatting-Course-material-in-Moodle/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 12:36, 12 April 2019 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01

Moodle లో Formatting course material అను స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.

00:07 ఈ ట్యుటోరియల్ లో, మనము :

Moodle లో వనరులు అదనపు course material ను జోడించడం అప్రమేయ text editor లో Formatting ఎంపికలు గురించి నేర్చుకుంటాము

00:21 ఈ ట్యుటోరియల్ :

ఉబుంటు లైనక్స్ OS 16.04, XAMPP 5.6.30 ద్వారా పొందిన Apache, MariaDB మరియు PHP, Moodle 3.3 మరియు ఫైర్ఫాక్స్ వెబ్ బ్రౌజర్ ను ఉపయోగించి రికార్డు చేయబడింది. మీరు మీకు నచ్చిన ఏ ఇతర బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు.

00:48 ఏమైనప్పటికీ, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ని వాడకూడదు, ఎందుకంటే అది కొన్ని ప్రదర్శన అసమానతలకు కారణమవుతుంది.
00:56 ఈ ట్యుటోరియల్,

మీ సైట్ నిర్వాహకుడు Moodle వెబ్సైట్ ను సెటప్ చేసారని, మరియు మిమ్మల్ని ఒక టీచర్ గా రిజిస్టర్ చేశారని అనుకుంటుంది.

01:06 ఈ ట్యుటోరియల్ యొక్క అభ్యాసకులు

Moodle లో ఒక teacher login ను తప్పక కలిగివుండాలి. అడ్మినిస్ట్రేటర్ చేత వారికి కనీసం ఒక కోర్సు అయిన కేటాయించబడాలి, వారి కోర్స్ కొరకు సంబందించిన కొంత కోర్స్ మెటీరియల్ ను అప్ లోడ్ చేసిఉండాలి.

01:21 ఒకవేళ 'లేకపోతే, దయచేసి ఈ వెబ్సైట్లోని సంబంధిత Moodle ట్యుటోరియల్స్ ను చూడండి.
01:27 బ్రౌజర్ కు మారి మీ Moodle site ను తెరవండి.
01:31 మీ టీచర్ యూజర్ నేమ్ మరియు పాస్ వర్డ్ వివరాలతో లాగిన్ అవ్వండి.
01:36 మనము ఇప్పుడు teacher dashboard లో ఉన్నాము.
01:39 ఎడమవైపున ఉన్న navigation menu లో, My Courses దిగువన ఉన్న Calculus ను గుర్తించండి.
01:45 Calculus course పై క్లిక్ చేయండి.
01:48 మనము ముందుగానే announcements మరియు కొన్ని సాధారణ course వివరాలను జోడించియున్నాము.
01:54 ఇప్పుడు మనము కొంత అదనపు course material ను జోడిస్తాము.
01:58 Moodle లోని అన్నిcourse material లు Resources అని పిలువబడతాయి.

ఈ materialని ఒక టీచర్, అభ్యాసానికి మద్దతు ఇవ్వడానికి ఉపయోగిస్తుంది.

02:09 Resourcesఅనేవి ఉపన్యాస గమనికలు, పుస్తకాలూ వంటి అంతర్గతమైనవి లేదా Wikipedia links వంటి బాహ్యమైనవి ఏవయినా కావచ్చు.
02:19 ప్రారంభిద్దాం

పేజియొక్క ఎగువ కుడిభాగం వద్ద ఉన్న gear ఐకాన్ పై క్లిక్ చేసి తరువాత Turn Editing On పై క్లిక్ చేయండి.

02:29 గమనిక: మీరు కోర్స్ కు ఏవైనా మార్పులు చేయటానికి , editing ను on చేయవలసి ఉంటుంది.
02:36 Basic Calculus section యొక్క దిగువ కుడిభాగం వద్ద ఉన్నAdd an activity or resource లింక్ పై క్లిక్ చేయండి.
02:44 resources యొక్క జాబితాతో ఒక పాప్ అప్ తెరుచుకుంటుంది.
02:48 క్రిందికి స్క్రోల్ చేసి జాబితా నుండి Page ను ఎంచుకోండి. మీరు ఏదయినా resourceను ఎంచుకున్నప్పుడు దాని కుడిభాగం పైన resource గురించి వివరణాత్మక వర్ణనను చదవండి.
03:01 పాప్ అప్ స్క్రీన్ యొక్క దిగువభాగం వద్ద ఉన్నAdd button పై క్లిక్ చేయండి.
03:06 Name ఫీల్డ్ లో, నేను Lecture 1 Notes ను టైప్ చేస్తాను.
03:12 తరువాత Description బాక్స్ లో, Involutes and construction of Involute of circle టైప్ చేయండి.
03:22 Display description on course page ఎంపికను తనిఖీ చేయండి.
03:27 Page Content బాక్స్ ను చూడటానికి స్క్రోల్ చేయండి. BasicCalculus-Involutes.odt ఫైల్ నుండి టెక్స్ట్ ను కాపీ చేసి పేస్ట్ చేయండి.
03:40 మనము తరువాత దశలో చిత్రాన్ని అప్లోడ్ చేస్తాము. ఈ ఫైల్ ఈ ట్యుటోరియల్ యొక్క Code Files లింక్ లో అందుబాటులో ఉంది.
03:51 ఇప్పుడు మనం టెక్స్ట్ ను format చేద్దాం. menu widgets లను విస్తరించేందుకు ఎగువ ఎడమ భాగం వద్ద ఉన్న డౌన్-బాణం పై క్లిక్ చేయండి.
04:03 చూపబడినవిధంగా నేను శీర్షికలను మరింత స్పష్టంగా చేస్తాను.
04:07 text editor లోని ఎంపికలు, ఏదయినా ఇతర ప్రామాణిక text editor కు సమానంగా ఉంటాయి. ఇక్కడ మనం Bold, Italics, Unordered మరియు Ordered lists వంటి ఎంపికలను చూడవచ్చు.
04:24 మనం ఒక టెక్స్ట్ ను hyperlink మరియు unlink చేయడానికి ఎంపికలను చూస్తాము.
04:30 అలాగే ఇక్కడ ఒక చిత్రాన్ని జోడించడానికి కూడా ఎంపిక ఉంది. Figure 1 shows the involute of a circle టెక్స్ట్ కు తరువాత ఒక చిత్రాన్ని జోడిద్దాం.
04:41 చిత్రం కొరకు స్థలాన్ని ఖాళీని చేయడానికి Enter నొక్కండి. తరువాత Image iconపై క్లిక్ చేయండి.
04:48 Image properties విండో కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఒక external image ను చేర్చదలచినట్లయితే, ఇక్కడ image యొక్క URL ను ఎంటర్ చెయ్యవచ్చు.
04:58 నేను ఒక imageని అప్ లోడ్ చేయడానికి Browse Repositories బటన్ పై క్లిక్ చేస్తాను.
05:04 File Picker అనే శీర్షికతో ఒక పాప్ అప్ విండో తెరుచుకుంటుంది.
05:09 Upload a file పై క్లిక్ చేయండి . తరువాత Choose File లేదా Browse బటన్ పై క్లిక్ చేసి, మీ మెషీన్ నుండి ఫైల్ను ఎంచుకోండి.
05:19 ఈ image, Code Filesలింక్ లో కూడా అందుబాటులో ఉంది. మీరు దానిని డౌన్లోడ చేసుకుని ఉపయోగించుకోవచ్చు.
05:26 Upload this file బటన్ పై క్లిక్ చేయండి.
05:29 మనము వివరణనుThis is the involute of a circle గా టైప్ చేస్తాము.
05:36 చివరగా, image ను చేర్చడానికి Save image బటన్ పై క్లిక్ చేయండి.
05:42 తరువాతి ఎంపిక అనేది mediaను జోడించడానికి. ఇది URL, video లేదా audio ఫైల్ కావచ్చు. మళ్ళీ, ఇది ఒక బాహ్య URL అయి ఉండవచ్చు లేదా మన మెషిన్ నుండి అప్లోడ్ చేయబడినది కావచ్చు.
05:58 తరువాతది Manage Files ఎంపిక, దానిపై క్లిక్ చేద్దాం.
06:04 Manage Files ఎంపిక అనేది మీరు నిల్వ చేయదలిచిన మరియు ప్రదర్శించదలిచిన ఫైల్స్ యొక్క ఒక జతను కలిగి ఉండాలి. ఇది assignment submissions, resource files, మొదలైనవి చేర్చుకునేలా ఉండాలి.
06:17 అవి ఈ course లో ఏవయినా ఇతర resourceల ద్వారా ఉపయోగించబడవచ్చు. మనము ఇప్పుడే అప్ లోడ్ చేసిన image కూడా ఇక్కడ ఉంది.
06:27 ఈ పాప్-అప్ బాక్స్ కి ఎడమవైపున 3ఐకాన్స్ ఉన్నాయి.
06:32 మొదటిది File picker, దానిపై క్లిక్ చేద్దాం.
06:37 ఇది server files, recent files, మొదలైనవి చూడటానికి ఎంపికలను కలిగిఉంది. Server files అనేవి కోర్సులో మరెక్కడైనా ఉపయోగించిన మరియు తిరిగి ఉపయోగించబడే ఫైళ్ళు.
06:52 X icon పై క్లిక్ చేయడం ద్వారా ఇప్పటి కొరకు నేను దీనిని మూసివేస్తాను.
06:57 తరువాత, మనం Create Folder icon పై క్లిక్ చేస్తాము, ఇది రెండవ ఐకాన్.
07:04 New folder name ఫీల్డ్ లో, Assignments అని టైప్ చేద్దాం.
07:10 తరువాత Assignments ఫోల్డర్ ను తెరవడానికి దానిపై క్లిక్ చేయండి.
07:15 Assignments ఫోల్డర్ లోపలి నా ఫైల్ ను నన్ను డ్రాగ్ చేయనివ్వండి.
07:20 ఇప్పుడే అప్ లోడ్ చేయబడిన, ఆ ఫైల్ పై క్లిక్ చేయండి.
07:24 ఈ పాప్-అప్, ఫైల్ పేరు మరియు రచయితను సవరించడానికి ఎంపికను కలిగి ఉంది. అలాగే ఫైల్ ను డౌన్లోడ్ చేయడానికి లేదా తొలగించదానికి కూడా.
07:34 నేను దేనినీ మార్చాలని అనుకోవడం లేదు. కనుక నేను పాప్-అప్ యొక్క దిగువభాగం వద్ద ఉన్నCancel బటన్ పై క్లిక్ చేస్తాను.
07:41 ఇప్పుడు, ట్యుటోరియల్ ను పాజ్ చేసి ఈ చిన్న అసైన్మెంట్ ను చేయండి:

Reference Material అనే ఒక ఫోల్డర్ ను సృష్టించండి. ఈ ఫోల్డర్, Files అనే ఫోల్డర్ లోపల ఉందని మరియు Assignments అనే సబ్ ఫోల్డర్ లోపల లేదని నిర్ధారించుకోండి.

07:57 3 ఫైళ్ళను అప్లోడ్ చేయండి. మీరు ఈ ట్యుటోరియల్ యొక్క Code files లింక్లో వాటిని కనుగొంటారు.
08:05 మీరు ఈ అసైన్మెంట్ ను పూర్తి చేసిన తర్వాత ఈ ట్యుటోరియల్ను పునఃప్రారంభించండి.
08:10 మీ File manager ఇప్పుడు 2 ఫోల్డర్లను అనగా Assignments మరియు Reference Material కలిగి ఉండాలి.
08:18 మరియు involutes-img1.png అనే పేరు గల మరో ఫైల్.
08:26 ఎగువ కుడిభాగం వద్ద ఉన్న X icon పై క్లిక్ చేయడం ద్వారా పాప్ అప్ విండో ను మూసివేయండి .
08:33 తరువాతి ఫార్మాటింగ్ ఎంపికల యొక్క సెట్,

Underline, Strikethrough, Subscript మరియు Superscript.

08:45 Align మరియు indent ఎంపికలు వీటిని అనుసరిస్తాయి. ఇవి ఏదయినా ఇతర text editor లోని వాటిలాగానే పనిచేస్తాయి.
08:53 equation editor అనే తరువాతి ఎంపికను ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం.
08:59 నేను ఈ వాక్యాన్ని ఒక సమీకరణంతోపాటు జోడించాలనుకుంటున్నాను. కనుక నేను equation editor ఐకాన్ పై క్లిక్ చేస్తాను. తరువాత సమీకరణాన్ని టైప్ చేయడానికి equation editor ను ఉపయోగించండి.
09:14 సమీకరణాలను టైప్ చేయడానికి LaTeX ను ఎలా ఉపయోగించాలి అనేదాని గురించి వివరాలు Additional Reading Material లింక్ లో ఉన్నాయి. మీరు పూర్తి చేసిన తర్వాత Save equation బటన్ పై క్లిక్ చేయండి.
09:29 Insert character, insert table మరియు clear formatting ఎంపికలు,ఏదయినా ఇతర text editor లోని వాటిలాగానే పనిచేస్తాయి.
09:40 తరువాతి రెండు ఎంపికలు Undo మరియు Redo. ఎప్పుడైనా కొన్ని సేవ్ కాని టెక్స్ట్ లు ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఎనేబుల్ అవుతాయి.
09:51 దీని తర్వాత, accessibility కొరకు 2 ఎంపికలు ఉన్నాయి. మొదటి ఐకాన్ Accessibility checker మరియు రెండవది screen reader helper.
10:05 accessible websitesమరియు ఈ ఎంపికల గురించిన వివరాలు Additional Reading Material లింక్ లో ఉన్నాయి.
10:14 చివరి ఎంపిక editor view నుండి HTML code వ్యూ కు టోగుల్ చేయుటకు ఉంది. ఇది చిత్రాలను embed చేయుటకు, వీడియోస్, PPT, ఇంటరాక్టివ్ కంటెంట్, మొదలైనవాటికి ఉపయోగించబడవచు.
10:30 HTML టోగుల్ పై మళ్ళీ క్లిక్ చేయండి. ఇది మనల్ని సాధారణ editor view కు తీసుకువస్తుంది.
10:39 ఈ ప్రదర్శన కోసం bold, italics మరియు listఎంపికలను ఉపయోగించి నేను టెక్స్ట్ ను ఫార్మాట్ చేశాను. మీ కంటెంట్ కొరకు మీరు కూడా అదేవిధంగా చేయండి.
10:52 మీరు ఫార్మాటింగ్ ను పూర్తి చేసిన తర్వాత, దిగువ భాగానికి స్క్రోల్ చేసి Save and display బటన్ పై క్లిక్ చేయండి.
11:01 ఇప్పుడు మనం Moodle నుండి లాగౌట్ చేయవచ్చు.
11:05 విద్యార్థిని ప్రియ సిన్హా ఈ పేజీని ఈ విధంగా చూస్తారు.
11:11 దీనితో, మనము ఈ ట్యుటోరియల్ యొక్క చివరికి వచ్చాము. సారాంశం చూద్దాం.
11:19 ఈ ట్యుటోరియల్ లో, మనము :

Moodle లో రిసోర్సెస్ course material ను జోడించడం అప్రమేయ text editor లో Formatting ఎంపికలు గురించి నేర్చుకున్నాము

11:34 ఇక్కడ మీ కొరకు మరొక అసైన్మెంట్.

Basic Calculus లో resource అనే ఒక కొత్త ఫోల్డర్ ను జోడించండి File Managerనుండి reference filesను జోడించండి వివరాల కొరకు ఈ ట్యుటోరియల్ యొక్క Assignment లింకును చూడండి.

11:51 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
12:00 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.
12:10 ఈ ఫోరమ్ లో మీ సమయంతో కూడిన సందేహాలను పోస్ట్ చేయండి.
12:14 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ పై మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
12:27 నేను ఉదయలక్ష్మి మీ వద్ద శలవు తీసుకుంటున్నాను.
12:38 మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya