Difference between revisions of "Linux/C2/General-Purpose-Utilities-in-Linux/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |హాయ్, Linux లోని General Purpose Utilities పై ఈ spoken tutorial కు మీకు స్వాగతం. |- |0:06 |…')
 
(No difference)

Revision as of 16:25, 2 December 2012

Time Narration
0:00 హాయ్, Linux లోని General Purpose Utilities పై ఈ spoken tutorial కు మీకు స్వాగతం.
0:06 ఈ tutorial లో మనము Linux లోని కొన్ని basic, కానీ చాలా ఎక్కువగా వాడబడే కొన్ని command ల గురించి మనము తెలుసుకుందాము.
0:14 linux తో పని చేయడము లో మీకు ఒక చక్కని ఆరంభమును అందించడము దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము.
0:21 మనము చూడబోయే మొదటి command echo command. Linux లోని command లు కేస్ సెన్సిటివ్ అనే విషయము గుర్తు పెట్టుకోండి.
0:29 ఇక్కడ ప్రత్యేకముగా చెప్పలేదు అంటే అన్ని command లు మరియు వాటి యొక్క ఆప్షన్ లు అన్నీ కూడా small letters లో ఉంటాయి.
0:36 స్క్రీన్ పైన కొన్ని మెసేజ్ లను display చేయడము కొరకు ఈ command వాడబడుతుంది. Terminal కు వెళ్ళండి.
0:43 ubuntu లో ఒక Terminal లు స్టార్ట్ చేయడము కొరకు Ctrl Alt t సహయము చేస్తుంది.
0:48 ఏది ఏమైనప్పటికీ, ఈ commands అన్నీ unix systems లో పని చేయకపోవచ్చు.
0:52 ఒక Terminal ను ఓపెన్ చేసే ఒక జనరల్ ప్రొసిజర్ ఇప్పటికే మరొక spoken tutorial లో వివరించబడినది.
0:58 ప్రాంప్ట్ వద్ద echo space Hello World nu టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
1:08 ఇది స్క్రీన్ పై కస్టమరీ Hello World మెసేజ్ ను ప్రింట్ చేస్తుంది.
1:14 మనము echo command ను ఒక variable యొక్క వాల్యూ ను display చేయడము కొరకు కూడా వాడవచ్చు.
1:19 ప్రాంప్ట్ వద్ద echo space dollar SHELL ను capital letter లలో టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
1:30 ఇది ప్రస్తుతము వాడబడుతున్న SHELL ను అవుట్ పుట్ గా ప్రెజెంట్ చేస్తుంది.
1:36 మనము echo command తో పాటుగా escape sequences ను కూడా వాడవచ్చు.
1:42 Linux కొరకు మనము -e (hyphen e) ఆప్షన్ ను వాడవలసి ఉంటుంది.
1:46 కామన్ escape sequences లలో టాబ్ కొరకు \t (బాక్ స్లాష్ t), క్రొత్త లైన్ కొరకు \n లు కూడా ఉంటాయి మరియు \c అనేది ఒక escape sequences, దీనిని వాడినప్పుడు అదే లైన్ లో ప్రాంప్ట్ display అయ్యేలా చేస్తుంది.
2:03 మనము ఏదైనా ఎంటర్ చేయడానికి ముందుగా మనము ఏదైనా మెసేజ్ ను ప్రాంప్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇది ఉపయోగకరముగా ఉంటుంది.

ప్రాంప్ట్ వద్ద ఇలా టైప్ చేయండి. echo space minus e within single quote ఒక command ను ఎంటర్ చేయండి, back slash c మరియు ఎంటర్ ను ప్రెస్ చేయండి.

2:32 ‘enter a command ‘on the same line అని ప్రింట్ చేసిన తరువాత ప్రాంప్ట్ display చేయబడుతున్నది అని మనము చూడవచ్చు.
2:38 మీరు రన్ చేస్తున్న Linux Kernel ఏ version దో తెలుసుకుకోవాలి అని మీరు అనుకోవచ్చు.
2:43 దీనిని మరియు మీ మెషీన్ కు సంబంధించిన ఇతర కారెక్టరిస్టిక్స్ గురించి తెలుసుకోవడానికి మనకు uname command ఉన్నది. ప్రాంప్ట్ వద్ద uname హైఫన్ r అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
2:58 యూజర్ నేమ్ తెలుసుకోవడము కొరకు, ప్రాంప్ట్ వద్ద who space am space I అని టైప్ చేసి ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయండి.
3:11 మీ system కనుక multiuser system అయితే, ఇది నిజమునకు system లోకి లాగిన్ అయిన అందరు యూజర్లను enlist చేసే who command నుంచి తీసుకుంటుంది.
3:21 కొన్నిసార్లు మీ లాగిన్ password కాంప్రమైజ్ అవ్వవచ్చు మరియు/లేదా మీరు దానిని మీరు మార్చాలని అనుకోవచ్చు.
3:28 దీని కొరకు మనకు passwd command ఉన్నది. ప్రాంప్ట్ వద్ద

p-a-s-s-w-d అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.

3:37 మీరు ఈ command ను టైప్ చేసినప్పుడు మిమ్మల్ని ప్రస్తుత password ఎంటర్ చేయమని అడుగుతుంది.
3:43 ఇక్కడ నేను నా system యొక్క ప్రస్తుత password ను టైప్ చేయవలసి ఉంటుంది.
3:48 అది సరిగ్గా ఎంటర్ చేయబడినప్పుడు, మీరు మీ క్రొత్త password ను ఎంటర్ చేసి, దానిని కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది.
4:02 కానీ మీరు కనుక ప్రస్తుతము ఉన్న password ను మరచి పోతే ఎలా?
4:06 అప్పుడు కూడా, ప్రస్తుత password తెలియక పోయినప్పటికీ password ను మార్చవచ్చు, కానీ ఆ పని కేవలము root user మాత్రమే చేయగలుగుతారు.
4:14 ఇప్పుడు root user అంటే ఎవరు?
4:18 అతను మరిన్ని ప్రివిలేజ్ లను కలిగి ఉన్న ఒక ప్రత్యేకము అయిన వ్యక్తి.
4:22 root user అంటే windows లో Administrator స్థాయిలో ఉన్న వ్యక్తి తో సమానము అయిన వాడు అని చెప్పవచ్చును.
4:30 మనకు system యొక్క డేట్ మరియు టైమ్ తెలుసుకోవడము పట్ల ఆసక్తి కలిగి ఉండవచ్చు. దీని కొరకు మనకు date command ఉన్నది.
4:36 టెర్మినల్ లో date అని టైప్ చేయండి మరియు ఎంటర్ ను ప్రెస్ చేయండి
4:42 అది మీకు ప్రస్తుతము system యొక్క టైమ్ మరియు డేట్ ను చూపిస్తుంది.
4:45 date command system time and date రెంటినీ ఇస్తున్నది అని మనము చూడవచ్చు. ఇది చాలా చాలా ప్రత్యేకము అయిన utility మరియు అలాగే చాలా ఆప్షన్ లను కలిగి ఉంటుంది.
4;54 ప్రాంప్ట్ వద్ద date space plus 'percent' sign capital T అని టైప్ చేసి ఎంటర్ చేయండి.
5:07 ఇది కేవలము time in hours minutes and seconds (hh:mm:ss) అనే ఫార్మాట్ లో చూపిస్తుంది.
5:12 ప్రాంప్ట్ వద్ద date space plus 'percentage sign small h అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
5:23 ఇది నెల యొక్క పేరు ను ఇస్తుంది.
5:25 ప్రాంప్ట్ వద్ద date space plus percentage sign small m అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
5:38 అది సంవత్సరము లోని నెలను న్యుమరికల్ ఫార్మాట్ లో ఇస్తుంది. ఇక్కడ అది ఫిబ్రవరి కొరకు 02 అని చూపిస్తోంది. మీకు వస్తున్న అవుట్ పుట్ ను బట్టి దీనిని జతపరచండి.
5:50 ప్రాంప్ట్ వద్ద date space plus percentage sign small y అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
6:01 అది ప్రస్తుత సంవత్సరము యొక్క చివరి రెండు అంకెలను ఇస్తుంది.
6:05 మనము ఈ ఆప్షన్లు అన్నిటినీ కూడా కలపవచ్చు. ఉదాహరణకు, ప్రాంప్ట్ వద్ద date space plus within double quotes percentage small h percentage small y అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
6:34 ఇక్కడ అది ఫిబ్రవరి 11 అని చూపిస్తున్నది.
6:39 దీనికి సంబంధించిన మరొక command cal command. ఇది మీకు ఏ నెల మరియు ఏ సంవత్సరము యొక్క కాలెండర్ అయినా చూడడములో సహాయము చేస్తుంది.
6:48 ప్రస్తుత సంవత్సరము యొక్క కాలెండర్ ను చూడడము కొరకు ప్రాంప్ట్ వద్ద ‘cal’ అని టైప్ చేసి ఎంటర్ ను ప్రెస్ చేయండి.
6:56 ఏదో ఒక నెల యొక్క కాలెండర్ చూడడము కొరకు, ఉదాహరణకు డిసెంబర్ 2070 యొక్క కాలెండర్ చూడడము కొరకు ప్రాంప్ట్ వద్ద ‘ cal space 12 space 2070 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
7:13 ఇది డిసెంబర్ 2070 కాలెండర్ ను ఇస్తుంది.
7:19 ఇంకా ముందుకు వెళ్ళే ముందు files మరియు directories గురించి కొంత చర్చిద్దాము.
7:26 Linux లో దాదాపు ప్రతిదీ ఒక file గా ఉంటుంది. ఇప్పుడు అసలు file అంటే ఏమిటి అనేది ప్రశ్న?
7:34 నిజ జీవితములో మనము మన పత్రములు మరియు కాగితములను ఎక్కడ ఉంచుతామో దానిని ఫైల్ అని అంటారు. అలాగే ఒక linux ఫైల్ అనేది సమాచారమును స్టోర్ చేసుకునే ఒక పాత్ర వంటిది.
7:48 ఆ తరువాత directory అంటే ఏమిటి?
7:52 ఒక directory అనేది files లేదా ఇతర (sub) directories యొక్క కలెక్షన్ అని భావించవచ్చు.
7:58 మన files ను ఒక క్రమపద్దతిలో అమర్చుకోవడములో ఒక directory మనకు సహాయము చేస్తుంది.
8:04 ఇది మనము windows లో folders అని పిలిచేవాటి లాగానే ఉంటుంది.
8:08 మనము Linux system లోకి లాగిన్ అయ్యాము అంటే డీఫాల్ట్ గా మనము home directory లో ఉంటాము. home directory లను చూడడము కొరకు ప్రాంప్ట్ వద్ద echo space dollar HOME అని టైప్ చేసి ఎంటర్ ను ప్రెస్ చేయండి.
8:27 మనము ప్రస్తుతము పని చేస్తున్న directory ను చూడడము కొరకు తరువాత వచ్చే command సహాయము చేస్తుంది. అది pwd command, ఇది present working directory యొక్క చిన్న రూపము. ప్రాంప్ట్ వద్ద pwd అని టైప్ చేసి ఎంటర్ చేయండి.
8:42 ఒకసారి మనకు directory ఏమిటో తెలిసిన తరువాత మనకు అందులోని files మరియు sab directories వంటి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటాము. దీని కొరకు మనకు ls command ఉన్నది, ఇది బహుశా Unix మరియు Linux లలో చాలా ఎక్కువగా వాడబడే command.
8:56 ls command ను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
9:01 ఇప్పుడు అవుట్ పుట్ ను గమనించండి.
9:04 సాధారణముగా ఫైల్స్ మరియు సబ్ డైరెక్టరీలు వేరు వేరు రంగులలో చూపబడతాయి.
9:08 ls చాలా విభిన్నము అయిన command మరియు చాలా ఆప్షన్ లను కలిగి ఉన్నది. వాటిలో కొన్నిటిని చూద్దాము, ప్రాంప్ట్ వద్ద ls minus all అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
9:24 ఇది hidden files తో సహా అన్ని files ను చూపిస్తుంది (ఇక్కడ hidden files అంటే డాట్(.)) తో మొదలు అయ్యే files.
9:33 మనము కేవలము file ను చూడడము మాత్రమే కాకుండా మరింత సమాచారము పొందాలి అని అనుకుంటే, దాని కొరకు minus l ఆప్షన్ ను వాడుకోవచ్చును.
9:40 command ls space minus small l అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
9:50 అది మనకు file permissions ను, file owner's name ను, చివరగా ఆ file ఫైల్ మాడిఫై చేయబడిన సమయమును , బైట్ లలో file size ఫైల్ సైజ్ ను ఇస్తుంది. ఈ ఆప్షన్ యొక్క ఫీల్డ్స్ ను గురించిన వివరణ అనేది ప్రస్తుత tutorial పరిధిలో లేదు.
10:06 ls ను చాలా చాలా ఆప్షన్ లతో వాడవచ్చును, మనము వాటిని తరువాత చూస్తాము.
10:11 స్క్రీన్ పై ఈ సమాచారములను display చేయడము నకు బదులుగా, మనము దానిని ఒక ఫైల్ లో స్టోర్ చేసుకోవచ్చు. నిజమునకు ఈ పద్దతిలో ఏ command యొక్క అవుట్ పుట్ ను అయినా సరే మనము ఒక ఫైల్ లో సేవ్ చేసుకోవచ్చును.
10:23 command వ్రాసి దాని తరువాత రైట్ యాంగిల్ బ్రాకెట్ ను file పేరు ను టైప్ చేయండి. ఉదాహరణకు, ls space minus small l space right angle bracket space fileinfo ani ను టైప్ చేసి ఎంటర్ ను ప్రెస్ చేయండి.
10:46 ఇప్పుడు అన్ని files మరియు directory ల సమాచారము fileinfo అనే పేరు కలిగిన file లోకి direct చేయబడతాయి.
10:54 కానీ మనము file ఫైల్ లోని కంటెంట్ ను ఎలా చూస్తాము? దీని కొరకు మనకు cat command ఉన్నది. cat space మరియు file పేరు ను టైప్ చేయండి, ఇక్కడ ఫైల్ పేరు fileinfo మరియు ఎంటర్ ప్రెస్ చేయండి.
11:12 ఇప్పుడు మనము కంటెంట్ ను చూడవచ్చు. నిజమునకు cat యొక్క మరో ముఖ్యమైన ఉపయోగము ఒక file ను create చేయడము. దీని కొరకు ప్రాంప్ట్ వద్ద cat space right angle bracket space filename అని టైప్ చేయాలి. ఫైల్ పేరు file1 అనుకోండి, అప్పుడు అదే టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
11:36 ఇప్పుడు మీరు ఈ command ను టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు అది యూజర్ నుంచి ఇన్ పుట్ కొరకు ఎదురు చూస్తుంది.
11:42 మనము ఏమి టైప్ చేసినా అది ఫైల్ లో వ్రాయబడుతుంది, కనుక కొంత టెక్స్ట్ టైప్ చేయండి.
11:50 ఇప్పుడు ఇన్ పుట్ యొక్క ఎండ్ ను సూచిస్తూ ఎంటర్ కీ ను ప్రెస్ చేయండి.
11:56 ఇప్పుడు Ctrl మరియు D కీ లను ఒకేసారి ప్రెస్ చేయండి.
12:05 file1 అనే పేరుతో ఒక file కనుక అప్పటికే ఉంటే అప్పుడు user in put ఆ file ను over write చేస్తుంది.
12:13 ‘file1’ అని అప్పటికే ఉన్న ఫైల్ చివరలో మీరు అపెండ్ చేయాలి అని అనుకుంటే, ప్రాంప్ట్ వద్ద cat space double right angle bracket space file1 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
12:36 ఇంకా చాలా command లను మనము చర్చించి ఉండవచ్చు, కానీ ఇప్పటికి ఇక్కడితో ఆపి వేద్దాము. నిజమునకు ఇక్కడ ఇప్పటి వరకు చెప్పుకున్న command లకు కూడా చాలా ఆప్షన్ లను మరియు అవకాశములను మనము ఇక్కడ కదిలించకుండా వదలి వేసాము.
12:50 దీనితో మనము ఈ spoken tutorial చివరకు వచ్చేసాము. spoken tutorial అనేవి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ వారి సహకారము కలిగిన టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లోని భాగము.
13:02 దీని గురించి మరింత సమాచారము ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్నది.
13:10 ఈ స్క్రిప్ట్ ------- చేత అందించబడినది () మరియు ఇది ----------------------- చేత -------------------------- నుండి రికార్డ్ చేయబడినది. మాతో జాయిన్ అయినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

PoojaMoolya, Pravin1389, Sneha, Yogananda.india