Linux/C2/Basic-Commands/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 18:30, 27 November 2012 by Sneha (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
0:00 ప్రియమైన మిత్రులారా, Linux Operating Systemపై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
0:05 ఈ ట్యుటోరియల్‌లో, మనం కొన్ని బేసిక్ కమాండ్స్ అధ్యయనం చేస్తాం.
0:10 నేను ఉబంటు 10.04 ఉపయోగిస్తున్నాను.
0:12 మీకు Linux operating system ప్రారంభించడం తెలిసి ఉంటుందని మేము భావిస్తున్నాము.
0:17 మీకు ఆసక్తి ఉంటే, దానిని http://spoken-tutorial.org.లోగల మరొక స్పోకెన్ ట్యుటోరియల్ ద్వారా పొందవచ్చు.
0:26 ఈ ట్యుటోరియల్‌లో, కమాండ్స్ మరియు కమాండ్ ఇంటర్‌ప్రెటర్ అంటే ఏమిటో మనం తెలుసుకుంటాం.
0:33 ఆ తరువాత మనం man commandను ఉపయోగించి Linuxలో ఏ విధంగా సహాయం పొందాలో తెలుసుకుంటాం.
0:39 ఇప్పుడు మన మొదటి ప్రశ్న, “కమాండ్స్ అంటే ఏమిటి?”.
0:43 సరళమైన మాటలలో Linux commandsను టైప్ చేసినపుడు కొన్ని చర్యలు జరగడానికి కారణమయ్యే పదములుగా చెప్పవచ్చు.
0:52 Linux కమాండ్స్ అరుదుగా మాత్రమే నాలుగు అక్షరాల కంటే ఎక్కువ నిడివి కలిగి ఉంటాయి. ఉదా. ls, who, ps మొదలైనవి.
0:59 ఈ కమాండ్స్ lower caseలో మరియు case sensitiveగా ఉంటాయి. మనం ఒక ఉదాహరణను చూద్దాం.
1:05 అప్లికేషన్స్ మెనూకి వెళ్లండి.
1:08 యాక్ససరీస్‌ని సెలక్ట్ చేసి లభ్యమైన ఆప్షన్స్ నుండి టెర్మినల్‌పై క్లిక్ చేయండి
1:14 లేదా ఒక టెర్మినల్ విండో తెరవడానికి మీ కీబోర్డ్‌పై ctrl alt t నొక్కండి.
1:20 ఇప్పుడు మనం ఒక prompt ($) మరియు దాని ప్రక్కన కర్సర్ బ్లింక్ కావడాన్ని గమనించవచ్చు. ఇక్కడే మనం కమాండ్ టైప్ చేయాలి.
1:29 who అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
1:34 లాగ్‌ఇన్ అయి ఉన్న యూజర్ల పేర్లను మనం చూడవచ్చు. వాస్తవానికి, మనం సిస్టమ్‌లోకి లాగ్‌ఇన్ అయిన వారిని చూపే who కమాండ్‌ను ఎగ్జిక్యూట్ చేశాం.
1:47 కొన్ని అక్షరాలను మాత్రమే కలిగి ఉన్న ఈ కమాండ్లను చర్యలుగా మారుస్తున్నది ఏది?
1:54 ఈ పని చేస్తున్నది Command Interpreter, దీనిని షెల్ అని కూడా పిలుస్తారు.
1:59 మనకు మరియు Linux systemకు మధ్య interfaceగా మనము shellను నిర్వచించవచ్చు.
2:08 ఇది యూజర్‌కి operating system ఎగ్జిక్యూట్ చేయడానికి కమాండ్లను ఇవ్వడానికి అనుమతిస్తుంది.
2:13 Linuxపై అనేక shells ఇన్‌స్టాల్ చేయడానికి సాధ్యత ఉండి, విభిన్న యూజర్లు తాము ఇష్టపడేదానిని తీసుకోవడం సాధ్యమవుతుంది.
2:22 Linuxపై, ఎప్పుడూ ఇన్‌స్టాల్ చేయబడే ప్రామాణిక shell /bin/sh bashగా పిలువబడే GNU suite of tools నుండి తీసుకున్న GNU Bourne-Again Shell.
2:35 ఈ ట్యుటోరియల్‌లో మనం తెలుసుకోబోయే కమాండ్స్ ఒకే తరగతికి చెందినవి మరియు కొద్దిపాటి తేడాలతో అధికభాగం Linux shellsపై run అవుతాయి.
2:44 మనం ఈ ట్యుటోరియల్‌లో వివరణ కొరకు shellగా bashను ఉపయోగించనున్నాము.
2:51 Bash అత్యంత ప్రసిద్ధి చెందిన shell మరియు దాదాపు అన్ని UNIXలకు పోర్టబుల్‌గా ఉండటం దీనికి కారణం.
2:58 ఇతర shellsలో ప్రారంభ Unix shellఅయిన Bourne shell, C Shell మరియు Korn shell ఉన్నాయి.
3:08 మనం ఏ shell ఉపయోగిస్తున్నామో చూడటానికి
3:11 terminal కు వెళ్లి కమాండ్ echo space dollar capital SHELL ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి
3:27 సాధారణంగా output /bin/bash గా ఉండి మనకు bash shellను ఇస్తుంది.
3:34 మనం విభిన్నమైన shellsను అనేక మార్గాల ద్వారా activate చేయవచ్చు. వాటిని మనం అడ్వాన్స్‌డ్ ట్యుటోరియల్‌లో తెలుసుకుందాం.
3:42 వాస్తవానికి కమాండ్స్ అనేవి ప్రోగ్రాములను కలిగియున్న ఫైళ్ళు, ఇవి ఎక్కువగా Cలో రాయబడి ఉంటాయి.
3:47 ఈ ఫైళ్ళు directoriesలో ఉంటాయి. కమాండ్ ఎక్కడ స్టోర్ చేయబడిందో తెలుసుకోవడానికి, మనం type కమాండ్‌ను ఉపయోగించవచ్చు.
3:55 కమాండ్ prompt వద్ద type అని వ్రాసి space ఇచ్చి ps అని వ్రాసి ఎంటర్ నొక్కండి.
4:03 నిజానికి ps అనేది /bin directoryలో స్టోర్ చేయబడిన ఒక ఫైల్‌గా ఇది చూపుతుంది.
4:09 కమాండ్ promptలో మనం ఒక కమాండ్‌ను ఇచ్చినపుడు, shell, డైరక్టరీల జాబితాలో ఆ కమాండ్ పేరుకు సరిపోయే ఫైల్ కొరకు వెదకుతుంది.
4:18 అది దొరికితే, ఆ ఫైల్‌కి సంబంధించిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేనట్లయితే, “command not found” అనే ఎర్రర్ కనిపిస్తుంది.
4:27 వెదకిన డైరక్టరీల జాబితా PATH variable ద్వారా చూపబడుతుంది, మనం దీనిని తరువాత చూద్దాం.
4:34 ప్రస్తుతం, మనం ఈ జాబితాను చూడాలనుకుంటే, కమాండ్ echo space dollar PATH అని
4:44 capitalలో టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
4:52 కమాండ్ల గురించి మాట్లాడుతున్నపుడు, మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి.
4:57 Linux కమాండ్లు రెండు రకాలు: ఎక్స్‌టర్నల్ కమాండ్లు మరియు ఇంటర్నల్ కమాండ్లు.
5:02 ఎక్స్‌టర్నల్ కమాండ్లు ప్రత్యేకమైన files/programs గా ఉనికిలో ఉంటాయి.
5:07 Linuxలో అధికభాగం కమాండ్లు ఈ తరహాకు చెందినవి. కానీ కొన్నికమాండ్ల అమలు shell లోపలే రాయబడి ఉంటుంది మరియు ఇవి ప్రత్యేక ఫైళ్లుగా ఉనికిలో ఉండవు.
5:18 ఇవి ఇంటర్నల్ కమాండ్లు.
5:20 తరువాత మనం చూడబోయే echo command, నిజానికి ఒక ఇంటర్నల్ కమాండ్.
5:25 టెర్మినల్‌కు వెళ్లి కమాండ్ వద్ద టైప్ చేయండి,
5:33 (కమాండ్ prompt వద్ద) type అని వ్రాసి space ఇచ్చి echo అని వ్రాసి ఎంటర్ నొక్కండి.
5:40 Outputలో echo ఒక shell bulletinగా చూపబడుతుంది.
5:43 ఒక ఫైల్ పేరు ఇవ్వడానికి బదులుగా అది echo command యొక్క అమలు shellకు ఇంటర్నల్ అని చూపుతుంది. అందువలన అది ఇంటర్నల్ కమాండ్ అని పిలువబడుతుంది.
5:56 మనం అర్ధం చేసుకోవలసిన మరొక ముఖ్యవిషయం కమాండ్ల యొక్క నిర్మాణం.
6:01 కమాండ్లు ఒక పదం లేదా అనేక పదాలను కలిగి, ఖాళీ ప్రదేశాలచే వేరుచేయబడతాయి.
6:08 రెండవ సందర్భంలో మొదటి పదం కమాండ్ యొక్క అసలైన పేరుగా ఉండగా ఇతర పదాలు ఆర్గ్యుమెంట్స్(సంగ్రహాలు)గా ఉంటాయి.
6:16 ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆప్షన్లు లేదా ఎక్స్‌ప్రెషన్లు లేదా ఫైళ్ల పేర్లుగా ఉండవచ్చు.
6:20 ఇచ్చిన ఆప్షన్‌పై ఆధారపడి ఒక కమాండ్ విభిన్న కార్యకలాపాలు నెరవేర్చగలదు.
6:26 సాధారణంగా వాటికి ముందుగా ఒకటి లేదా రెండు మైనస్ గుర్తులు (-) ఉండి, షార్ట్ మరియు లాంగ్ ఆప్షన్లుగా క్రమంలో పిలువబడతాయి.
6:35 టెర్మినల్ విండోకు వెళ్లి కమాండ్లను టైప్ చేసి వాటి అవుట్‌పుట్‌లను చూడండి.
6:40 టెర్మినల్ విండోను క్లియర్ చేయడానికి clear అని టైప్ చేయండి.
6:44 ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
6:49 మరలా clear అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
6:55 ls space minus a టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
7:04 టెర్మినల్ విండోను క్లియర్ చేయడానికి clear అని టైప్ చేయండి.
7:11 ఇప్పుడు ls space minus minus all అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
7:19 టర్మినల్‌ను క్లియర్ చేయడానికి clear అని టైప్ చేయండి.
7:23 ఇప్పుడు ls space minus d అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
7:32 ఈ సమయంలో ఆప్షన్లు మారడం వలన కమాండ్ల ప్రవర్తనలో మార్పును తెలుసుకుంటే సరిపోతుంది.
7:40 Linuxలో మనకు పెద్ద సంఖ్యలో కమాండ్లు ఉన్నాయి,
7:45 వీటిలో ప్రతి ఒక్కటీ విభిన్నమైన ఆప్షన్లను కలిగి ఉంది.
7:48 కమాండ్లను ఏ విధంగా జతపరచవచ్చో మనం తరువాత చూస్తాం. ఇదంతా మనం ఎలా గర్తుపెట్టుకోగలం?
7:55 నిజానికి మనం ఆ విధంగా చేయనక్కరలేదు. Linuxలో లభ్యమవుతున్న అద్భుతమైన ఆన్‌లైన్ హెల్ప్ సౌకర్యం దీనికి కారణం.
8:01 Man కమాండ్ సిస్టంలో అందుబాటులో ఉన్న దాదాపు ప్రతి కమాండ్ గురించిdocumentationను అందిస్తుంది.
8:08 ఉదాహరణకు, ls కమాండ్ గరించి తెలుసుకోవడానికి, మీరు చేయవలసింది, టెర్మినల్‌కు వెళ్లి
8:16 ls ఆర్గ్యుమెంట్‌తో man కమాండ్‌ను వ్రాయడం అంటే man అని వ్రాసి space ఇచ్చి ls అని వ్రాసి చేసి ఎంటర్ నొక్కడం
8:30 q నొక్కి బయటకు రండి.
8:35 Man అనేది సిస్టమ్ యొక్క మాన్యువల్ పేజర్. సాధారణంగా manకు ఇచ్చే ప్రతి ఆర్గ్యుమెంట్ ఒక ప్రోగ్రాం, యుటిలిటీ లేదా ఫంక్షన్ యొక్క పేరుగా ఉంటుంది.
8:43 అప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్‌కి సంబంధించిన ప్రతి మాన్యువల్ పేజ్‌ కనుగొనబడి, ప్రదర్శించబడుతుంది.
8:49 ఒక సెక్షన్, ఉన్నట్లయితే, అది manను మాన్యువల్ యొక్క ఆ విభాగానికి నిర్దేశిస్తుంది.
8:55 డిఫాల్ట్‌లో ఇది ముందుగా నిర్వచించబడిన క్రమాన్ని అనుసరిస్తూ, కనుగొన్న మొదటి పేజీని ప్రదర్శించడానికి అందుబాటులోని, పేజి అనేక విభాగాలలో ఉన్నప్పటికీ, అన్ని విభాగాలను వెతుకుతుంది.
9:07 Man కమాండ్ గురించి మరింత తెలుసుకోనడానికి మీరు మరలా Man కమాండ్‌నే ఉపయోగించవచ్చు.
9:14 టెర్మినల్‌కు వెళ్లి man space man అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
9:23 దాని నుండి బయటకు రావడానికి q నొక్కండి.
9:26 man కమాండ్‌కు అనేక ఆప్షన్స్ ఉన్నాయి.
9:30 ఎక్కువగా ఉపయోగపడే వాటిని నేను మీకు తెలుపుతాను. కొన్ని సందర్భాలలో మనం ఏమి చేయాలనుకుంటున్నామో మనకు తెలుసు కానీ ఖచ్చితమైన కమాండ్ తెలియదు. అప్పుడు మనమేం చేయగలము?
9:41 man –k ఆప్షన్ ను అందిస్తుంది, ఇది ఒక ముఖ్యమైన పదాన్ని తీసుకొని దానికి బదులుగా కమాండ్ల జాబితాను మరియు వాటి సంక్షిప్త ప్రయోజనాన్ని అందిస్తుంది.
9:50 ఉదాహరణకు, ఒక డైరక్టరీని సృష్టించడానికి, మీకు ఖచ్చితమైన కమాండ్ తెలియకపోవచ్చు,
9:56 అందువలన మనం command promptకు వెళ్లి man అని వ్రాసి space ఇచ్చి minus k అని వ్రాసి space ఇచ్చి directories అని వ్రాసి ఎంటర్ నొక్కుతాం.
10:12 మనకు వాస్తవంగా ఏది అవసరమో తెలుసుకోవడానికి ఇప్పుడు మనం ఈ కమాండ్లలో ప్రతి దానినీ వెదకవచ్చు.
10:17 ఇదే ఫలితాన్ని apropos కమాండ్‌ను ఉపయోగించి కూడా పొందవచ్చు.
10:21 command prompt వద్ద apropos space directories అని టైప్ చేసి అవుట్‌పుట్ చూడటానికి ఎంటర్ నొక్కండి.
10:36 కొన్ని సార్లు మనకు మరీ ఎక్కువ వివరాల అవసరం ఉండదు. ఒక కమాండ్ ఏమి చేయగలదో తెలుసుకుంటే సరిపోతుంది.
10:40 అటువంటి సందర్భంలో మనం whatis కమాండ్ లోదా man –f ఉపయోగిండవచ్చు. ఇవి రెండూ ఒక లైనులో కమాండ్‌ను గురించి వివరిస్తాయి.
10:52 టెర్మినల్‌ విండోను క్లియర్ చేయడానికి టెర్మినల్‌కు వెళ్లి clear అని టైప్ చేయండి
10:58 ఇప్పుడు whatis space ls అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
11:06 కొన్ని కమాండ్లకు అనేక ఆప్షన్లు ఉంటాయి. ఒక కమాండ్‌కు ఉండే విభిన్న ఆప్షన్ల జాబితాను పొందాలని మనం కోరుకోవచ్చు.
11:13 అప్పుడు మనం minus help ఆప్షన్ ఉపయోగిస్తాం.
11:18 command promptకు వెళ్లి ls space minus minus help అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
11:29 మీరు మాన్యువల్ పేజిలోని అన్ని ఆప్షన్లను చూడటానికి వీలుగా నేను దీనిని చుట్టివేస్తాను.
11:45 ఇది లైనక్స్ స్పోకెన్ ట్యుటోరియల్‌లో భాగం. స్పోకెన్ ట్యుటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
11:56 దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతుంది.
12:00 ఈ రచనకు సహాయపడింది-పి.వి.శైలజ---------------------(అనువాదం చేసినవారి పేరు) మరియు -----------------------(రికార్డ్ చేసినవారి పేరు) --------------------------(ప్రదేశం పేరు) నుండి. ధన్యవాదములు మరియు శుభం.

Contributors and Content Editors

Sneha, Yogananda.india