Difference between revisions of "Linux-Old/C2/Synaptic-Package-Manager/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |Synaptic package managerను ఏ విధంగా ఉపయోగించాలో తెలిపే ఈ స్పోకెన్ ట…')
 
m (moved Linux-Ubuntu/C2/Synaptic-Package-Manager/Telugu to Linux/C2/Synaptic-Package-Manager/Telugu: Combining Linux & Linux-Ubuntu FOSS Categories.)
(No difference)

Revision as of 02:08, 21 April 2013

Time Narration
0:00 Synaptic package managerను ఏ విధంగా ఉపయోగించాలో తెలిపే ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
0:06 ఈ ట్యుటోరియల్‌లో, Synaptic Package Managerను ఉపయోగించి ఉబంటులో అప్లికేషన్లను ఎలా ఇన్‌స్టాల్ చేయాలో మనం నేర్చుకుంటాం
0:17 ఈ ట్యుటోరియల్‌ను వివరించడానికి నేను జెనోమ్ పర్యావరణ డెస్క్‌టాప్‌తో ఉన్న ఉబంటు 10.04 వాడుతున్నాను.
0:24 Synaptic package manager ఉపయోగించడానికి మీరు అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ కలిగి ఉండాలి.
0:29 ఇంటర్నెట్ కనెక్షన్ చక్కగా పనిచేస్తుండాలి. ముందు మనం Synaptic Package Managerను తెరుద్దాం.
0:36 దానికోసం System->Administrationకు వెళ్లి Synaptic Package managerపై క్లిక్ చేయండి.
0:47 ఇక్కడ, మిమ్మల్ని పాస్‌వర్డ్ అడుగుతూ ఒక ధృవీకరణ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
0:55 పాస్‌వర్డ్ టైప్ చేసి ఎంటర్ నొక్కుదాం.
1:06 synaptic package managerను మనం మొదటిసారి ఉపయోగిస్తున్నపుడు, ఒక పరిచయ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది.
1:13 synaptic package managerను ఏ విధంగా ఉపయోగించాలో తెలిపే సమాచారాన్ని ఈ డైలాగ్ బాక్స్ కలిగి ఉంటుంది.
1:20 ఒక అప్లికేషన్ లేదా పాకేజ్ ఇన్‌స్టాల్ చేయడానికి synaptic package managerలో Proxy మరియు Repository కాన్ఫిగర్ చేద్దాం.
1:29 దీనికోసం మనం Synaptic Package Manager విండోకి మారదాం.
1:36 Settingకు వెళ్ళి Preferencesపై క్లిక్ చేయండి.
1:44 Preference Windowలోని అనేక టాబ్స్ తెరపై కనిపిస్తాయి. ప్రాక్సీ సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేయడానికి Networkపై క్లిక్ చేయండి.
1:55 Proxy Server క్రింద రెండు ఆప్షన్స్ ఉంటాయి- Direct Connection మరియు Manual Proxy Connection. ఇక్కడ చూపిన విధంగా నేను Manual Proxy Configuration ఉపయోగిస్తున్నాను. మీరు మీకు నచ్చినదానిని ఎంపికచేసుకొని Authentication బటన్ క్లిక్ చేయవచ్చు.

తెరపై HTTP Authentication విండో కనిపిస్తుంది.

2:21 అవసరమైతే యూజర్ పేరు మరియు పాస్‌వర్డ్ ఎంటర్ చేసి OKపై క్లిక్ చేయండి. ఇప్పుడు మార్పులను save చేయడానికి “Apply”పై క్లిక్ చేయండి. విండోను మూసివేయడానికి OKపై క్లిక్ చేయండి.
2:38 ఇప్పుడు మరలా “Setting”కు వెళ్లి “Repositories” పై క్లిక్ చేయండి
2:46 తెరపై Software Sources విండో కనిపిస్తుంది
2:51 ఉబంటు సాఫ్ట్‌వేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి అనేక వనరులు ఉన్నాయి. డ్రాప్ డౌన్ మెనూ “Download From”పై క్లిక్ చేసి repositories యొక్క జాబితా కొరకు mouse బటన్‌ను వత్తి ఉంచండి.
3:05 “Other..” ప్రపంచవ్యాప్తంగా ఉన్న సర్వర్ల జాబితాను చూపుతుంది.
3:12 విండోను మూసివేయడానికి Cancelపై క్లిక్ చేయండి. ఇక్కడ చూపిన విధంగా నేను “Server for India” ఉపయోగిస్తున్నాను. “Software Sources” విండోను మూసివేయడానికి “Close”పై క్లిక్ చేయండి.
3:26 synaptic package manager(సినాప్టిక్ పాకేజ్ మేనేజర్)ను ఏ విధంగా ఉపయోగించాలో నేర్చుకోవడానికి, ఒక ఉదాహరణగా నేను vlc player ఇన్‌స్టాల్ చేస్తాను.
3:34 synaptic package managerను మీరు మొదటిసారి ఉపయోగిస్తుంటే, పాకేజస్ reload చేసుకోవలసి ఉంటుంది. దీనికోసం టూల్‌బార్ పై ఉన్న“Reload” బటన్‌పై క్లిక్ చేయండి. దీనికి కొన్ని సెకండ్ల సమయం పట్టవచ్చు. పాకేజస్ ఇంటర్‌నెట్ ద్వారా బదిలీ మరియు అప్‌డేట్ అవడాన్ని మీరు చూడవచ్చు.
3:59 రీలోడింగ్ ప్రక్రియ పూర్తైన తరువాత, మనం టూల్‌బార్‌పై ఉన్న quick search boxకు వెళ్లి “vlc” అని టైప్ చేద్దాం.
4:14 ఇక్కడ Vlc యొక్క అన్ని పాకేజస్ చూపబడటాన్ని మనం గమనించవచ్చు.
4:19 “vlc package” సెలక్ట్ చేయడానికి, చెక్ బాక్స్‌పై క్లిక్ చేసి, కనిపిస్తున్న మెనూ బార్‌లోని “Mark for installation” ఎంపికను సెలక్ట్ చేయండి.
4:34 repository packages యొక్క మొత్తం జాబితాను చూపే ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఆధారిత పాకేజ్‌లన్నిటినీ ఆటోమెటిక్‌గా గుర్తించడానికి “Mark” బటన్‌పై క్లిక్ చేయండి.
4:46 టూల్ బార్‌కు వెళ్లి “apply” బటన్‌పై క్లిక్ చేయండి.
4:52 ఇన్‌స్టాల్ చేయవలసిన పాకేజీల వివరాలను చూపుతూ ఒక Summary విండో కనిపిస్తుంది. ఇన్‌స్టలేషన్‌ను ప్రారంభించడానికి “Apply” బటన్‌పై క్లిక్ చేయండి.
5:05 ఇన్‌స్టాల్ చేయవలసిన పాకేజీల సంఖ్య మరియు పరిమాణంపై ఆధారపడి ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుంది. ఇంతకు ముందు చూసినట్లే, దీనికి కొంత సమయం పట్టవచ్చు.
5:25 ఇన్‌స్టలేషన్ పూర్తవుతూనే “Downloading Package File” విండో మూసుకుంటుంది.
5:43 మార్పులు వర్తించబడటాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు.
6:00 ఇప్పుడు vlc ఇన్‌స్టాల్ అవడం మనం చూస్తున్నాం. “Synaptic Package Manager” విండోను మూసివేయండి.
6:09 vlc player విజయవంతంగా ఇన్‌స్టాల్ అయిందీ లేనిదీ మనం ఇప్పుడు పరిశీలిద్దాం.
6:15 దీని కోసం, మనం Applications->Sound & Videoకు వెళ్దాం. vlc media player అని కనబడటం మనం ఇక్కడ చూడవచ్చు. అంటే vlc విజయవంతంగా ఇన్‌స్టాల్ అయింది. ఇదేవిధంగా, Synaptic Package Managerను ఉపయోగించి మనం ఇతర అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేయవచ్చు.
6:36 ఒకసారి టూకీగా చేప్తాను......ఈ ట్యుటోరియల్‌లో మనం..... Synaptic Package Manager‌లో Proxy మరియు Repository ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో, Synaptic Package Managerను ఉపయోగించి ఒక అప్లికేషన్ లేదా పాకేజీని ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలో తెలుసుకున్నాం.
6:51 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్, టాక్ టు ఎ టీచర్ ప్రాజక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.

దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతుంది: http://spoken-tutorial.org/NMEICT-Intro

7:19 ఈ రచనకు సహాయపడింది---పి.వి.శైలజ-------------------(అనువాదం చేసినవారి పేరు) మరియు -----------------------(రికార్డ్ చేసినవారి పేరు) --------------------------(ప్రదేశం పేరు) నుండి. ధన్యవాదములు మరియు శుభం.

Contributors and Content Editors

Nancyvarkey, Pravin1389, Sneha