LibreOffice-Suite-Math/C2/Using-Greek-characters-Brackets-Steps-to-Solve-Quadratic-Equation/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:51, 8 March 2013 by Sneha (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్రేఆఫీస్ మాథ్ పైన స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.
00:04 ఈ ట్యుటోరియల్ లో మనము ఈ క్రింది అంశములు నేర్చుకుంటాము:
00:08 ఆల్ఫా, బీటా, తీటా మరియు పై వంటి గ్రీక్ కారెక్టర్లను వాడడము
00:15 ఒక క్వాడ్రాటిక్ సమీకరణమును సాధించడము కొరకు బ్రాకెట్లను వినియోగించడము
00:21 Math ను వినియోగించి గ్రీక్ కారెక్టర్లను ఎలా వ్రాయాలో ఇప్పుడు నేర్చుకుందాము.
00:26 దీని కొరకు మనము ఇంతక్రితము ట్యుటోరియల్ లో క్రియేట్ చేసిన MathExample1.odt అనే Writer డాక్యుమెంట్ లో మన ఉదాహరణను ఓపెన్ చేద్దాము.
00:41 మనము వ్రాసిన ఫార్ములాలు ఉన్న గ్రే బాక్స్ పైన డబుల్ క్లిక్ చేయండి.
00:47 దీని వలన మనకు Math Formula Editor మరియు Elements window లు అందుబాటులోకి వస్తాయి.
00:54 Formula Editor ఫ్లోట్ అవ్వడము కొరకు దాని బోర్డర్ పైన క్లిక్ చేయండి మరియు దానిని కుడి వైపున డ్రాగ్ చేయండి.
01:02 ఇది Writer window చక్కగా కనిపించేలా పెద్దగా చేస్తుంది.
01:07 ఆల్ఫా, బీటా, తీటా మరియు పై వంటి సాధారణముగా ఉండే గ్రీక్ కారెక్టర్లను ఉదాహరణకు తీసుకోండి.
01:16 కానీ మనము ఈ కారెక్టర్లను Elements window లో కనుగోనలేము.
01:21 ఒక పర్సంటేజ్ సైన్ ప్రక్కన ఆ కారెక్టర్ యొక్క పేరును ఇంగ్లీష్ లో వ్రాయడము ద్వారా మనము వాటిని సూటిగా వ్రాయవచ్చు.
01:30 ఉదాహరణకు పై ను వ్రాయడము కొరకు మనము Formula Editor లో కేవలము %pi అని టైప్ చేస్తే చాలు.
01:41 ఒక లోయర్ కేస్ కారెక్టర్ ను వ్రాయడము కొరకు ఆ కారెక్టర్ యొక్క పేరును లోయర్ కేస్ లెటర్లలో వ్రాయండి.
01:47 ఉదాహరణకు ఆల్ఫా ను లోయర్ కేస్ లో వ్రాయడము కొరకు %alpha or %beta అని టైప్ చేయండి.
01:59 ఒక అప్పర్ కేస్ కారెక్టర్ ను వ్రాయడము కొరకు ఆ కారెక్టర్ పేరు ను అప్పర్ కేస్ లో వ్రాయండి.
02:06 ఉదాహరణకు గామా అని అప్పర్ కేస్ లో వ్రాయడము కొరకు %GAMMA లేదా  %THETA అని టైపు చేయండి.
02:17 గ్రీకు కారెక్టర్లను ఎంటర్ చేయడము కొరకు మరొక మార్గము Tools మెనూ లోని Catalog ను వాడడము.
02:26 Symbol set క్రింద Greek అని ఎంచుకోండి
02:31 మరియు లిస్ట్ నుంచి ఒక గ్రీక్ లెటర్ పైన డబుల్ క్లిక్ చేయండి.
02:35 క్రింద లిస్ట్ లో డిస్ప్లే చేసిన విధముగా గ్రీక్ లెటర్ యొక్క మార్క్ అప్ alpha అని గమనించండి.
02:43 కనుక ఒక ఫార్ములా లో ఇలా మనము గ్రీక్ కారెక్టర్లను పెట్టగలుగుతాము.
02:49 ఇతర గ్రీకు కారెక్టర్ల మార్క్ అప్ ను తెలుసుకోవడము కొరకు Symbols Catalogను చూడండి
02:56 మన ఫార్ములా లలో బ్రాకెట్లను ఎలా వాడలో ఇప్పుడు నేర్చుకుందాము.
03:01 ఒక ఫార్ములా లోని ఆపరేషన్ ఆర్డర్ గురించి మాథ్ కు తెలియదు.
03:07 కనుక ఆ ఆపరేషన్ ఆర్డర్ గురించి తెలపడము కొరకు మనము బ్రాకెట్లను వాడవలసి ఉంటుంది.
03:13 ఉదాహరణకు, మనము ‘ఫస్ట్ యాడ్ x అండ్ y, దెన్ డివైడ్ 5 బై ది రిజల్ట్’? అనే దానిని ఎలా వ్రాస్తాము.
03:22 మనము ‘ 5 ఓవర్ x + y ‘ అని టైప్ చేయవచ్చు.
03:28 ఇప్పుడు మనము నిజముగా వ్రాయాలి అనుకున్నది ఇదేనా?
03:32 కాదు, మనము x మరియు y లను ముందుగా కలపాలి అని అనుకున్నాము మరియు x మరియు y ల చుట్టూ కర్లీ బ్రాకెట్లను పెట్టడము ద్వారా మనము అలా చేయవచ్చు.
03:44 మరియు మార్క్ అప్: ‘5 ఓవర్ x+yఇన్ కర్లీ బ్రాకెట్స్’ గా కనిపిస్తుంది
03:52 కనుక ఒక ఫార్ములా లో ఆపరేషన్ యొక్క ఆర్డర్ ను సెట్ చేయడములో కర్లీ బ్రాకెట్లు ఉపయోగపడతాయి.
03:58 పైన ఉన్న File మెనూ లో Save ను ఎంచుకోవడము ద్వారా మనము మన పనిని సేవ్ చేసుకోవచ్చు.
04:08 ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ సమీకరణమును సాధించడములో ఉన్న స్టెప్ లను వ్రాద్దాము.
04:13 Control + Enter ను ప్రెస్ చేయడము ద్వారా Writer document లో మరొక క్రొత్త పేజీ కు మనము వెళ్ళగలము.
04:21 అక్కడ ‘Solving a Quadratic Equation’ అని టైప్ చేయండి.
04:25 మరియు Insert>Object>Formula menu ల ద్వారా మాథ్ ను కాల్ చేయండి.
04:33 నేను ఇప్పటికే క్వాడ్రాటిక్ సమీకరణములను టైప్ చేసి ఉంచాను. సమయము ఆదా చేయడము కొరకు నేను వాటి కట్ చేసి పేస్ట్ చేస్తాను.
04:42 కనుక మనము సాధించవలసిన క్వాడ్రాటిక్ సమీకరణము ఇలా ఉన్నది x స్క్వేర్డ్ - 7 x + 3 = 0
04:53 దీనిని సాధించడము కొరకు స్క్రీన్ మీద చూపిన విధముగా మనము క్వాడ్రాటిక్ ఫార్ములాను మనము వాడవచ్చు:
04:59 04:59 ఇక్కడ ‘a’ x స్క్వేర్డ్ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్, ‘b’ x టర్మ్ యొక్క కోఎఫిషియెంట్ మరియు ‘c’ స్థిర రాసి.
05:11 మరియు ఫార్ములాలో a స్థానములో 1 ని , - b స్థానములో -7 ను మరియు c స్థానములో 3 ను ప్రతిక్షేపించడము ద్వారా సమీకరణమును మనము సాధించవచ్చు.
05:23 కనుక మనము సాధించాలి అని అనుకున్న క్వాడ్రాటిక్ సమీకరణము యొక్క మార్క్ అప్ ను ముందుగా వ్రాద్దాము.
05:30 ముందుగా మనము Insert>Object>Formula menu నుంచి Math ను కాల్ చేద్దాము.
05:39 Format Editor విండో లో మార్క్ అప్ ను ఇలా తీసుకుందాము:
05:46 x స్క్వేర్డ్ మైనస్ 7 x ప్లస్ 3 = 0
05:53 చక్కగా చదవడము కోసము బ్లాంక్ లైన్ల కొరకు రెండు న్యూ లైన్ లను వ్రాద్దాము.
06:01 ఎంటర్ ను ప్రెస్ చేయండి మరియు ‘Quadratic Formula: ‘అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి.
06:07 క్లిష్టమైన ఫార్ములా ను అన్నిటికంటే లోపల ఉన్న ఎలిమెంట్లతో మొదలు పెట్టి విడగొట్టి సాధించడము అనేది చక్కని అభ్యాసముగా గుర్తింపబడుతుంది.
06:16 ఆ తరువాత మనము ఈ ఎలిమెంట్స్ తో పని చేయవచ్చు.
06:21 కనుక మనము అన్నిటికంటే లోపల ఉన్న స్క్వేర్ రూట్ ఫంక్షన్ ను ముందుగా వ్రాద్దాము.
06:27 మరియు మార్క్ అప్ కర్లీ బ్రాకెట్ లలో ‘స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్డ్ - 4ac’ గా ఉంటుంది.
06:37 ఆ తరువాత మనము ‘మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ ’ ను పై ఎక్స్ప్రెషన్ కు కలుపుతాము మరియు వాటిని కర్లీ బ్రాకెట్లలో పెడతాము.
06:48 మరొక జత కర్లీ బ్రాకెట్లను జత చేయడము ద్వారా మనము పై ఎక్స్ప్రెషన్ ను హారముగా చేస్తాము.
06:57 ‘ఓవర్ 2a’ను ఎక్స్ప్రెషన్ కు కలపండి.
07:02 మరియు చివరగా ‘x ఈక్వల్స్’ ను మొదటిలో కలపండి.
07:08 ‘ఈక్వల్ టు ’సింబల్ కు రెండు వైపులా రెండు లాంగ్ గాప్ లు కూడా ఉంచండి.
07:13 మరియు మనకు కావలసిన క్వాడ్రాటిక్ ఫార్ములా ఇక్కడ ఉన్నది.
07:16 ఇలా క్లిష్టమైన ఫార్ములాను మనము విడగొట్టి ఒక్కో భాగముగా నిర్మిస్తాము.
07:22 ఆ తరువాత Formula Editor window లో మిగిలిన టెక్స్ట్ ను ఇలా టైప్ చేయండి:
07:29 ‘ఇక్కడ ‘a’అనేది x స్క్వేర్డ్ టర్మ్ యొక్క కోఎఫిషియెంట్, b x పదము యొక్క కోఎఫిషియెంట్, c స్థిర రాశి, దీని తరువాత ఒక క్రొత్త లైన్ ను ఇవ్వాలి.
07:43 మరియు స్థానములో 1 ని, b స్థానములో -7 ను మరియు c స్థానములో 3 ను ప్రతిక్షేపించడము ద్వారా మనము సమీకరణమును సాధించవచ్చు, దీనికి తోడుగా ప్రక్కన రెండు న్యూ లైన్లు కూడా ఇవ్వాలి.
07:59 ప్రతిక్షేపించిన తరువాత మార్క్ స్క్రీన్ మీద చూపిన విధముగా ఉంటుంది:
08:05 కనుక మనము సమీకరణములో సంఖ్యలను పెరాంథసిస్ ను వాడి ప్రతిక్షేపించాము.
08:12 ఒకే మీ కొరకు ఇక్కడ ఒక ఎసైన్మెంట్ ఉన్నది.
08:15 పై క్వాడ్రాటిక్ సమీకరణము సాధించడములో మిగిలిన స్టెప్ లను పూర్తి చేయండి.
08:20 రెండు ఫలితములను విడి విడిగా ప్రదర్శించండి.
08:23 ఎలైన్మెంట్ మరియు స్పేసింగ్ లను మార్చడము ద్వారా స్టెప్ లను ఫార్మాట్ చేయండి.
08:28 ఎక్కడ ఎక్కడ అవసరము అయితే అక్కడ అక్కడ long gaps ను మరియు క్రొత్త లైన్ లను యాడ్ చేయండి.
08:33 ఈ క్రింది ఫార్ములా ను వ్రాయండి.: pi ఈజ్ సిమిలర్ ఆర్ ఈక్వల్ టు 3.14159’
08:42 దీనితో మనము గ్రీక్ కారెక్టర్స్ , బ్రాకెట్స్ మరియు ఈక్వేషన్స్ ఇన్ లిబ్రేఆఫీస్ మాథ్ అనే ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
08:52 సంగ్రహముగా చెప్పాలి అంటే మనము ఈ క్రింది అంశములు నేర్చుకున్నాము:
08:56 ఆల్ఫా, బీటా, తీటా మరియు పై వంటి గ్రీక్ కారెక్టర్లను వాడడము
09:01 ఒక క్వాడ్రాటిక్ సమీకరణమును బ్రాకెట్లు సాధించడము కొరకు స్టెప్ లను వ్రాయడము
09:07 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
09:12 దీనికి ICT, MHRD భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
09:20 http://spoken-tutorial.org. ఈ ప్రాజెక్ట్ కు సహకారము అందిస్తున్నది.
09:24 09:24 మరింత సమాచారము కొరకు http://spoken-tutorial.org/NMEICT-Intro. లింక్ ను చూడండి.
09:29 ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల. ఇంక విరమిస్తున్నాము.
09:38 మాతో కలిసినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Sneha, Yogananda.india