LibreOffice-Suite-Calc/C2/Formatting-Data/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:44, 8 March 2013 by Sneha (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

Resources for recording Formatting Data

Time NARRATION
00:00 లిబ్రేఆఫీస్ Calc లో డేటా ఫార్మాటింగ్ పై స్పోకెన్ ట్యుటోరియల్ కు మీకు స్వాగతము.
00:06 ఈ ట్యుటోరియల్లో మీరు ఫార్మాటింగ్, బోర్డర్స్, బాక్ గ్రౌండ్ కలర్స్ వంటి వాటి గురించి నేర్చుకుంటారు.
00:12 ఆటోమాటిక్ రాపింగ్ ను వాడి చాలా ఎక్కువ లైన్ లను ఫార్మాట్ చేయడము.
00:18 సెల్ లను మెర్జింగ్ చేయడము, సెల్ లో సరిపోవడము కొరకు టెక్స్ట్ ను shrink చేయడము.
00:22 ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
00:33 ముందుగా లిబ్రేఆఫీస్ Calc లో మనము బోర్డర్లను ఫార్మాట్ చేయడము గురించి నేర్చుకుందాము.
00:39 ఇప్పుడు మన “personal finance tracker.ods” ఫైల్ ను ఓపెన్ చేద్దాము.
00:45 బోర్డర్ లను ఫార్మాట్ చేయడము అనేది ఒక ప్రత్యేకమైన సెల్ కొరకు కానీ లేదా కొన్ని సెల్ ల సమూహము కొరకు కానీ చేయవచ్చు.
00:50 ఉదాహరణకు, “Serial Number”, “Item”, “Cost”, “Spent”, ”Received”, ”Date” మరియు ”Account” అని హెడింగ్ కలిగి ఉన్న సెల్ లను ఫార్మాట్ చేద్దాము.
01:01 కనుక ఇప్పుడు Serial Number అనే హెడింగ్ తో ఉండి “SN” చేత సూచించబడే సెల్ పైన ముందుగా క్లిక్ చేద్దాము.
01:08 ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను గట్టిగా పట్టుకుని హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ ల గుండా దానిని డ్రాగ్ చేయండి.
01:14 హెడింగ్ లను కలిగి ఉన్న మొత్తము హారిజాంటల్ రో ను సెలెక్ట్ చేసుకున్న తరువాత Formatting toolbar పైన ఉన్న “Borders” ఐకాన్ పైన క్లిక్ చేయండి.
01:23 చాలా రకముల బోర్డర్ స్టైల్ లను కలిగి ఉన్న ఒక డ్రాప్ డౌన్ బాక్స్ కనిపిస్తుంది.
01:28 బోర్డర్ ల పైన మీరు అప్లై చేయాలి అని అనుకున్న ఒక స్టైల్ పైన క్లిక్ చేయండి.
01:33 నేను చివరి ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను.
01:34 మనము ఎంచుకున్న స్టైల్ ప్రకారము బోర్డర్ లు ఫార్మాట్ అవ్వడము మనము చూడవచ్చు.
01:39 ఇప్పుడు మార్పును అన్ డూ చేద్దాము.
01:45 ఎంచుకోబడిన సెల్ లు ఇప్పటికీ హైలైట్ చేయబడి ఉన్నాయి. సెలెక్షన్ పైన రైట్ క్లిక్ చేయండి మరియు “Format Cells” ఆప్షన్ ను పైన క్లిక్ చేయండి.
01:54 ఇప్పుడు “Borders” టాబ్ పైన క్లిక్ చేయండి.
01:56 మీరు “Line arrangement”, “Line”, “Spacing to contents” మరియు “Shadow style” ల కొరకు ఆప్షన్ లను చూడగలుగుతారు.
02:05 ఇందులో డిస్ప్లే చేయబడినవి Calc యొక్క డీఫాల్ట్ సెట్టింగ్ లు.
02:10 కానీ ఎవరైనా సరే వీటిని తమ అవసరమునకు తగిన విధముగా మార్చుకోవచ్చు.
02:14 “User-defined” క్రింద సెలక్షన్ ను డిస్ప్లే చేసే ఒక చిన్న ప్రివ్యూ విండో డిస్ప్లే అవ్వడమును మీరు చూడవచ్చు.
02:22 “Default”క్రింద ఉన్న వాటిలో నేను మూడవ ఆప్షన్ ను ఎంచుకుంటాను మరియు అది ప్రీవ్యూ విండో లో డిస్ప్లే అవ్వడమును మీరు చూడవచ్చు.
02:29 నేను “Style”, “Width” మరియు “Color” లను కూడా మారుస్తాను.
02:33 మరలా ప్రివ్యూ విండో లో మార్పులను మీరు గమనించవచ్చు.
02:38 కంటెంట్ టు స్పేసింగ్ లో “Synchronize” ఆప్షన్ ను చెక్ చేయవలసి ఉంటుంది.
02:42 అన్ని మార్జిన్ లకు ఒకే స్పేసింగ్ అప్లై చేయబడినది అని దీని అర్ధము.
02:47 ఎవరైనా సరే దీనిని uncheck చేయవచ్చు మరియు అవసరమునకు తగిన విధముగా margin spacing ను మార్చవచ్చు.
02:53 నేను మార్జిన్ ల యొక్క “Top” మరియు “Bottom” లను 1.4pt లకు మార్చుతాను.
03:00 మీ అంతట మీరే వివిధ షాడో స్టైల్ లను ఎక్స్ప్లోర్ చేసేలా నేను వాటిని మీకే వదలి వేస్తున్నాను.
03:04 OK పైన క్లిక్ చేయండి.
03:06 ఇది ఎంచుకోబడిన సెల్ లకు కావాలి అని ఎంచుకున్న స్టైల్ ను అప్లై అయ్యేలా చేస్తుంది.
03:11 బోర్డర్ లను ఎలా ఫార్మాట్ చేయాలో నేర్చుకున్నాక ఇప్పుడు మనము సెల్ లకు బాక్ గ్రౌండ్ కలర్ ఎలా ఇవ్వాలో నేర్చుకుందాము.
03:18 సెల్ లకు బాక్ గ్రౌండ్ కలర్ ఇవ్వడము కొరకు Calc “Background Color”, అనే పేరు కలిగి Formatting toolbar లో ఉన్న ఒక ఆప్షన్ ను అందిస్తుంది.
03:27 ఇప్పుడు అది ఎలా చేయబడుతుందో మనము చూద్దాము.
03:30 ఉదాహరణకు, హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ లకు ఒక బాక్ గ్రౌండ్ కలర్ ను ఇద్దాము.
03:36 కనుక “SN” తో సూచించబడుతూ హెడింగ్ సీరియల్ నంబర్ ను కలిగి ఉన్న సెల్ పైన ముందుగా మనము క్లిక్ చేద్దాము.
03:44 ఇప్పుడు ఎడమ వైపు మౌస్ బటన్ ను గట్టిగా పట్టుకుని దాని హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ ల మీదుగా డ్రాగ్ చేయండి.
03:50 హెడింగ్ లను కలిగి ఉన్న మొత్తము హారిజాంటల్ రో ను ఎంచుకున్న తరువాత Formatting టూల్ బార్ లో ఉన్న “Background Color” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
04:00 మీరు బాక్ గ్రౌండ్ లో అప్లై చేయాలి అని అనుకున్న కలర్ ను ఎంచుకోవడము కొరకు ఒక పాప్ అప్ మెనూ కనిపిస్తుంది.
04:08 ఇప్పుడు “Grey” కలర్ పైన క్లిక్ చేయండి.
04:11 హెడింగ్ లను కలిగి ఉన్న సెల్ ల బాక్ గ్రౌండ్ గ్రే గా మారడమును మీరు చూడవచ్చు.
04:17 చాలా లైన్ల టెక్స్ట్ ను ఫార్మాట్ చేయడము కొరకు Calc వివిధ ఆప్షన్లను అందిస్తుంది.
04:22 మొదటిది “Automatic Wrapping” ను వాడి చేయడము.
04:26 Automatic Wrapping” ద్వారా ఒక యూజర్ చాలా లైన్ల టెక్స్ట్ ను ఒక సెల్ లో ఎంటర్ చేయవచ్చు.
04:33 కనుక అది ఎలా చేస్తామో ఇప్పుడు చూడండి.
04:37 ఇప్పుడు మన “personal finance tracker.ods” షీట్ లో ఒక ఖాళీ సెల్ పైన క్లిక్ చేయండి
04:44 ఉదాహరణకు “B12” అనే నంబర్ ను కలిగి ఉన్న సెల్ పైన క్లిక్ చేయండి.
04:49 ఇప్పుడు సెల్ పైన రైట్ క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Format Cells” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
04:54 డయలాగ్ బాక్స్ లోని “Alignment” టాబ్ పైన క్లిక్ చేయండి.
04:58 డయలాగ్ బాక్స్ క్రింద “Wrap text automatically” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత“OK” బటన్ పైన క్లిక్ చేయండి.
05:08 ఇప్పుడు మనము “THIS IS A PERSONAL FINANCE TRACKER. IT IS VERY USEFUL”. అని టైప్ చేస్తాము.
05:11 చాలా స్టేట్మెంట్ లు ఒక సెల్ లోకి కుదురుకోవడమును మీరు చూడవచ్చు.
05:19 ఇప్పుడు మార్పులను అన్ డూ చేద్దాము.
05:21 “Automatic Wrapping” గురించి నేర్చుకున్నాక మనము Calc లో సెల్ లను ఎలా మెర్జ్ చేయాలో చూద్దాము.
05:29 మన “personal finance tracker.ods” ఫైల్ లో “SN” అనే హెడింగ్ కలిగి ఉన్న వరుస సంఖ్యను కలిగి ఉన్న సెల్ లను మరియు వాటికి సంబంధించిన ఐటమ్ లను కలిగి ఉన్న సెల్ లను మీరు మెర్జ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు ముందుగా “SN”. హెడింగ్ క్రింద ఉన్న డేటా ఎంట్రీ '1' పైన క్లిక్ చేయాలి.
05:46 ఇప్పుడు కీ బోర్డ్ మీద ఉన్న “Shift” కీ ను పట్టుకుని ఉంచి సెల్ ను దానికి సంబంధించిన ఐటమ్ “Salary” ను కలిగి ఉన్న సెల్ పైన క్లిక్ చేయండి.
05:55 ఇది మెర్జ్ చేయవలసిన రెండు సెల్ లను హైలైట్ చేస్తుంది.
05:59 ఆ తరువాత మెనూ బార్ లోని “Format” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Merge Cells” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
06:07 పాప్ అప్ అవుతూ ఉన్న సైడ్ బార్ లో “Merge Cells” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
06:12 రెండు సెల్ లలో ఉన్న కంటెంట్ ను ఒక సెల్ లోకి మూవ్ చేయడము కొరకు అక్కడ కనిపించే డయలాగ్ బాక్స్ లోని “Yes” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
06:21 మీరు ఎంచుకున్న సెల్ లు ఒక దాని లోకి మెర్జ్ అయి వస్తాయి మరియు కంటెంట్ లు కూడా అదే మెర్జ్ చేయబడిన సెల్ లోకి వస్తాయి.
06:31 ఇప్పుడు మనము చేసిన మెర్జ్ ను “CTRL+Z” ను ఒకేసారి ప్రెస్ చేయడము ద్వారా undo చేద్దాము.
06:37 ఆ తరువాత ఒక సెల్ లోకి సరిపోయేలా ఒక టెక్స్ట్ ను ఎలా shrink చేయాలో ఇప్పుడు మనము నేర్చుకుందాము.
06:41 ఒక సెల్ లోని డేటా యొక్క ఫాంట్ సైజ్ ఆ సెల్ లోకి సరిపోయేలా ఆటోమాటిక్ గా ఫిట్ అవుతుంది.
06:49 అది ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాము.
06:50 B14 అని రిఫర్ చేయబడిన సెల్ లో “This is for the month of January” అనే టెక్స్ట్ ను టైప్ చేద్దాము.
07:00 ఈ టెక్స్ట్ ఆ సెల్ లో సరిపోవడము లేదు, అది మీకు కనిపిస్తూ ఉన్నది.
07:03 ఆ టెక్స్ట్ ఫిట్ అయ్యేలా శ్రింక్ చేయడము కొరకు ముందుగా B14 అని రిఫర్ చేయబడిన సెల్ పైన క్లిక్ చేయండి.
07:11 ఇప్పుడు మెనూ బార్ లోని “Format” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Cells” పైన క్లిక్ చేయండి.
07:18 ఇంకో విధముగా చేయాలి అంటే, సెల్ పై రైట్ క్లిక్ చేయండి మరియు “Format Cells” పైన క్లిక్ చేయండి.
07:24 “Format Cells” డయలాగ్ బాక్స్ ఓపెన్ అవ్వడమును మనము చూడవచ్చు.
07:28 డయలాగ్ బాక్స్ లోని “Alignment” టాబ్ పైన క్లిక్ చేయండి.
07:31 డయలాగ్ బాక్స్ క్రింద “Shrink to fit cell size” చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “OK” బటన్ పైన క్లిక్ చేయండి.
07:41 మోతము టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజు తగ్గి అది మొత్తము తనంత తానే B14 అని రిఫర్ చేయబడిన సెల్ లో ఫిట్ అవ్వడమును మీరు చూడవచ్చు.
07:54 ఇప్పుడు మార్పులను అన్ డూ చేద్దాము.
07:57 దీనితో మనము లిబ్రే ఆఫీస్ Calc స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము.
08:02 మనము నేర్చుకున్నది సంగ్రహముగా చెప్పాలి అంటే మనము Calc లను బోర్డర్ లను ఫార్మాట్ చేయడము, బాక్ గ్రౌండ్ కలర్ లను సెట్ చేయడము వంటివి నేర్చుకున్నాము.
08:09 ఆటోమాటిక్ రాపింగ్ ను వాడి చాలా లైన్ల టెక్స్ట్ ను ఫార్మాట్ చేయడము.
08:14 సెల్ లను మెర్జ్ చేయడము, సెల్ లోకి ఫిట్ అయ్యేలా టెక్స్ట్ ను శ్రింక్ చేయడము.
08:19 సంగ్రహముగా పరీక్ష
08:21 “spreadsheetpractice.ods” షీట్ ను ఓపెన్ చేయండి
08:25 అన్ని హెడింగ్ లను సెలెక్ట్ చేయండి.
08:27 బ్లూ ను హెడింగ్ లకు బాక్ గ్రౌండ్ కలర్ గా ఇవ్వండి.
08:31 “Automatic Wrapping” ను వాడి “This is a Department Spreadsheet” అనే టెక్స్ట్ ను టైప్ చేయండి.
08:37 ఈ టెక్స్ట్ ను సెల్ లో ఫిట్ అయ్యేలా శ్రింక్ చేయండి.
08:40 ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియోను చూడండి.
08:43 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది.
08:46 మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
08:51 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది.
08:56 ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది.
09:00 మరిన్ని వివరముల కొరకు contact@spoken-tutorial.org కు వ్రాయండి.
09:06 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
09:11 దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
09:18 ఈ మిషన్ గురించి మరింత సమాచారము spoken hyphen tutorial.org/NMEICT -Intro వద్ద అందుబాటులో ఉన్నది
09:29 ఈ రచనకు సహాయపడిన వారు దేశీక్ర్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
09:35 ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Sneha, Yogananda.india