LibreOffice-Suite-Calc/C2/Basic-Data-Manipulation/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 14:45, 8 March 2013 by Sneha (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search

Resources for recording

Basic Data Manipulation


VISUAL CUE NARRATION
00:00 లిబ్రేఆఫీస్ Calc-బేసిక్స్ ఆఫ్ డేటా మానిప్యులేషన్ స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతము.
00:07 ఈ ట్యుటోరియల్లో మీరు ఈ క్రింది వాటి గురించి నేర్చుకుంటారు:
00:09 ఫార్ములా బేసిక్స్ యొక్క పరిచయము
00:12 కాలమ్ ల ద్వారా సార్టింగ్ చేయడము
00:15 డేటా ను ఫిల్టరింగ్ చేయడము యొక్క బేసిక్స్
00:17 ఇక్కడ మనము Ubuntu Linux version 10.04 ను మన ఆపరేటింగ్ సిస్టమ్ గా మరియు లిబ్రేఆఫీస్ సూట్ 3.3.4. ను వాడుతున్నాము.
00:27 మన ట్యుటోరియల్ ను లిబ్రే ఆఫీస్ Calcలో వాడే బేసిక్ ఫార్ములాలను నేర్చుకోవడముతో మొదలు పెడదాము.
00:35 ఫార్ములాలు అనేవి సంఖ్యలు మరియు చలరాశులను వాడి ఫలితములను రాబట్టే సమీకరణములు.
00:41 ఒక స్ప్రెడ్ షీట్ లో చలరాసులు అనేవి సమీకరణము పూర్తి అవ్వడము కొరకు కావలసిన డేటా ను కలిగి ఉండే సెల్ స్థానములు.
00:47 చాలా సాధారణముగా జరుగుతూ ఉండే అర్థమెటిక్ ఆపరేషన్లుగా కూడిక, తీసివేత, గుణకారము మరియు భాగహారములు ఉన్నాయి.
00:56 ఇప్పుడు ముందుగా మన “Personal-Finance-Tracker.ods” ఫైల్ ను ఓపెన్ చేద్దాము.
01:02 మన “personal finance tracker.ods” ఫైల్ లో “Cost” అనే హెడింగ్ క్రింద అన్ని ఖర్చుల యొక్క ధరను ఎలా కూడాలో చూద్దాము.
01:13 “SUM TOTAL” just under “Miscellaneous” క్రింద మనము “SUM TOTAL” అనే మరొక హెడింగ్ ను ఇవ్వవలసి ఉంటుంది.
01:19 మరియు మనము సెల్ A8 పైన క్లిక్ చేయాలి మరియు వరుస సంఖ్యను “7” గా ఇవ్వాలి.
01:25 ఇప్పుడు మనము ధరల యొక్క మొత్తమును డిస్ప్లే చేయాలి అని అనుకున్న సెల్ సంఖ్య “C8” పైన క్లిక్ చేయండి.
01:32 అన్ని ధరలను యాడ్ చేయడము కొరకు మనము “ఈజ్ ఈక్వల్ టు సమ్” అని టైప్ చేస్తాము మరియు బ్రాకెట్లలో కూడవలసిన కాలమ్ ల యొక్క రేంజ్ ”C3 colon C7”ను ఇస్తాము.
01:44 ఇప్పుడు కీ బోర్డ్ మీది “Enter” ను ప్రెస్ చేయండి.
01:47 “Cost” క్రింద ఉన్న అన్ని ఐటమ్ లు కూడబడడమును మీరు గమనించవచ్చు
01:51 ఇప్పుడు Calc లో ఎలా తీసివేత చేయాలో నేర్చుకుందాము.
01:55 మనము “ఇంటి అద్దె” మరియు “విద్యుత్ బిల్లు” ల ధరలను తీసివేసి దానిని A9 అని రిఫర్ చేయబడే సెల్ లో డిస్ప్లే చేయాలి అని అనుకుంటే ముందుగా A9 సెల్ పైన క్లిక్ చేయండి
02:06 ఇప్పుడు ఈ సెల్ లో “is equal to” అని టైప్ చేయండి మరియు బ్రాకెట్ లలో ఆయా సెల్ రిఫరెన్స్ లను అంటే “C3 minus C4” అని టైప్ చేయండి.
02:17 కీ బోర్డ్ పైన ఉన్న “Enter” కీ ను ప్రెస్ చేయండి.
02:20 ఆ రెండు సెల్ రిఫరెన్స్ ల ధరలు తీసివేయబడి అవి A9 అనే సెల్ నంబర్ లో డిస్ప్లే చేయబడడమును మీరు గమనించవచ్చు.
02:29 ఇప్పుడు మార్పులను undo చేద్దాము.
02:32 అలాగే వివిధ సెల్ లలో ఉన్న డేటా ను గుణకారము లేదా భాగహారము చేయవచ్చు.
02:37 స్ప్రెడ్ షీట్ లో ఉన్న మరొక బేసిక్ ఆపరేషన్ గా సంఖ్యల సరాసరిని కనుగొనడము అంటే ఫైండింగ్ ది “Average” ఆఫ్ నంబర్స్ ఉన్నది.
02:43 దానిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము.
02:45 “Average” just below the “SUM TOTAL” సెల్ క్రింద “Average” అనే హెడింగ్ ను ఇవ్వండి.
02:50 మనము ఇక్కడ మొత్తము ధర యొక్క యావరేజ్ ను డిస్ప్లే చేయాలి అని అనుకుంటున్నాము.
02:55 కనుక “C9” సెల్ పైన క్లిక్ చేయండి
02:58 ఇప్పుడు మనము “is equal to” Average అని మరియు బ్రాకెట్ లలో ధరను టైప్ చేస్తాము.
03:04 కీ బోర్డ్ మీద ఉన్న “Enter” కీ ను ప్రెస్ చేయండి.
03:07 “Cost” కాలమ్ యొక్క యావరేజ్ ఈ సెల్ లో డిస్ప్లే చేయబడడమును మీరు గమనించవచ్చు.
03:11 ఇప్పుడు మార్పులను undo చేద్దాము.
03:15 అలాగే ఒక హారిజాంటల్ రో లోని ఎలిమెంట్ల యావరేజ్ ను కూడా మీరు కనుగొనవచ్చు.
03:20 మనము ఫార్ములాల గురించి మరియు ఆపరేటర్ల గురించి ఎడ్వాన్స్డ్ లెవల్ ట్యుటోరియల్ లలో నేర్చుకోవచ్చు.
03:25 ఇప్పుడు ఒక Calcspreadsheet లో డేటా ను ఎలా “Sort” చేయాలో నేర్చుకుందాము.
03:30 షీట్ లో కనిపిస్తున్న సెల్ లను సార్టింగ్ మీకు కావలసిన పద్ధతిలో అమరుస్తుంది.
03:35 Calc లో మీరు డేటాను మూడు క్రైటీరియాల వరకు సార్ట్ చేయవచ్చు. ఇవి ఒకదాని తరువాత మరొకటి అప్లై చేయబడతాయి.
03:43 మీరు ఒక ప్రత్యేకమైన ఐటమ్ కొరకు వెతుకుతున్నప్పుడు అవి సరిపోతాయి మరియు మీరు డేటాను ఫిల్టర్ చేసిన తరువాత మరింత శక్తివంతము కూడా అవుతాయి.
03:51 ఇప్పుడు మనము “Costs” అనే హెడింగ్ క్రింద ఉన్న డేటాను ఆరోహణ క్రమములో సార్ట్ చేయాలి అని అనుకున్నాము అనుకోండి.
03:57 కనుక ముందుగా మనము “Cost” అనే సెల్ ను క్లిక్ చేయడము ద్వారా సార్టింగ్ చేయవలసిన సెల్ లను హైలైట్ చేస్తాము.
04:03 ఇప్పుడు ఎడమ మౌస్ బటన్ ను పట్టుకుని ఉంచి దానిని “2000” అని ఉన్న సెల్ చివర వరకు కాలమ్ గుండా డ్రాగ్ చేయండి.
04:12 ఇది మనము సార్ట్ చేయాలి అని అనుకున్న కాలమ్ ను ఎంపిక చేస్తుంది.
04:15 ఇప్పుడు మెనూ బార్ లోని “Data” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Sort” పైన క్లిక్ చేయండి.
04:21 ఆ తరువాత “Current Selection” పై క్లిక్ చేయండి.
04:24 “Sort criteria” మరియు “Options” ను కలిగి ఉన్న ఒక డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది
04:31 “Sort criteria” టాబ్ లో మీరు , “Sort by” ఫీల్డ్ లో “Cost” ను ఎంచుకోండి .
04:37 ధరను ఆరోహణ క్రమములో సార్ట్ చేయడము కొరకు దాని ప్రక్కనే ఉన్న “Ascending” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
04:44 ఇప్పుడు “OK” బటన్ పైన క్లిక్ చేయండి.
04:47 కాలమ్ ఆరోహణ క్రమములో సార్ట్ అవ్వడమును మీరు గమనించవచ్చు.
04:51 అలాగే, అవరోహణ క్రమములో సార్ట్ చేయడము కొరకు “Descending” పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “OK” బటన్ పైన క్లిక్ చేయండి.
04:59 ఇప్పుడు మార్పులను Undo చేద్దాము.
05:02 అన్ని కాలమ్ లను ముందుగా ఎంచుకుని ఆ తరువాత సార్ట్ ఆప్షన్లను అప్లై చేయడము ద్వారా చాలా కాలమ్ లను ఒకేసారి సార్ట్ చేయవచ్చు.
05:09 మనము వరుస సంఖ్యలను మరియు ధరలను సార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము అనుకోండి.
05:14 కనుక మనము ఇంతకు పూర్వము చేసిన విధముగా కాలమ్ లను ఎంచుకోండి.
05:18 ఇప్పుడు మెనూ బార్ లోని “Data” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు “Sort” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
05:24 అప్పుడు కనిపించే డయలాగ్ బాక్స్ లో ముందుగా “Sort by” ఫీల్డ్ లో “Cost” ను ఎంచుకోండి.
05:30 ఆ తరువాత “Then by” ఫీల్డ్ లో “SN” ను ఎంచుకోండి .
05:35 రెండు ఆప్షన్లలో కూడా వాటికి దగ్గరలో ఉన్న “ Descending” ను ఎంచుకోండి మరియు ఆ తరువాత “OK” బటన్ పై క్లిక్ చేయండి.
05:43 రెండు హెడింగ్ లు కూడా అవరోహణ క్రమములో సార్ట్ అవ్వడమును మీరు చూడవచ్చు
05:47 ఇప్పుడు మార్పులను Undo చేద్దాము
05:49 ఇప్పుడు లిబ్రేఆఫీస్ Calc లో డేటా ను ఎలా ఫిల్టర్ చేయాలో మనము నేర్చుకుందాము
05:53 ఒక ఫిల్టర్ అనేది డిస్ప్లే చేయబడడము కొరకు ప్రతి ఎంట్రీకు తప్పనిసరిగా ఉండవలసిన కండీషన్ల యొక్క లిస్ట్.
06:00 స్ప్రెడ్ షీట్ లో ఒక ఫిల్టర్ ను అప్లై చేయడము కొరకు “Item” అనే పేరు ఉన్న సెల్ పైన క్లిక్ చేద్దాము.
06:07 ఇప్పుడు మెనూ బార్ లోని “Data” ఆప్షన్ పైన క్లిక్ చేయండి మరియు ఆ తరువాత “Filter” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
06:12 పాప్ అప్ మెనూ నుంచి “AutoFilter” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
06:16 ఒక యారో హెడింగ్ ల పైన మార్క్ చేసి ఉండడమును మీరు చూడవచ్చు.
06:20 “Item” అనే పేరు ఉన్న సెల్ మీద ఉన్న డౌన్ యారో పైన క్లిక్ చేయండి.
06:24 ఇప్పుడు “Electricity Bill” కు సంబంధించిన డేటా ను మాత్రమే డిస్ప్లే చేయాలి అని అనుకుంటే .
06:29 అప్పుడు “Electricity Bill” ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
06:34 “Electricity Bill” కు సంబంధించిన డేటా మాత్రమే ఈ షీట్ లో డిస్ప్లే చేయబడడమును మీరు గమనించవచ్చు.
06:40 మిగిలిన ఆప్షన్లు అన్నీ ఫిల్టర్ చేయబడ్డాయి.
06:43 మొత్తము డేటాను చూడడము కొరకు ”Item” అనే పేరు ఉన్న సెల్ యొక్క డౌన్ వర్డ్ యారో పైన మరలా క్లిక్ చేయండి మరియు “All” పైన క్లిక్ చేయండి.
06:52 ఇప్పుడు మనము నిజముగా వ్రాసిన మొత్తము డేటాను చూడగలము అని మీరు గమనించవచ్చు.
06:59 “AutoFilter” మాత్రమే కాకుండా , “Standard Filter” మరియు “Advanced Filter” అనే రెండు ఇతర ఫిల్టర్ ఆప్షన్లు కూడా ఉన్నాయి, వీటి గురించి మనము ఈ వరుస లోని ఇతర స్థాయిలలో నేర్చుకుంటాము.
07:11 దీనితో మనము లిబ్రేఆఫీస్ Calc అనే స్పోకెన్ ట్యుటోరియల్ చివరకు వచ్చేసాము :
07:15 మనము నేర్చుకున్నది సంగ్రహముగా తెలపాలి అంటే :
07:18 ఫార్ములా యొక్క బేసిక్ లతో పరిచయము
07:21 కాలమ్ లతో సార్ట్ చేయడము
07:23 డేటాను ఫిల్టర్ చేయడము యొక్క బేసిక్స్
07:26 ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్న వీడియో ను చూడండి.
07:30 అది స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ను సంగ్రహముగా తెలుపుతుంది.
07:33 మీకు మంచి బాండ్ విడ్త్ కనుక లేకపోయినట్లు అయితే మీరు దానిని డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.
07:37 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్
07:40 *స్పోకెన్ ట్యుటోరియల్ ల పైన వర్క్ షాప్ లు నిర్వహిస్తుంది.
07:43 ఆన్ లైన్ టెస్ట్ లో ఉత్తీర్ణులు అయిన వారికి సర్టిఫికెట్లు అందిస్తుంది.
07:47 మరిన్ని వివరముల కొరకు contact@spoken -tutorial.org ను కు వ్రాయండి
07:53 ఈ స్పోకెన్ ట్యుటోరియల్ టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో భాగము
07:58 *దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది
08:06 *ఈ మిషన్ గురించి మరింత సమాచారము
08:08 *spoken hyphen tutorial.org/NMEICT -Intro వద్ద అందుబాటులో ఉన్నది
08:16 *ఈ రచనకు సహాయపడినవారు లక్ష్మి, మరియు నిఖిల. ఇంక విరమిస్తున్నాము
08:20 *మాతో కలిసినందుకు కృతజ్ఞతలు.

Contributors and Content Editors

Gaurav, Madhurig, Sneha, Yogananda.india