Koha-Library-Management-System/C2/Add-an-Item-type/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 17:20, 15 February 2019 by Madhurig (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 కోహ ఇంటర్ఫేస్ లో ఐటమ్ టైప్ ని ఎలా జోడించాలో అనే స్పోకన్ ట్యుటోరియల్కు స్వాగతం.
00:08 ఈ ట్యుటోరియల్లో, టైప్ యొక్క రకాలు మరియు టైప్ రకం ని ఎలా జోడించాలో అనేది నేర్చుకుంటాము.
00:17 ఈ ట్యుటోరియల్ను రికార్డ్ చేసేందుకు, నేను:

ఉబుంటు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టం 16.04 మరియు కోహ వర్షన్ 16.05 ఉపయోగిస్తున్నాను.

00:30 ఈ ట్యుటోరియల్ను అనుసరించడానికి, అభ్యాసకులకు లైబ్రరీ సైన్స్ గురించి తెలుసి ఉండాలి.
00:36 ఈ ట్యుటోరియల్ సాధన చేసేందుకు, మీ సిస్టమ్లో కోహ ఇన్స్టాల్ చేసి ఉండాలి.
00:42 మరియు, మీకు కోహ్లోలో అడ్మిన్ యాక్సెస్ కలిగి ఉండాలి. లేకపోతే, ఈ వెబ్సైట్లో కోహా స్పోకెన్ ట్యుటోరియల్ సీరీస్ ను చూడండి.
00:52 ప్రారంభిద్దాం. నన్ను కోహ ఇంటర్ఫేస్కు మారనివ్వండి.
00:58 మనము ఒక సూపర్లిబ్రియన్ బెల్లాను సృష్టించామని గుర్తుతెచ్చుకోండి.
01:03 ఇప్పుడు మనము username బెల్లా మరియు తన password తో లాగిన్ అవుతాము.
01:08 ఇప్పుడు మనము కోహ ఇంటర్ఫేస్ లో సూపర్లిబ్రియన్ బెల్లా గా ఉన్నాము.
01:14 మనము ముందుకు వెళ్ళేముందు, item టైప్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
01:20 Item types, సాధారణంగా లైబ్రరీలో ఉన్న పదార్థాన్ని సూచిస్తాయి,

అనగా పుస్తకాలు, జర్నల్స్, సిడిలు/DVD లు మొదలైనవి.

01:31 కోహ లో ప్రతి Item typeకి ఒక కలెక్షన్ కోడ్ ఉంటుంది.
01:37 ఈ కోడ్ ఆ Item type ని ప్రత్యేకంగా గుర్తిస్తుంది.
01:42 ఒక కొత్త Item type ని జోడించడం నేర్చుకుందాం.
01:46 కోహ హోమ్ పేజీ లో, కోహ అడ్మినిస్ట్రేషన్ క్లిక్ చేయండి.
01:52 బేసిక్ పారామీటర్స్ విభాగానికి వెళ్ళి, Item Types పై క్లిక్ చేయండి.
01:59 Item types administration పేజీలో ఎగువన New Item Type బటన్ పై క్లిక్ చేయండి.
02:06 Item type ఫీల్డ్ లో, మీరు జోడించదలిచిన కొత్త item type కోసం ఒక కోడ్ను నమోదు చేయండి.
02:13 నేను REF అని టైప్ చేస్తాను.
02:17 Description ఫీల్డ్ అనేది item type యొక్క వివరణ.
02:22 ఇక్కడ నేను, Reference అని టైప్ చేస్తాను మరియు Search category ఫీల్డ్ ను దాటవేస్తాను.
02:30 తర్వాత టైప్ Choose an icon.
02:33 bridge పై క్లిక్ చేయండి.
02:37 ఇక్కడ, ఇచ్చిన ఎంపికల నుండి, item typeతో సంబంధం ఉన్న చిహ్నంపై క్లిక్ చేయండి.
02:45 నేను ఈ రిఫరెన్స్ ఐకాన్ ను ఎంచుకుంటాను.
02:49 మనము Hide in OPAC ఎలా సహాయపడుతుందో నేర్చుకుందాం.
02:54 ఒక పుస్తకం దెబ్బతిన్నది మరియు/లేదా బైండింగ్ ప్రయోజనం కోసం ఉంచబడిందనుకుందాం.
03:02 అటువంటి సందర్భాలలో, Hide in OPAC ఎంపిక యూసర్ లకు పుస్తకాన్ని అదృశ్యం చేస్తుంది.
03: 11 మీ అవసరాలకు అనుగుణంగా, Hide in OPAC చెక్బాక్స్ ఎంపికను తనిఖీ చేయండి లేదా టిక్కును తొలగించండి. నేను చెక్బాక్స్ ఖాళీగా వదిలివేస్తాను.
03:21 లైబ్రరీలో, కేవలం భద్రపరచుటకు మాత్రమే పంపిణీ చేసుటకు కానీ ఐటమ్ల కోసం Not for loanఎంపిక ఉపయోగించండి.
03:29 ఉదాహరణకు: రిఫరెన్స్ బుక్స్, అరుదైన పుస్తకాలు, డిక్షనరీ మొదలైనవి.
03:36 నేను ఈ చెక్ బాక్స్నుఖాళీగా వదిలివేస్తాను.
03:40 మీరు Rental charge field' లో ఛార్జ్ చేయవలసిన మొత్తాన్ని నమోదు చేయవచ్చు.

లైబ్రరీలో కొన్ని ప్రత్యేక 'itemల కోసం కనీస అద్దె రుసుము వసూలు చేయాల్సి ఉంటుంది.

03:51 అద్దె రుసుము చాలా వస్తువుల మీద వసూలు చేయనవసరం లేదు, నేను ఎటువంటి ఫీజును నమోదు చేయను.
04:00 మీరు ఫీజును నమోదు చేయాలనుకుంటే, చెల్లుబాటు అయ్యే నంబర్ను మాత్రమే నమోదు చేయాలని గుర్తుంచుకోండి.
04:07 తరువాతది Checkin message టెక్స్ట్ ఫీల్డ్.
04:11 Checkin message ప్రత్యేక ఐటమ్ యొక్క రకంపై ఆధారపడి ఉంటుంది.
04:16 బుక్, సీరియల్, సిడిఎస్ /డివైడ్స్, బౌండ్ వాల్యూమ్, మైక్రోఫిల్మ్ మొదలైనవి.
04:26 Checkin message ఫీల్డ్ లో నేను బౌండ్ వాల్యూమ్ అని టైప్ చేస్తాను.
04:32 దీని తర్వాత Checkin message type వస్తుంది.
04:36 ఐటమ్ రకాన్ని బట్టి, ఐటమ్ కోసం ఒక సందేశాన్ని లేదా హెచ్చరికను ఎంచుకోండి.
04:42 గుర్తుంచుకోండి, ఎంచుకున్న ఎంపిక ప్రకారం ఈ ప్రత్యేక ఐటమ్ కోసం చెక్ ఇన్ లు చేయబడినప్పుడు సందేశం లేదా హెచ్చరిక ప్రదర్శించబడుతుంది.
04:53 నేను messageని ఎంచుకుంటున్నాను.
04:56 తర్వాత వచ్చేది SIP media type.

మీ లైబ్రరీలో సార్టర్ లేదా లాకర్ సదుపాయం వాడుతున్నప్పుడు మాత్రమే SIP media type వర్తిస్తుంది.

05:07 కాబట్టి ఇక్కడ, నేను SIP media type ను స్కిప్ చేస్తున్నాను.
05:11 Summary ఫీల్డ్ లో, మీరు కావాలనుకుంటే, ఆ ఐటమ్ యొక్క సారాంశాన్ని రాయండి.
05:18 నేను ఐటమ్ టైప్ - రిఫరెన్స్, fecilitate-సెల్ఫ్ చెక్ అవుట్ or రిటర్న్ అని టైప్ చేస్తాను.
05:25 చివరగా, Save changes బటన్పై క్లిక్ చేయండి.
05:30 Item types administration అనే కొత్త పేజీ తెరుచుకుంటుంది.
05:35 కొత్త item type కోసం నింపిన అన్ని వివరాలు, Item types administration పేజీలో ఒక టాబులర్ రూపంలో కనిపిస్తాయి.
05:45 గమనించదగిన కొన్ని ముఖ్యమైన విషయాలు-
05:49 item types కు కేటాయించిన Collection codeలు సవరించబడవు.
05:54 item type యొక్క వివరణను సవరించవచ్చు. ఒక item type లైబ్రరీలోని ఐటమ్ల చే ఉపయోగించ పడితే, అది తొలగించబడదు.
06:05 మనము ఈ ట్యుటోరియల్ చివరికి వచ్చాము.
06:08 సారాంశం చూద్దాం.

ఈ ట్యుటోరియల్ లో, మనము Item typeలు మరియు Item type ని ఎలా జోడించాలో నేర్చుకున్నాము.

06:18 ఒక అసైన్మెంట్గా - మీ లైబ్రరీకి కొత్త ఐటమ్, బుక్ మరియు సీరియల్ చేర్చండి.
06:25 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
06:33 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

06:43 దయచేసి ఈ ఫోరమ్లో మీ ప్రశ్నలను సమయం తో పాటు పోస్ట్ చేయండి.
06:47 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ NMEICT, MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది. ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
06:59 ఈ రచనకు సహాయపడినవారు మాధురి మరియు ఉదయ లక్ష్మి. చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Madhurig