Difference between revisions of "Health-and-Nutrition/C2/Non-vegetarian-recipes-for-lactating-mothers/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {|border=1 | <center>Time</center> |<center>Narration</center> |- | 00:00 | పాలిచ్చే తల్లుల కొరకు మాంసాహార వంటక...")
 
 
Line 130: Line 130:
 
| 02:42
 
| 02:42
 
| అందులో, అన్ని మసాలాలు ఇంకా చికెన్ వేయండి.
 
| అందులో, అన్ని మసాలాలు ఇంకా చికెన్ వేయండి.
ఇప్పుడు సగం కప్పు నీరు పోసి  బాగా కలపాలి కలపండి.
+
ఇప్పుడు సగం కప్పు నీరు పోసి  బాగా కలపండి.
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
Line 213: Line 213:
 
|-
 
|-
 
| 04:32
 
| 04:32
| దీని కొరకు, మనం తీసుకునేవి- 100 గ్రాముల రోహు చేప,
+
| దీని కొరకు, మనం తీసుకునేవి- 100 గ్రాముల రోహు చేప(బొచ్చ గండు మీను),
 
½ కప్పు తురిమిన కొబ్బరి, 4 ఎండు మిరపకాయలు,
 
½ కప్పు తురిమిన కొబ్బరి, 4 ఎండు మిరపకాయలు,
 
|-
 
|-
Line 233: Line 233:
 
|-
 
|-
 
|04:56
 
|04:56
| ఒకవేళ, రోహు చేప అందుబాటులో లేనట్లయితే మీరు వీటిలో దేనినైనా ఉపయోగించవచ్చు -
+
| ఒకవేళ, రోహు చేప (బొచ్చ గండు మీను) అందుబాటులో లేనట్లయితే మీరు వీటిలో దేనినైనా ఉపయోగించవచ్చు -
మాకేరెల్, పోమ్‌ఫ్రేట్ లేదా బాంబే డక్.
+
మాకేరెల్(వంజరం చేప), పోమ్‌ఫ్రేట్(చందువాచేపలు)లేదా బాంబే డక్(వనమట్టాలు).
 
|-
 
|-
 
|05:06
 
|05:06
Line 259: Line 259:
 
|-
 
|-
 
| 05:42
 
| 05:42
| దాంట్లో, మ్యారినేట్ చేసిన చేపముక్కలను వేసి, ఇంకో 10 నిమిషాలు ఉడికించాలి.
+
| దాంట్లో, ఊరపెట్టిన చేసిన చేపముక్కలను వేసి, ఇంకో 10 నిమిషాలు ఉడికించాలి.
 
చేప కొబ్బరి కూర సిద్ధంగా ఉంది.
 
చేప కొబ్బరి కూర సిద్ధంగా ఉంది.
 
|-
 
|-
Line 268: Line 268:
 
| దీన్ని తయారుచేయడానికి, మనకు అవసరమైనవి-
 
| దీన్ని తయారుచేయడానికి, మనకు అవసరమైనవి-
 
2 ఉడికించిన గుడ్లు,
 
2 ఉడికించిన గుడ్లు,
2 ముక్కలు కాలీఫ్లవర్,
+
క్యాబేజి పువ్వు ముక్కలు2,
 
|-
 
|-
 
| 05:59
 
| 05:59
| 1 మీడియం ఉల్లిపాయ,
+
|1 మీడియం ఉల్లిపాయ,
తరిగిన ఫ్రెంచ్ బీన్స్ 2,
+
తరిగిన బీన్స్ చిక్కుడుకాయలు 2,
 
|-
 
|-
| 06:02
+
|06:02
 
| తరిగిన 1 మీడియం టొమాటో,
 
| తరిగిన 1 మీడియం టొమాటో,
 
తరిగిన చిన్న క్యాప్సికమ్ లో సగం,
 
తరిగిన చిన్న క్యాప్సికమ్ లో సగం,
Line 282: Line 282:
 
1 టీస్పూన్ కారం పొడి,
 
1 టీస్పూన్ కారం పొడి,
 
|-
 
|-
| 06:12
+
|06:12
 
| రుచికి సరిపడా ఉప్పు,
 
| రుచికి సరిపడా ఉప్పు,
 
½ స్పూన్ పసుపు పొడి,
 
½ స్పూన్ పసుపు పొడి,
Line 336: Line 336:
 
| 07:19
 
| 07:19
 
| దీన్నితయారు చేయడానికి, మనకు అవసరమైనవి -
 
| దీన్నితయారు చేయడానికి, మనకు అవసరమైనవి -
సాల్మన్ చేప 2 ముక్కలు,
+
 
 +
సాల్మన్ చేప(మాగా చేప) 2 ముక్కలు,
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
Line 383: Line 384:
 
|-
 
|-
 
|08:30
 
|08:30
| ఇప్పుడు, వేయించిన చేప ముక్కలు వేసి, మసాలా అంతా చేపలకు పట్టుకునే వరకు ఉడికించండి.
+
| ఇప్పుడు, వేయించిన చేప ముక్కలు వేసి, మసాలా అంతా చేపలకు పట్టుకునే వరకు ఉడికించండి.
  
 
|-
 
|-

Latest revision as of 13:17, 14 February 2020

Time
Narration
00:00 పాలిచ్చే తల్లుల కొరకు మాంసాహార వంటకాలపై స్పోకెన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము: తల్లిపాలు ఇస్తున్న సమయంలో పోషకాహారం యొక్క ప్రాముఖ్యత,
00:13 ఇటువంటి మాంసాహార వంటకాలను తయారుచేయడం - మునక్కాడలతో చికెన్ కర్రీ,
00:20 శనగపలుకులు వెల్లుల్లి మసాలాలో చికెన్,
00:24 కొబ్బరితో చేపల కూర,

మిశ్రమ కూరగాయలతో గుడ్డు కూర మరియు పాలకూర చేపల కర్రీ.

00:31 పాలిస్తున్న సమయంలో, ఒక తల్లికి వీటి కొరకు అదనపు పోషకాహారం అవసరం- పాల ఉత్పత్తి కోసం,
00:38 పెరుగుతున్న శిశువుకు తగినంత పోషకాలను అందించడానికి మరియు

తల్లి యొక్క రోజువారీ అవసరాలను తీర్చడానికి.

00:45 పాలిస్తున్న సమయంలో అవసరమైన ముఖ్యమైన పోషకాలు -

విటమిన్లు,(మినరళ్ళు) ఖనిజాలు,

00:51 ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ మరియు కోలిన్.
00:54 పోషకాలతో పాటు, మనము గెలక్టోగాగ్స్ (Galactogogues) గురించి నేర్చుకుంటాము.
00:59 గెలాక్టోగోగ్స్ అనేవి పాల ఉత్పత్తికి సహాయపడే పదార్థాలు.
01:04 తల్లి ఆహారంలో వీటిని చేర్చుకోవడం ద్వారా వాటిని పొందవచ్చు-

- వెల్లుల్లి,

01:08 మెంతి గింజలు మరియు ఆకులు,
01:10 సోపు గింజలు,
01:12 (గార్డెన్ క్రెస్ సీడ్స్) అదిత్యాలు, అడాలు,

మునగాకులు,

01:15 సాయకూర ఆకులు మరియు వాము.
01:19 దయచేసి గమనించండి:

పాలిచ్చే తల్లుల కొరకు పోషకాహారం కోసం ఇదే సిరీస్ యొక్క మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది.

01:28 పాలిస్తున్న సమయంలో పోషకాహారం యొక్క ప్రాముఖ్యత కోసం అర్థం చేసుకున్న తరువాత, మనం వంటకాల తయారీతో ప్రారంభిస్తాము.
01:37 మనం మన మొదటి వంటకమైన మునక్కాడలతో చికెన్ కర్రీతో ప్రారంభిద్దాం
01:43 దీన్ని తయారు చేయడానికి, మనకు అవసరమైనవి - 100 గ్రాముల చికెన్,
01:47 2 మునక్కాడలు,

కరివేపాకు 1 రెమ్మ,

01:51 1 టీస్పూన్ నల్ల మిరియాలు,

1 తరిగిన ఉల్లిపాయ,

01:55 4 వెల్లుల్లి రెబ్బలు,

రుచికి సరిపడా ఉప్పు.

02:00 ½ టీస్పూన్ పసుపు పొడి,

½ టీస్పూన్ కారం పొడి,

02:05 1 పచ్చి మిరపకాయ,

1 గుప్పెడు కొత్తిమీర, 2 టీస్పూన్ల నూనె.

02:11 ఒక పాన్ లో 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి.

అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, మిరియాలు, పచ్చిమిర్చి వేయండి.

02:19 బంగారు రంగులోకి వచ్చేవరకు వాటిని వేయించాలి.

ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి 2-3 సెకన్ల పాటు వేయించండి.

02:27 వాటిని చల్లారనిచ్చి కొంచం నీళ్లు పోసి రుబ్బి పేస్ట్ తయారుచేయండి.
02:32 తరువాత, మునక్కాడలను ఉడికేవరకు కుక్కర్ లో లేదా బయట ఉడికించండి
02:36 ఒక పాన్ లో 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి.

తయారు చేసిన పేస్ట్ ను అందులో వేసి 2 నిమిషాలు ఉడికించాలి.

02:42 అందులో, అన్ని మసాలాలు ఇంకా చికెన్ వేయండి.

ఇప్పుడు సగం కప్పు నీరు పోసి బాగా కలపండి.

02:50 మూతపెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
02:53 అందులో, బయట ఉడికించిన లేదా ప్రెజర్ కుక్ చేసిన మునక్కాడలను వేసి 2-4 నిమిషాలు ఉడికించండి.
02:59 మునక్కాడలతో తో చికెన్ కర్రీ సిద్ధంగా ఉంది.
03:03 మనం నేర్చుకునే రెండవ వంటకం వేరుశెనగలు వెల్లుల్లి మసాలాలో చికెన్.
03:08 దీనిని తయారుచేయడానికి, మనకు అవసరమైనవి - 100 గ్రాముల చికెన్,

2 టేబుల్ స్పూన్ల వేరుశెనగలు,

03:14 5 వెల్లుల్లి రెబ్బలు,

తరిగిన టమోటా1,

03:18 తరిగిన ఉల్లిపాయ1,

1/2 టీస్పూన్ పసుపు,

03:21 రుచికి సరిపడా ఉప్పు,

1 టీస్పూన్ ఎర్ర కారం పొడి,

03:25 2 టీస్పూన్ల నూనె.
03:27 వేరుశెనగలు వెల్లుల్లి పేస్ట్ తయారుచేయడానికి - ఒక పాన్ లో వేరుశెనగలను మీడియం మంట మీద వేయించుకోవాలి.
03:34 మాడిపోకుండా ఉండటానికి వాటిని ఆపకుండా కలుపుతూఉండండి.

వాటిని చల్లారనివ్వండి.

03:39 పైన తొక్కును తీసేయడానికి వాటిని మీ అరచేతుల మధ్య వేసి రుద్దండి.
03:45 ఇప్పుడు ఒక పాన్ లో1 టీస్పూన్ నూనె వేసి వేడి చేసి ఉల్లిపాయ, టమోటా, వెల్లుల్లి వేయండి.

టమోటా మృదువుగా అయ్యే వరకు వాటిని వేయించండి.

03:54 వాటిని చల్లారనివ్వండి.

చల్లారిన తరువాత, వీటిని వేరుశెనగలతో కలపండి.

03:59 కొద్దిగా నీరు వేసి రుబ్బి పేస్ట్ తయారుచేయండి.
04:03 ఒక పాన్ లో1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి.
04:05 ఇప్పుడు అందులో వేరుశెనగ వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు ఉడికించండి.

తరువాత, మసాలాలు వేసి బాగా కలపాలి

04:15 దాంట్లో చికెన్ వేసి ఇంకో 2 నిమిషాలు ఉడికించాలి.

ఇప్పుడు కొద్దిగా నీరు పోసి బాగా కలపండి.

04:21 పాన్ పైన మూత పెట్టి చికెన్ మెత్తగా అయ్యే వరకు ఉడికించండి.
04:25 చికెన్ వేరుశెనగ వెల్లుల్లి మసాలా సిద్ధంగా ఉంది.
04:28 మూడవ వంటకం కొబ్బరితో చేపల కూర.
04:32 దీని కొరకు, మనం తీసుకునేవి- 100 గ్రాముల రోహు చేప(బొచ్చ గండు మీను),

½ కప్పు తురిమిన కొబ్బరి, 4 ఎండు మిరపకాయలు,

04:38 ½ టీస్పూన్ పసుపు,

రుచికి సరిపడా ఉప్పు,

04:42 4 వెల్లుల్లి రెబ్బలు,

1 చిన్న నిమ్మకాయ పరిమాణంలో చింతపండు,

04:47 1 తరిగిన ఉల్లిపాయ,

½ టీస్పూన్ మెంతులు,

04:51 ½ టీస్పూన్ జీలకర్ర,

1 టీస్పూన్ నూనె.

04:56 ఒకవేళ, రోహు చేప (బొచ్చ గండు మీను) అందుబాటులో లేనట్లయితే మీరు వీటిలో దేనినైనా ఉపయోగించవచ్చు -

మాకేరెల్(వంజరం చేప), పోమ్‌ఫ్రేట్(చందువాచేపలు)లేదా బాంబే డక్(వనమట్టాలు).

05:06 చేపలను శుభ్రం చేసి, 2 చిటికెల ఉప్పు వేసి 10 నిమిషాలు ఉంచండి.
05:11 ఎండు మిరపకాయలు, మెంతులు, జీలకర్ర ను రంగు మారే వరకు నూనెలేకుండా వేయించండి.
05:17 వేయించిన పదార్థాలను కొబ్బరి, చింతపండు, వెల్లుల్లితో కలిపి రుబ్బి పేస్ట్ చేసుకోవాలి.
05:25 ఒక పాన్ లో 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి.
05:29 ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
05:33 దాంట్లో రుబ్బిన పేస్ట్ వేసి 5-6 నిమిషాలు ఉడికించాలి.

మసాలాలు కూడా వేసి బాగా కలపాలి.

05:42 దాంట్లో, ఊరపెట్టిన చేసిన చేపముక్కలను వేసి, ఇంకో 10 నిమిషాలు ఉడికించాలి.

చేప కొబ్బరి కూర సిద్ధంగా ఉంది.

05:49 నాల్గవ వంటకం మిశ్రమ రకాల కూరగాయలతో ఉడికించిన గుడ్డు కూర.
05:53 దీన్ని తయారుచేయడానికి, మనకు అవసరమైనవి-

2 ఉడికించిన గుడ్లు, క్యాబేజి పువ్వు ముక్కలు2,

05:59 1 మీడియం ఉల్లిపాయ,

తరిగిన బీన్స్ చిక్కుడుకాయలు 2,

06:02 తరిగిన 1 మీడియం టొమాటో,

తరిగిన చిన్న క్యాప్సికమ్ లో సగం,

06:07 1 టేబుల్ స్పూన్ నువ్వులు,

1 టీస్పూన్ కారం పొడి,

06:12 రుచికి సరిపడా ఉప్పు,

½ స్పూన్ పసుపు పొడి,

06:16 1 టేబుల్ స్పూన్ గసగసాలు,

½ టేబుల్ స్పూన్ (గార్డెన్ క్రెస్ సీడ్స్ పౌడర్) అడాలా పొడి,

06:21 1 టీస్పూన్ నూనె.
06:24 ఒక పాన్ లో నువ్వులు మరియు గసగసాలను నూనెలేకుండా వేయించుకోండి.

వాటిని చల్లారనివ్వండి.

06:29 తరువాత, ఒక పాన్ లో అర టీస్పూన్ నూనె వేసి టమోట ముక్కలు వేసి వేయించాలి.
06:35 చల్లారిన తరువాత, టమోటాలు మరియు నువ్వులు గసగసాలను మిక్సర్ లేదా రోట్లో రుబ్బుకోవాలి.
06:41 ఒక పాన్ లో 1 టీస్పూన్ నూనె వేసి వేడి చేయాలి.

ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

06:48 ఇప్పుడు టమోటా పేస్ట్ ను వేసి 5 నిమిషాలు ఉడికించాలి.

ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి బాగా కలపాలి.

06:57 అందులో, కొంచెం నీరు పోసి కూరగాయ ముక్కలు వేయండి.
07:01 మూతపెట్టి కూరగాయలు మెత్తబడే వరకు ఉడికించాలి.
07:04 ఉడికించిన గుడ్లను 2 భాగాలుగా కట్ చేసి కూరలో వేయండి.

ఒక నిమిషం ఉడికించండి.

07:10 మిశ్రమ రకాల కూరగాయలతో ఉడికించిన గుడ్డు కూర సిద్ధంగా ఉంది.
07:14 మనం చూసే చివరి వంటకం పాలకూరతో చేపల కూర-
07:19 దీన్నితయారు చేయడానికి, మనకు అవసరమైనవి -

సాల్మన్ చేప(మాగా చేప) 2 ముక్కలు,

07:22 4-5 పాలకూర ఆకులు,

రుచికి సరిపడా ఉప్పు,

07:26 1 టీస్పూన్ కారం పొడి,

½ టీస్పూన్ పసుపు పొడి,

07:31 1 టీస్పూన్ అవిస గింజల పొడి,

1 టీస్పూన్ నెయ్యి లేదా నూనె,

07:36 1 గుప్పెడు కొత్తిమీర,

1 టీస్పూన్ నిమ్మరసం,

07:41 పచ్చిమిర్చి 1,

1 టీస్పూన్ గరం మసాలా పొడి.

07:45 చేప ముక్కలను కడగండి. వాటికి కొంచెం ఉప్పు మరియు పసుపు రాసి పక్కన ఉంచండి.
07:52 పాలకూరను నీటిలో బాగా కడగండి.

ఒక గిన్నెలో నీరు మరిగించి దాంట్లో పాలకూర వేసి 5 నిమిషాలు ఉడికించాలి.

08:01 తరువాత, నీటిని వంపేసి దాన్ని చల్లారనివ్వండి.

పాలకూర, కొత్తిమీర, పచ్చిమిర్చిని రుబ్బి పేస్ట్ చేసుకోవాలి.

08:09 ఒక పాన్ లో 1 టీస్పూన్ నెయ్యి లేదా నూనె వేసి వేడి చేసి, చేపముక్కలను ఉడికే వరకు వేయించాలి.
08:15 అదే సమయంలో మరొక పాన్ లో 1 టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయండి.
08:22 అందులో పాలకూర పేస్ట్ ఇంకా కొద్దిగా నీరు వేసి 5 నిమిషాలు ఉడికించాలి.

దాంట్లో మసాలాలు అన్నీ వేసి బాగా కలపండి.

08:30 ఇప్పుడు, వేయించిన చేప ముక్కలు వేసి, మసాలా అంతా చేపలకు పట్టుకునే వరకు ఉడికించండి.
08:37 గరం మసాలా పొడి మరియు అవిసె గింజల పొడి వేసి 2 నిమిషాలు ఉడికించండి.
08:42 స్టవ్ ఆపేసి అందులో నిమ్మరసం వేయండి.

పాలకూరతో చేపల కూర సిద్ధంగా ఉంది.

08:49 పై వంటకాలన్నిటిలో ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి -

ప్రోటీన్,

08:54 విటమిన్ బి 12,
08:57 మంచి కొవ్వులు,
09:00 ఐరన్,
09:02 ఫోలేట్,
09:04 పొటాషియం,
09:06 విటమిన్ A,
09:08 విటమిన్ D,
09:12 జింక్,
09:14 మెగ్నీషియం.
09:17 ఈ పోషకాలు వీటికి సహాయపడతాయి - శిశువు యొక్క పెరుగుదల మరియు అభివృద్ధి,
09:22 తల్లిలో పాల ఉత్పత్తి ఇంకా తల్లిని ఆరోగ్యంగా ఉంచడం.
09:27 ఇది పాలిచ్చే తల్లుల కొరకు మాంసాహార వంటకాలపై ఈ ట్యుటోరియల్ చివరికి మనల్నితీసుకువస్తుంది.

మాతో చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Simhadriudaya