Health-and-Nutrition/C2/Magnesium-rich-vegetarian-recipes/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 23:35, 30 August 2020 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time
Narration
00:00 మెగ్నీషియం సమృద్ధిగా గల శాఖాహార వంటకాలపై స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని గురించి నేర్చుకుంటాము:
00:09 మెగ్నీషియం యొక్క ప్రయోజనాలు,
00:11 మెగ్నీషియం యొక్క శాకాహార వనరులు
00:13 మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉండే శాఖాహార వంటకాలు.
00:18 మెగ్నీషియం అనేది ఒక మినరల్, ఇది శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన పోషకం.
00:24 ఇది మరొక ట్యుటోరియల్‌లో వివరించబడిన టైప్ 2 పోషకాలలో ఒకటి.
00:31 ఈ ట్యుటోరియల్ కొరకు దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.
00:35 ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాల కొరకు మెగ్నీషియం అనేది అవసరం.
00:40 అలాగే శక్తి ఉత్పత్తి అవ్వడానికి కూడా మనకు మెగ్నీషియం అవసరం.
00:44 మరియు DNA సంయోగానికి కూడా.
00:47 మెగ్నీషియం యొక్క ప్రాముఖ్యత అనేది మరొక ట్యుటోరియల్‌లో వివరించబడింది.
00:52 ప్రస్తుతం మెగ్నీషియం వీటిల్లో ఉంది
00:54 బీన్స్,

కాయలు,

00:56 విత్తనాలు,

ఆకు కూరలు

00:59 మరియు ధాన్యాలు.
01:01 మెగ్నీషియం తీసుకోవడం మరియు శరీరంలో దాని శోషణ రెండూ సమానంగా ముఖ్యమైనవి.
01:08 పులియబెట్టడం (కిణ్వ ప్రక్రియ),

వేయించడం,

01:10 మొలకెత్తించడం

మరియు వంట అనేవి శోషణను మెరుగుపరుస్తాయి.

01:15 వంట చేయడానికి ముందు బీన్స్ నానబెట్టడం కూడా అదే చేస్తుంది.
01:20 ఇప్పుడు, మనం మన మొదటి రెసిపీ, మొలకెత్తిన మోటుపెసల కట్లెట్ యొక్క తయారీని చూద్దాం.
01:27 ఈ రెసిపీని తయారు చేయడానికి, మనకు కావాల్సినవి:
01:31 ¼ కప్పు మొలకెత్తిన మోటుపెసలు,
01:34 బాగా కడిగి తరిగిన పాలకూర 1 కప్పు,
01:37 1 టేబుల్ స్పూన్ శనగపిండి,
01:40 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు,
01:43 1 టీస్పూన్ నిమ్మరసం,
01:45 1 టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు
01:49 మరియు రుచికి సరిపడా ఉప్పు.
01:51 మనకు ఇవి కూడా కావాలి:
01:53 1 టీస్పూన్ ఎర్ర కారంపొడి
01:55 3 టీస్పూన్ల నూనె
01:58 ఇప్పుడు నేను తయారీవిధానాన్ని వివరిస్తాను:
02:00 మొలకెత్తించడం కోసం, మోటు పెసలను రాత్రంతా నానబెట్టండి.
02:05 ఉదయాన్నే అందులోని నీళ్లన్నీ వంపేసి వాటిని శుభ్రమైన మస్లిన్ వస్త్రంలో మూటకట్టండి.
02:10 మొలకెత్తడం కోసం వాటిని వెచ్చని ప్రదేశంలో 2 రోజులు ఉంచండి.
02:15 మొలకెత్తడానికి వేర్వేరు రకాల చిక్కుళ్ళు వేర్వేరు సమయాలు తీసుకుంటాయని దయచేసి గమనించండి.
02:20 మొలకలు సిద్ధమైన తర్వాత అందులో వెల్లుల్లి వేసి ముతక పేస్ట్‌ గా రుబ్బుకోవాలి.
02:27 పేస్ట్ తయారు చేయడానికి మీరు మిక్సర్ ను లేదా రాతిరోలును ఉపయోగించవచ్చు.
02:32 ఒక పాన్ ను వేడి చేసి నువ్వులు లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
02:37 వాటిని చల్లారనివ్వండి.
02:39 కట్లెట్స్ చేయడానికి, ఒక గిన్నెలో మొలకల పేస్ట్ ను తీసుకోండి.
02:43 అందులో వేయించిన నువ్వులు, పాలకూర, శనగపిండి, మసాలాలు, ఉప్పు మరియు నిమ్మరసం వేయండి.
02:52 వాటిని బాగా కలపండి.
02:54 ఒకవేళ పేస్ట్ పొడిగా ఉంటే, అందులో 1 టేబుల్ స్పూన్ నీటిని కలపండి.
02:59 ఈ పేస్ట్‌ను 4 భాగాలుగా విభజించండి
03:01 వాటిని కట్లెట్లు ఆకృతిలో చేయండి.
03:04 ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయండి.
03:06 కట్లెట్లను రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు మీడియం వేడి మీద షాలో ఫ్రై చేయండి.
03:12 మోటుపెసలు పాలకూర కట్లెట్లు సిద్ధంగా ఉన్నాయి.
03:15 4 కట్లెట్స్‌లో దాదాపుగా 208 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది.
03:22 మన తరువాతి వంటకం పొద్దుతిరుగుడు విత్తనాలు పచ్చడి (అద్దుకునేది).
03:26 ఈ వంటకం కోసం, మనకు అవసరమైనవి:
03:28 2 టేబుల్ స్పూన్ల పొద్దుతిరుగుడు విత్తనాలు
03:32 పచ్చిమిర్చి 1

4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు

03:36 1 చిన్న తరిగిన టమోటా
03:39 రుచికి సరిపడా ఉప్పు
03:41 ½ టీస్పూన్ నూనె లేదా నెయ్యి
03:44 తయారీవిధానం:

పొద్దుతిరుగుడు విత్తనాలను మీడియం మంట మీద లేత గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి.

03:50 తరువాత వాటిని చల్లారనివ్వండి.
03:52 ఒక పాన్ లో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి
03:55 అందులో తరిగిన టమోటాను వేసి వేయించండి.
03:57 చల్లారడానికి దాన్ని ఒక పక్కన ఉంచండి
04:00 ఈ రెండింటినీ వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు మరియు నీటితో పాటు పేస్ట్‌ గా రుబ్బుకోవాలి.
04:07 పొద్దుతిరుగుడు విత్తనాలు పచ్చడి సిద్ధంగా ఉంది.
04:10 ఈ పచ్చడి యొక్క 2 టేబుల్ స్పూన్ల లో దాదాపు 133 mg మెగ్నీషియం ఉంటుంది.
04:17 మన తరువాతి వంటకం బొబ్బర్ల మొలకలతో పరాటా (ఏదైనా నింపిచేసిన పల్చని బ్రెడ్ వంటిది).
04:21 మొలకలు తయారుచేసే విధానం ఈ ట్యుటోరియల్‌లో ఇంతకుముందే వివరించబడింది.
04:27 ఈ రెసిపీ కోసం, మనకు అవసరమైనవి:
04:30 1/4 కప్పు గోధుమ పిండి
04:32 2 టేబుల్ స్పూన్ల బొబ్బర్ల మొలకలు
04:36 1 టేబుల్ స్పూన్ నువ్వులు
04:39 1 పచ్చిమిర్చి
04:40 1 టీస్పూన్ జీలకర్ర
04:43 ½ టీస్పూన్ పసుపు పొడి
04:46 మనకు ఇవి కూడా కావాలి,

రుచికి సరిపడా ఉప్పు

04:49 మరియు 2 టీస్పూన్ల నూనె లేదా నెయ్యి.
04:53 మొదట, ఒక మిక్సర్ ను ఉపయోగించి బొబ్బర్ల మొలకలు పచ్చిమిర్చి కలిపి ముతక పేస్ట్ ను తయారు చేయండి.
05:00 ఒకవేళ మిక్సర్ అందుబాటులో లేకపోతే మీరు రాతిరోలును ఉపయోగించవచ్చు.
05:05 ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయండి, అందులో జీలకర్ర వేసి తరువాత నువ్వులు వేయండి.
05:11 అవి రంగు మారేవరకు వాటిని వేయించండి.
05:13 బొబ్బర్ల పేస్ట్ ను వేసి మరో 2 నిమిషాలు వేయించండి.
05:19 తరువాత ఉప్పు మరియు పసుపు పొడి వేసి దాన్ని 5 నిమిషాలు ఉడికించండి.
05:24 చల్లారడానికి దాన్ని ఒక పక్కన ఉంచండి.
05:27 పరాఠా చేయడానికి ఒక గిన్నెలో పిండిని తీసుకోండి.
05:31 తగినంత నీరు పోస్తూ పిండిని పిసికి మెత్తని ముద్దగా కలపండి.
05:35 రోలింగ్ పిన్ను (చపాతీ కర్ర) ను ఉపయోగించి పిండి ముద్దని సమానంగా వత్తండి.
05:39 వత్తిన పిండిపైన బొబ్బర్ల పేస్ట్ ను ఉంచండి.
05:42 అన్ని వైపుల నుండి దాన్ని కవర్ చేయండి.
05:44 కొంచెం పిండిని చల్లండి
05:46 ఇప్పుడు దాన్ని పరాఠా లాగ వత్తండి
05:49 ఒక పాన్ ను వేడి చేయండి, నెయ్యి లేదా నూనె వేసి పరాఠా ను రెండు వైపులా బాగా కాల్చండి.
05:55 బొబ్బర్ల మొలకల పరాఠా సిద్ధంగా ఉంది.
05:59 ఒక పరాటాలో సుమారు 173 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది.
06:05 తరువాతి వంటకం మొలకెత్తిన కొమ్ముశనగల పొడి కూర.
06:09 ఈ రెసిపీ కోసం, మనకు అవసరమైనవి:
06:12 ¼ కప్పు కొమ్ముశనగల మొలకలు
06:15 1 కప్పు కడిగిన మెంతి ఆకులు
06:19 1 తరిగిన టమోటా మీడియంది
06:21 మరియు 1 తరిగిన ఉల్లిపాయ మీడియంది
06:25 మనకు ఇవి కూడా కావాలి:
06:27 ½ టీస్పూన్ పసుపు పొడి,
06:29 ½ టీస్పూన్ ఎర్ర కారం పొడి,
06:31 1 టేబుల్ స్పూన్ వేయించిన వేరుశెనగల పొడి,
06:35 1 టీస్పూన్ నూనె
06:37 మరియు రుచికి సరిపడా ఉప్పు
06:39 తయారీ విధానం:

మొలకెత్తిన కొమ్ముశనగలను 2 విజిల్స్ వచ్చే వరకు ప్రెజర్ కుక్ చేయండి.

06:45 ప్రెజర్ అంతా పోయేవరకు వేచి ఉండండి.
06:47 ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయండి,
06:49 అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేవరకు వాటిని వేయించాలి.
06:53 టమోటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు ఉడికించండి.
06:57 మెంతి ఆకులు కూడా వేసి 5 నిమిషాలు ఉడికించండి.
07:02 ఇప్పుడు మసాలాలు, ఉప్పు మరియు మొలకెత్తిన కొమ్ముశనగలు వేసి బాగా కలపాలి.
07:08 అందులో, వేరుశెనగ పొడి వేయండి
07:11 పాన్ పైన మూతపెట్టి 5 నుండి 10 నిమిషాలసేపు ఉడికించండి.
07:15 మొలకెత్తిన కొమ్ముశనగల పొడి కూర సిద్ధంగా ఉంది.
07:19 ½ కప్పు ఈ కూర లో 141 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది.
07:26 చివరి వంటకం తోటకూర ఆకుల వేపుడు.
07:30 ఈ రెసిపీ కోసం, మనకు అవసరమైనవి:
07:33 100 గ్రాముల కడిగిన తోటకూర ఆకులు,
07:36 వెల్లుల్లి 4 రెబ్బలు,
07:38 1 చిన్న ఉల్లిపాయ,
07:40 2 టేబుల్ స్పూన్ల తురిమిన కొబ్బరి,
07:43 2 పచ్చి మిరపకాయలు,
07:45 చిటికెడు పసుపు

మరియు రుచికి సరిపడా ఉప్పు.

07:49 మనకు 1 టీస్పూన్ నూనె కూడా కావాలి.
07:53 తయారీ విధానం:

ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయండి.

07:56 అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయండి
08:01 వాటిని రంగు మారేవరకు వేయించండి.
08:03 ఇప్పుడు తోటకూర ఆకులు వేసి బాగా కలపాలి.
08:07 దానిపైన మూత పెట్టేసి 5 నుండి 7 నిమిషాల సేపు ఉడికించండి.
08:12 ఉప్పు మరియు పసుపు వేసి 1 నిమిషం ఉడికించండి.
08:16 అందులో తురిమిన కొబ్బరి వేసి మరో 5 నిమిషాలు ఉడికించండి.
08:21 తోటకూర ఆకుల వేపుడు సిద్ధంగా ఉంది.
08:25 ఈ వేపుడు ½ కప్పులో 209 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది.
08:31 మంచి ఆరోగ్యం కోసం మీ రోజువారీ ఆహారంలో మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఈ వంటకాలను చేర్చండి.
08:37 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది

మాతో చేరినందుకు ధన్యవాదములు

Contributors and Content Editors

Simhadriudaya