Difference between revisions of "FrontAccounting-2.4.7/C2/Setup-in-FrontAccounting/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- | 00:01 | Setup in FrontAccounting పై ఈ ట్యుటోరియల్‌కు...")
 
(No difference)

Latest revision as of 22:50, 22 May 2020

Time
Narration
00:01 Setup in FrontAccounting పై ఈ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకునేవి: ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్
00:12 Setup టాబ్‌లోని వివిధ మాడ్యూల్స్
00:15 అలాగే, మనం వీటిని ఎలా చేయాలో నేర్చుకుంటాము: మన స్వంత సంస్థను లేదా కంపెనీ ని సృష్టించడం
00:21 క్రొత్త వినియోగదారుల ఖాతాలను (యూజర్ అకౌంట్స్) సెటప్ చేయడం
00:24 యాక్సెస్ పర్మిషన్ లను సెటప్ చేయడం మరియు

డిస్ప్లే( ప్రదర్శన)ను సెటప్ చేయడం.

00:29 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:

ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04

00:37 ఫ్రంట్ అకౌంటింగ్ 2.4.7
00:41 ఈ ట్యుటోరియల్‌ను అనుసరించడానికి మీకు హైయర్ సెకండరీ కామర్స్ పై అవగాహన మరియు అకౌంటింగ్ పరిజ్ఞానం ఉండాలి.
00:50 మీరు ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ లో పనిచేయడాన్ని ప్రారంభించడానికి ముందు XAMPP సర్వీసెస్ ను ప్రారంభించండి.
00:56 మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ ను తెరుద్దాం.
01:00 బ్రౌజర్‌ను తెరిచి, localhost స్లాష్ account అని టైప్ చేసి, Enter ను నొక్కండి.
01:07 login పేజీ కనిపిస్తుంది.
01:10 ఇన్స్టాలేషన్ సమయంలో, మనం అడ్మిన్ యూజర్ ను సృష్టించామని గుర్తుచేసుకోండి.
01:16 యూజర్ నేమ్ గా admin ను మరియు పాస్ వర్డ్ గా spoken ను టైప్ చేయండి.
01:22 తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి.
01:25 FrontAccounting విండో తెరుచుకుంటుంది.
01:28 ఫ్రంట్ అకౌంటింగ్‌లో ప్రామాణిక మాడ్యూల్స్ అందించబడ్డాయి.
01:32 మనం వీటిని గురించి నేర్చుకుంటాము

Sales Purchases (అమ్మకాలు కొనుగోళ్లు)

01:38 Items and Inventory (అంశాలు మరియు జాబితా)
01:40 బ్యాంకింగ్ అండ్ జనరల్ లెడ్జర్ మరియు సెటప్ మాడ్యూల్స్ గురించి రాబోయే ట్యుటోరియల్స్ లో నేర్చుకుంటాం.
01:47 ఫ్రంట్ అకౌంటింగ్ లోని Setup టాబ్‌తో మనం ప్రారంభిద్దాం.
01:51 Setup టాబ్‌ పై క్లిక్ చేయండి.

ఈ మాడ్యూల్ కంపెనీ సెట్టింగ్ కోసం ఉపయోగించబడుతుంది.

01:57 Company Setup లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా కొత్త సంస్థను లేదా కంపెనీ ను సృష్టిద్దాం.
02:04 డిఫాల్ట్ గా నేమ్ ఫీల్డ్ లో, మనం కంపెనీ యొక్కపేరును company - ST Company Pvt Ltd అని చూడవచ్చు,
02:12 ఇలా ఎందుకంటే మనం ఇన్స్టాలేషన్ సమయంలో ఈ పేరును ఇచ్చాము కనుక.
02:17 ఏదేమైనా, మీరు నివేదికలలో పేరు ఎలా కనిపించాలని అనుకుంటున్నారో దాని ఆధారంగా మీరు పేరును మార్చుకోవచ్చు.
02:23 నేను అదే పేరును ఉంచుతాను.

స్క్రోల్ చేయండి.

02:28 Home currency ఫీల్డ్‌లో, డ్రాప్‌డౌన్ మెనుపై క్లిక్ చేయండి
02:32 ఎంపికల యొక్క ఒక జాబితా కనిపిస్తుంది.
02:35 కానీ Indian Rupees అనేది ఈ జాబితాలో అందుబాటులో లేదు.
02:39 మన కంపెనీ భారతదేశంలో ఉన్నందున, మనం home currency ను Indian Rupees (భారతీయ రూపాయిల) కు సెటప్ చేస్తాము.
02:45 ఇక్కడ ఉన్న జాబితాకు కొత్త కరెన్సీ ని ఎలా జోడించాలో మనం నేర్చుకుందాం.
02:50 ఎగువన ఉన్న మెనూలోని Banking and General Ledger టాబ్ పై క్లిక్ చేయండి.
02:55 Maintenance ప్యానెల్ లో, Currencies లింక్ పై క్లిక్ చేయండి.

ఒక క్రొత్త విండో కనిపిస్తుంది.

03:03 Currency Abbreviation ఫీల్డ్ లో INR అని మరియు Currency Symbol ఫీల్డ్ లో Rs అని టైప్ చేయండి.
03:11 Currency Name ఫీల్డ్ లో Indian Rupees అని టైప్ చేయండి.
03:15 Hundredths Name ఫీల్డ్ లో Paise అని మరియు Country ఫీల్డ్ లో India అని టైప్ చేయండి.
03:23 ఇప్పుడు విండో యొక్క దిగువ బాదం వద్ద ఉన్న Add new బటన్ పై క్లిక్ చేయండి.
03:28 New currency has been added అనే ఒక విజయ సందేశాన్ని మనం చూడవచ్చు.
03:33 Company setup పేజీకి తిరిగి వెళ్దాం.

దీని కోసం, ఎగువన ఉన్న మెనూలోని Setup టాబ్‌పై క్లిక్ చేసి, ఆపై Company Setup లింక్‌పై క్లిక్ చేయండి.

03:43 తరువాత, కంపెనీ యొక్క అడ్రస్
03:47 నివాసం, ఫోన్ నం, ఇమెయిల్ అడ్రస్ మరియు Company GST నంబర్ లను

ఇక్కడ చూపిన విధంగా సంబంధిత ఖాళీలలో టైప్ చేయండి.

03:58 ఇప్పుడు, హోమ్ కరెన్సీ డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి.
04:02 Indian Rupees ను ఎంచుకోండి.
04:05 తరువాత మనం ఆర్థిక సంవత్సరం (ఫిసికల్ ఇయర్) గురించి నేర్చుకుంటాము.
04:09 అప్రమేయంగా మునుపటి ఆర్థిక సంవత్సరం, అనగా 1 st జనవరి నుండి 31 st డిసెంబర్ 2018 వరకు మూసివేయబడినట్లు చూపబడింది.
04:18 ఈ ట్యుటోరియల్ ని రికార్డ్ చేసే సమయంలో, తేదీ అనేది స్క్రీన్ పై చూపిన విధంగా ఉంది.
04:24 మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇది భిన్నంగా ఉండవచ్చు.
04:28 తేదీ ఫార్మాట్ అనేది MMDDYYYY లో ఉందని గమనించండి.
04:35 ఆర్థిక సంవత్సరం (ఫిసికల్ ఇయర్) అంటే ఏమిటి?
04:37 ఇది ఒక కంపెనీ అకౌంటింగ్ ప్రయోజనాల కొరకు మరియు ఆర్థిక నివేదికలను తయారుచేయడం కొరకు ఉపయోగించే కాలం.

ఇది వేర్వేరు దేశాలలో మారుతూ ఉంటుంది.

04:47 Fiscal Year setup (ఆర్థిక సంవత్సరాన్ని సెటప్ చేయడం)

ఫ్రంట్ అకౌంటింగ్ లో కొత్త కంపెనీ ని సృష్టించేటపుడు, Fiscal Year ని (ఆర్థిక సంవత్సరాన్ని )సరిగ్గా అమర్చాలి.

04:56 అప్రమేయంగా, ఫ్రంట్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ అనేది fiscal year ని (ఆర్థిక సంవత్సరాన్ని) జనవరి నుండి డిసెంబర్ వరకు చూపిస్తుంది.
05:03 ఇది భారతదేశంలోని కంపెనీలకు మరియు సంస్థలకు తగినది కాదు.
05:08 మనము ఆ fiscal year (ఆర్థిక సంవత్సరం) కొరకు 1 st ఏప్రిల్ నుండి 31 st మార్చి వరకు fiscal year (ఆర్థిక సంవత్సరాన్ని) ను ఏర్పాటు చేయాలి.
05:15 ఇది ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం.
05:19 మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి వెళ్దాం.
05:23 ఎంట్రీలను సేవ్ చేయడానికి క్రిందికి స్క్రోల్ చేసి, Update బటన్ పై క్లిక్ చేయండి.
05:28 మనం Company setup has been updated అనే ఒక సందేశాన్ని చూడవచ్చు.
05:33 ఇప్పుడు, మనం Fiscal Year (ఆర్థిక సంవత్సరాన్ని) ని ప్రస్తుత Financial Yearకి (ఆర్థిక సంవత్సరానికి) మారుస్తాము.
05:38 ఫ్రంట్ అకౌంటింగ్ యొక్క Setup టాబ్ పై క్లిక్ చేయండి.
05:42 Fiscal Years లింక్ పై క్లిక్ చేయండి.
05:45 అప్రమేయంగా Fiscal Year (ఆర్థిక సంవత్సరం) అనేది 01 జనవరి 2018 నుండి 31 డిసెంబర్ 2018 వరకు ప్రారంభమవుతుందని మనం చూడవచ్చు.
05:55 కనుక మొదట, మనం 01 జనవరి 2019 నుండి 31 మార్చి 2019 వరకు 3 నెలల డమ్మీ (నకిలీ) కాలాన్ని సృష్టిస్తాము.
06:05 డమ్మీ (నకిలీ) కాలం ఎందుకు? ఇది ఎందుకంటే, Fiscal Year (ఆర్థిక సంవత్సరం) అంటే జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు మరియు ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఉన్నFinancial Year (ఆర్థిక సంవత్సరం) కి మధ్యనున్న అంతరాన్ని మనం పూరించాలి కనుక.
06:20 మీరు ఈ ట్యుటోరియల్ ని సాధన చేస్తున్నప్పుడు మీరు వేరే ఆర్థిక సంవత్సరంలో ఉండవచ్చు.
06:25 అటువంటి సందర్భంలో,మీరు ప్రస్తుత financial year (ఆర్థిక సంవత్సరం) వరకు ఉన్న మునుపటి అన్ని సంవత్సరాల కొరకు fiscal year ( ఆర్థిక సంవత్సరం) ను ఏర్పాటు చేయాలి.
06:33 మీ అవగాహన కోసం ఇక్కడ ఒక నమూనా చూపబడింది.
06:38 మొదట, 3 నెలల డమ్మీ (నకిలీ) కాలాన్ని 01 జనవరి 2019 నుండి 31 మార్చి 2019 వరకు ఎంచుకోండి.
06:47 ఇప్పుడు, Add New బటన్ పై క్లిక్ చేయండి.
06:51 dummy period సృష్టించబడినట్లు మనం చూడవచ్చు.
06:53 New Fiscal year has been added అని ఒక సందేశం కనిపిస్తుంది
06:58 అప్పుడు, ప్రస్తుత financial year (ఆర్థిక సంవత్సరం) ను 1 ఏప్రిల్ 2019 నుండి 31 మార్చి 2020 వరకు మనం చూడవచ్చు.
07:07 ప్రస్తుత financial year (ఆర్థిక సంవత్సరాన్ని) ను మనం అకౌంటింగ్ ప్రయోజనాల కొరకు ఉపయోగిస్తున్నందున Is closed ఎంపికను No గా ఉంచండి.
07:15 మళ్ళీ, Add New బటన్ పై క్లిక్ చేయండి.
07:19 ఇక్కడ, మీరు financial year (ఆర్థిక సంవత్సరం) సృష్టించబడిందని చూడవచ్చు.
07:24 2018 జనవరి 1 నుండి 2018 డిసెంబర్ 31 వరకు ఉన్నfiscal year (ఆర్థిక సంవత్సరం) మూసివేసినట్లుగా మనం చూడవచ్చు.
07:32 మనము 1 st జనవరి 2019 నుండి 31 మార్చి 2019 వరకు డమ్మీ (నకిలీ) కాలాన్ని సృష్టించాము.
07:39 మనము Is Closed ఎంపికను Yes అని మారుస్తాము.

Edit icon పై క్లిక్ చేయండి

07:46 Is Closed డ్రాప్ డౌన్ మెనులో, Yes. ను ఎంచుకోండి.
07:50 ఒకవేళ మునుపటి financial years (ఆర్థిక సంవత్సరాలు) అవసరం లేకపోతే వాటిని మూసివేయడానికి అవే దశలను పునరావృతం చేయండి.
07:57 Update బటన్ పై క్లిక్ చేయండి.
08:00 Selected fiscal year has been updated అనే ఒక సందేశం కనిపిస్తుంది.
08:05 అదేవిధంగా మీరు మార్పులను చేయడానికి Edit బటన్‌ను ఉపయోగించవచ్చు
08:10 cross (X) sign సంవత్సరాన్ని తొలగించడం కొరకు

ప్రస్తుతం, మనము ఏ అడ్డు వరుసలను తొలగించము.

08:17 ఇప్పుడు, ఈ మార్పులను Company setup లో update చేయాల్సిన అవసరం ఉంది.
08:22 Setup టాబ్ పై క్లిక్ చేయండి.

తరువాత Company Setup లింక్ పై క్లిక్ చేయండి.

08:28 fiscal year (ఆర్థిక సంవత్సరం) ఫీల్డ్ లో,డ్రాప్-డౌన్ మెనుపై క్లిక్ చేయండి.
08:32 active గా చూపించబడుతున్న ప్రస్తుత Financial Year (ఆర్థిక సంవత్సరం) 1 st ఏప్రిల్ 2019 నుండి 31sup> st </sup> మార్చి 2020 వరకు ఎంచుకోండి.
08:41 స్క్రోల్ చేసి Login Timeout ఎంపికకు వెళ్ళండి.
08:46 మనము 6 లక్షల సెకన్లకు పెంచుతాము, దానివల్ల తరచుగా logout లేదా timeout లు రాకుండా నివారించవచ్చు.
08:53 Update బటన్ పై క్లిక్ చేయండి.
08:56 తరువాత మనం User Accounts (వినియోగదారుల ఖాతాలను) ను సెటప్ చేస్తాము.
09:00 మళ్ళీ Setup టాబ్ పై క్లిక్ చేయండి.
09:03 User Accounts Setup లింక్‌పై క్లిక్ చేయండి.
09:06 admin user login యొక్క సమాచారం Full Name, Email, Access Level, మొదలైనటువంటివాటిని మనం చూడవచ్చు
09:15 ఇన్స్టాలేషన్ సమయంలో ఈ సమాచారం ఎంటర్ చేయబడిందని గుర్తుచేసుకోండి. మనం ఒక కొత్త user login ను సృష్టిద్దాం.
09:22 ఇక్కడ చూపిన విధంగా నేను క్రొత్త యూజర్ వివరాలను టైప్ చేసాను.

అదేవిధంగా, మీ క్రొత్త యూజర్ వివరాలను ఎంటర్ చేయండి.

09:30 Access Level field ఫీల్డ్ లో డ్రాప్-డౌన్ మెనుపై క్లిక్ చేసి, Sub Admin ను ఎంచుకోండి.
09:36 Language field లో, అప్రమేయంగా, డ్రాప్-డౌన్ మెను ఎంపిక అనేది English.
09:42 ఇక్కడ, POS అంటే Point of Sale.

మేము డిఫాల్ట్ ఎంపికను ఉంచుతాము.

09:49 Printing option డ్రాప్ డౌన్ మెను లో, డిఫాల్ట్ ఎంపిక Browser printing support ను ఉంచండి.
09:56 తరువాత, అప్రమేయంగా, reports ఎంపిక కొరకు popup విండో కొరకు చెక్ బాక్స్ తనిఖీ చేయబడుతుంది.
10:03 Add new బటన్ పై క్లిక్ చేయండి.

A new user has been added అనే సందేశాన్ని మనం చూడవచ్చు.

10:10 కొత్త యూజర్ అడ్మిన్ క్రిందన ఉన్న ప్యానెల్‌లో జోడించబడిందని కూడా మనం చూడవచ్చు.
10:16 మళ్ళీ, Setup టాబ్ పై క్లిక్ చేయండి.
10:20 తరువాత మనం Access setup ను చూద్దాం.
10:23 Role డ్రాప్-డౌన్ మెనుపై క్లిక్ చేసి, Sub Admin ను ఎంచుకోండి.
10:28 ఉపయోగించడం కొరకు Sub Admin కు డిఫాల్ట్ access ఇవ్వబడింది మనం చూడవచ్చు.

స్క్రోల్ చేయండి.

10:35 సబ్ అడ్మిన్ కోసం అందుబాటులో ఉన్న అనుమతులను మనం చూడవచ్చు.
10:39 సబ్ అడ్మిన్ ఉపయోగించడం కొరకు అవసరమైన బాక్సులను మీరు కూడా చెక్ చేయవచ్చు లేదా అన్‌చెక్ చేయవచ్చు.
10:46 తరువాత Save Role బటన్ పై క్లిక్ చేయండి.
10:49 Security role has been updated అనే ఒక సందేశం కనిపిస్తుంది.
10:54 అదేవిధంగా, మీరు మీ అవసరానికి అనుగుణంగా కొందరు యూజర్ లను సృష్టించవచ్చు మరియు వారికి అవసరమైన అనుమతులు ఇవ్వవచ్చు.
11:01 మళ్ళీ, Setup టాబ్ పై క్లిక్ చేసి, ఆపై Display Setup లింక్ పై క్లిక్ చేయండి.
11:07 Display Setup అనేది Decimal Places (దశాంశ స్థానాలు),Date format and Separators (తేదీ ఆకృతి మరియు సెపరేటర్లు), ఇతర parameters(పారామితులను) ను మార్చడానికి ఉపయోగించబడుతుంది.
11:16 Prices/amounts (ధరలు /మొత్తాలు), Quantities (పరిమాణాలు),Exchange rate (మారకపు రేటు )మరియు Percentages (శాతాలు) కొరకు Decimal Places (దశాంశ స్థానాల) సంఖ్యను మనం చూడవచ్చు.
11:27 డ్రాప్-డౌన్ మెనుని ఎంచుకోవడం ద్వారా మనం డేట్ ఫార్మాట్ మరియు డేట్ సెపరేటర్స్ ను మార్చవచ్చు.
11:33 మనం Date format ను DDMMYYYY కు మారుస్తాము.
11:41 మనం వివిధ ఇతర సెట్టింగులను (Miscellaneous Settings) కూడా చూడవచ్చు.
11:45 మార్పులను సేవ్ చేయడానికి అప్‌డేట్ బటన్ పై క్లిక్ చేయండి..
11:49 Display settings have been updated అనే ఒక సందేశాన్ని మనం చూడవచ్చు.
11:54 ఇప్పుడు మనం fiscal year (ఆర్థిక సంవత్సరం) date format ను తనిఖీ చేస్తాము.

Setup tab కు వెళ్ళండి.

12:01 Company Setup ప్యానల్ క్రింద, fiscal year (ఆర్థిక సంవత్సరం) లింక్ పై చేయండి.
12:06 date format అనేది DDMMYYYY ఫార్మాట్ కు మార్చబడిందని మనం చూడవచ్చు.
12:14 గుర్తుచేసుకోండి, ప్రారంభంలో మనం fiscal year (ఆర్థిక సంవత్సరాన్ని) ను జోడించినప్పుడు అది MMDDYYYY ఫార్మాట్.
12:23 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది. సారాంశం చూద్దాం.
12:28 ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకున్నవి

ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ మరియు Setup టాబ్‌లోని వివిధ మాడ్యూల్స్

12:36 అలాగే, మనం వీటిని ఎలా చేయాలో నేర్చుకున్నాం: మన స్వంత సంస్థను లేదా కంపెనీ ని సృష్టించడం
12:42 వినియోగదారుల ఖాతాలను (యూజర్ అకౌంట్స్) సెటప్ చేయడం

యాక్సెస్ పర్మిషన్ లను సెటప్ చేయడం మరియు డిస్ప్లే( ప్రదర్శన)ను సెటప్ చేయడం.

12:50 ఒక అసైన్మెంట్ గా,యూజర్ అకౌంట్స్ సెటప్ ను ఉపయోగించి ఒక కొత్త యూజర్ ను జోడించండి.
12:55 ఒక అకౌంటెంట్ గా యాక్సెస్ లెవెల్ ను ఇవ్వండి.
12:59 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది. దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
13:06 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

13:15 దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
13:19 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
13:24 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya