Difference between revisions of "FrontAccounting-2.4.7/C2/Installation-of-FrontAccounting-on-Windows-OS/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | విండోస్ OS పై FrontAccounting యొక్క ఇన్‌స్టాలేషన్ అను...")
 
(No difference)

Latest revision as of 22:41, 22 May 2020

Time Narration
00:01 విండోస్ OS పై FrontAccounting యొక్క ఇన్‌స్టాలేషన్ అను స్పోకన్ ట్యుటోరియల్‌కు మీకు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్‌లో, మనం XAMPP ని ఇన్‌స్టాల్ చేయడం
00:12 ఫ్రంట్ అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేయడం
00:15 డేటాబేస్ సెటప్ ను చేయడం మరియు

విండోస్ OS లో ఫ్రంట్ అకౌంటింగ్ ను ఇన్స్టాల్ చేయడం.

00:21 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:

విండోస్ OS వర్షన్ 10

00:26 XAMPP 5.5.19 ద్వారా పొందిన Apache, MySQL మరియు PHP
00:32 ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7
00:36 Firefox వెబ్ బ్రౌజర్ మరియు పనిచేస్తున్న ఒక ఇంటర్నెట్ కనెక్షన్.
00:41 మీరు మీకు నచ్చిన ఏ ఇతర వెబ్ బ్రౌజర్ ని అయినా ఉపయోగించవచ్చు.
00:44 ఫ్రంట్ అకౌంటింగ్ అనేది ఒక సర్వర్ ఆధారిత అకౌంటింగ్ సిస్టమ్ (వ్యవస్థ).

కనుక మనం మన మెషీన్లో వెబ్ సర్వర్ ను సెటప్ చేయడానికి XAMPP ను ఉపయోగిస్తాము.

00:52 ఒక వెబ్ బ్రౌజర్‌ ను తెరవండి.

అడ్రస్ బార్ లో, ఈ URL ను టైప్ చేసి, Enter నొక్కండి.

00:59 ఇది మనల్ని XAMPP డౌన్‌లోడ్ పేజీకి తీసుకెళుతుంది.
01:03 ఇక్కడ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌ల కొరకు డౌన్‌లోడ్ చేయడానికి XAMPP అందుబాటులో ఉంటుంది.
01:08 ఈ ఆకుపచ్చ బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా XAMPP యొక్క లేటెస్ట్ (తాజా) వర్షన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
01:13 ఏదేమైనా, మీ సాఫ్ట్‌వేర్ అవసరాన్ని బట్టి, మీకు XAMPP యొక్క వేరే వర్షన్ అవసరం కావచ్చు.
01:19 నా విషయంలో నాకు XAMPP వర్షన్ 5.5.19 అవసరం.
01:24 XAMPP విండోస్ లింక్ పై క్లిక్ చేయండి.
01:28 తిరిగి మళ్లించబడిన పేజీ ఇప్పటి వరకు ఉన్న అన్ని XAMPP వర్షన్ లను ప్రదర్శిస్తుంది.
01:32 ఈ ఇన్‌స్టాలేషన్ కొరకు, నేను 'XAMPP వర్షన్ 5.5.19 ను ఎంచుకుంటాను.
01:39 డౌన్ లోడ్ చేయడానికి లింక్ పై క్లిక్ చేయండి.
01:43 ఇప్పుడు, Savefile బటన్ పై క్లిక్ చేయండి.

Exe ఫైల్ మన మెషీన్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.

01:51 మీరు ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసిన ఫోల్డర్‌ను తెరవండి.
01:55 ఇన్‌స్టాలేషన్ ను ప్రారంభించడానికి ఫైల్‌పై డబుల్ క్లిక్ చేయండి.
01:59 ఒక User Account Control డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.

Yes బటన్ పై క్లిక్ చేయండి.

02:06 ఒకవేళ మీరు మీ మెషీన్‌లో ఏదైనా antivirus సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే, మీకు మరొక పాపప్ విండో రావొచ్చు.

Yes బటన్ పై క్లిక్ చేయండి.

02:15 తరువాతి విండోలో, వార్నింగ్ మెసెజ్ ను విస్మరించడానికి OK బటన్ పై క్లిక్ చేయండి.
02:21 ఇప్పుడు Setup wizard డైలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది.
02:25 ప్రాంప్ట్ చేయబడినపుడల్లా Next బటన్ పై క్లిక్ చేసి, చూపిన విధంగా ఇన్స్టాలేషన్ దశలను అనుసరించండి.
02:31 Learn more about Bitnami for XAMPP చెక్ బాక్స్ ను అన్ చెక్ చేయండి.

తరువాత Next బటన్ పై క్లిక్ చేయడం ద్వారా కొనసాగించండి.

02:40 ఒకసారి ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, want to start the Control Panel now? చెక్ బాక్స్‌ను అన్ చెక్ చేయండి.
02:47 చివరగా, Finish బటన్ పై క్లిక్ చేయండి.
02:51 ఇప్పుడు మనం మన మెషీన్ లో XAMPP విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడిందా లేదా అని తనిఖీ చేయాలి.
02:56 స్క్రీన్ యొక్క దిగువ ఎడమ వైపున ఉన్నWindows search bar పై క్లిక్ చేసి, xampp అని టైప్ చేయండి.
03:02 మనము సర్చ్ లిస్ట్ లో XAMPP Control Panel ను చూడవచ్చు.
03:06 XAMPP Control Panel పై రైట్ క్లిక్ చేసి, Run as administrator ను ఎంచుకోండి.
03:12 XAMPP Control Panel లో, Apache మరియు MySQL సర్వీస్ లు రన్ అవుతున్నాయని నిర్ధారించుకోండి.
03:18 ఒకవేళ లేకపోతే, సంబంధిత services యొక్క బటన్ పై క్లిక్ చేసి ఈ సర్వీస్ లను ప్రారంభించండి.
03:24 మీరు ఇటువంటి కొన్ని ఎర్రర్ మెసేజ్ లను పొందవచ్చు:

Apache shutdown unexpectedly

03:30 Port 80 in use for Apache Server
03:34 Unable to connect to any of the specified MySQL hosts for MySQL database.
03:41 ఇలా జరగటానికి కారణం ఏంటంటే, Apache మరియు MySQL కు కేటాయించిన డిఫాల్ట్ port అనేది మరొక సాఫ్ట్‌వేర్ ద్వారా తీసుకోబడ్డాయి.
03:47 Apache కొరకు port డిఫాల్ట్ నంబర్ అనేది 80 మరియు MySQL కొరకు అది 3306.
03:55 ఈ ports ను మార్చడానికి, ఈ ట్యుటోరియల్ యొక్క Additional Reading Material ను చూడండి.
04:00 ఇంకా ముందుకు కొనసాగే ముందు సరైన port సంఖ్యలను కేటాయించండి. ఉదాహరణకు: 8080
04:07 ఇప్పుడు, Firefox web browser ను తెరవండి.
04:11 address bar లో,localhost అని టైప్ చేసి, Enter ను నొక్కండి.

మనం XAMPP స్క్రీన్ ను చూడగలగాలి.

04:19 ఒకవేళ భాషా ఎంపిక కోసం ప్రాంప్ట్ చేయబడితే, English ను ఎంచుకోండి.

ఇప్పు మనం XAMPP homepage లో ఉన్నాము.

04:27 మనం FrontAccounting ను డౌన్‌లోడ్ చేయడం ప్రారంభిద్దాం.
04:30 వెబ్ బ్రౌజర్ లో మరొక టాబ్ ను తెరిచి, ఈ URL కి వెళ్ళండి.
04:37 frontaccounting-2.4.7.zip పై క్లిక్ చేయండి.
04:42 వెంటనే, డౌన్‌లోడ్ ప్రారంభమవుతుంది.

Save file బటన్ పై క్లిక్ చేసి, ఆపై OK బటన్ పై క్లిక్ చేయండి.

04:49 డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత, మీరు ఫైల్‌ను ఎక్కడ డౌన్‌లోడ్ చేసారో ఆ ఫోల్డర్‌ను తెరవండి.
04:54 నేను డౌన్‌లోడ్ చేసిన ఫైల్ ఇక్కడ ఉంది.
04:57 ఫైల్ పై రైట్ -క్లిక్ చేసి Extract Here ను ఎంచుకోండి.
05:01 ఒకసారి ఎక్స్ట్రాక్ట్ అయిన తరువాత, ఎక్స్ట్రాక్ట్ అయిన FrontAccounting ఫోల్డర్ కు నేను account గా పేరు ను మారుస్తాను.
05:07 ఫోల్డర్ పేరు ను మార్చడం అనేది ఐచ్ఛికం, అయితే

ఒక మెషీన్ పై ఇన్‌స్టాల్ చేయబడిన FrontAccounting యొక్క బహుళ సందర్భాలను గుర్తించడానికి ఇది సహాయపడుతుంది.

05:17 ఇప్పుడు మనం ఈ account ఫోల్డర్‌ను apache home directory లోకి తరలించాలి.
05:22 root directory కొరకు పాత్ అనేది c:\xampp\htdocs
05:29 account ఫోల్డర్ పై రైట్ -క్లిక్ చేసి Copy ను ఎంచుకోండి.
05:33 ఎడమవైపు పేన్‌లో, This PC పై క్లిక్ చేయండి, దీనిని My Computer అని కూడా పిలుస్తారు.
05:39 తరువాత Local Disk (C :) పై డబుల్ క్లిక్ చేయండి, అంటే C drive పైన

ఇంకా xampp మరియు htdocs కు వెళ్ళండి.

05:47 Htdocs లోపల, ఖాళీ స్థలంపై రైట్ -క్లిక్ చేసి, Paste ను ఎంచుకోండి.
05:53 మనం XAMPP సర్వర్‌ను విజయవంతంగా ఇన్‌స్టాల్ చేసాము.
05:57 FrontAccounting installer అనేది వెబ్ సర్వర్ యొక్క రూట్ డైరక్టరీ లో ఉందని నిర్ధారించుకోండి.
06:02 తరువాత ముందుకు కోనసాగడానికి మనం FrontAccounting కొరకు ఒక database ను సృష్టించాలి.
06:07 మనము దీన్ని phpmyadmin లో చేస్తాము, ఇది MySQL కొరకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్.

ఇది XAMPP ఇన్స్టాలేషన్ తో పాటు వస్తుంది.

06:17 మనం వెబ్ బ్రౌజర్ లోని XAMPP పేజీకి తిరిగి వెళ్దాం.
06:21 XAMPP పేజీపై, ఎడమ వైపున ఉన్న మెనులో, phpMyadmin పై క్లిక్ చేయండి.
06:27 ఎగువ భాగంలో మెనూలోని Users పై క్లిక్ చేసి, ఆపై Add User పై క్లిక్ చేయండి.
06:33 తెరుచుకున్న క్రొత్త విండోలో మీకు నచ్చిన ఒక username ను ఎంటర్ చేయండి.

నేను నా username గా frontacc ను టైప్ చేస్తాను.

06:42 Host డ్రాప్-డౌన్ జాబితా నుండి, Local ను ఎంచుకోండి.
06:46 పాస్‌వర్డ్ టెక్స్ట్-బాక్స్‌లో మీకు నచ్చిన పాస్‌వర్డ్ ను ఎంటర్ చేయండి.
06:50 నేను నా పాస్ వర్డ్ గా admin123 ను టైప్ చేస్తాను.
06:54 Re-type టెక్స్ట్ బాక్స్ లో అదే పాస్ వర్డ్ ను టైప్ చేయండి.
06:58 ప్రస్తుతానికి Generate Password prompt పై క్లిక్ చేయవద్దు.
07:02 Database for user account క్రింద, మనం ఈ ఎంపికను చూడవచ్చు.

Create database with the same name and grant all privileges.

07:10 మనము ఆ ఎంపికను తనిఖీ చేసి స్క్రోల్ చేస్తాము.
07:14 తరివాత పేజీ యొక్క కుడి దిగువ కుడి వైపున ఉన్నGo బటన్ ను క్లిక్ చేయండి.
07:18 మనం You have added a new user అనే ఒక సందేశాన్ని చూస్తాము.
07:22 frontacc అనే పేరుతో మరియు ఒక user frontacc తో ఒక కొత్త database సృష్టించబడింది అని దీని అర్థం.
07:29 ఈ username మరియు password అనేవి డేటాబేస్ లాగిన్ ప్రయోజనం కొరకు మాత్రమే.
07:34 ఈ username, password మరియు database పేర్లను రాసిపెట్టుకోండి.
07:38 FrontAccounting ఇన్‌స్టాలేషన్‌ను పూర్తి చేయడానికి ఇవి తరువాత అవసరం అవుతాయి.
07:43 Database పేరు మరియు username ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు.

వేర్వేరు పేర్లను కలిగి ఉండటానికి, మొదట డేటాబేస్ ను సృష్టించండి, ఆపై ఆ డేటాబేస్ కోసం ఒక యూజర్ ను సృష్టించండి.

07:53 అలాగే, పేరును పెట్టే పద్దతి ప్రకారం, username అనేది మధ్యలో ఎటువంటి ఖాళీలను కలిగి ఉండకూడదు.
07:59 ఇప్పుడు మనకు రన్ అవుతున్న XAMPP ఉంది ఇంకా మన డేటాబేస్ సిద్ధంగా ఉంది.
08:02 ఇప్పుడు మనం Front Accounting ను ఇన్స్టాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము.
08:07 web browser లో ఒక కొత్త ట్యాబ్ ను తెరవండి.

అడ్రస్ బార్ లో localhost/account అని టైప్ చేసి Enter నొక్కండి.

08:17 Step 1: System Diagnostics అని చూపించే FrontAccounting వెబ్ పేజీని మనం చూడవచ్చు
08:22 Select install wizard language అనేది English అని నిర్ధారించుకోండి.
08:26 స్క్రోల్ చేసి పేజీ యొక్క దిగువభాగం వద్ద ఉన్న Continue బటన్ పై క్లిక్ చేయండి.
08:31 తదుపరి వెబ్ పేజీ యొక్క శీర్షిక అనేది Step 2: Database Server Settings
08:37 ఇక్కడ నేనుServer Host ను లోకల్ హోస్ట్‌గా ఉంచుతాను

నేను server port ను ఖాళీగా ఉంచుతాను.

08:44 ఒకవేళ మీరు MySQL డిఫాల్ట్ port సంఖ్యను 3306 కాకుండా మార్చినట్లయితే, అప్పుడు ఆ port సంఖ్యను ఇక్కడ ఎంటర్ చేయండి.
08:52 మనము ఇంతకుముందు సృష్టించిన కింది వివరాలను ఎంటర్ చేయండి

database Name ను frontacc గా

09:00 database user ను frontacc గా
09:03 database password ను admin123 గా
09:07 మిగిలిన ఎంపికలను విస్మరించి, దిగువభాగం వద్ద ఉన్న Continue బటన్ పై క్లిక్ చేయండి.
09:12 తరువాత, మీరు మీ స్వంత కంపెనీ వివరాలను ఉంచాలి.

అది ఎలా చేయాలో నేను ప్రదర్శిస్తాను.

09:19 Company Name ఫీల్డ్ లో, నేను ST Company Pvt Ltd అని టైప్ చేస్తాను
09:24 నేను Admin Login ను admin గా ఉంచుతాను.

తరువాత నేను Admin password గా spoken ను టైప్ చేస్తాను.

09:31 మీరు మీకు నచ్చిన ఏ పాస్ వర్డ్ ని అయినా ఇవ్వవచ్చు.
09:34 అదే పాస్‌వర్డ్ ను మళ్ళీ ఎంటర్ చేయండి.

ఇది లాగిన్ పాస్వర్డ్ అని గుర్తుంచుకోండి.

09:40 తరువాత మనం Charts of Accounts కొరకు రెండు ఎంపికలను చూస్తాము.
09:44 నేను Standard new company American COA ను ఎంచుకుంటాను.
09:49 Default Language గా English ను ఎంచుకోండి.
09:52 Install బటన్ పై క్లిక్ చేయండి.
09:55 మనం మన స్క్రీన్ పైన FrontAccounting ERP విజయవంతంగా ఇన్స్టాల్ చేయబడింది అనే చివరి సందేశాన్ని చూడవచ్చు.

ఇది మన ఇన్‌స్టాలేషన్ విజయవంతమైందని నిర్ధారిస్తుంది.

10:06 ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు లాగిన్ అవ్వడానికి Click here to start లింక్ పై క్లిక్ చేయండి.
10:12 లాగిన్ స్క్రీన్‌లో, కింది వివరాలను ఎంటర్ చేయండి:

User name గా admin Password గా spoken

10:22 Company గా ST Company Pvt. Ltd.

Login బటన్ పై క్లిక్ చేయండి.

10:28 మనం Front Accounting Administration పేజీకి తీసుకెళ్ళబడతాము.


10:32 ఈ పేజీలో మనం వివిధ ట్యాబ్‌లను చూడవచ్చు.

వీటిల్లో చాలావాటిని ఎలా ఉపయోగించాలి అనేది ఈ సిరీస్‌లో తరువాత మనం నేర్చుకుంటాము.

10:39 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.

సారాంశం చూద్దాం.

10:44 ఈ ట్యుటోరియల్‌లో, మనం నేర్చుకున్నవి XAMPP ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం.
10:50 FrontAccounting సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయడం.
10:53 Windows 10 OS లో database setup ను చేయడం.
10:57 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

11:05 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

11:13 ఈ స్పోకెన్ ట్యుటోరియల్‌లో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయా?

దయచేసి ఈ సైట్‌ను సందర్శించండి.

11:18 మీకు ఎక్కడ సందేహం ఉందో ఆ నిమిషం మరియు క్షణాన్ని ఎంచుకోండి

మీ ప్రశ్నను క్లుప్తంగా వివరించండి మా టీం లోని వారు ఎవరైనా వాటికి సమాధానాలు ఇస్తారు.

11:27 ఈ ట్యుటోరియల్ పై నిర్దిష్ట ప్రశ్నల కొరకు స్పోకన్ ట్యుటోరియల్ ఫోరమ్
11:32 దయచేసి వాటిపై సంబంధంలేని మరియు సాధారణ ప్రశ్నలను పోస్ట్ చేయవద్దు.

ఇది అనవసరమైన వాటిని తగ్గించడానికి సహాయపడుతుంది.

11:39 తక్కువ అయోమయంతో, మనం ఈ చర్చను బోధనా సమాచారంగా ఉపయోగించవచ్చు.
11:44 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
11:49 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya