Difference between revisions of "FrontAccounting-2.4.7/C2/Banking-and-General-Ledger-in-FrontAccounting/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 |'''Time''' |'''Narration''' |- |00:01 | ఫ్రంట్ అకౌంటింగ్‌లో Banking and General Ledger పై ఈ స్పోకన్ ట...")
 
(No difference)

Latest revision as of 22:52, 22 May 2020

Time Narration
00:01 ఫ్రంట్ అకౌంటింగ్‌లో Banking and General Ledger పై ఈ స్పోకన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
0:07 ఈ ట్యుటోరియల్‌లో, మనం వీటిని సృష్టించడం నేర్చుకుంటాము

General Ledger Classes (జనరల్ లెడ్జర్ క్లాసులు)

00:13 General Ledger Groups (జనరల్ లెడ్జర్ గ్రూప్ లు)

General Ledger Accounts (జనరల్ లెడ్జర్ అకౌంట్ లు).

00:18 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి, నేను ఉపయోగిస్తున్నవి:

ఉబుంటు లైనక్స్ OS వర్షన్ 16 .04

00:26 ఫ్రంట్ అకౌంటింగ్ వర్షన్ 2.4.7
00:30 ఈ ట్యుటోరియల్‌ని అభ్యసించడానికి, మీకు వీటిపై అవగాహన ఉండాలి: హయ్యర్ సెకండరీ కామర్స్ మరియు అకౌంటింగ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్కీపింగ్ (జమ ఖర్చుల లెక్కలు వ్రాసే విధానం)
00:40 మరియు మీరు FrontAccounting లో ఇప్పటికే ఒక సంస్థను లేదా ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఉండాలి.
00:46 ఒకవేళ లేకపోతే, సంబంధిత ఫ్రంట్ అకౌంటింగ్ ట్యుటోరియల్స్ కొరకు దయచేసి ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
00:52 మీరు ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ లో పనిచేయడాన్ని ప్రారంభించడానికి ముందు XAMPP సర్వీసెస్ ను ప్రారంభించండి.
00:58 మనం ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ ను తెరుద్దాం.
01:01 బ్రౌజర్‌ను తెరిచి, localhost స్లాష్ account అని టైప్ చేసి, Enter ను నొక్కండి.
01:09 login పేజీ కనిపిస్తుంది.
01:12 యూజర్ నేమ్ గా admin ను మరియు పాస్ వర్డ్ ను టైప్ చేయండి.

తరువాత Login బటన్ పై క్లిక్ చేయండి.

01:20 ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్ఫేస్ తెరుచుకుంటుంది.
01:23 Banking and General Ledger ట్యాబ్ పై క్లిక్ చేయండి.
01:27 Maintenance ప్యానెల్‌లో మనం ఈ ఎంపికలను చూడవచ్చు:

GL Accounts

01:33 GL Account Groups మరియు

GL Account Classes

01:38 మనము ఏదైనా లావాదేవీతో (ట్రాంజక్షన్) ప్రారంభించడానికి ముందు, మనము Charts of Accounts ను సెట్ చేయాలి.
01:43 FrontAccounting లో Charts of Accounts అనేది టైప్, క్లాస్, గ్రూప్

మరియు అకౌంట్ ద్వారా నిర్వచించబడింది.

01:50 అన్ని transactions ఒక Account, Group మరియు Classes కు వసూలు (చార్జ్) చేయబడతాయి.
01:56 reporting purposes కొరకు group transactions కు వీటిని ఉపయోగిస్తారు.
02:00 ఫ్రంట్ అకౌంటింగ్ లో, Account అనేది ఒక గ్రూప్ కు సంబందించినది మరియు Group అనేది ఒక Class కు సంబందించినది.
02:06 ఇది Account Group ప్రకారం Balance Sheet మరియు Profit and Loss account statements లో ప్రతిబింబిస్తుంది.
02:13 ఫ్రంట్ అకౌంటింగ్ ఇంటర్‌ఫేస్‌కు తిరిగి మారండి.
02:17 మొదటి దశ అనేది General Ledger Account Classes ను సెట్ చేయడం.
02:22 Maintenance ప్యానెల్‌లోని GL Account Classes లింక్‌పై క్లిక్ చేయండి.
02:27 ఇక్కడ, అప్రమేయంగా Class Name మరియు Class Type అనేవి ఇలా నిర్వచించబడ్డాయి:

Assets (ఆస్తులు), Liabilities (బాధ్యతలు), Income (ఆదాయం) మరియు Expense (ఖర్చు).

02:38 అలాగే, ప్రతి Class Type కొరకు Class ID సెట్ చేయబడిందని మనం చూడవచ్చు.
02:44 Account Group ను సెట్ చేయడానికి ముందు మనం ఈ class ను సెట్ చేయాలి.
02:49 ఇప్పుడు మనం ఒక కొత్త class ను ఎలా జోడించాలో చూస్తాము.
02:53 Class ID ఫీల్డ్‌లో, 5 ని టైప్ చేయండి. Class ID అనేది ఒక ప్రత్యేక విలువగా ఉండాలి.
03:00 Class Name ఫీల్డ్‌లో, Equity అని టైప్ చేయండి.
03:04 Class Type డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి.

మనము డిఫాల్ట్ జాబితాను చూడవచ్చు: Assets (ఆస్తులు),Liabilities (బాధ్యతలు),Equity (ఈక్విటీ),Income (ఆదాయం), Cost of Goods Sold (అమ్మిన వస్తువుల ధర) మరియు Expense (ఖర్చు)

03:21 ఫ్రంట్ అకౌంటింగ్ ఈ Class Type ను బ్యాలెన్స్ షీట్ లో ప్రదర్శించడానికి అనుసరిస్తుంది.
03:26 Class Type ను Equity గా ఎంచుకోండి.
03:29 విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add new బటన్ పై క్లిక్ చేయండి.
03:33 New account class has been added అనే సందేశం ప్రదర్శించబడుతుంది.
03:38 ఇక్కడ, క్రొత్త క్లాస్ ఈక్విటీ అనేది మూడవ వరుసకు జోడించబడిందని మనం చూడవచ్చు.
03:44 ఇది ఎందుకంటే, డిఫాల్ట్ గా Class Type, Equity అనేది మూడవ సోపానక్రమం స్థాయిలో ఉంది కనుక.
03:50 కనుక, ఎప్పుడైనా ఒక క్రొత్త Class ని జోడించినప్పుడు, అది ఆ Class Type యొక్క డిఫాల్ట్ స్థానాన్ని తీసుకుంటుంది.
03:56 ఇప్పుడు, మనం GL Groups ను ఎలా జోడించాలో చూద్దాం.
04:00 Banking and General Ledger ట్యాబ్ కు వెళ్ళండి.
04:03 Maintenance ప్యానెల్ లో GL Account Groups లింక్ పై క్లిక్ చేయండి.
04:08 మనం డీఫాల్ట్ Group Name ను చూడవచ్చు, ఇది Class కిందన GL Account Groups ని చూపిస్తుంది.
04:15 క్లాస్ ఐడి ప్రకారం Group ID సెట్ చేయబడిందని కూడా మీరు చూడవచ్చు.
04:20 ID ఫీల్డ్ లో, కొత్త Group ID గా 12 ని టైప్ చేయండి.
04:24 Name ఫీల్డ్ లో, నేను Group Name గా Fixed Assets ను టైప్ చేస్తాను.
04:29 Group Name Fixed Assets అనేది ఇప్పటికే అందుబాటులో ఉన్న ఏ subgroup కి చెందినది కాదు.
04:35 అందువల్ల, Subgroup ఫీల్డ్‌లో, ఫీల్డ్‌ను None గ ఉంచండి.
04:40 ఇప్పుడు, Class డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి.
04:44 Charts of Accounts, Fixed Assets (స్థిర ఆస్తులు) అనేవి Assets యొక్క class కింద వస్తాయి.

కనుక Class ను Assets గా ఎంచుకోండి.

04:53 ఈ మార్పులను సేవ్ చేయడానికి, విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add new బటన్ పై క్లిక్ చేయండి.
04:59 మనం This account Group ID is already in use అని చెప్పే ఒక ఎర్రర్ మెసేజ్ ను చూస్తాము.
05:06 కనుక ప్రతీ Group Name కు ఒక ప్రత్యేకమైన Class ID ని జోడించాలి.
05:11 మనం Group ID ను 13 కు మార్చుదాం.
05:15 విండో యొక్క దిగువభాగం వద్ద ఉన్న Add new బటన్ పై క్లిక్ చేయండి.
05:19 ఈసారి మనం New account type has been added అని చెప్పే ఒక సందేశాన్ని చూడవచ్చు.
05:25 క్రొత్త Group Name అనేది class Assets లోపల యాదృచ్ఛికంగా జోడించబడుతుంది.
05:30 అదేవిధంగా, మనం మన స్వంత Group Name ను జోడించవచ్చు.
05:34 ఇప్పుడు, మనం GL Accounts ను ఎలా జోడించాలో చూద్దాం.
05:38 Banking and General Ledger ట్యాబ్ పై క్లిక్ చేయండి.
05:42 తరువాత Maintenance ప్యానల్ లో GL Accounts లింక్ పై క్లిక్ చేయండి.
05:47 ఇక్కడ కూడా మనం ఒక ప్రత్యేకమైన code ను టైప్ చేయాలి. ఇది తప్పనిసరి ఫీల్డ్.
05:53 Account Code ఫీల్డ్‌లో, నేను కోడ్‌గా 1100 ను టైప్ చేస్తాను.
06:00 మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన ఏదైనా కోడ్ ను ఇవ్వవచ్చు.
06:04 Account Name ఫీల్డ్ పై క్లిక్ చేయండి.

Account Name గా Land and Building ను టైప్ చేయండి.

06:11 మీరు మీకు నచ్చిన ఏ పేరునైనా ఇవ్వవచ్చు.
06:14 Account Group డ్రాప్-డౌన్ బాక్స్‌లో, Account Group గా Fixed Assets ను ఎంచుకోండి
06:20 Charts of Accounts ప్రకారం Account Name Land and Building అనేది Group Fixed Assets కిందకు రావాలి.
06:28 తరువాత, Account status డ్రాప్ డౌన్ మెనుపై క్లిక్ చేయండి.

status గా Active ను ఎంచుకోండి.

06:35 తరువాత విండో దిగువభాగం వద్ద ఉన్న Add Account బటన్ పై క్లిక్ చేయండి.
06:40 New account has been added - అనే సందేశాన్ని మనం చూడవచ్చు.
06:45 ఇప్పుడు, ఎగువభాగం వద్ద ఉన్న New account డ్రాప్-డౌన్ బాక్స్ పై క్లిక్ చేయండి.

కొత్తగా జోడించిన Account ను ఇక్కడ మనం చూడవచ్చు.

06:54 ఇక్కడ చూపిన విధంగా ప్రతి సంస్థ వారి స్వంత account codes యొక్క సెట్ ను కలిగి ఉంటాయి.
07:00 అదేవిధంగా, పై దశలను అనుసరించడం ద్వారా, మీరు మీ స్వంత GL Accounts ను సృష్టించవచ్చు.
07:06 ఇది మనల్ని ఈ ట్యుటోరియల్ చివరికి తీసుకువస్తుంది.

సారాంశం చూద్దాం.

07:12 ఈ ట్యుటోరియల్‌లో, మనం సృష్టించడం నేర్చుకున్నవి

General Ledger Classes, General Ledger Groups మరియు General Ledger Accounts.

07:22 ఒక అసైన్మెంట్ గా,

కింది వివరాలతో ఒక కొత్త GL Accounts - Cash మరియు Capital ను సృష్టించండి. మార్పులను సేవ్ చేయండి.

07:31 ఇప్పుడు మనం మన Company కోసం కొత్త GL Accounts తో చార్ట్స్ ఆఫ్ అకౌంట్స్ ను సెట్ చేసాము.
07:38 ఈ లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియో స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్ని ఇస్తుంది.

దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.

07:46 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం వర్కుషాప్స్ నిర్వహిస్తుంది మరియు సర్టిఫికెట్ లు ఇస్తుంది.

మరిన్ని వివరాలకు, దయచేసి మాకు రాయండి.

07:55 దయచేసి మీ సమయంతో కూడిన సందేహాలను ఈ ఫోరమ్‌లో పోస్ట్ చేయండి.
07:59 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ MHRD, గవర్నమెంట్ అఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది.
08:05 ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించినది ఉదయలక్ష్మి నేను మీ వద్ద శలవు తీసుకుంటున్నాను. మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Simhadriudaya