Difference between revisions of "Linux/C2/File-Attributes/Telugu"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 18: Line 18:
 
||ఫైల్ యొక్క యజమాని, ఫైల్ రకం, ఫైల్‌ను పొందడానికి అనుమతి వంటి ఫైల్ లక్షణాలను ఫైల్ అట్రిబ్యూట్ వివరిస్తుంది.
 
||ఫైల్ యొక్క యజమాని, ఫైల్ రకం, ఫైల్‌ను పొందడానికి అనుమతి వంటి ఫైల్ లక్షణాలను ఫైల్ అట్రిబ్యూట్ వివరిస్తుంది.
 
|-   
 
|-   
|00:45
+
|00:45  
 
||c-h own కమాండ్ ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చడానికి ఉపయోగించబడుతుంది.  
 
||c-h own కమాండ్ ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చడానికి ఉపయోగించబడుతుంది.  
 
ఇది ఒక అడ్మిన్ కమాండ్, రూట్ యూజర్ మాత్రమే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చగలడు.
 
ఇది ఒక అడ్మిన్ కమాండ్, రూట్ యూజర్ మాత్రమే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చగలడు.

Revision as of 10:52, 8 April 2015

Time Narration
00:00 లైనక్స్ ఫైల్ అట్రిబ్యూట్స్‌ పై స్పోకెన్ ట్యుటోరియల్‌కు స్వాగతం.
00:05 ఈ ట్యుటోరియల్‌ కొరకు ముందుగా మీరు example1, example2, example3, example4, example5, మరియు testchown అనే ఖాళీ ఫైళ్లను సృష్టించాలి.
00:18 test_chown మరియు directory1 అనే పేరుతో ఖాళీ డైరెక్టరీలను కూడా సృష్టించండి.
00:25 ఫైల్ అట్రిబ్యూట్ అనేది ఒక కంప్యూటర్ ఫైల్‌ను వివరించే లేదా దానితో సంబంధం కలిగి ఉన్న మెటా డేటా.
00:33 ఫైల్ యొక్క యజమాని, ఫైల్ రకం, ఫైల్‌ను పొందడానికి అనుమతి వంటి ఫైల్ లక్షణాలను ఫైల్ అట్రిబ్యూట్ వివరిస్తుంది.
00:45 c-h own కమాండ్ ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చడానికి ఉపయోగించబడుతుంది.

ఇది ఒక అడ్మిన్ కమాండ్, రూట్ యూజర్ మాత్రమే ఒక ఫైల్ లేదా డైరెక్టరీ యొక్క యజమానిని మార్చగలడు.

01:00 chown space options space ownername space filename (ఫైల్ పేరు) లేదా directoryname (డైరక్టరీ పేరు) chown కమాండ్ యొక్క సింటాక్స్
01:13 మనం chown కమాండ్‌తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు.
01:18 -R : ప్రస్తుతం మీరు ఉన్న డైరక్టరీ యొక్క సబ్ డైరక్టరీలోని ఫైళ్ల అనుమతి మార్చడానికి.
01:28 -c : ప్రతి ఫైలుకు అనుమతి మార్చడానికి
01:33 -f : ఎర్రర్ మెసేజ్లు ప్రదర్శించకుండా ch own నివారిస్తుంది.
1:37 ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం
01:40 టెర్మినల్‌కు వెళ్లండి. మనం ఖాళీ ఫైళ్లు మరియు ఫోల్డర్లు సృష్టించిన డైరక్టరీకి వెళదాం. అందుకు cd స్పేస్ Desktop స్లాష్ file attribute టైపు చేసి ఎంటర్ నొక్కండి
01:56 ఇప్పుడు $ ls space ఇచ్చి -l space testchown అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి.
02:11 'testchown' ఫైల్ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు.
02:18 ఫైల్ యొక్క యజమానిని మార్చడానికి, $ sudo space c-h own space అనగా a-n-u-s-h-a anusha స్పేస్ testchown అనగా t-e-s-t-c-h-o-w-n అని కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
02:36 sudo పాస్వర్డ్ ఎంటర్ చేసి మరలా ఎంటర్ నొక్కండి
02:44 ఇప్పుడు $ ls space -l space t-e-s-t-c-h-o-w-n అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఇక్కడ మనం ఫైల్ యొక్క కొత్త యజమాని అనూష అని చూడవచ్చు.
03:03 ఇప్పుడు మనం డైరెక్టరీ యొక్క యజమానిని ఏ విధంగా మార్చాలో చూద్దాం
03:07 $ ls –l కమాండ్ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి. 'test_chown' డైరక్టరీ యొక్క యజమాని షాహిద్ అని మనం ఇక్కడ చూడవచ్చు.
03:21 డైరక్టరీ యొక్క యజమానిని మార్చడానికి, కమాండ్‌ను టైప్ చేయండి
03:26 $ sudo స్పేస్ chown స్పేస్ మైనస్ కాపిటల్ R స్పేస్ a-n-u-s-h-a anusha స్పేస్ spacetest_chown అనే డైరక్టరీ పేరును టైప్ చేసి ఎంటర్ నొక్కండి
03:44 అవసరమైతే sudo పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి, మరలా ఎంటర్ నొక్కండి.
03:49 మన సౌకర్యం కొరకు Clt+L నొక్కడం ద్వారా నేను స్క్రీన్‌ను క్లియర్ చేస్తాను.
ఇప్పుడు $ ls స్పేస్ –l అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
డైరక్టరీ యొక్క కొత్త యజమాని అనూష అని మనం చూడవచ్చు.
04:06 . ఒకటి లేదా అంతకంటే ఎక్కవ ఫైళ్ల ఏక్సెస్ మోడ్ లేదా అనుమతులను మార్చడానికి chmod కమాండ్ ఉపయోగించబడుతుంది.
04:13 chmod కమాండ్ యొక్క సింటాక్స్ chmod స్పేస్ [options]స్పేస్ mode స్పేస్ ఫైల్ పేరు స్పేస్ chmod స్పేస్ [options] స్పేస్ మనం chmod కమాండ్ తో క్రింది ఎంపికలను ఇవ్వవచ్చు.
04:29 -c : మార్పులు చేసిన ఫైళ్ల గురించి న సమాచారాన్ని ముద్రిస్తుంది.
04:34 -f : chmod మార్చలేని ఫైళ్ల గురించి యూజర్ కు తెలియచేయదు.
4:41 ఇక్కడ ఈ క్రింది రకాల అనుమతులు ఉన్నాయి
04:44 r : రీడ్ w : రైట్ x : ఎగ్జిక్యూట్ s : సెట్ యూజర్ (లేదా గ్రూప్) ) ID
04:54 ప్రత్యామ్నాయంగా మనం మూడు-అంకెల ఆక్టల్ సంఖ్య ద్వారా అనుమతులను తెలియచేయవచ్చు.
05:00 మొదటి అంకె యజమాని అనుమతిని, రెండవ అంకె గ్రూప్ అనుమతిని, మూడవ అంకె ఇతరుల అనుమతిని సూచిస్తాయి.
05:09 క్రింది ఆక్టల్ విలువలను కూడటం ద్వారా అనుమతులు లెక్కించబడతాయి: 4 అనగా రీడ్, 2 అనగా రైట్, 1 అనగా ఎగ్జిక్యూట్
05:20 ఇప్పుడు మనం chmod యొక్క కొన్ని ఉదహరణలు చూద్దాం.

టెర్మినల్‌కు వెళ్ళి, ఫైల్ example1కి add execute-by-user అనుమతి జతచేయడానికి కమాండ్‌ను ఎంటర్ చేద్దాం.

05:30 ముందుగా Clt+l నొక్కి నేను మరొకసారి స్క్రీన్ క్లియర్ చేస్తాను
05:36 ఇప్పుడు $ chmod space u+x space example1 టైప్ చేసి ఎంటర్ నొక్కండి
05:49 $ ls space -l space example1 అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి
06:01 ఇక్కడ మనం ఫైల్ example1కు యజమాని ద్వారా read/write/execute అనుమతి, గ్రూప్ ద్వారా read/execute అనుమతి, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతి ఇవ్వబడడాన్ని చూడవచ్చు
06:15 ఇప్పుడు $ chmod space 751 space example1 కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి
06:26 ఇప్పుడు $ ls space -l space example1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
06:35 పైన ఇచ్చిన కమాండ్, మన ఫైల్ example1 కు యజమాని ద్వారా read/write/execute అనుమతిని, గ్రూప్ ద్వారా read/execute అనుమతిని, మరియు ఇతరుల ద్వారా execute-only అనుమతిని ఇచ్చిందని గమనించవచ్చు
06:52 ఫైల్ example1కు ప్రతి ఒక్కరికి read-only అనుమతిని ఇవ్వడానికి $ chmod space =r space example1 అనే కమాండ్‌ను టైప్ చేసి ఎంటర్ నొక్కండి
07:08 $ ls space -l space example1 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
07:19 ఫైల్ example1 కోసం ప్రతి ఒక్కరికి read only అనుమతి ఇవ్వబడిందని మనం ఇక్కడ చూడవచ్చు
07:30 అనుమతిని అనేకసార్లు మార్చడానికి మరియు ప్రతి ఒక్కరికీ read and execute అనుమతిని ఇవ్వడానికి ఇంకా directory1 డైరక్టరీ యజమానికి write అనుమతిని కూడా ఇవ్వడానికి కమాండ్‌ను టైప్ చేయండి
07:44 $ chmod space minus capital R space 755 space directory1 అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి
08:00 $ ls space -l అని టైప్ చేసి మార్పులను చూడటానికి ఎంటర్ నొక్కండి
08:09 ఫైల్ example2 కోసం యూజర్‌కు execute అనుమతిని ఇవ్వడానికి $ chmod space u+x space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
08:27 ఇప్పుడు $ ls space -l space example2 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి .
08:40 ఇక్కడ యూజర్‌కు example2 కొరకు execute అనుమతి ఇవ్వబడడాన్ని చూడవచ్చు
08:50 ఫైల్ example3 కొరకు గ్రూప్‌కు write అనుమతులను ఇవ్వడానికి $ chmod space g+w space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
09:10 $ ls space -l space example3 అనే కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
09:23 ఇక్కడ మనం గ్రూప్‌కి write అనుమతి జతపరచబడటం చూడవచ్చు
09:30 అందరికి write అనుమతిని తొలగించడానికి $ chmod space a-w space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి
09:45 ఇప్పుడు $ ls space -l space example3 అని టైపు చేసి ఎంటర్ నొక్కండి
09:55 అందరికీ write అనుమతి తొలగిపొవడం మనం ఇక్కడ చూడవచ్చు
10:02 ఒకటి లేదా ఎక్కువ ఫైళ్ల యొక్క గ్రూప్‌ను కొత్త గ్రూప్‌కు మార్చడానికి chgrp కమాండ్ ఉపయోగపడుతుంది .
10:10 ఈ కొత్త గ్రూప్ ఒక గ్రూప్ ID నంబర్ లేదా /etc/group లో ఉన్న గ్రూప్ పేరు అయి ఉంటుంది.
10:20 ఫైల్ యొక్క యజమాని లేదా privileged యూజర్ మాత్రమే గ్రూప్ ను మార్చవచ్చు.
10:26 chgrp కమాండ్ కొరకు సింటాక్స్ chgrp space [options] space newgroup space files.
10:36 టెర్మినల్‌కు వెళదాం. ఇప్పుడు మనం chgrp కమాండ్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం.

$ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి

10:57 ఇక్కడ మనం షాహిద్ అనే యూజర్‌కు గ్రూప్ అనుమతిని ఉందని చూడవచ్చు.
11:03 గ్రూప్ అనుమతిని మార్చడానికి, $ sudo space chgrp space rohit space example4 కమాండ్ టైప్ చేయండి
11:20 ఎంటర్ నొక్కండి, అవసరమైతే సూడో పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
11:27 $ ls space -l space example4 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
11:38 ఇక్కడ మనం గ్రూప్ షాహిద్ నుండి రోహిత్‌కు మారడాన్ని చూడవచ్చు
11:46 ఐనోడ్ నంబర్ అనేది డివైస్‌కు కేటాయించబడిన ఒక ప్రత్యేక పూర్ణసంఖ్య.
11:51 ఐనోడ్ ఒక సాధారణ ఫైల్ లేదా డైరక్టరీ గురించి ప్రాధమిక సమాచారాన్ని నిల్వ చేస్తుంది.
11:57 అన్ని ఫైల్స్ ఐనోడ్‌కు హార్డ్ లింక్స్‌గా ఉన్నాయి.
12:00 ఎప్పుడైతే ఒక ప్రోగ్రామ్ ఒక ఫైల్‌ను పేరుతో సూచిస్తుందో, అప్పుడు తగిన ఐనోడ్‌ను వెదకడానికి సిస్టం ఫైల్‌పేరును ఉపయోగిస్తుంది .
12:12 ఒక ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్యను చూడటానికి మనం ls space –i కమాండ్ ను ఉపయోగించవచ్చు.
12:19 $ ls space -i space example5 కమాండ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి
12:29 ఫైల్ కు ముందు రాయబడిన సంఖ్య ఫైల్ యొక్క ఐనోడ్ సంఖ్య.
12:35 ఐనోడ్‌లు ఒక సమయంలో స్పష్టంగా ఒక డైరక్టరీతో మాత్రమే అనుబంధించబడి ఉంటాయి.
12:41 హార్డ్ లింకులు బహుళ డైరక్టరీ ఎంట్రీలను ఒకే ఐనోడ్‌తో అనుబందిస్తాయి . 'ln' కమాండ్ లింకును ఏర్పరుస్తుంది
12:52 హార్డ్ లింక్ సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్
12:57 ln space source space link అనే కమాండ్ లో source అనేది ఉనికిలో ఉన్న ఫైల్ మరియు link అనేది సృష్టించవలసిన ఫైల్.
13:06 ఇప్పుడు మనం కొన్ని hard links యొక్క ఉదాహరణలు చూద్దాం
13:10 స్క్రీన్ మరొకసారి క్లియర్ చేస్తాను.

ఇప్పుడు $ ln space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి

13:25 రెండు ఫైళ్ల యొక్క ఐనోడ్ సంఖ్యను చూపడానికి $ ls space -i space example1 space exampleln అని కమాండ్ టైపు చేసి ఎంటర్ నొక్కండి.
13:41 ఇక్కడ మనం రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్య ఒకటిగా ఉండటాన్ని చూడవచ్చు, file exampleln అనేది file example1కు హార్డ్ లింక్
13:54 సాఫ్ట్ లింక్ సింబాలిక్ లింక్ అనేది ఒక ప్రత్యేక రకపు ఫైల్.
ఇది absolute or relative pathలో మరొక ఫైల్ లేదా డైరెక్టరీకి సూచికను కలిగి ఉంటుంది
14:07 సాఫ్ట్ లింకులను సృష్టించడానికి ln కమాండ్ యొక్క సింటాక్స్
14:12 ln space -s space {టార్గెట్ –ఫైల్ పేరు} space {సింబాలిక్-ఫైల్ పేరు}
14:19 ఇప్పుడు మనం సాఫ్ట్ లింక్ యొక్క కొన్ని ఉదాహరణలు చూద్దాం
14:25 సాఫ్ట్ లింక్‌ను సృష్టించడానికి, $ ln space -s space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి
14:40 ఎంటర్ నొక్కండి
14:43 ఇప్పుడు, ఐనోడ్ సంఖ్యను మరియు రెండు ఫైళ్ల జాబితాను ప్రదర్శించడానికి,
$ ls space -li space example1 space examplesoft అనే కమాండ్ టైప్ చేయండి
15:01 ఎంటర్ నొక్కండి
15:03 ఈ రెండు ఫైళ్ల ఐనోడ్ సంఖ్యలు వేరుగా ఉన్నాయని మరియు examplesoft అనేది example1 యొక్క సాఫ్ట్ లింక్ అని ఇక్కడ మనం చూడవచ్చు.
15:16 ఈ ట్యుటోరియల్‌లో మనం అనుమతి, యజమాన్యం మరియు ఫైల్ యొక్క గ్రూప్ మార్చడం వంటి Linux Files Attributes గురించి నేర్చుకున్నాం.
15:26 ఇంకా మనం ఒక ఫైల్ యొక్క ఐనోడ్, సాఫ్ట్ మరియు హార్డ్ లింకులను గురించి కూడా నేర్చుకున్నాం.
15:31 ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చాం.
15:35 స్పోకెన్ ట్యటోరియల్స్ టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్‌లో భాగం, దీనికి ICT ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహాయం అందిస్తోంది.
15:44 దీనిపై మరింత సమాచారం క్రింద ఉన్న లింక్‌లో లభ్యమవుతోంది.
15:50 ఈ రచనకు సహాయపడినవారు శ్రీహర్ష (అనువాదం చేసినవారి పేరు) మరియు స్రవంతి (రికార్డ్ చేసినవారి పేరు) బళ్ళారి. ధన్యవాదములు. సెలవు

Contributors and Content Editors

Madhurig, Udaya, Yogananda.india