LibreOffice-Suite-Base/C4/Design-Refine-Database-Design-and-Normalization-Rules/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 00:25, 20 February 2018 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:02 LibreOffice Base నందు Spoken tutorial కు స్వాగతం
00:06 ఇది మునుపటి ట్యుటోరియల్ Database Design కు కొనసాగింపు.
00:11 ఇక్కడ మనం క్రింది అంశాలను నేర్చుకుందాం
00:15 database design ను మెరుగుపర్చడం,
00:18 normalization నియమాలను అమలు చేయడం
00:21 డేటాబేస్ డిజైన్ ను పరీక్షించండం.
00:25 క్రితం ట్యుటోరియల్ నందు మనం primary keys మరియు foreign keys ను ఉపయోగించి table relationships ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాం.
00:34 ఇప్పుడు database design పద్దతిని అనుకరిద్దాం
00:38 ముందు మన డేటాబేస్ డిజైన్ ను మెరుగుపర్చుదాం.
00:42 ఇప్పుడు మనం ప్రాధమిక నిర్మాణం ను కలిగి ఉన్నాము. మనం దానినుండి, టేబుల్స్ ను సృష్టించి, మరియు నమూనా డేటా ను నింపగలము.
00:50 నమూనా queries, form మరియు report తయారు చేసి, మునుపటి ప్రశ్నలకి సమాధానం లభించిందో లేదో చూద్దాం
00:59 మనం అనవసరమైన నకిలీలను తనిఖీ చేసి డిజైన్ ను మార్చడం ద్వారా వాటిని తొలగించవచ్చు.
01:06 మనం మర్చిపోయిన column ను కలపవచ్చు
01:10 మనం Business rules ను Libraryడాటాబేస్ కు చేర్చడం ద్వారా Database Integrity ను అమలు చేయవచ్చు
01:19 ఉదాహరణకు Books పట్టికలో Price column డేటా టైప్ numeric గా ఉండాలి.
01:24 మరొక నియమం ఏమిటంటే, Return Date పుస్తకం జారీచేసిన తేదీ నుండి ఒకనెల తరువాత ఉండాలి
01:32 లేదా ఒక నిర్దిష్ట చర్య సంభవించినప్పుడు, తదుపరి చర్యలు ప్రేరేపించబడాలి.
01:39 కాబట్టి, ఒక పుస్తకం రిటర్న్ తేదీ దాటి ఉంటే, మనం సభ్యునికి ఒక ఇమెయిల్ రిమైండర్ ను పంపడానికి డేటాబేస్లో చర్యలను ఏర్పాటు చేయాలి.
01:50 కాబట్టి మనం పునఃరూపకల్పన చేస్తున్నప్పుడు కొత్త పట్టికలను, columns, నియమాలు లేదా పరిమితులను జోడించవచ్చు.
01:58 Data Integrity ను కోల్పోకుండా ఉండటానికి మనం మునుపటి దశలన్నిటికి వెళ్ళాలి.
02:07 తరువాత normalization rules ను అమలు చేయవచ్చు.
02:13 ఇవి మన పట్టికలు
02:17 సరిగ్గా నిర్మించబడ్డావో, లేదో మరియు మనం మునుపు చూసిన ఏదైనా మార్పులకు సంబంధిచిన anomalies ఉన్నవో, లేదో
02:20 అని పరీక్షించుకోవడానికి ఉపయోగపడతాయి.
02:25 ఈ విధంగా normal forms ను database design కి వర్తీకరించే విధానాన్నీ normalization అంటారు
02:33 ట్యూటోరియాల్ ల్లో మొదటి మూడు Normal forms ను గమనిద్దాం
02:38 First Normal Form లేదా 1NF అన్ని columnల విలువ atomic గా ఉండాలని సూచిస్తుంది
02:51 ఉదాహరణకి Books పట్టికలోని Price వరుసలో ప్రతి సెల్ ఒకేవిలువను కలిగి ఉండాలి
02:59 అంటే ఆ వరుస కేవలం పుస్తకం యొక్క ధర మాత్రమే కలిగి ఉండాలి
03:07 అలాగే Authors పట్టికలోని ప్రతి First Name రచయిత మొదటిపేరును మాత్రమే కలిగి ఉండాలి
03:16 First Normal form నిలువు వరుసల పునరావృత సమూహాలు లేవని సూచిస్తుంది
03:23 ఉదాహరణకి ప్రచురణకర్త మూడు పుస్తకాలు ప్రచురించాడనుకుందాం
03:29 మరియు Publishers పట్టిక క్రింది వరుసలు కలిగి ఉంటుంది
03:34 Publisher Id, Publisher, Book1, Author 1, Book 2, Author 2, Book 3, Author 3.
03:47 Book and Author మూడుసార్లు పునరావృత్తం అయ్యిందని గమనించాలి
03:52 అలాంటివి మనం గమనించినప్పుడు మన డిజైన్ ను మరొకసారి పరీక్షించుకోవాలి
03:58 ఒకవేళ ప్రచురణకర్త మరో పది పుస్తకాలను ప్రచురిస్తే మనము పట్టికకు మరొక 20 వరుసలు జతచేయాల్సి ఉంటుంది
04:08 కాబట్టి డేటాలో మార్పు చేసినప్పుడు పట్టిక డిజైన్ స్థిరంగా ఉండదని గమనించవచ్చు
04:14 అంతేకాకుండా, పుస్తకం లేదా రచయిత పై ఆధారపడి table ను శోధించి మరియు క్రమబద్ధీకరణ చేసినప్పుడు అది గజిబిజిగా మారుతుంది.
04:23 కాబట్టి మనం ఈ పొరపాట్లను సరిచేయుటకు, పట్టికను రెండు లేదా మూడు భాగాలుగా విభజించవచ్చు.
04:30 మన ఉదాహరణలో పై పట్టికను Publishers, Books మరియు Authors గా విభజించవచ్చు
04:41 ఈ డిజైన్ పట్టికను First Normal Form కి తీసుకొస్తుంది
04:47 అంతేకాకుండా, ప్రచురణకర్తలు పుస్తకాలపై డేటా మార్చినప్పటికీ పట్టిక నిర్మాణాలు స్థిరంగా ఉంటాయి.
04:56 ఇప్పుడు Second Normal Formను ఇప్పుడు చూద్దాం.
05:00 ఒక టేబుల్ 1NF లో ఉంటూ, ప్రతి non-key column primary key పై మాత్రమే పూర్తిగా ఆధారపడి ఉంటే
05:07 ఆ table, Second Normal Form or 2NF లో ఉందని చెప్పగలుగుతాం.
05:14 ఈ నియమం మన primary key లో ఒకటి కంటే ఎక్కువ columnలు ఉన్నప్పుడు వర్తిస్తుంది
05:22 ఉదాహరణకి BooksIssued అనే పట్టికను
05:29 BookId, MemberId, BookTitle మరియు IssueDate లను columnలుగా మరియు BookId and MemberId లను primary key గా తీసుకుందాం
05:42 BookTitle కాలమ్ ను గమనించండి
05:45 మనము Books పట్టికలోని BookTitle ను BookId ద్వారా పొందవచ్చు
05:52 వేరొక విధంగా చెప్పాలంటే BookTitle కాలమ్ BookId పై మాత్రమే ఆధారపడివుంటుంది Member ID పై కాదు
06:00 కాబట్టి ఇది పూర్తి primary key పై ఆధారపడదు
06:06 ఈ పట్టికను Second Normal Formకు మార్చడానికి మనం BookTitle ను తొలిగించాలి మరియు
06:14 పూర్తిగా primary key and columns లపై ఆధారపడిన కాలమ్స్ లను మాత్రమే ఉంచాలి.
06:23 IssueDate ఇక్కడ ఉంది, ఎందుకంటే అది రెండు primary key ఫీల్డ్స్ పై ఆధారపడివుంటుంది
06:31 Third Normal Form అంటే ఏమిటో చూద్దాం
06:35 ఒక పట్టిక 2NF లో ఉన్నపుడు మాత్రమే అది Third Normal Form అని చెప్పగలుగుతాం
06:42 మరియు అన్ని నాన్ -కీ కాలమ్స్ స్వతంత్రంగా ఉంటాయి
06:48 ఉదాహరణకి BooksIssued పట్టికను
06:54 BookIssueId (ప్రైమరీ కీ గా) BookTitle, Member, IssueDate and ReturnDate కాలమ్స్ తో తీసుకొందాం.
07:03 మరియు Library పాలసీగా Book Issue Date కి ఒక నెల తరువాత తిరిగి ఇచ్చు తేదీ ఉండాలి అనుకుందాం.
07:11 ఇప్పుడు Base, ఒక non-key అయిన IssueDate కాలమ్ ను ఉపయోగించి, Return Date ను లెక్కకట్టవచ్చు.
07:19 అంటే, ReturnDate కేవలం IssueDate పై మాత్రమే ఆధారపడి ఉంటుంది ఇంకా దీనిపై ఆధారపడదు.
07:26 ఒకవేళ Return Date లో వేరొక తేదీ చేర్చింనట్లయితే, అది లైబ్రరీ నియమాన్ని ఉల్లంగిస్తుంది
07:37 కాబట్టి పట్టికను Third Normal Form లో పెట్టడానికి మనం పట్టిక నుండి ReturnDate వరుసను తొలిగించాలి
07:44 కాబట్టి ఇప్పుడు మనం మొదటి మూడు నార్మల్ ఫార్మ్ లను ఎలా అమలు చేయాలో నేర్చుకున్నాం
07:49 సాధారణంగా మన డేటాబేస్ డిజైన్ 3NF వద్ద ఆగిపోతుంది.
07:55 Normal forms and database design పై మరింత సమాచారం కోసం తెరపైఉన్న వెబ్సైట్ను చూడండి.
08:05 చివరిగా మన డేటాబేస్ డిజైన్లను పరీక్షిద్దాం.
08:12 మనం డేటాబేస్ నిర్మాణం ను సృష్టించగలము.
08:16 ఇక్కడ మనం Tables, Relationships, Rules లేదా Constraints, Forms, Queries మరియు Reports లను తయారుచేద్దాం
08:24 మరియు మనం డాటాబేస్ను వాస్తవ డాటానుప్రయోగించి పరీక్షిద్దం
08:29 form ను ఉపయోగించి జోడింపులు, నవీకరణలు లేదా డేటాబేస్ తొలగించవచ్చు
08:36 Run రెపోర్ట్ ను ఉపయోగించి ఫలితాలు సరైనవో కావో మరియు ఖచితత్వమును తెలుసుకోవచ్చు
08:42 డేటాబేస్ ఉపయోగానికి సిద్దమైనతరువాత మనం నిర్వహణ వేగాన్ని పరీక్షించుకోవాలి
08:50 పట్టికలకు, Indexes ను జోడించడం ద్వారా డేటాను పొందే వేగాన్ని పెంచవచ్చు
08:55 మన డేటాబేస్ను సఫలవంతం చేయడానికి కాలానుగుణంగా డేటాబేస్ ను నిర్వహిoచాలి
09:03 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది
09:08 Library database design కు Media అనే కొత్త entity జోడించండి.
09:14 Media లో ఆడియో లేదా వీడియో ను కలిగిన DVDs మరియు CDs ఉన్నవి
09:21 పుస్తకాల మాదిరిగానే DVDs మరియు CDs Library సభ్యులకిస్తారు
09:28 database design పద్దతిని అనుకరించండి
09:31 మొదటి మూడు Normal forms ను మీ డిజైన్ కు అనువర్తించండి.
09:37 ఇది మనకు Database Desin in LibreOffice Base లోని మూడోవ భాగంపై చివరకు తీసుకొస్తుంది
09:45 సారాంశంగా, మనం డాటాబేస్ డిజైన్ పై క్రింది అంశాలను నేర్చుకున్నాము.
09:50 డాటాబేస్ను రిఫైన్ చేయడం,
09:52 normalization నియమాలను వర్తించడం,
09:55 డేటాబేస్ డిజైన్ ను పరీక్షించండం,
09:58 Spoken Tutorial Talk to a Teacher ప్రాజెక్టుకు ఒక భాగం, ICT, MHRD, భారత ప్రభుత్వము ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
10:10 ఈ ప్రాజెక్ట్ http://spoken-tutorial.org ద్వారా సమన్వయించబడుతుంది.
10:15 దీనిపై మరింత సమాచారం క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉంది.
10:20 దీనిని అనువదించినది హరికృష్ణ. చేరినందుకు ధన్యవాదాలు.

Contributors and Content Editors

Yogananda.india