LibreOffice-Suite-Base/C2/Tables-and-Relationships/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 16:03, 23 March 2017 by Yogananda.india (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:00 లిబ్రేఅఫీస్ బేస్ మీద ట్యుటోరియల్కు స్వాగతం.
00:04 ఈ ట్యుటోరియల్లో, మనం లిబ్రేఅఫీస్ బేస్లో టేబుల్స్ మరియు రిలేషన్షిప్స్ కవర్ చేస్తాము.
00:10 ఇక్కడ, మనము వీటి గురించి నేర్చుకుంటాము. టేబుల్కు డాటా ఆడ్ చేయడం
00:16 రిలేషన్షిప్స్ డిఫైన్ చేయడం మరియు క్రియేట్ చేయడం
00:19 మునుపటి లిబ్రేఅఫీస్ బేస్ ట్యుటోరియల్లో, మనము బేస్, డాటాబేస్ బేసిక్స్ ఇంట్రొడ్యూస్ చేసి డాటా బేస్ మరియు టేబుల్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాము.
00:31 ట్యుటోరియల్ యొక్క గమనములో మనము లైబ్రరి అనే ఎగ్జాంపుల్ డాటాబేస్ కూడా క్రియేట్ చేసి బుక్స్ టేబుల్ కూడా క్రియేట్ చేసాము.
00:42 ఈ ట్యుటోరియల్లో, మనము లైబ్రరి డాటా బేస్ రెస్యూమ్ చేసి టేబుల్కి డాటా ఎలా ఆడ్ చేస్తారో చూస్తాము.
00:51 దీని కోసం, మనం మొదట లిబ్రేఅఫీస్ బేస్ ప్రోగ్రామ్ ఇన్వోక్ చేద్దాము.
00:57 దీని కోసం, మనం స్క్రీన్కి ఎడమ వైపున ఉన్న స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసి,
01:03 ఆల్ ప్రొగ్రామ్స్ మీద క్లిక్ చేసి, తర్వాత లిబ్రేఅఫీస్ సూట్ మరియు లిబ్రేఅఫీస్ బేస్ మీద క్లిక్ చేద్దాము.
01:12 మనము ఇప్పటికే చివరి ట్యుటోరియల్లో లైబ్రరి డాటాబేస్ క్రియేట్ చేసి ఉన్నాము కనుక, ఈ సారి మనం కేవలం దానిని ఓపెన్ చేసే అవసరం మాత్రం ఉంది.
01:20 అది చేయడానికి, మనం open an existing database file వైకల్పాన్ని క్లిక్ చేద్దాము.
01:28 Recently Used డ్రాప్ డౌన్ బాక్స్లో, మన లైబ్రరి డాటాబేస్ కనపడాలి,
01:35 కనుక ఇప్పుడు, Finish బటన్ మీద క్లిక్ చేయండి.
01:38 మీరు దానిని చూడనట్లయితే, మనం ఎక్కడియితే లైబ్రరి డాటాబేస్ సేవ్ అయి ఉండో ఆ విండోస్ డైరెక్టరిని బ్రౌజ్ చేయడానికి మధ్యలో ఉన్న ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయవచ్చు.
01:50 కనపడగానే, filename మీద క్లిక్ చేయండి. తర్వాత Open బటన్ మీద క్లిక్ చేయండి.
01:57 ఇప్పుడు, ఒకవేళ లిబ్రేఅఫీస్ బేస్ ప్రొగ్రాం ఇప్పటికే ఓపెన్ అయి ఉంటే, మనం ఇక్కడి నుండి లైబ్రరి డాటాబేస్ ఓపెన్ చేయవచ్చు,
02:07 అది పైన ఉన్న File menu క్లిక్ చేయడం ద్వారా ఇంకా Open క్లిక్ చేయడం ద్వారా చేస్తాము.
02:14 మనం లైబ్రరి డాటాబేస్ సేవ్ అయి ఉన్న విండోస్ డరెక్టరీని బ్రౌజ్ చేస్తాము.
02:21 మనం Library.odb మీద క్లిక్ చేసి తర్వాత క్రింద ఉన్న Open బటన్ మీద క్లిక్ చేద్దాము.
02:31 మనమిప్పుడు లైబ్రరి డాటాబేస్లో ఉన్నాము.
02:35 మనం లెఫ్ట్ పానెల్లో డాటాబేస్ లిస్ట్ లోని టేబుల్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము.
02:42 కుడి పానెల్లో టేబుల్స్ లిస్ట్లో బుక్స్ టేబుల్ కనపడడాన్ని గమనించండి.
02:48 ఇప్పుడు మనం బుక్స్ టేబుల్ మీద రైట్ క్లిక్ చేస్తాము.
02:53 ఇక్కడ మీరు ఎన్నుకోగలిగే వివిధ వైకల్పాలను గమనించండి.
02:58 ఈ టేబుల్కి డాటా ఆడ్ చేయడానికి మనమిప్పుడు open బటన్ మీద క్లిక్ చేద్దాము
03:04 ప్రత్యామ్నాయంగా, మనం టేబుల్ నేమ్ మీద దానిని ఓపెన్ చేయడానికి డబుల్ క్లిక్ చేయవచ్చు.
03:10 టైటిల్ Books - Library - LibreOffice Base: Table Data Viewతో ఒక క్రొత్త విండో ఓపెన్ అవుతుంది.
03:20 ఇప్పుడు మనం వాల్యూస్ని ప్రతి సెల్లోకి డైరెక్ట్గా టైప్ చేస్తూ బుక్స్ టేబుల్లో డాటా ఎంటర్ చేయడం మొదలు పెట్టవచ్చు.
03:32 Bookid కాలమ్ (column)కి Autofield ఉండడం గమనించండి.
03:37 దీని అర్థం మనం ఇన్సర్ట్ చేసే డాటా యొక్క ప్రతి రో (Row)కి బేస్ ఆటోమేటిక్గా ఆరోహించే (ascending) నంబర్స్ ఆపాదిస్తుంది.
03:48 ఇప్పుడు, మనం స్క్రీన్ మీద చూపిన విధముగా, ఒక రో తర్వాత మరొకటిగా, సెల్స్లోకి డాటా ఇన్పుట్ చేద్దాము.
04:23 కనుక, ఇక్కడ మన టేబుల్ బుక్స్లో మనకు 5 రోస్ సాంపుల్ డాటా ఉన్నది.
04:29 మనం పైన ఉన్న ఫైల్ మెను క్లిక్ చేసి తర్వాత క్లోస్ ఎంపిక చేసుకుని విండో క్లోస్ చేద్దాము.
04:39 ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది.
04:42 ప్రతి మెంబర్ గురించి సమాచారం స్టోర్ చేసే మెంబర్స్ టేబుల్ క్రియేట్ చేయండి, ఉదాహరణకు, మెంబర్ నేమ్ మరియు ఫోన్ నంబర్.
04:53 ఈ క్రింది మూడు ఫీల్డ్స్ ఇన్క్లూడ్ చేయండి
04:57 Fieldtype Integerతో MemberId, ఇక దీనిని ప్రైమరి కీ చేయండి
05:06 Fieldtype Textతో నేమ్
05:10 Fieldtype Textతో ఫోన్
05:15 సరే, మీ పని అయిపోతే, మెంబర్స్ టేబుల్ ఈ విధంగా కనపడుతుంది.
05:22 మనం విండో క్లోస్ చేద్దాము.
05:25 మనం స్క్రీన్ మీద చూపిన విధంగా మెంబర్స్ టేబుల్లోకి నాలుగు సాంపుల్స్ ఆడ్ చేద్దాము.
05:35 మనం ఎలాగయితే బుక్స్ టేబుల్ కోసం చేసామో అలానే చేద్దాము.
05:46 ఒక్కసారి చేసాక, మనం విండో క్లోస్ చేద్దాము.
05:50 ఇప్పుడు, మనం మెయిన్ విండోకి తిరిగి వెళ్ళి మళ్ళీ టేబుల్స్ ఐకాన్ మీద క్లిక్ చేద్దాము.
05:57 ఇక మనం మూడవ టేబుల్ క్రియేట్ చేద్దాము: BooksIssued.
06:03 చేసినాక, BooksIssued టేబుల్కు ఈ క్రింది ఫీల్డ్స్ ఉంటాయి:
06:10 IssueId, Fieldtype Integer అది ప్రైమరి కీ అవుతుంది
06:16 BookId, Fieldtype Integer
06:20 MemberId Fieldtype Integer
06:24 IssueDate Fieldtype Date
06:28 ReturnDate Fieldtype Date
06:32 ActualReturnDate Fieldtype Date
06:36 తర్వాత CheckedIn Fieldtype Yes/No Boolean
06:42 సరే, మనం BooksIssued టేబుల్ క్రియేట్ చేసాము,
06:47 ఇక మనము ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తోన్న విధంగా దానిలోకి క్రింది సాంపుల్ డాటా ఆడ్ చేద్దాము.
06:56 ఇది మీకు ఇప్పుడు పూర్తిగా అర్థం కాక పోయినప్పటికీ, మనం త్వరలో ఏమి జరుగుతోందో అర్థం చేసుకుంటాము.
07:17 సాంపుల్ డాటాతో కలిపి ఇప్పుడు, మన లైబ్రరి డాటాబేస్లో మనకు మూడు టేబుల్స్ ఉన్నాయి
07:25 ఇప్పుడు మనం డాటాబేస్ లో రిలేషన్షిప్స్ డిఫైన్ చేయడం నేర్చుకుందాము.
07:31 కనుక మనము మూడు వివిధ సెట్స్ ఆఫ్ ఇంఫర్మేషన్ స్టోర్ చేయడానికి మూడు టేబుల్స్ క్రియేట్ చేసాము.
07:38 బుక్స్, మెంబర్స్ మరియు మెంబర్స్కి బుక్స్ ఇస్యూ చేయడం.
07:44 ఇప్పుడు మనం ప్రతి పుస్తకాన్ని, ప్రతి మెంబర్నీ ఇంకా ప్రతి బుక్ ఇస్స్యూని ఈ మూడు టేబుల్స్లో విలక్షణంగా ఐడెంటిఫై చేయడానికి కాలమ్స్ (columns) కూడా సెట్ అప్ చేస్తాము.
07:57 అవి ప్రైమరీ కీస్ అవుతాయి.
08:00 ప్రైమరీ కీ యొక్క వివిధ ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే అది టేబుల్స్ మధ్య రిలేషన్షిప్స్ స్థాపించడానికి సాయపడుతుంది.
08:10 కానీ మనకు రిలేషన్షిప్స్ ఎందుకు కావాలి?
08:13 మనం BooksIssued టేబుల్ వైపు చూద్దాము. ఇక్కడ, మనం BookId మరియు MemberId ఫీల్డ్స్ చూడగలము.
08:23 వాటికి BooksIssued టేబుల్లో ఏ వాల్యూ అయినా ఉండవచ్చు.
08:28 కానీ, అవి బుక్స్ మరియు మెంబర్స్ టేబుల్స్లో తదనుగుణముగా మన దగ్గర ఉన్న అవే వాల్యూస్ కి అనురూపమై ఉండాలి.
08:38 కనుక ఒకవేళ బుక్, మాక్బెత్కి, బుక్స్ టేబుల్లో 3 BookIdగా ఉన్నట్లయితే,
08:45 BooksIssued టేబుల్ యొక్క BookIdలో 3 ఉపయోగించడం ద్వారా, మనం అప్పటికీ అదే బుక్ను రెఫర్ చేస్తాము..
08:56 కనుక ఈ రెండు టేబుల్స్నీ స్పష్టంగా కనెక్ట్ చేయడం కోసం, మనం ఇప్పటికీ ఏదో విధంగా వాటిని లింక్ చేయాల్సిన అవసరం ఉంది.
09:05 అంతేకాక, ఉదాహరణకు, 3వ తేదీ జూన్ 2011న Macbeth అనే పుస్తకం రవికుమార్ కు ఇస్యూ అయ్యిందని ఎలా మీరు నిర్ధారిస్తారు?
09:16 లేదా ఒక పుస్తకం లైబ్రరీ యొక్క మెంబర్స్కు మాత్రమే ఇస్యూ అయ్యింది మరెవరికీ కాదు అని మీరు ఎలా ఖాయపరచగలరు?
09:25 ఇవన్నీ కూడా రిలేషన్షిప్స్ సెట్ అప్ చేయడం ద్వారా మీరు సాధించగలరు, అది డాటాను ఇంటర్లింక్ చేయడానికి దోహదపడుతుంది.
09:34 మనం సముచితమైన ఫీల్డ్స్ లింక్ చేయడం ద్వారా బేస్ను బుక్స్ టేబుల్ మరియు మెంబర్స్ టేబుల్ నుండి మాత్రమే వాల్యూస్ ఉపయోగించేలా చూడాలి.
09:46 అది ఎలాగో మనం చూద్దాము.
09:48 లిబ్రేఅఫీస్ బేస్ మెయిన్ విండోలో, మనం టూల్స్ ఆ తర్వాత రిలేషన్షిప్స్ మీద క్లిక్ చేద్దాము.
09:58 ఇది ఒక చిన్న పాపప్ విండో ఓపెన్ చేస్తుంది,
10:03 ఇక్కడ మనం అన్నింటికన్న పైన ఉన్న టేబుల్ ఎంపిక చేసుకుని ఆడ్ బటన్ మీద క్లిక్ చేస్తాము, తర్వాత ఇతర రెండు టేబుల్కి కూడా ఇదే రిపీట్ చేస్తాము.
10:15 పాపప్ విండో క్లోస్ చేయండి.
10:18 మనమిప్పుడు మూడు టేబుల్స్ Books, BooksIssued ఇంకా Members ఒక లైనులో చూడగలము.
10:26 క్లిక్ చేయడం, డ్రాగ్ చేయడం మరియు డ్రాప్ చేయడం ద్వారా మనం టేబుల్స్ మధ్య మరింత స్పేస్ ప్రవేశపెడదాము.
10:35 ఇప్పుడు, మనం బుక్స్ టేబుల్ లోని BookId మీద క్లిక్ చేసి BooksIssued టేబుల్లోని BookId మీద డ్రాగ్ చేసి డ్రాప్ చేద్దాము.
10:48 ఈ రెండు ఫీల్డ్ నేమ్స్ కలిపే ఒక లైను గమనించండి. కనుక అక్కడ, మనం ఒక రిలేషన్షిప్ సెట్ అప్ చేసాము.
10:57 మనం MemberId కోసం అదే రిపీట్ చేద్దాము.
11:02 మెంబర్స్ టేబుల్ లోని MemberId మీద క్లిక్ చేసి దానిని డ్రాగ్ చేసి BooksIssued టేబుల్లో డ్రాప్ చేయండి.
11:11 మనం ఇప్పుడు రెండు రిలేషన్షిప్స్ క్రియేట్ చేయడం మీరు చూడగలరు.
11:16 ఇక, ఈ విధంగా మనం రిలేషన్షిప్స్ స్థాపించగలము
11:20 కనుక రిలేషనల్ డాటాబేస్లో వివిధ టేబుల్స్లో స్టోర్ అయి ఉన్న అర్థవంతమైన డాటాను ఇంటర్లింక్ చేయండి
11:30 ఇది లిబ్రేఅఫీస్లో టేబుల్స్ మరియు రిలేషన్షిప్స్ మీద ఈ ట్యుటోరియల్ చరమాంకానికి మనను తీసుకు వస్తుంది
11:36 సంగ్రహపరచడానికి, మనం నేర్చుకున్నది: టేబుల్కు డాటా ఆడ్ చేయడం ఇంకా రిలేషన్షిప్స్ డిఫైన్ చేసి క్రియేట్ చేయడం
11:45 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ అనేది టాక్ టు ఎ టీచర్ ప్రాజెక్ట్ లోని భాగము, దీనికి ICT, MHRD, భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తోంది.
11:57 ఈ ప్రాజెక్ట్ను Spoken Tutorial.org http://spoken-tutorial.org సమన్వయపరుస్తోంది..
12:03 ఇదే అంశం మీద మరింత సమాచారం ఈ క్రింది లింకులో అందుబాటులో ఉంది: http://spoken-tutorial.org/NMEICT-Intro.
12:08 ఈ స్క్రిప్ట్ రచనకు సహాయపడినవారు నిఖిల మరియు స్వాతి
12:17 చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Udaya, Yogananda.india