Jmol-Application/C2/Introduction-to-Jmol-Application/Telugu

From Script | Spoken-Tutorial
Revision as of 09:33, 13 November 2017 by Simhadriudaya (Talk | contribs)

(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to: navigation, search
Time Narration
00:01 అందరికి నమస్కారం, Introduction to Jmol Application అను ట్యుటోరియల్కు స్వాగతం.
00:07 ఈ ట్యుటోరియల్ లో నేను,
00:11 Jmol అప్లికేషన్, విండో మరియు కొన్ని ప్రాథమిక కార్యకలాపాల(ఆపరేషన్స్)గూర్చి క్లుప్తంగా వివరిస్తాను.
00:16 మనం,
00:18 Menu bar, Tool bar మరియు Jmol panelగూర్చి,
00:22 Jmol పానెల్ యొక్క పరిమాణాన్ని ఎలా మార్చడం,
00:25 సాధారణ సేంద్రీయ అణువుల నమూనాలను సృష్టించడం,
00:28 Methyl గ్రూప్ తో హైడ్రోజన్ ప్రతిక్షేపం చేసి,అణువులను నిర్మించడం నేర్చుకుంటాం.
00:34 అలాగే మనం,
00:36 ఒక స్థిరమైన ఆకృతి పొందడానికి శక్తిని కనిష్టం చేయటం
00:41 చిత్రాన్ని .mol ఫైల్ గా Save చేయడం కూడా నేర్చుకుంటాం.
00:45 ఈ ట్యుటోరియల్ ను అనుసరించడానికి మీకు,
00:49 హై స్కూల్ (ఉన్నత పాఠశాల)కెమిస్ట్రీ(రసాయన శాస్త్రం)మరియు బేసిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ(ప్రాథమిక సేంద్రీయ రసాయన శాస్త్రం)ల గూర్చి అవగాహన ఉండాలి.
00:53 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయడానికి నేను,
00:56 Ubuntu ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ 12.04
01:00 Jmol వర్షన్ 12.2.2 మరియు
01:03 Java వర్షన్ 7 ఉపయోగిస్తున్నాను.
01:06 దయచేసి గమనించండి -Jmol అప్లికేషన్ సజావుగా అమలు చేయడం కొరకు, మీ సిస్టమ్ లో జావా స్థాపించబడి ఉండాలి.
01:14 Jmol Application గూర్చి వివరణ-
01:17 ఇది, ఒక ఉచిత మరియు ఓపెన్ సోర్స్ Molecular Viewer.
01:21 ఇది రసాయన నిర్మాణాల యొక్క 3 డైమెన్షనల్ నమూనాలను రూపొందించడానికి మరియు వీక్షించడానికి ఉపయోగపడుతుంది.
01:27 proteins మరియు macromolecules యొక్క ద్వితీయ నిర్మాణాలను వీక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది.
01:33 డౌన్లోడ్ మరియు సంస్థాపన(ఇన్స్టాలేషన్)గురించిన సమాచారం-
01:37 Ubuntu OS కొరకు, Ubuntu Software Center ను ఉపయోగించి Jmol యొక్క సంస్థాపన జరుగుతుంది.
01:45 దయచేసి, మా వెబ్సైట్ www.spoken-tutorial.org లోని Linux సిరీస్ లో దీనిపై ఉన్న ట్యుటోరియల్ ను అనుసరించండి.
01:56 విండోస్, మాక్ OS మరియు ఆండ్రాయిడ్ పరికరాల్లో స్థాపించడం కొరకు, www.jmol.sourceforge.net ను దయచేసి సందర్శించండి.
02:08 (ఇన్స్టాల్)స్థాపించడం కోసం వెబ్ పేజీలో ఇచ్చిన సూచనలను అనుసరించండి.
02:13 Ubuntu Software Center ను ఉపయోగించి,నేను నా సిస్టమ్ లో Jmol అప్లికేషన్ ను ఇప్పటికే (ఇన్స్టాల్)స్థాపించియున్నాను.
02:20 Jmol Application ను తెరవడానికి Dash home పై క్లిక్ చేయండి.
02:24 సెర్చ్ బాక్స్ లో Jmol అని టైప్ చేయండి.
02:27 Jmol ఐకాన్ తెర(స్క్రీన్)పై కనిపిస్తుంది.
02:30 Jmol అప్లికేషన్ విండోను తెరవడానికి Jmol ఐకాన్ పై క్లిక్ చేయండి.
02:35 Jmol Application విండో,పైభాగంలో Menu bar ను కలిగిఉంది.
02:40 Menu bar కిందన, Tool bar ఉంది.
02:43 ఇక్కడ Jmol panel గా సూచించబడే Display area ఉంది.
02:48 మెనూ బార్ లో File, Edit, Display మొదలైనటువంటి వివిధరకాల ఎంపికలు ఉన్నాయి.
02:56 వీటిలో ప్రతి ఒక్క దానికి వివిధ రకాల ఉప-ఎంపికలను కూడా ఉన్నాయి.
03:00 Tools మెనూ,ఇతర ఎంపికలే కాకుండా,అణువుల మధ్య దూరాన్ని కొలవడానికి కావాల్సిన టూల్స్ ను కూడా కలిగిఉంది.
03:07 మనం తదుపరి ట్యుటోరియల్స్ లో ఈ ఎంపికల గురించి నేర్చుకుంటాము.
03:12 Help మెనూ,Jmol అప్లికేషన్ గురించి చాలా ఉపయోగకరమైన సమాచారాన్ని కలిగిఉంది.
03:18 ఇది డాక్యుమెంటేషన్ ను కలిగియున్న ఒక User Guide ను కూడా కలిగిఉంది.
03:23 Tool bar అనేక మెనూ icon లను కలిగిఉంది.
03:27 మెనూ ఐకాన్లు కొన్ని ఫంక్షన్ లను త్వరగా అమలు చేస్తాయి.ఉదాహరణకు Open, Save, Export, Print మొదలైనవి.
03:37 ఇక్కడ, త్రిప్పడం,అణువుల సమితిని ఎంచుకోవడం,దూరాన్ని కొలవడం మొదలైనవి చేయటానికి ఐకాన్స్ యొక్క సమితి ఉంది.
03:47 modelkit ఐకాన్ ను,మొలిక్యూలర్(అణుసంబంధమైన)model లను సృష్టించడానికి మరియు edit చేయడానికి ఉపయోగిస్తారు.
03:53 Jmol panel ను మన అవసరాలకు అనుగుణంగా పునఃపరిమాణం చేయవచ్చు.
03:58 కర్సర్ ను, విండో యొక్క ఏదయినా మూలకు,అనగా అది ఒక(యారొ ఇండికేటర్)బాణం సూచిక గా మారే వరకు తీసుకువెళ్ళండి.
04:04 ఇప్పుడు,వికర్ణంగా పైకి లేదా క్రిందికి లాగడం ద్వారా విండో పరిమాణాన్ని మార్చండి.
04:10 panel యొక్క పరిమాణాన్ని మార్పుచేయడానికి Menu bar లోని Display మెనూ ని కూడా ఉపయోగించవచ్చు.
04:16 Display మెనూ పై క్లిక్ చేసి Resize ఎంపికను ఎంచుకోండి.
04:20 ఒక డైలాగ్-బాక్స్ తెరుచుకుంటుంది, అక్కడ వెడల్పు మరియు ఎత్తు( డైమెన్షన్స్) పరిమాణాలను పిక్సల్స్ లో నిర్దేశించవచ్చు.
04:27 800 బై 600 pixels పరిమాణాలతో గల విండో నాకు అవసరం.
04:32 కనుక, నేను 800 space 600 అని టైప్ చేసి OK బటన్ పై క్లిక్ చేస్తాను.
04:41 ఇప్పుడు Jmol panel,800 by 600 pixels కు పునఃపరిమాణం చేయబడింది.
04:47 ఇప్పుడు కొన్ని సాధారణ సేంద్రీయ అణువుల యొక్క నమూనాలను రూపొందించడానికి ముందుకు వెళ్దాం.
04:53 Modelkit శక్తి కనిష్టీకరణతో నమూనాలను నిర్మించి, సవరించడానికి అనుమతిస్తుంది.
05:00 tool bar లోని modelkit ఐకాన్ పై క్లిక్ చేయండి.
05:04 Methane యొక్క నమూనా పానెల్ పై కనిపిస్తుంది.
05:07 Jmol panel యొక్క ఎగువ ఎడమ మూలలో ఒక మెను కనిపిస్తుంది.
05:12 ఈ మెనూ యొక్క ఫీచర్స్(లక్షణాలు), అణువులను సులభంగా జోడించడం, తొలగించడం, లాగటం,
05:19 functional groups ను జోడించడం,
05:21 (బాండ్స్)బంధాలను Delete, add మరియు rotate చేయడం,
05:25 add hydrogens, minimize మరియు save files మొదలైనవి చేయటానికి సామర్ధ్యాన్ని కలిగిఉన్నాయి.
05:30 మెనూ లో ఒక నిర్దిష్ట లక్షణాన్ని(ఫీచర్)ఉపయోగించడానికి, అందించబడిన చెక్-బాక్స్ పై క్లిక్ చేయండి.
05:35 Modelkit ఫంక్షన్ మనకు Methyl group తో hydrogen అణువును ప్రత్యామ్నాయం/ప్రతిక్షేపణం చేయడానికి అనుమతిస్తుంది.
05:41 మీరు ప్రత్యామ్నాయం/ప్రతిక్షేపణం చేయాలనుకుంటున్న hydrogen అణువు దగ్గరకు కర్సర్ ను తీసుకురండి.
05:46 ఆ hydrogen అణువుపై ఒక ఎరుపు రంగు రింగ్ కనిపిస్తుంది.
05:50 ఆ అణువు పై క్లిక్ చేయండి.
05:52 ఒక Methyl గ్రూప్(సమూహం)జోడించబడింది అని మీరు గమనిస్తారు.
05:56 Methane మొలిక్యూల్ ఇప్పుడు Ethane గా మార్చబడింది.
06:00 మునుపటి అదేశాన్ని(స్టెప్)పునరావృతం చేయండి.
06:03 Propane యొక్క నమూనాను పొందటానికి hydrogen అణువుపై క్లిక్ చేయండి.
06:07 ఈ మొలిక్యూల్ పై Energy minimization చేస్తే, మనకు అత్యంత స్థిరమైన ఆకృతి వస్తుంది.
06:13 Energy minimization చేయడానికి,
06:15 Modelkit menu లోని ఎంపికలను స్క్రోల్ చేయండి.
06:19 minimize ఎంపికపై క్లిక్ చేయండి.
06:22 ఇప్పుడు మన వద్ద Propane మొలిక్యూల్ యొక్క అత్యంత స్థిరమైన ఆకృతి నమూనాను ఉంది.
06:28 ఈ నిర్మాణాన్ని .mol ఫైల్ గా(సేవ్ )భద్రపరచడానికి,Modelkit menu ను తెరవండి.
06:33 menu ని స్క్రోల్ చేసి, save file ఎంపికపై క్లిక్ చేయండి.
06:37 ఒక Save డైలాగ్ -బాక్స్ స్క్రీన్ (తెర)పై కనిపిస్తుంది.
06:41 మీరు మీ ఫైల్ ను(సేవ్)భద్రపరచదలిచిన ఫోల్డర్ పై క్లిక్ చేయండి.
06:45 నా ఫైల్ ను భద్రపరచడానికి నేను Desktop ను(లొకేషన్)స్థానంగా ఎంచుకుంటున్నాను.
06:50 కనుక, Desktop ను ఎంచుకుని Open బటన్ పై క్లిక్ చేయండి.
06:54 File Name కి వెళ్ళి, టెక్స్ట్-బాక్స్ లో propane అని టైప్ చేయండి.
06:59 Files of Type పై క్లిక్ చేసి, MOL ఎంపికను ఎంచుకోండి.
07:03 ఇప్పుడు,dialog-box యొక్క కుడి దిగువన ఉన్నSave బటన్ పై క్లిక్ చేయండి.
07:08 Propane యొక్క 3D మోడల్(నమూనా)Desktop పైన .mol ఫైల్ గా భద్రపరచబడుతుంది.
07:14 Jmol నుండి, నిష్క్రమించడానికి,File మెనూ పై క్లిక్ చేసి, Exit ఎంపికను ఎంచుకోండి.
07:21 సారాంశం చూద్దాం.ఈ ట్యుటోరియల్ లో,మనం నేర్చుకున్నవి,
07:25 Jmol Application విండో గూర్చి.
07:27 Jmol panel ను పునపరిమాణం చేయటం.
07:29 Methane, Ethane మరియు Propane వంటి సాధారణ సేంద్రియ అణువుల యొక్క 3D models సృష్టించడానికి టూల్ బార్ లోని Modelkit ను ఉపయోగించడం.
07:40 methyl group తో hydrogen యొక్క ప్రత్యామ్నాయం/ప్రతిక్షేపణం ద్వారా మొలిక్యూల్ నిర్మించడం.
07:45 స్థిరమైన ఆకృతిని పొందడానికి శక్తిని తగ్గించడం.
07:48 చిత్రాన్ని.mol ఫైల్ గా భద్రపరచడం.
07:52 Jmol Modelkit ఫంక్షన్ ని ఉపయోగించి,క్రింద ఇచ్చిన మొలిక్యూల్స్ యొక్క నమూనాలను తయారు చేయండి,
07:58 2-4 Dimethyl Pentane మరియు 3-Ethyl, 5-Methyl Heptane.
08:03 స్థిరమైన ఆకృతిని పొందడానికి శక్తిని కనిష్టీకరించండి.
08:07 చిత్రాన్ని .mol ఫైల్ గా భద్రపరచండి.
08:11 టూల్ బార్ లోని rotate molecule ను ఉపయోగించి నమూనాను తిప్పండి.
08:15 మీ పూర్తి అయిన అసైన్మెంట్ చూడటానికి ఇలా ఉండాలి.
08:19 కింది లింక్ లో అందుబాటులో గల వీడియో ను చుడండి.
08:22 ఇది Spoken Tutorial ప్రాజెక్ట్ యొక్క సారాంశాన్నిఇస్తుంది.
08:26 మీకు మంచి బ్యాండ్ విడ్త్ లేదంటే, డౌన్ లోడ్ చేసి చూడగలరు.
08:30 స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీం:స్పోకెన్ ట్యుటోరియల్స్ ఉపయోగించి వర్క్ షాప్స్ నిర్వహిస్తుంది.
08:36 ఆన్ లైన్ పరీక్ష పాస్ అయిన వారికి ధ్రువీకరణ పత్రాలు ఇస్తుంది.
08:40 మరిన్ని వివరాలకు,దయచేసి వ్రాయండి.
08:47 Spoken Tutorial ప్రాజెక్ట్ Talk to a Teacher ప్రాజెక్ట్ యొక్క ఒక భాగం.
08:52 దీనికి ICT,MHRD,ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్,గవర్నమెంట్ అఫ్ ఇండియా సహకారం అందిస్తుంది.
08:59 ఈ మిషన్ గురించి మరింత సమాచారం ఈ లింక్ వద్ద అందుబాటులో ఉంది.
09:04 ఈ ట్యుటోరియల్ ని తెలుగు లోకి అనువదించినది,ఉదయలక్ష్మి మాతో చేరినందుకు ధన్యవాదములు.

Contributors and Content Editors

Madhurig, Simhadriudaya