Git/C3/Hosting-Git-Repositories/Telugu

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 Hosting Git Repositories పై spoken tutorial కు స్వాగతం.
00:06 ఈ ట్యుటోరియల్ లో మనము Git repository hosting services గురించి నేర్చుకుంటాము.
00:11 అలాగే, GitHub account ను క్రియేట్ చేయడం.
00:14 GitHub లో repository ను మరియు repository లో tag ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకుంటాము.
00:20 ఈ ట్యుటోరియల్ ను రికార్డ్ చేయుటకు నేను Ubuntu Linux 14.04 మరియు Firefox web browserను ఉపయోగిస్తున్నాను.
00:29 మీరు మీకు నచ్చిన ఏ బ్రౌజర్ ను అయినా ఉపయోగించవచ్చు.
00:32 మీకు ఈ ట్యుటోరియల్ కొరకు Internet కనెక్షన్ అవసరం.
00:37 మీకు Git కమాండ్స్ గురించి అవగాహన కూడా ఉండాలి.
00:42 లేకపోతే, సంబంధిత Git ట్యుటోరియల్స్ కోసం, దయచేసి మా link ను సందర్శించండి.
00:47 ముందుగా మనం Git repository hosting services గురించి నేర్చుకుందాం.
00:52 ఇక్కడ Bitbucket, CloudForge మరియు GitHub వంటి అనేక వెబ్ ఆధారిత హోస్టింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి.
01:00 ఇక్కడ మీరు మీ Git repositories ఉచితంగా దిగుమతి చేసుకోవచ్చు.
01:05 అవి మీ repository పంచుకునే కేంద్రీకృత ప్రదేశాన్ని అందిస్తాయి, అందువల్ల అనేక మంది వ్యక్తులు సులభంగా ప్రాజెక్ట్లో సహకరించుకోవచ్చు.
01:14 అవి ఇతర ప్రాజెక్ట్ లను ఉచితంగా డౌన్లోడ్ చేయడానికి మరియు అధ్యయనం చేయడానికి మీకు అనుమతిస్తాయి.
01:19 తరువాత, మనం GitHub ను ఎందుకు ఉపయోగించాలో చూద్దాం.
01:23 GitHub Open Source Software హౌసింగ్ కొరకు అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ సైట్.
01:28 GitHub లో, మీరు మీ బృందంతో ప్రభావవంతంగా మార్పులను వీక్షించవచ్చు, చర్చించవచ్చు మరియు సమీక్షించవచ్చు.
01:35 GitHub లో ఉపయోగించిన విధానం ఇతర ఉచిత Git hosting వెబ్ సైట్ల మాదిరిగానే ఉంటుంది.
01:42 మీరు తర్వాత వాటిని సొంతంగా అన్వేషించవచ్చు.
01:45 తరువాత మనం GitHub లో account ను ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం.
01:49 మీరు మీ వెబ్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి మరియు www.github.com కు వెళ్ళండి.
01:56 ఇక్కడ, హోమ్ పేజీ లో, మీరు రిజిస్ట్రేషన్ కోసం మీ వివరాలు ఇవ్వాలి.
02:01 నేను priya-spoken ను యూసర్ నేమ్ గాను మరియు
02:07 priyaspoken@gmail.com ను e-mail ID గాను టైప్ చేస్తున్నాను.
02:11 దయచేసి మీరు, మీకు నచ్చిన యూజర్ పేరు మరియు చెల్లుబాటు అయిన ఇమెయిల్ ఐడిని టైప్ చేయండి.
02:16 ఇప్పుడు నేను, నా పాస్ వర్డ్ ను టైప్ చేస్తున్నాను.
02:19 మీరు మీకు నచ్చిన పాస్ వర్డ్ ను ఇవ్వవచ్చు.
02:23 ఇప్పుడు, కుడివైపు క్రిందన ఉన్న Sign up for GitHub బటన్ పై క్లిక్ చేయండి.
02:28 తరువాత, Step 2 లో, మన ప్రణాళికను ఎంచుకోవాలి.
02:32 నేను ఉచిత సేవను ఉపయోగించుకోవాలనుకుంటున్నాను కాబట్టి Free ప్రణాళికను ఎంచుకుంటాను.
02:37 ఇప్పుడు Finish sign up బటన్ పై క్లిక్ చేయండి.
02:40 తరువాత మనం GitHub లో repository ని క్రియేట్ చేద్దాం.
02:44 మీరు కుడి వైపు బాక్స్ లో New repository అనే బటన్ ను చూడవచ్చు, దానిపై క్లిక్ చేయండి.
02:51 ఇది Please verify your email address అనే సందేశాన్ని చూపిస్తుంది.
02:55 GitHub మన రిజిస్టర్డ్ మెయిల్ ఐడి కి ఒక వెరిఫికేషన్ మెయిల్ ను పంపిస్తుంది.
02:59 కాబట్టి, మనం మెయిల్ అకౌంట్ ని ఓపెన్ చేసి GitHub ద్వారా పంపిన మెయిల్ పై క్లిక్ చెయ్యాలి.
03:06 నేను ఇప్పటికే GitHub తో రిజిస్టర్ అయిన నా ఇమెయిల్ ఐడిలో సైన్ ఇన్ చేశాను.
03:11 నన్ను దీనిని ఓపెన్ చేయనివ్వండి.
03:13 నా వద్ద GitHub నుండివచ్చిన ఒక e-mail ఉంది.
03:16 నేను దానిపై క్లిక్ చేస్తాను.
03:18 దానియందు గల సబ్జక్ట్ Please verify your email address అని చెప్తుంది.
03:23 మీ Inbox లో మెయిల్ కనిపించకపోతే, దయచేసి మీ Spam లేదా Junk ఫోల్డర్లను చెక్ చెయ్యండి.
03:29 ఇప్పుడు Verify email address బటన్ పై క్లిక్ చేయండి.
03:32 మనం GitHub Homepage కి మళ్ళించబడుచున్నాము.
03:36 ఇది మనం GitHub లో account ని విజయవంతంగా సృష్టించామని సూచిస్తుంది.
03:42 మనం GitHub లోఒక repository ను క్రియేట్ చేయటానికి ప్రయత్నిద్దాం.
03:45 ఇప్పుడు మీరు కుడి వైపు బాక్స్ లో New repository బటన్ పై నొక్కండి.
03:50 ఇప్పుడు మనము repository సృష్టించగలమని చూడవచ్చు.
03:54 Repository Name గా stories ను టైప్ చేద్దాం.
03:58 మీరు repository గురించి ఎటువంటి వివరణ అయినా ఇవ్వాలనుకుంటే, మనము ఇక్కడ ఇవ్వవచ్చు.
04:04 తరువాత, నేను పబ్లిక్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటాను. ఇది ఉచితం.
04:09 ఒకవేళ మనము Private ఆప్షన్ ను ఎంచుకుంటే, మన repository ప్రైవేట్ గా ఉంచడానికి మనం కొంత రుసుము చెల్లించాలి.
04:16 దీనర్థం ఇతర వినియోగదారులు మన repostory కనుగొన లేరు మరియు డౌన్లోడ్ చేసుకోలేరు.
04:21 మళ్ళీ నన్ను Public పై క్లిక్ చేయనివ్వండి.
04:24 Initialize this repository with a README అనే చెక్ బాక్స్ పై క్లిక్ చేయండి.
04:28 ఇది readme ఫైల్ ను సృష్టిస్తుంది.
04:31 ఈ ఫైలులో, మీరు ఉపయోగించవలసిన కోడ్ లేదా ఇన్స్టాలేషన్ సూచనల గురించిన సమాచారాన్ని వ్రాయవచ్చు.
04:37 ఇది సహచరులందరికి ఉపయోగకరంగా ఉంటుంది.
04:42 అయితే, మనము ఇప్పటికే ఉన్న repository ను దిగుమతి చేస్తే, ఈ బాక్స్ Check చేయబడదు.
04:48 ఇప్పుడు Create repository బటన్ పై క్లిక్ చేయండి.
04:52 మీరు, మీ యూజర్ నేమ్ తో పాటు విజయవంతంగా సృష్టిచబడిన మీ repository పేరును చూడవచ్చు.
04:58 repository సృష్టించబడిన తరువాత, మీరు ఎడమ వైపున దిగువన readme ఫైల్ లేబుల్ ను చూడవచ్చు.
05:05 ఈ ఫైల్లో కొంత సమాచారాన్నిమనం తరువాత వ్రాద్దాము.
05:09 డిఫాల్ట్ గా మనం ఒక commit(i.e) అనగా Initial commit ను, ఒక branch (i.e) అనగా master ను, మరియు ఒక contributor ను చూడవచ్చు.
05:18 మీరు ప్రతి లింక్ పై క్లిక్ చేసి, మీ సౌలభ్యతకనుగుణంగా వాటిని అన్వేషించవచ్చు.
05:23 ఇప్పుడు, మనం ఈ repository లో పని మొదలుపెడదాము.
05:27 మన రిపోజిటరీకు ఒక ఫైల్ ను జోడించడంతో ప్రారంభిద్దాం.
05:31 మధ్య పానెల్ లో ఉన్న New file బటన్ పై క్లిక్ చేయండి.
05:34 ఒక ఫైల్ను సృష్టించడానికి క్రొత్త form ఓపెన్ అవుతుంది.
05:38 ఇక్కడ, నేను ఫైల్ పేరు ను kids-story.html గా ఇస్తాను.
05:44 నేను ముందుగా సేవ్ చేసిన నా Writer document నుండి, కొంత కోడ్ ను copy చేసి ఈ ఫైల్ లోనికి paste చేస్తాను.
05:51 అదేవిధంగా, మీరు మీ ఫైల్ లో కొంత కంటెంట్ ను జోడించండి.
05:55 ఇప్పుడు ఈ కొత్త ఫైల్ ను commit చేద్దాం.
05:58 commit message ఇవ్వడానికి పేజీని క్రిందికి స్క్రోల్ చేయండి.
06:01 ఇక్కడ commit message లో, మీరు Create kids-story.html అనే డిఫాల్ట్ సందేశాన్ని చూడవచ్చు.
06:09 మీరు డిఫాల్ట్ సందేశాన్ని ఉంచవచ్చు లేదా కొత్త సందేశాన్ని టైప్ చేయవచ్చు.
06:13 నేను డిఫాల్ట్ సందేశాన్ని ఉంచుతున్నాను.
06:16 ఇక్కడ, తదుపరి రంగంలో, మీరు commit యొక్క విస్తృత సమాచారాన్ని ఇవ్వవచ్చు.
06:22 కాబట్టి ఇక్కడ నేను Added first file of the repository అని టైప్ చేస్తాను.
06:27 డిఫాల్ట్ గా మనం master branch కు commit చేస్తాం
06:31 ఇప్పుడు Commit new file బటన్ పై క్లిక్ చేయండి.
06:34 మన కొత్త ఫైల్ kids-story.html రిపోజిటరీకు జోడించబడింది.
06:39 ఇప్పుడు commit number రెండు కు పెరిగింది అని గమనించండి
06:43 దానిపై క్లిక్ చేద్దాం.
06:45 ఇక్కడ, మీరు commit message ప్రక్కన ఉన్న మూడు చుక్కలను చూడవచ్చు.
06:49 నేను వాటిపై క్లిక్ చేస్తాను.
06:51 ఇది commit యొక్క వివరణను చూపిస్తుంది.
06:54 మనము commit లో చేసినదానిని తెలుసుకోవడానికి, ఆ ప్రత్యేకమైన commit message పై క్లిక్ చేయండి.
07:00 ఇప్పడు మీరు commit యొక్క వివరాలు చూడవచ్చు.
07:03 తిరిగి commit list కు వెళ్దాము.
07:06 దీని కోసం, బ్రౌజర్ యొక్క ఎగువ ఎడమ మూలలో ఉన్న ఎడమ బాణం బటన్ పై క్లిక్ చేయండి.
07:11 కుడి వైపున, మీరు commit యొక్క hash value ని చూస్తారు.
07:15 repositoryకు తిరిగి రావడానికి, పైన ఎడమవైపు మూలన ఉన్న Code టాబ్ పై క్లిక్ చేయండి.
07:21 ఇప్పుడు GitHubలో కొత్త branch ను ఎలా క్రియేట్ చేయాలో వివరిస్తాను.
07:26 ఎడమ వైపున, మీరు Branch లేబుల్ తో ఒక జాబితాను చూడవచ్చు.
07:31 కొత్త branch ను క్రియేట్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి.
07:34 మీరు ఒక పాప్-అప్ విండో తెరుచుకోవడాన్ని చూడవచ్చు.
07:38 పాప్-అప్ విండో లో, మీరు Find or create a branch fieldను చూడవచ్చు.
07:43 నేను కొత్త branch కు పేరుగా new-chapter అని టైప్ చేసి, Enter నొక్కాను.
07:49 మీరు, new-chapter branch సృష్టించబడిందని చూడవచ్చు మరియు అది మన ప్రస్తుత branch.
07:55 తరువాత, branching process ను బాగా అర్థం చేసుకోవడానికి మనము new-chapter branch లో commit చేస్తాము.
08:02 ప్రదర్శన కోసం kids-story.html ఫైలులో కొన్ని మార్పులను చేద్దాము.
08:09 రిపోజిటరీలో kids-story.html ఫైల్ ను ఓపెన్ చేయడానికి దానిపై క్లిక్ చేయండి.
08:14 ఎడిటర్ పానెల్ యొక్క కుడి ఎగువ మూలలో, మీరు edit icon చూడవచ్చు.
08:19 ఈ ఫైల్ ను edit చేయటానికి దానిపై క్లిక్ చేయండి.
08:22 ఇక్కడ నేను నా Writer డాక్యుమెంట్ నుండి కాపీ చేసిన కొన్ని లైన్ లను జత చేస్తున్నాను.
08:27 మీరు కూడా అలాగే చేయవచ్చు.
08:30 ఇప్పుడు, మనం ఈ మార్పును commit చేస్తాము.
08:33 నేను default commit message ను అలాగే ఉంచుతున్నాను.
08:37 ఇక్కడ, మీరు commit చేసిన చోట branch name new-chapterను చూడవచ్చు.
08:43 commit చేయడానికి Commit changes బటన్ పై క్లిక్ చేయండి.
08:46 మన ప్రస్తుత repository కు తిరిగి వెళ్ళడానికి, Code టాబ్ పై క్లిక్ చేయండి.
08:50 తరువాత మనం master మరియు new-chapter branches యొక్క commits ను చెక్ చేద్దాం.
08:56 commits లింక్ పై క్లిక్ చేయండి.
08:59 ఇక్కడ, Branch డ్రాప్ డౌన్ లో, మనం చూడాలనుకుంటున్న branch పేరుని ఎంచుకోవచ్చు.
09:04 నేను లిస్ట్ లో master branch ను ఎంచుకుంటున్నాను.
09:08 ఒక్కసారి ఇది ఎంచుకున్న తరవాత master branch యొక్క commits లిస్ట్ అవుతాయి.
09:13 new-chapter branch యొక్క commits ను చూడడానికి మనం Branch డ్రాప్ డౌన్ లో new-chapter ఎంచుకొనాలి.
09:19 ఇప్పుడు మీరు new-chapter branch యొక్క commits ను చూడవచ్చు.
09:24 repository కు తిరిగి వెళ్ళడానికి, Code టాబ్ పై క్లిక్ చేయండి.
09:28 తరువాత GitHub లో tag ను ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం.
09:32 commit stage ను ముఖ్యమైనదిగా గుర్తించడానికి tagging ను ఉపయోగిస్తామని మనకు తెలుసు.
09:38 ఉదాహరణకు, నేను kids-story.html ఫైల్ ను జోడించిన తరువాత master branch లో tag ను క్రియేట్ చేయాలనుకుంటున్నాను.
09:46 tag ను క్రియేట్ చేయడానికి మొదటగా releases లింక్ పై క్లిక్ చేయండి.
09:50 Create a new release బటన్ పై క్లిక్ చేయండి.
09:54 ఒక కొత్త form ఓపెన్ అవుతుంది.
09:56 Tag Version బాక్స్ లో "V1.0" అని టైప్ చేయండి.
10:01 Release title బాక్స్ లో "Version one" అని టైప్ చేయండి.
10:05 Write బాక్స్ లో మనం, మన tag గురించి వివరణ ఇద్దాం.
10:10 నేను “This is the version one” అని టైప్ చేస్తాను.
10:13 ఇప్పుడు Publish release బటన్ పై క్లిక్ చేయండి.
10:18 ఇక్కడ, ఎడమ వైపు, మీరు చివరి commit యొక్క hash value ను చూడగలరు.
10:24 డిఫాల్ట్ గా, tag, latest commit లో సృష్టించబడుతుందని మనకు ఇప్పటికే తెలుసు.
10:30 దీనితో మనము ఈ ట్యుటోరియల్ చివరకు చేరుకున్నాము.
10:33 ట్యుటోరియల్ సారాంశం.
10:35 ఈ ట్యుటోరియల్ లో మనము,
10:38 online Git hosting services యొక్క ప్రాముఖ్యత,
10:42 GitHub account ను క్రియేట్ చేయడం,
10:44 GitHub లో repository ను మరియు repository లో tag ను క్రియేట్ చేయడం గురించి నేర్చుకున్నాము.
10:50 ఒక అసైన్మెంట్ గా,
10:52 GitHub లో repository ను క్రియేట్ చెయ్యండి.
10:54 repository కి కొన్ని ఫైళ్ళను ని జోడించండి.
10:57 ఫైళ్ళను సవరించడం మరియు కొన్ని commits చేయడం మరియు repository లో branches మరియు tagsను క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి.
11:05 ఈ క్రింది లింక్ వద్ద ఉన్న వీడియో Spoken Tutorial ప్రాజెక్ట్ ను గురించి తెలుపుతుంది.
11:10 దయచేసి దానిని డౌన్లోడ్ చేసి చూడండి.
11:12 స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ బృందం వర్క్ షాప్లను నిర్వహిస్తుంది మరియు ఆన్ లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికేట్లను ఇస్తుంది.
11:20 మరిన్ని వివరాల కోసం దయచేసి మాకు వ్రాయండి.
11:23 NMEICT, MHRD, భారత ప్రభుత్వం Spoken Tutorial ప్రాజెక్ట్ కు నిధులు సమకూరుస్తుంది.
11:29 ఈ మిషన్ పై మరింత సమాచారం క్రింది లింక్ లో అందుబాటులో ఉంది.
11:34 ట్యుటోరియల్ ను తెలుగు లోకి అనువదించింది శివ మకుటం. నేను స్వామి ధన్యవాదములు.

Contributors and Content Editors

Ahalyafoundation, Madhurig, Pratik kamble, Yogananda.india